మీ వ్యూస్

సింబా.. అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్‌లో -విమర్శలు, ప్రశంసలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. చదువుతుంటే సంతోషం అనిపిస్తుంది. ఈమధ్య ‘సింబా గర్జించాడు’ అంటూ వెనె్నలలో ప్రచురించిన రివ్యూ చాలా చాలా బావుంది. రివ్యూ చదువుతుంటే సినిమాని బాగా ఆకళింపు చేసుకొని తిరిగి కథ చెబుతున్నంత హాయిగా అనిపించింది. రచయిత విజయప్రసాద్ రాసిన విధానం ఆకట్టుకుంది. సినిమా సక్సెస్‌కు ఇచ్చినట్టే -సమీక్షకూ మూడు నక్షత్రాలివ్వాలి. చదువుతున్నంత సేపూ -ఎప్పుడు సినిమా చూస్తామా? అన్నంత ఆసక్తికరంగా రాశారు. ఇమంది రామారావు వ్యాసంతో రావుగోపాలరావు గొప్పదనం చెప్పడం బావుంది. ఇక దుమ్ము రేపుతున్నారు అంటూ నేటి ప్రమోషన్ల గురించి చెబుతూ, 70 ఏళ్లక్రితంనాటి గుర్రబ్బండి, 60 ఏళ్ల క్రితంనాటి రిక్షా ప్రచారాలు అంశాలను గుర్తు చేయడంతో కథనానికి బలం వచ్చింది. రోజులుమారాయి సినిమా వచ్చిన సమయం నుంచీ 1980ల వరకూ దినపత్రికల చివరి పేజీ ఫుల్‌గా రిలీజ్ సినిమాల ప్రకటనలే ఉండేవి. ఆ విషయాన్ని గుర్తు చేసివుంటే బావుండేది.
-ఎవిఎస్ ఆంజనేయులు, కాకినాడ
అదో టైపు..
హిందీ చిత్ర వీక్షకులకు వివేక్ అగ్నిహోత్రి పేరు తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘తాష్కెంట్ పేపర్స్’ హిట్టయ్యింది. కానీ ఇద్దరు ప్రఖ్యాత విమర్శకులు ‘ఆ చిత్రానికి మేము చూసే అర్హతలేదు’ అని ప్రకటించారు. చిత్రాలకు స్టార్ రేటింగ్ ఇస్తారు. కాని ఒక విమర్శకురాలు ఆయన చిత్రం ఒకదానికి జీరో స్టార్లు ఇచ్చిందట. ఆయన చిత్రానికి రివ్యూ రాయటంకన్నా చావటం మేలు అన్నాడట ఇంకో విమర్శకుడు. ఇలాంటి విమర్శకులపై వివేక్ విరుచుకుపడుతూ వీళ్లంతా అవినీతిపరులు. పార్టీలకు ఆహ్వానించి కరెన్సీ కవర్లు అందించి, పూటుగా మందుపోయిస్తే చాలు మంచి రివ్యూలు రాస్తారు. లేకుంటే ఇలాగే పక్షపాత చెత్త రాస్తుంటారు అన్నాడు. ఏది నిజం?
-సుభాష్, శ్రీనగర్
భలే బాబులు..
మహేష్‌బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి జగపతిబాబు తప్పుకున్నాడన్న వార్త సంచలనమైంది. స్క్రిప్ట్‌లో సీరియస్ విలన్‌ని కామెడీ విలన్‌గా మార్చటంవల్ల ఆయన తప్పుకున్నాడని కథనాలొచ్చాయి. ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. నేను తప్పుకోలేదు, తప్పించారన్న ధోరణిలో జగపతిబాబు వ్యాఖ్య. ఎన్నికల ప్రచారంలో ఉండటంవల్ల ప్రకాష్‌రాజ్‌కి చిత్రాలు లేవు. ఎన్నికల్లో ఓడిన తర్వాత మహేష్ చిత్రంలో తనకి ఒక చాన్స్ ఇమ్మని ఆయన నిర్మాత దిల్‌రాజు, హీరో మహేష్‌లకు పోన్లుమీద ఫోన్లు చేస్తూండటంతో జగపతిబాబుకి చెప్పి ఒప్పించి తప్పించారని మరో వదంతి. ప్రకాష్‌రాజ్ షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తాడు. సిబ్బందితో గొడవల పెట్టుకుంటాడు. అందుకే చాలా మంది ఆయన్ని దూరంపెడతారన్న ప్రచారమూ ఉంది. ఈసారి మాత్రం దిల్‌రాజు, మహేష్‌ను బాగా ఊదరగొట్టి ఛాన్స్ కొట్టేశాడని వినిపిస్తోంది. జగపతిబాబు మాత్రం హుందాగా ఇండస్ట్రీ ఒక కుటుంబం లాంటిది, ఎన్నో పరిస్థితులుంటాయి. వాటిని బయటకు చెప్పుకోకూడదు అన్నాడు. దిల్‌రాజు, మహేష్ పెదవి విప్పలేదు.
