బిజినెస్

మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస రెండు వారాల లాభాలకు బ్రేక్
సెనె్సక్స్ 490, నిఫ్టీ 161 పాయింట్లు పతనం
మదుపరులను వెంటాడిన ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల భయాలు
వారాంతపు సమీక్ష

ముంబయి, డిసెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస రెండు వారాల లాభాలకు గడచిన వారం బ్రేక్ పడింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు 2 శాతం క్షీణించి 26 వేల స్థాయిని కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,800 మార్కుకు దిగువన ముగిసింది. కీలక వడ్డీరేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పెంచుతుందేమోనన్న భయాలు మదుపరులను వెంటాడాయి. నిజానికి గడచిన వారం తొలి రెండు రోజులు సూచీలు లాభాల్లోనే కదలాడినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచడం మదుపరుల పెట్టుబడుల ఆసక్తిని దెబ్బతీసింది. అంతేగాక నవంబర్‌లో పిఎమ్‌ఐ తయారీ గణాంకాలు 25 నెలల కనిష్టానికి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. అటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసిబి) ఉద్దీపన చర్య అంతర్జాతీయ మార్కెట్లను కుంగదీసింది. ఈసిబి బాండ్ల కొనుగోలు కార్యక్రమం అటు ఐరోపా మార్కెట్లతోపాటు ఇటు ఆసియా మార్కెట్లనూ ప్రభావితం చేసింది. ఈ ప్రభావం సహజంగానే భారతీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. దీంతో గడచిన వారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 490.09 పాయింట్లు పతనమై 25,638.11 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 160.80 పాయింట్లు కోల్పోయి 7,781.90 వద్ద నిలిచింది. విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. గడచిన వారం 4,108.13 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. బ్యాంకింగ్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, ఎఫ్‌ఎమ్‌సిజి, పిఎస్‌యు, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఐటి, చమురు, గ్యాస్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. ఫలితంగా ఈ రంగాల షేర్ల విలువ గరిష్ఠంగా 2.68 శాతం, కనిష్టంగా 0.23 శాతం దిగజారింది. అయితే హెల్త్‌కేర్ షేర్లు 0.85 శాతం, రియల్టీ షేర్లు 0.35 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇకపోతే బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.45 శాతం పడిపోగా, స్మాల్-క్యాప్ 0.1 శాతం పెరిగింది. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 14,943.39 కోట్ల రూపాయలు, ఎన్‌ఎస్‌ఇ 94,796.17 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 11,087.94 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 69,864.40 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, అంతకుముందు రెండు వారాల్లో సెనె్సక్స్ 517.67 పాయింట్లు, నిఫ్టీ 180.45 పాయింట్లు పుంజుకున్నది తెలిసిందే.