మీ వ్యూస్

భలే సంక్రాంతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి సినిమాలు దేనికదే అన్నట్టు మంచి వినోదాన్ని పంచాయి. పండుగకు ఓ సినిమా చూడాలన్న ఆనందానికి అటు మహేష్, ఇటు బన్నీ మంచి వినోదానే్న అందించారు. అనువాద చిత్రంతో ఈ ఏడాది ఆనందం మొదలైనా -దర్బార్‌తో రజనీకాంత్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడని అనిపించింది. సీజన్‌లో చివరిగా వచ్చిన కల్యాణ్‌రామ్ సినిమా సైతం భావోద్వేగంతో కంటతడి పెట్టిస్తూనే -ఒకింత ప్రేమను పంచితే అచ్చమైన బంధాలు, బంధుత్వాలు వాటంతట అవే నడిచొస్తాయని చెప్పడం బావుంది. ఏదేమైనా 2020 సంక్రాంతి మాత్రం మంచి సినిమాలతో బోణీకొట్టింది. ఈ ఏడాది టాలీవుడ్‌లో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని, రావాలని ఆశిద్దాం.
-పి హరితేజ, కైకలూరు
అల్లు.. అల.. అలా
అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్‌గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన అల.. వైకుంఠపురములో సినిమా బావుంది. కానీ, అదేదో అద్భుతమైన చిత్రంలా, టాలీవుడ్‌లో ముందెన్నడూ అలాంటి చిత్రం రానంతగా ప్రచారం కల్పిస్తుండటం మాత్రం బాగలేదు. అలాంటి కథాంశంతో గతంలోనూ టాలీవుడ్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అదే పాయింట్‌ను త్రివిక్రమ్ తనదైన శైలిలో చెప్పటం వరకూ మంచిగా అనిపించింది. ఉదాత్తమైన కథాంశంగా చెప్పుకోలేకపోయినా, హీరో బన్నీ మాత్రం తనదైన స్టయిల్ చూపించటంలో ఈ సినిమాలో పరిణితి కనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్‌కు ఓ కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ‘సిత్రాల సిరపడు’ పాటతో ఫైట్ సీన్ డిజైన్ చేయడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వసూళ్లపరంగా కోట్లు రాబట్టినా అల.. వైకుంఠపురములో వినోదం పంచిన ఓ మంచి సినిమాగానే చూడాలి తప్ప, టాలీవుడ్ చరిత్రను తిప్పిరాసే సినిమాగా మాత్రం చూడలేం.
-రావు గోకరకొండ, విశాఖ
సరిలేరు..
సంక్రాంతి సినిమాగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ప్రస్తావించటం అతిశయోక్తి అయితే కాదు. టాలీవుడ్‌లో మాస్ అప్పీల్‌కు మంచి మార్కులు పడతాయి కనుక, మహేష్ సైతం ఆ ‘మార్క్’ కోసం ఓ ప్రయత్నం చేసిన సినిమాగా చూడొచ్చు. ఆర్మీ మేజర్ పాత్రను మాత్రం ‘కమర్షియల్ హీరోయిజానికి’ దించేయటంతో -లాజిక్‌కు దూరంగా ఉన్నట్టనిపించింది. ఇక బన్నీ ‘అల.. వైకుంఠపురములో’, కల్యాణ్‌రామ్ ‘ఎంత మంచి వాడవురా’ చిత్రాలనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సంక్రాంతి సీజన్‌లో సినిమాల రేసు సాగుతుంది కనుక -ప్రమోషన్లతో మేం ముందు మేం ముందు అంటూ ప్రచారాలు సాగించినా.. ఏవీ ఎక్కువ కాదు, ఏవీ తక్కువ కాదన్నట్టే సినిమాలున్నాయి. గుజరాత్ రీమేక్‌గా వచ్చిన కల్యాణ్‌రామ్ ‘ఎంత మంచివాడవురా’ చిత్రం కానె్సప్ట్ మాత్రం ఒకింత కొత్తగా, భావోద్వేగంగానూ ఉంది. ఈ పాతకు కల్యాణ్ పెర్ఫార్మెన్స్ బావుంది.
-పి తరుణి, సికింద్రాబాద్
టైం బాబూ..
