మీ వ్యూస్

గ్రేట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమా గురించి లీడ్‌రోల్ చేసిన సోనమ్‌కఫూర్ మాట్లాడుతూ ‘రెజీనా కూల్ గాళ్, మంచి నటి. వీటన్నిటికి మించి రెజీనా దగ్గర ఎప్పుడూ ఓ పరిమళం ఉంటుంది. అందుకే రెజీనాతో రొమాన్స్ బాగుంటుంది. నేను హ్యాపీ’ అంటూ కామెంట్ చేయడం చాలా బావుంది. ఆ కామెంట్‌లో సోనమ్ మెచ్యూరిటీ కనిపిస్తోంది. రెజీనాతో రొమాన్స్ అన్నది సినిమాపరంగా వేరే అర్థం కావొచ్చేమోకానీ, ఆమె మాటల్ని విన్నపుడు మాత్రం ఆమెతో తనకున్న స్నేహాన్ని, అందులోని మాధుర్యాన్ని చెప్పినట్టే అనిపించింది. ఇద్దరు అందగత్తెలు తగవులాడుకునే పరిస్థితిపోయ, ఆమె మాటల్లో హృద్యమైన వాతావరణం కనిపించడాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
-కె నర్మద, రుద్రవరం
ఏది నిజమో
వెనె్నలలో ప్రచురించిన ‘మనకేదీ ఆస్కారం’ -వ్యాసంలో చెప్పిన దానికీ, నేను ఇతరత్రా చదివిన దానికీ కొంత తేడా ఉంది. ఏది నిజమో పాఠకులెవరైనా తెలిసినవాళ్లు చెప్పొచ్చు. ఆస్కార్ అవార్డులు కేవలం ఆంగ్ల చిత్రాలకే పరిమితం. ఆంగ్లేతర చిత్రాలు పోటీ పడేది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ క్యాటగిరీలో మాత్రమే. ఆంగ్లేతర చిత్రాల్లోని నటులు, దర్శకులు, సాంకేతికులకు ఆస్కార్లు రావు. అయితే ఏఆర్ రెహ్మాన్, భాను అతయా, మలయాళ సినిమాటోగ్రాఫర్ పూకుట్టి ఆంగ్ల చిత్రాలకు పని చేసి వాటితో ఆస్కార్లు పొందిన భారతీయులు. సత్యజిత్‌రాయ్ గొప్ప బెంగాలీ చిత్రాలు తీసినా ఆంగ్లంలో తీయలేదు. ఆయనకు గౌరవ పురస్కారంగా మాత్రమే ఆస్కార్ లభించింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మనకు ఇంతవరకూ అవార్డు రాలేదు.
-ప్రభాస్, గాంధీనగర్
భలే కథనం
ఆనాటి ప్రతిభావంతులైన నటీనటులు, బాలతారలు ఇప్పుడు తెరమరుగై ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో ఆ ముచ్చట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఈవారం చిపా (చిన్ననాటి పార్వతి) గురించి చెప్పిన విషయాలు అలరించాయి. కానీ, ఈనాడు ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం, ‘మా’లాంటి సంస్థలు పట్టించుకోకపోవడం శోచనీయం. ఆనాటి హృదయాల.. పేరిట ఇమంది రామారావు ప్రారంభించిన కొత్త శీర్షిక చాలాబావుంది. చాలామందికి తెలీని చిన్న చిన్న ముచ్చట్లు సెట్స్‌పై సందడి గురించి చెప్పుకోవడం, వినడం చాలా చాలా బావుంటుంది. మంచి శీర్షికలు అందిస్తున్నందుకు వెనె్నలకు కృతజ్ఞతలు.
-ప్రసాద్, గొడారిగుంట
ఇదేంటండీ బాబూ..
సినిమాల సంగతేమోగానీ సమీక్షలు మాత్రం పిచ్చిలేపుతున్నాయి. చౌకబారు, నేలబారు, ‘కథ’ల్లేని సినిమాలతోనే చస్తున్నామంటే -వాటి సమీక్షలు ఒక్కోటీ ఒక్కోలా అందిస్తూ ఆడియన్స్‌కి పిచ్చెక్కిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా.. అంతకుమించి సోషల్ మీడియా.. పద్ధతీ పాడూ లేకుండా ఇష్టారీతిన ఇచ్చేస్తున్న సమీక్షలు భరింపశక్యంగా ఉండటం లేదు. సమీక్షలో ఉన్న కంటెంట్‌కీ, సినిమా కంటెంట్‌కీ సంబంధం ఉండటం లేదు. కొంతమీడియా ఆహా అంటే కొంతమీడియా తుస్ మంటూ సమీక్షలు ఇవ్వడం విడ్డూరం అనిపిస్తుంది. సినిమా బాగలేనప్పుడు -సమీక్షలన్నీ అచ్చంగా ఒకేలా ఉండకున్నా మూలమైతే అదే ఇవ్వాలిగా. కానీ, ఒకరు బావుందని, మరొకరు బాగలేదని రాస్తుంటే -సినిమాల కంటే సమీక్షలే పిచ్చిలేపుతున్నాయి. ఈ గోలేంటండీ బాబూ..
