మీ వ్యూస్

భలే తెలివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చానల్ సినిమా కార్యక్రమాల్లో ఔచిత్యాన్ని మరిచి సంచలనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సమంత- నాగచైతన్య మధ్య చిచ్చుపెట్టిన శైలజ.. సమంతపై ఆధిపత్యం చెలాయిస్తున్న చైతన్య అంటూ ఊదరగొట్టిన ఒక చానల్ చివరకు తుస్సుమనిపించింది. అసలు విషయం ఏమంటే చైతూ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఆగస్టు చివరిన విడుదల కావలసి ఉంది. వాయిదాపడి సెప్టెంబర్ 13న వచ్చింది. కాని అదే రోజున ప్రప్రథమంగా లేడీ ఓరియంటెడ్‌గా సమంత నటిస్తున్న ‘యూ టర్న్’ వచ్చింది. నిర్మాతలు సర్దుబాటు చేసుకోవలసిన అంశాన్ని చైతు సమంతల మధ్య ఘర్షణగా చిత్రించిన ఆ చానల్ తెలివే తెలివి!!

-అభిలాష, సాంబమూర్తినగర్

కంటెంట్ ఉంటేనే..

‘హీరోలు ఎంత కాలం?’ అన్న ప్రశ్న సంధిస్తూనే హీరోల కొడుకులూ, బంధువులే హీరోలు కావాలా? అని కూడా అడిగారు. రెండు ప్రశ్నలూ సమంజసమే. తమ పర్యవేక్షణలో తాము వేసిన నిచ్చెన ఎక్కి వారసులు పైకి వస్తారనుకోవడం సహజమే. కాని అన్నివేళలా పర్యవేక్షణ, నిచ్చెన సత్ఫలితం ఇవ్వలేవు. వారసుల్లో స్టార్ మెటీరియల్ ఉండాలి. అది లేనినాడు నిచ్చెన మధ్యలో విరిగి కెరియర్ ఆగిపోవచ్చు. ఏ వారసత్వ దన్నులేకపోయినా నాని, విజయ్ దేవరకొండ లాంటివారు స్టార్ మెటీరియల్ ఉండటంవల్ల ముందుకు దూసుకుపోతున్నారు. అందువల్ల వారసులు అయినా, కాకపోయినా స్టార్ మెటీరియల్ ఉండటం అవసరం.

- చైతన్య, వాకలపూడి

వస్తూనే ఉన్నాయ

సినిమాలకు సెన్సార్ అవసరమా? అంటే అవసరమే అని చెప్పాలి. ఇప్పటికే సమాజంలో సెక్స్, క్రైం మోతాదు మించిపోతున్నది. ముఖ్యంగా ఐటం సాంగ్స్, రెచ్చగొట్టే సన్నివేశాలు యూత్‌ని ప్రభావితం చేస్తున్నాయి. సెన్సారింగ్ లేకపోతే మహిళలు థియేటర్‌కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఉండదు. యూత్ అయినా బూత్ సినిమాలు ఎన్ని చూస్తారు? క్రమంగా వారికీ బోర్ కొడుతుంది. సినిమాలు చూడటం మానేస్తారు. సెక్సీ చిత్రాలు తీసే డైరెక్టర్లు క్రమంగా కుటుంబ చిత్రాలవైపు మళ్లడం చూస్తున్నాం. ఎప్పుడూ క్రైం చిత్రాలే తీసేవారికీ చుక్కెదురు అవుతోంది. వీళ్లు కుటుంబ చిత్రాలవైపు మళ్లినా కొత్తవారు ఆ ఖాళీ భర్తీచేస్తూండటంతో సెక్స్, క్రైం చిత్రాలు వస్తూనే ఉన్నాయి.

-గిరిధర్, కాకినాడ

అదీ లేకపోతే.. అంతే!

సోషల్ మీడియాలో పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్లు, మతోన్మాదుల గురించి ప్రసారం అయిన కల్పిత వార్తలువల్ల మూకదాడులు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. టీవీ చానల్స్, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాకుండా ప్రభుత్వ అదుపు ఉండాలి. అయితే అదుపుచేసే చర్యల్ని మాధ్యమాలు, చానల్స్ కోర్టులు కూడా అడ్డుకుంటున్నాయి. ఈ అరాచకాల్ని ఆపడానికి ఏంచేయాలో ఎవరూ చెప్పటంలేదు. వీటికి లేని సెన్సార్ సినిమాలకు ఎందుకు అంటున్నారు. మతోన్మాదాలు, సెక్స్, హింస సెన్సార్ లేకుండా సినిమాల్లో ప్రవేశిస్తే థియేటర్లలోనే రేప్‌లు, కొట్లాటలూ జరగవచ్చు. సినిమాలకు సెన్సార్ ఉండటం మంచిది.

