బిజినెస్

మాల్యాను వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకులు ప్రతి పైసా వసూలు చేస్తాయి
‘ఇండియా టుడే కాంక్లేవ్’లో జైట్లీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 17: ఉద్ధేశ్యపూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోవని ఆయన నుంచి ప్రతి పైసా వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మాల్యా దేశం విడిచి పారిపోవడంపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో జైట్లీ మంగళవారం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాకుండా మాల్యా చట్టాన్ని ఉల్లంఘంచినట్లు తేలితే ఆయనపై దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు చేపడతాయన్నారు. చాలా కాలం నుంచి కార్యకలాపాలను ఆపేసి నేలకే పరిమితమైన కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థకు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ మాల్యా సంస్థల నుంచి రూ.9000 కోట్లకు పైగా రుణాలను రాబట్టుకునేందుకు పలు బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరపడానికి కొద్ది రోజుల ముందే ఆయన ఈ నెల 2వ తేదీన దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మాల్యా వ్యవహారంలో వాస్తవాలు ఏమిటో స్పష్టమయ్యాయని, చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే ఆయనపై దర్యాప్తు సంస్థలు మొదలుకొని ఆదాయ పన్ను విభాగం వరకు ప్రభుత్వంలోని సంబంధిత సంస్థలన్నీ తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాయని, అలాగే బ్యాంకులు కూడా ఆయన నుంచి ప్రతి పైసా రుణాన్ని తిరిగి వసూలు చేస్తాయని జైట్లీ చెప్పారు. విజయ్ మాల్యా నుంచి రుణాలను తిరిగి వసూలు చేసేందుకు ప్రభుత్వం ఏమి చేస్తోందని ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో అడిగిన ప్రశ్నకు జైట్లీ పై సమాధానమిచ్చారు. అంతేకాకుండా, ఉక్కు, జౌళి, రహదారులు, వౌలిక వసతులు తదితర రంగాల్లో నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.