జాతీయ వార్తలు

మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై పిటిషన్ విచారణకు సుప్రీం ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మసీదుల్లోకి ప్రార్థనల కోసం మహిళలు వెళ్లవచ్చా లేదా అనే అంశాన్ని సుప్రీం కోర్టు తేల్చనున్నది. ఈ మేరకు మహారాష్టక్రు చెందిన ఓ జంట వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ అంశంపై ఫిర్యాదును పరిశీలించేందుకు సుప్రీం అంగీకరించింది. కేంద్ర ప్ర‌భుత్వానికి, సెంట్ర‌ల్ వ‌క్ఫ్ కౌన్సిల్‌, ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్ల‌వ‌చ్చు అంటూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ తీర్పు ఆధారంగానే తాము మ‌సీదుల్లోకి ముస్లిం మ‌హిళ‌లు వెళ్ల వ‌చ్చా లేదా అన్న అంశాన్ని తేల్చాల‌ని భావిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది.