మీ వ్యూస్

డేరింగ్ సమంత - మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డేరింగ్ సమంత
నేను అందంగా ఉండనని ధైర్యంగా చెప్పగల ఏకైక నటి సమంత. అద్దంలో నా ముఖం నాకే నచ్చదని అందామె. అందుకే నేను నటించిన సినిమాలు చూడనని చెబుతోంది. దాంతోపాటు తాజాగా డీగ్లామర్ పాత్రలో నటించడానికి ముందుకొచ్చింది. డీగ్లామర్ పాత్రలవల్ల ఆ చిత్రం ఫలితం వేరేలా ఉన్నా ఆమె డిమాండ్ మాత్రం తగ్గదు. ఎందుకంటే గతంలో నాదీ ఆడజనే్మ చిత్రంలో సావిత్రి, చెల్లెలి కాపురంలో శోభన్‌బాబు ఇలాంటి పాత్రల్లో నటించి తమ నటనతో గ్లామర్ తీసుకొచ్చారు. సమంత కూడా అలాగే గుర్తింపు తెచ్చుకుంటుంది.
-పి శుభలక్ష్మి, కాకినాడ

దర్శకుల హవా
ఒక హీరో తన వద్దవున్న కొంతమంది దర్శకులతో సినిమా తీస్తే ఒకే రకమైన చిత్రాలు వచ్చి ప్రేక్షకులకు తలనొప్పిగా తయారవుతాయి. అంతేకాదు ఫ్లాప్‌లుగా మిగిలిపోతాయి. మన హీరోలు ఇప్పటివరకు తీయని దర్శకులతో సినిమాలు తీస్తే, కొత్త కథలు వస్తాయి. అందుకే ఇటీవలే కొందరు హీరోలు కొత్త దర్శకులతో చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో, పవన్‌కళ్యాణ్ వి.వి.వినాయక్‌తో, మహేష్‌బాబు బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమాలు అలాంటివే. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులూ ఆదరిస్తారు. హరీశ్ శంకర్, మెహర్ రమేష్ వంటివాళ్లు కూడా కొత్తవాళ్ళతో సినిమాలు తీయాలి.
-బానాల కృష్ణమాచారి, హైదరాబాద్

చదివిస్తుంది
శుక్రవారం వెనె్నల్లో ప్రతి అంశం మళ్లీ మళ్లీ చదివేలా చేస్తుంది. సినిమా రివ్యూలు, మీవ్యూస్‌లో పాఠకుల అభిప్రాయాలు, సూచనలు, ఫ్లాష్‌బ్యాక్‌లో ఆనాటి చిత్రాలకు సంబంధించిన వివరాలు, సాంకేతిక నిపుణుల సహకారం, శరత్‌కాలంలో కళాకారుల పూర్వాపరాలు, నాకు నచ్చిన పాట, నాకు నచ్చిన సినిమా, కొత్త దర్శకుల పరిచయాలు, నూతన నటీనటుల ఫొటోలతో ప్రతి అంశం అలరిస్తోంది. పాఠకులకు ఇది ఓ కానుకలాంటిదే. అభినందనలతో..
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం

అత్యాశే
తొలి సినిమాతోనే కమర్షియల్ హీరో ఇమేజ్ సొంతం చేసుకునేందుకు అఖిల్ అక్కినేని తీవ్రంగా ప్రయత్నించాడు. ఫైట్లు, డాన్సులు, కామెడీ బాగా చేశాడు. అద్భుతమైన మూమెంట్లతో పాటల్ని హైలెట్‌గా తీసుకెళ్లాడు. తొలి సినిమాతో ఒక హీరోనుండి ఇంతకంటే ఆశించడం అత్యాశే అవుతుంది. అఖిల్ ప్రయత్నాన్ని కథారచయిత, దర్శకుడు దారుణంగా గండికొట్టాడు. అర్థంకాని కథ, అయోమయంతో వున్న కథనం, డెప్త్‌లేని ప్రేమ సన్నివేశాలు, చక్కిలిగింతలు పెట్టినా నవ్వురాని సన్నివేశాలు, బాగా తేలిపోయిన క్లైమాక్స్- ఇలా ఈ సినిమాని పెద్ద డిజాస్టర్‌గా మిగిల్చింది. ఈ హడావుడింతా పక్కన పెట్టేసి తన ఫార్మాట్‌లో వి.వి.వినాయక్ తీసి వున్నా అఖిల్ యావరేజ్ అయ్యేది. తనకు మాలిన ధర్మం వలదన్న సూక్తి వి.వి.వినాయక్ విషయంలో నూరు శాతం నిజమైంది.
-ఎం.కనకదుర్గ, తెనాలి

