మీ వ్యూస్

మహానటికి భాష్పాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి చిత్రంలో కీర్తిసురేష్ సావిత్రి పాత్రను నిజంగా మనం సావిత్రిగా ఫీలవుతాము. దర్శకుడు క్రిష్ పాత్రతో కె.వి.రెడ్డి సావిత్రిలో ఒక కంట కన్నీరు కురిపించాలని రెండో కన్నులో ఎలాంటి భావం ఉండవద్దని చెబితే ఒకే షాట్‌లో లీనమైన సావిత్రి జీవితంలోని రెండో కన్ను కూడ కన్నీళ్ళమయమైంది. పెళ్ళాం ఉన్న జెమినీ గణేశన్ పెళ్ళాడి ఇంకో స్ర్తితో పడక సుఖం పంచుకుంటే తన జీవితాన్ని నాశనం చేసిన జెమినిపై తిరగబడే సన్నివేశం కన్నీరు కురిపిస్తుంది. సావిత్రి శశిరేఖ పాత్రలో ‘అహనా పెళ్ళంట’ అన్న పాటలో మోహన్‌బాబు ఎస్.వి.రంగారావునే స్ఫురణకు తెచ్చారు. సావిత్రి తన ఆస్తులు పోయినను తన కారు డ్రైవర్‌కు తన పట్టుచీరను అమ్మించి డబ్బులు ఇచ్చే దృశ్యం చూస్తుంటే మనిషికి మనిషికన్నా డబ్బే ఎక్కువన్పిస్తుందే. ఈ ప్రపంచంలో డబ్బుకన్నా మనం చస్తే మన వెంట వచ్చే ఆ నలుగురికోసమే జీవించాలన్నది సావిత్రి చిత్రం చూస్తే అర్ధం అవుతుంది. ప్రేమించి పెళ్ళాడి భరె్తై జీవితం అనుకున్న సావిత్రికి డబ్బే భార్య అవడంపై సావిత్రి మదనపడ్డ దృశ్యాలను కీర్తిసురేశ్ బాగా చేసింది. కీర్తిసురేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇవ్వాలి. సావిత్రిని చూస్తే మనకు అమ్మగా కనబడ్తుంది. అటువంటి అమ్మ కు కన్నీరు కురిపించిన వారిని ముఖ్యంగా సావిత్రి స్టార్‌డమ్ ద్వారా కోట్లు సంపాదించిన నిర్మాతలు కోమాలోకి వెళ్తే ఎవరు ఆదరించకపోవడం సినిమాయగా చెప్తూ సావిత్రికి మా కన్నీరుతో భాష్పాంజలి.
- కోలిపాక రాణిశ్రీనివాస్,
బోడుప్పల్, మేడ్చల్ జిల్లా
అది తప్పు!
వెనె్నలలో నాకు నచ్చిన పాట ‘నీవు లేక వీణ’ పాట గల చిత్రం ‘డాక్టర్ చక్రవర్తి’ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అని పొరపాటున ఆ రచయిత పేర్కొనడం జరిగింది. కానీ అది తప్పు! ప్రసిద్ధ రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి నవల ‘చక్రభ్రమణం’ ఆధారంగా ఆ చిత్రం నిర్మించబడింది. రాష్ట్ర ప్రభుత్వం 1959లో ప్రవేశపెట్టిన ‘నంది’ బహుమతుల పోటీలో మొదటి ‘బంగారు నంది’ కైవసం చేసుకున్న మహత్తర చిత్ర రాజం ‘డాక్టర్ చక్రవర్తి’. కాకపోతే అన్నపూర్ణవారి ఆత్మీయ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మరణం ప్రేక్షక లోకానికీ, పాఠక లోకానికీ తీరని లోటే. ఆ మహా రచయిత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిద్దాం! తేదీ 27.05.2018 వెనె్నలలో వాణిశ్రీగారి వ్యాసం అద్భుతం అనిపించింది. ‘హీరో ఒక్కడేనా?’ అనే కానె్సప్టుతో రచయిత సహాయ పాత్రల విలువలను, చిత్రం విజయం సాధించడంలో, కథను సరియైన దారిలో నడిపించడంలో ఆయా సహాయ పాత్రల పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేసారు. ముఖ్యంగా మా వయసు వారిని స్వర్ణయుగ సినీ వినీలాకాశంలో విహరింపచేసారు. ఆయా పాత పాత్రల గుర్తులు మళ్లీ పాత విషయాల చిత్ర జ్ఞాపకాలతో మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ వ్యాసంలో ఉన్న నిజాన్ని, నిజాయితీని ఈనాటి దర్శక, నిర్మాతలు అర్థంచేసుకుని ముందుకెళితే బాగా ఉం టుంది. ఇటువంటి అర్థవంతమైన వ్యాసాలను అందిం చి, పాత, కొత్త చిత్రాల మధ్య వారధిగా, ఈతరం వారికి ఆనాటి పాత మధురాల విలువల్ని అందిస్తున్న మా ‘వెనె్నల’కు అభినందన చందనాల మాల! మరిన్ని మంచి విషయాలను, మధురమైన జ్ఞాపకాలను మాకు అందించి, మరింత సుందరంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం!
- తాడ్డి అప్పలస్వామి,
పార్వతీపురం
గమనించగలరు
మే 13, 2018 ఈ తేదీ వెనె్నల సంచికలో నాకునచ్చిన పాట శీర్షికలో డా.చక్రవర్తి చిత్రంలో ‘నీవులేక వీణ పలుకలేనన్నది’ అనే పాట వెనుక ఉన్న నేపథ్యాన్ని కర్నూలు నుండి ఓ పెద్దాయన బాగానే వివరించారు. ఆ పాటలో ఉన్న పదాల పవళింపు, భావార్థాలు సన్నివేశానికి సందర్భానికి తగినట్లు మన మనసుకవి ఆత్రేయ వ్రాశారు. డా.సి.నా.రెగారు కాదు గమనించగలరు.
- బంగ్లాజ్యోతిరాణి, రేణిగుంట
ప్రాభవాన్ని
కోల్పోతుంది..
ఇటీవల ‘పాడుతా-తీయగా’ కార్యక్రమంలో బాలుగారి స్వంత విషయాలు ఎక్కువగాచెప్తూ కార్యక్రమాన్ని నీరసపరుస్తున్నారపిస్తుంది. ఈవారం కార్యక్రమంలో చివరిగా పాడిన పాట సదరు యువకుడు ఎంతోబాగా పాడారు. (ఏ) దివిలో విరిసిన పారిజాతమో పాట) కాని బాలుగారు ఆ యువకుని ప్రశంసించడం మానేసి ‘రఫీ’ని గురించి ఎక్కువగా చెప్పడం ఏమీ సమంజసంగా లేదు. బాలుగారు ఇంతకుముందు అనేకమార్లు ‘రఫీ’ భజన చేయడం దానిమీద కొందరు ఘంటసాల అభిమానులు ఆయనను ఘాటుగా విమర్శించడం జరిగింది. దానికి ఆయన వారికి క్షమాపణకూడా చెప్పారు. ఏదిఏమైనా బాలుగారి సోది ఎక్కువై ‘పాడుతా తీయగా’ తన ప్రాభవాన్ని కోల్పోతుంది. ఈ విషయం బాలుగారు గ్రహించి తన ప్రవర్తన మార్చుకుంటే బావుంటుంది.
- జి.శ్రీహరిరావు,
గంగవరం గ్రామం, నెల్లూరు జిల్లా.