-చంద్రిక, రాజేంద్రనగర్
కంగ్రాట్స్ చెబితే..
తెలుగు అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్ కబీర్‌సింగ్ బంపర్ హిట్టవ్వటం చూసి తెలుగు హీరో విజయ్ దేవరకొండ అసూయతో రగిలిపోతున్నాడా? తెలుగు చిత్రం 35కోట్లు సాధిస్తే, హిందీ చిత్రం 260 కోట్లు దాటి 300 కోట్ల క్లబ్‌కు పరిగెడుతోంది. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఒక్కరే. పైగా తెలుగువాడు కాబట్టి హిందీ చిత్రంలో తనని తీసుకుంటారని విజయ్ ఆశించినా, షాహిద్‌కపూర్ చాన్స్ తన్నుకుపోయాడు. విజయ్ హిందీ చిత్రాన్ని చూడలేదు. చూడనుకూడా అన్నాడట. అందువల్ల అసూయ కథనం జోరందుకుంది. నిజానికి తెలుగులో విజయ్ స్థానం సుస్థిరం కాబట్టి అతనికి అసూయ ఉండదని సమర్ధకులు అంటున్నారు. అయితే సల్మాన్‌ఖాన్ హిందీ చిత్రం దబాంగ్‌ని తెలుగులో గబ్బర్‌సింగ్‌గా రీమేక్‌చేస్తే అది హిట్టయ్యింది. సల్మాన్‌ఖాన్‌కి తెలుగురాదు కాబట్టి తెలుగు చిత్రం చూడలేదు. కాని దర్శకుడికి కంగ్రాట్స్ చెప్పాడు. విజయ్ కూడా కబీర్ దర్శకుడికి కంగ్రాట్స్ చెప్తే బాగుండేది.
-కృష్ణ, కొండయ్యపాలెం
స్టేట్‌మెంట్స్ గోల
ఇటీవల కొన్ని సినిమాలు.. అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుందంటూ వాయిదాల మీద వాయిదా వేస్తూ విసుగిస్తున్నాయి. ముఖ్యంగా సాహో చిత్రం గురించి గత కొన్ని నెలలుగా ఊదరగొడుతున్నారు. లేనిపోని ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, సినీ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తున్నారు. అలాగే సైరా విషయంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ట్రైలర్ విడుదలైందని ఏదో చిన్న అంశాన్ని చూపి ఊదరగొట్టడం జరుగుతోంది. నిర్దిష్టమైన విడుదల ప్రకటనలు చేయక కాలయాపన చేస్తోంది. ఇది అవసరమా? స్పష్టమైన తేదీని ప్రకటించకుండా అత్యధిక పబ్లిసిటీ ఇస్తున్నారు. క్లారిటీ కరవవ్వటంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇకనైనా భారీ చిత్రాలు నిర్మించేవారు తేదీ విషయంలో స్పష్టతను ఇస్తే బాగుంటుంది. గతంలోనూ అనేక సినిమాల విషయంలో ఇదే జరిగింది.
-ఏఆర్ రామారావు, ఖమ్మం
మాకూ చాన్సివ్వండి
వెనె్నల పేజీలో నిర్వహిస్తోన్న ‘నాకు నచ్చిన సినిమా, పాట’ శీర్షిక అభిమాన పాఠక వ్యాస రచయితల కోసమేనని విశ్వసిస్తున్నాం. అంటే అందరి వ్యాసాలకు అవకాశమివ్వాలనే తలంపుతోనే కదా! ఎవరెన్ని ఎక్కువ వ్రాసి పంపించినా వీలువెంబడి ప్రచురిస్తున్నారు ఇన్నాళ్లూ. మీ యిష్టప్రకారం మీకు నచ్చిన వాటినే ఎంపిక చేసుకొనే ప్రచురిస్తున్నారు. కాని ఈమధ్య గత ఆరేడు వారాలుగా కేవలం ఒక్కరివే ప్రచురించడాన్ని చూస్తున్నాం. వరుసగా వారివే వేయడం సబబేనా! మాలాంటివారూ ఆ స్థాయిలోనే రచన చేసి పంపుతుంటారు. వారితోపాటు మాలాంటి అందరివీ ప్రచురించాలని మనవి.
-పీవీఎస్ ప్రసాదరావు, అద్దంకి