Others

మనసున మనసై.. నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వర్ణయుగం’ రోజుల్లో అన్నపూర్ణా సంస్థ నుంచి ఎన్నో గొప్ప సినిమాలొచ్చాయి. అందులో -డాక్టర్ చక్రవర్తి ఒకటి. కోడూరి కౌసల్యాదేవి ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా వచ్చిన తొలి తెలుగు సినిమా ఇది. సినిమా ఒక ఎత్తయితే, శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై’ పాట ఒక ఎత్తు. డా.చక్రవర్తి సినిమా కథాపరంగా గొప్పది. అనురాగం, అభిమానం, ప్రేమ, అపార్థాలు, వియోగం, ఎడబాటు, త్యాగం ఇలాంటి విలక్షణమైన అంశాలు, సంఘర్షణలతో ఆద్యంతం ఊపిరి సలపని ఉద్వేగంతో సాగుతుంది. చివరకు అపార్థాలు తొలగి అందరూ కలవడం, శుభం.. కార్డుపడటం ఇందులో విశేషాంశం. ప్రతీ మనిషికీ ఎవరోఒకరు మనసున మనసుగా, బ్రతుకున బ్రతుకుగా తోడుండాలని కథానాయకుడు చెప్పడమే పాట. భావస్ఫోరకంగా ఘంటసాల పాడితే, అనువైన బాణీని ఎస్ రాజేశ్వరరావు అందించి పాట గుభాళించేలా చేశారు. ‘ఆశలు తీరని ఆవేశములో/ ఆశయాలలో ఆవేదనలో/ చీకటి మూసిన ఏకాంతములో/ తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గము.’ అంటారు తొలి చరణంలో శ్రీశ్రీ. నిన్నునిన్నుగా ప్రేమించుటకు/ నీకోసమే కన్నీరు నింపుటకు/ నేనున్నానని నిండుగ పలికే/ తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ.. -ఈ పదబంధాల్లో ఎంతటి నిగూఢార్థాలను పొదిగారో శ్రీశ్రీ. అలతి పదాలతో ఆకాశమంత అర్థాన్ని చెప్పి ఔరా! అనిపించారు శ్రీశ్రీ. అల్లూరి సీతారామరాజు చిత్రంలోని -తెలుగువీర లేవరా పాటకు జాతీయ అవార్డు అందుకున్న శ్రీశ్రీ, అంతకు పదేళ్ల ముందటే జాతీయస్థాయి అవార్డు అందుకోగలిగిన పాటను మనకు అందించారు. ఈ కాలంలో ఇలాంటి పాటలు రాసినా ఆదరించే ప్రేక్షకులు లేరు. అందరికీ కెవ్వుకేకలు, ఆటోఅప్పారావులే కావాలి మరి.
-కె.ఎన్నార్ నమ్మి, పెనుగొండ