హీరోగా జగపతిబాబు కథ ముగిసింది అనుకునేలోగా లెజండ్‌లో విలన్‌గా పునర్జన్మ పొంది భేష్ అనిపించుకొని క్యారెక్టర్ యాక్టర్‌గా, విలన్‌గా చాలా చిత్రాలు చేశాక ఇప్పుడు మళ్లీ స్లంప్ ఏర్పడింది. ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆయన్ని తొలగించి ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నారు. ఈలోగా బాహుబలి కట్టప్ప సత్యరాజ్ సహాయ పాత్రల్లోనూ, విలన్‌గానూ పుంజుకున్నాడు. హీరోయిన్లుగా ఇతర భాషల అమ్మాయిలు రాజ్యం ఏలుతుండగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలంటూ ఇతర భాషల క్యారెక్టర్ నటులకు, విలన్లకు టాలీవుడ్‌లో గిరాకీ ఏర్పడింది. తెలుగు విలన్ల ముఖాల్లో కావలసినంత రగ్గెడ్‌నెస్ లేదంటూ ఇతర భాషల వారిని తీసుకుంటున్నారు. కట్టప్ప 2 1/2 కోట్లు అడిగినా ఇస్తున్నారు.
-పవన్‌పుత్ర, రామారావుపేట
మరి జానూకి..
రెండో ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ కోట్లకు పడగెత్తింది. అయితే తన భర్త కృష్ణవంశీకి పూరి ఫ్రెండ్. పైగా పూరి కొడుకుని ‘రొమాంటిక్’ చిత్రం ద్వారా నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకని పెద్దమనసు చేసుకొని రమ్యకృష్ణ ఆయన చిత్రంలో పెంచని రెమ్యునరేషన్‌కే చేస్తుందట. మరి పూరి ఏంచేశాడు? ‘ఫైటర్’లో దేవరకొండ పక్కన హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వి కాళ్లావేళ్లా పడి 4 కోట్లకు ఒప్పించాడు. పరాయి పిల్ల జాన్వికి కోట్లు! టాలీవుడ్ సూపర్ ఆర్టిస్టు రమ్యకృష్ణకు లక్షలు. జాన్విపట్ల ఎందుకింత దేబిరింత? టాలీవుడ్‌లో లక్షలిస్తే చాలు జాన్విపాటి నటన ప్రదర్శించే ఎందరో అమ్మాయిలున్నారు. మనోళ్లు ఆలోచించరేంటి?
-సంపూర్ణ, సాంబమూర్తినగర్
నోరు మెదపరేం..
విమర్శకులు వేలెత్తిచూపని విధంగా చిన్న పొరపాటు కూడా లేకుండా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు ఆదుర్తి సుబ్బారావు. తొలి రోజుల్లో ఆయన తీసిన ‘మాంగల్యబలం’లో ఒక సన్నివేశం మాత్రం విమర్శలకు తావిచ్చింది. పిల్లలు బొమ్మల పెళ్లి చేస్తూ ఆలుమగల జీవితం గురించి -హాయిగా ఆలుమగలై కాలం గడపాలి’ అని పాడుతూ ఎన్ని సమస్యలొచ్చినా తలగడ, మంచం వేరు చేయొద్దన్న చరణం పెట్టడం విమర్శలకు తావిచ్చింది. చిన్నపిల్లలచేత ఇలాంటి పాట పాడించడం ఏమిటని ఆక్షేపించారు. చిన్నపిల్లలు పాడేందుకు ఇలాంటి పాటను రాసినందుకు శ్రీశ్రీనీ విమర్శించారు. ఈనాటి సినిమాల్లో పిల్లలచేత ఇంకా ముదురు మాటలు మాట్లాడిస్తున్నారు. ఎవ్వరూ నోరు మెదపరేం?
-ప్రభాస్, గాంధీనగర్
పొరబాటు కదా
జనవరి 5న ఆంధ్రభూమి వెనె్నల అనుబంధంలో ‘అక్కా చెల్లెలు’ చిత్రం గురించి రచయిత్రి మాణిక్యేశ్వరి రాస్తూ.. ఈ చిత్రం తమిళ చిత్రం ‘అక్కా తంగై’ ఆధారంగా తెలుగులో వచ్చిందన్నారు. అసలు ఈ చిత్రాలు హిందీ చిత్రం ‘కానూన్’ ఆధారంగా స్వల్ప మార్పులు చేర్పులతో రూపుదిద్దుకున్నాయి. కానూన్ చిత్రంలో పాటలు లేవు. అశోక్‌కుమార్, రాజేంద్రకుమార్, నందా, మొహమూద్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు. చివరి వరకూ సస్పెన్స్‌తో నడిచే చిత్రమిది.
-కె నాగరత్నమయ్య శెట్టి, యమ్మిగనూరు