-ఆల్విన్ రాజు, హైదరాబాద్
మనిష్టం మనది
ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమా అని సినిమా సమీక్షలు, వార్తలు మరు నిమిషం ప్రపంచవ్యాప్తం అవతున్నాయి. అయితే వందల కొద్దీ సమీక్షలు వెలువడి అన్నీ చదవలేని పరిస్థితి ఉంటుంది. అయినా అవన్నీ చదవటం టైమ్ వేస్ట్ అనిపిస్తోంది కూడా. ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా ప్రింట్ మీడియాలో వెలువడే ఎంపిక చేసిన ముఖ్య అభిప్రాయాలు తీరిక సమయంలో చదువుకోవడం సముచితం. ఏమంటారు? అయినా సమీక్షలు వెంటనే చదివేసి ఏం చేస్తాం? థియేటర్‌కి పరిగెడతామా? నిజం చెప్పాలంటే సమీక్షల్ని పట్టించుకోకుండా చూడాలనిపిస్తే చూస్తాం. లేదంటే లేదు. అంతేకదా. ఏ మాధ్యమం సౌలభ్యం ఆ మాధ్యమానికుంటుంది. మన సౌలభ్యం మనది. కదా!
-సుబ్బక్క,
జగన్నాథపురం
మంచి ట్రెండ్
గతవారం వెనె్నలలో అక్కడ హిట్టయ్యాడు -వ్యాసం చాలా బావుంది. హీరోల్లో వస్తున్న మార్పును చక్కగా విశే్లషించారు. కాసుల డబ్బా మోతకి, ఖాళీ డబ్బా సౌండ్‌కి తేడా కనిపెట్టలేనంత పిచ్చోళ్లు కాదు ఆడియన్స్. ఫ్లాప్ సినిమాని పదిమంది కలిసి పొగిడినంత మాత్రాన -ప్రేక్షకులు వెళ్లి చూసేస్తారా? ఒకవేళ చూసినా వందమందికి అదెంత గొప్ప సినిమానో చెప్పకుండా ఉంటారా? ఈ విషయాన్ని పక్కనపెడితే మంచికో, చెడుకో హీరోలు మొదలెట్టిన కొత్త ట్రెండ్ అభినందనీయమే. సినిమా పోయిందన్న విషయాన్ని నిజాయితీగానో, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునో అంగీకరించడాన్ని ఆహ్వానించాలి. దీనివల్ల ఆడియన్స్‌కి పెద్దగా లాభం ఉండకపోవచ్చు. కానీ, హీరోలు జాగ్రత్తపడక తప్పని పరిస్థితి వస్తుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. సినిమా దెబ్బతిన్నపుడు ఎవరెవరు ఎంతెంత నష్టపోయారో లెక్కలు చూసుకుని ఆమేరకు సహాయ సహకారం అందించే సంస్కృతి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వస్తే -ఇంకా సూపర్.
-కల్లెం రాజేంద్ర, తిరుపతి
వెండి వెనె్నలే
‘వెనె్నల’ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా మార్పు కనిపిస్తోంది. పరిశ్రమ కోసం తమవంతు కష్టపడిన, ప్రతిభ చూపించిన ఒకనాటి తరాన్ని ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌మీదకు తెచ్చి చూపిస్తోన్న కథనాలు చాలా బావుంటున్నాయి. ఆనాటి హృదయాల శీర్షిక జర్నలిస్ట్, దర్శకుడు ఇమంది రామారావు అందిస్తున్న ‘ముచ్చట్లు’ చాలా రిలీఫ్. మళ్లీ మళ్లీ చదవాలనిపించే కబుర్లే. ముఖచిత్ర కథనాలను ఆసక్తికరంగా అందిస్తున్న తీరు బావుంటుంది. కొద్దికాలం ఆపేసిన ఫ్లాష్‌బ్యాక్ అట్ 50 ఫీచర్‌ను మళ్లీ మొదలుపెట్టినందుకు కృతజ్ఞతలు. ఎన్నో గొప్ప చిత్ర రాజాలను, వాటిలోని విషయాన్ని ఫ్లాష్‌బ్యాక్ శీర్షిక ద్వారా అందిస్తున్న రచయిత్రి మాణిక్యేశ్వరికి అభినందనలు. సినిమా సమీక్షలు బావుంటున్నాయి.
-పల్లె సుభద్ర, రాజమండ్రి