రాష్ట్రీయం

రక్షణ రంగంపై దృష్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక నైపుణ్యాన్ని అందుకోవాలి యువతకు రాష్టప్రతి ప్రణబ్ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 19: దేశ రక్షణ దళాల అవసరం కోసం యువత తాజా సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటూ సైనిక సంబంధిత ఆవిష్కరణలను వేగవంతం చేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మన సైనిక బలగాల సాంకేతిక పురోగతులను ఉపయోగించుకుంటూ ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా వారికి అండదండగా నిలవాలని కోరారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సికిందరాబాద్‌లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం 96వ డిగ్రీ ఇంజనీరింగ్, 24వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు స్నాతకోత్సవంలో ప్రసంగించారు. సైనిక బలగాలకు మన యువత సాంకేతిక రంగంలో వెన్నుదన్నుగా నిలుస్తారని రాష్టప్రతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం మొత్తం యువతవైపు ఇదే ఆలోచనతో చూస్తోందన్నారు. సైనిక ఆవిష్కరణల్లో మన సైన్యం ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. సైనిక సాంకేతిక నైపుణ్యం దేశానికి ఎంతో అవసరమన్నారు. సమాజానికి ఈ నైపుణ్యం ఎంతో ఉపయోగపడిందని రాష్టప్రతి తెలిపారు. ఈ నైపుణ్యం జాతి అభివృద్ధికి ప్రధాన దోహదకారిగా నిలిచిందన్నారు. గతంలో జరిగిన పలు యుద్ధాలను, వాటి ఫలితాలను పరిశీలిస్తే సాంకేతికత కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోందని తెలిపారు. బలమైన ప్రత్యర్థులపై సైనిక పరంగా పై చేయి సాధించాలి అంటే నిరంతరం సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఉండాలని అన్నారు. దేశ సైనిక సామర్ధ్యం మరింతగా పెంచాలన్నా అభివృద్ధి పరచాలన్నా, సైనిక దళాలు, సాంకేతికను వ్యూహాత్మక భాగాస్వాములుగా ఉండాలని అన్నారు. దేశాన్ని సైనిక పరంగా శక్తివంతంగా తయారు చేసేందుకు యువ సాంకేతిక నిపుణులు నూతన ఆవిష్కరణలు చాలెంజ్‌గా స్వీకరించాలని అన్నారు. సైనిక రంగంలో యువ నిపుణులు సాధిస్తున్న ప్రగతి పట్ల సంతోషంగా ఉందని అన్నారు. నేర్చుకోవడం అనేది జీవితంలో నిరంతరం కొనసాగేదని, ఇక్కడ నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరానికి చెందిన యువత తమ ప్రతిభను చూపాలని అన్నారు.
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరంలో మీరున్నారని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఈ కాలంలో యుద్ధంలో సైనిక పరమైన సాంకేతిక నైపుణ్యం కీలక పాత్ర వహిస్తోందని అన్నారు. సాంకేతికంగా బలంగా ఉన్న దేశాలు ప్రత్యర్థులపై పై చేయి సాధించగలుతున్నాయని అన్నారు. యువ సాంకేతిక నిపుణులుగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని సూచించారు. భారత సైనిక రంగం అనేక నూతన ఆవిష్కరణలు చేసిందని తెలిపారు. ఆర్మీ డే సందర్భంగా ప్రధానమంత్రి సైనిక సంకేతిక నిపుణులకు సంబంధించి ప్రాజెక్టులకు ఎనిమిది అవార్డులు బహూకరిస్తే, అందులో నాలుగు అవార్డులు సికిందరాబాద్‌లోని ఎంసిఇఎంఇ కాలేజీకి లభించిందని తెలిసి సంతోషం వేసిందని రాష్టప్రతి అన్నారు. యువ గ్రాడ్యుయేట్‌గా సైనిక విభాగానికి సాంకేతికంగా తానేమీ చేయాలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని రాష్టప్రతి పిలుపు ఇచ్చారు. సైనిక దళాలు, టెక్నాలజీ రెండు కీలక వ్యూహాత్మక భాగస్వాములని ఆయన అన్నారు. మిలిటరీ టెక్నాలజీ వల్ల పౌరసమాజానికి ఉపయోగం కలుగుతోందన్నారు. ఎంపిఇఎంఇ గొప్ప మానవ వనరుల సంస్ధన్నారు. రక్షణ రంగంలో పరిశోధనలు జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని చేపట్టాలన్నారు. గవర్నర్ నరసింహాన్, పలువురు సైనిక అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్టప్రతి మెడల్స్ అందించారు. (చిత్రం) మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కాలేజీ స్నాతకోత్సవంలో స్టూడెంట్ ఆఫీసర్‌కు అవార్డు అందిస్తున్న ప్రణబ్