తామర తంపర సినిమాలు
ఈమధ్య కాలంలో సినిమాలు రాశి ఎక్కువైనా వాసి లేకుండా తామరతంపరగా విడుదలవుతున్నాయి. బ్రూస్‌లీ లాంటి సినిమా ప్లాప్ అయింది. శ్రీనువైట్ల సినిమాలంటేనే రియాల్టీ షోలు ఉంటాయి. అలాంటి సినిమాలన్నీ బాల్చీ తనే్నస్తున్నాయి. ఇక చిన్నాచితక సినిమాలు పేలి పోతున్నాయి. ఎంతో ఊదరగొట్టిన అఖిల్ పత్తా లేకుండాపోయాడు. కథాకథనాలు పాత చింతకాయ పచ్చడితో వినాయక్ వండాడంటే నమ్మలేం. కమల్ చీకటి రాజ్యం సినిమాకు తక్కువ డాక్యుమెంటరీకి ఎక్కువలా తయారైంది. థియేటర్ల యజమానులు తమ ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలు పెంచి, మూటలు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ నిర్ణయాలతో వారికి పనిలేదు. బీదవారికోసం 10 రూపాయలు ఉండాలని చెప్పినా అలాంటిది థియేటర్లలో ఎక్కువ కనపడడం లేదు. ఇక సినిమాలు ఎలా ఆడతాయి.
- శివలెంక చంద్రశేఖర్, మెహదీపట్నం

సూపర్ హిట్ చేస్తారా?
బాలీవుడ్ సూపర్‌స్టార్స్ ముగ్గురు ఖాన్‌లలో అమీర్‌ఖాన్‌కు ఉత్తముడన్న పేరు ఉంది. అయితే అతడే దేశంలో అసహనం పెరిగిపోతోందని, టామ్‌టామ్ చేస్తున్నవారితో చేరి, తన భార్య భయపడి దేశం విడిచిపోదాం అంటుంది అనేశాడు. హిందువుల్ని కించపరిచే దృశ్యాలు ఉన్నాయని కొందరు విమర్శించినా పీకే చిత్రాన్ని సూపర్‌హిట్ చేశారని, మెచ్చుకుందీ అతడే. తను మెచ్చుకున్న వారిలో ఇప్పుడతనికి అసహనం కనిపిస్తోంది! రెండు నెలల క్రితం జరిగిన దుర్ఘటనల్లో నిందితుల్ని అరెస్టుచేసి, విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత దేశం ప్రశాంతంగానే వుంది. ఇప్పుడు అమీర్ అసహనం గురించి మాట్లాడడం ఏమిటి? మరో దేశంలో ఇంత కీర్తి, డబ్బు సంపాదించగలిగేవాడా?
- కె.సుధీర్, శ్రీనగరం

నెత్తిన పెట్టుకొని..
రామ్‌గోపాల్‌వర్మ చెప్పినట్లు మన ముగ్గురు ఖాన్‌లను నెత్తిన పెట్టుకొని.. ఇద్దర్ని దేశ ప్రథమ పౌరులుగా ఎన్నుకొని.. ఎంత గొప్పదనం.. మరి వాళ్లు మతం కోసం అన్నదమ్ములను చంపేసి, తండ్రిని ఖైదుచేసి, ఒక్కగానొక్క అక్క రోషనారా విషమిచ్చి చంపి, గద్దెనెక్కారు. ఇప్పుడు అలాంటివన్నీ మరిచిపోయి అందరూ సహోదరుల్లా మెలుగుతుంటే ఒక ప్రముఖుడి మీద సిరాపోయడం తప్పే, కానీ అన్నిటికీ మతం ముసుగు ఎందుకు?
- జి.నాగమల్లిక, గుంటూరు

కొత్త సినిమా గురూ
కొత్తగా విడుదలైన చిత్రాలపై వెనె్నలలో వస్తున్న సమీక్షలు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇవి చదివిన తర్వాత ఆ అంశాలు నచ్చితేనే సినిమా థియేటర్‌కు వెళ్తున్నాం. కానిపక్షంలో టిక్కెట్ కొని లోపలికి వెళ్లి రావడం దండగ అని అనుకుంటున్నాం. ఈ శీర్షిక అలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది.
- కె.సుబ్రహ్మణ్యం, కావలి