- చంపక్, మాధవనగర్

ఇక ఆపండిబాబూ...

మన పూర్వీకులు మనిషి జీవితాన్ని బాల్య, కౌమార, గృహస్థ, వానప్రస్థ అనే నాలుగు అంచెలుగా విభజించారు. పిల్లలు పెద్దవాళ్లయి పెళ్లిళ్లుచేసుకొని గృహస్థులయ్యాక వారికి, అధికార పగ్గాలు అప్పగించి పెద్దల గ్రేస్‌ఫుల్‌గా రిటైర్ అవడానే్న వానప్రస్థం అంటారు. సాధారణంగా అడవులకుపోయి సన్యాసుల్లాగ జీవితం గడిపేవారు. ఈరోజుల్లో అడవులకు పోవడం కుదరదు కాబట్టి బిడ్డలతో ఇంటి పట్టునే ఉంటూ ఇంటి వ్యవహారాల్లో జోక్యంచేసుకోకుండా అంటీముట్టనట్టు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. అలాంటి జీవితం గడపలేక మన సీనియర్ హీరోలు తుది శ్వాసదాకా నటిస్తూనే ఉంటానంటూ వారసుల అభివృద్ధికి అడ్డంపడుతూ పెత్తనం చెలాయిస్తున్నారు.

- స్నేహమాధురి, పెద్దాపురం

ఇందులోనూ అనుకరణే

నటీమణులు కడు సుకుమారులు. పెళ్లి చేసుకుంటారు గాని తొమ్మిది నెలలు గర్భం మోయలేరు. పరిశ్రమకు ఐదారు నెలలు దూరంగా ఉంటే కెరియర్ ముగిసిపోతుందని భయం. అందుకే గర్భం మోయడానికి ‘అద్దె గర్భాలను’ ఆశ్రయించడం చాలా కాలంగా ఉన్నదే. ఇప్పుడు కొత్త టెక్నిక్ వచ్చింది. వయసు 40 ఏళ్లు దాటితే పుట్టిన బిడ్డలు సక్రమంగా ఎదగరు. అందుకని యవ్వనంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ అండాలను నిద్రపుచ్చి (ఫ్రీజింగ్ చేయించుకొని) వయసు మీరిన తర్వాత పెళ్లిచేసుకొని ఫ్రీజింగ్ చేసిన అండాలను మేల్కొలిపి ఫలదీకరణం చేయించి అద్దె గర్భంలో నిక్షిప్తం చేసి బిడ్డలను పొందుతున్నారు. హాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ టెక్నిక్ బాలీవుడ్‌లో కూడా ప్రవేశించింది. ఔరా! సైన్స్ ఎంత విజృంభించింది!

- గునే్నశ్, కొవ్వాడ

వీళ్లు మారరు

గత తరం నిర్మాత, దర్శకుడు, రచయితలకు సినిమా ఒక తపన. ఒక తపస్సు. ఒక అంకితభావం. ప్రేక్షకులకు ఏదో ఒక సందేశం ఇవ్వాలన్న ఆరాటం. అందుకే ప్రతి పాత్రను తీర్చిదిద్ది నిలబెట్టేవారు. సన్నివేశాలు, పాటలు హృదయాల్ని కదిలించే విధంగా మలిచేవారు. ఆ తరం గతించింది. నేటి తరానికి అసలు దార్శనికత లేదు. అరడజను సినిమాల్లోంచి సన్నివేశాలు ఎత్తుకొచ్చి మాస్‌మసాలా దట్టించి విచ్చలవిడిగా బ్లాక్‌మనీ ఖర్చుపెట్టి లాభాలు నొల్లుకోవాలన్న యావ తప్ప నిబద్ధత లేదు. అవగాహన లేదు. అందుకే సినిమాని జూదంస్థాయికి దిగజార్చారు. ఇలాంటివారి వల్లనే సినిమా జూదం అయిపోయింది.

- సౌందర్య, కాకినాడ