Others

మళ్లీ చురక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు అన్న తేడా లేకుండా ఎవరిమీదైనా పంచ్‌లు వేసే ధైర్యం ఎవరికుంది? అంటే కచ్చితమైన సమాధానం ఎవరైనా చెప్పేది ఒక్కటే. అదే సమంత. సమంతకున్న ధైర్యం ఎవరికీ లేదేమో. గతంలో హీరోలపైనే పంచ్‌లు వేసేసిన ఆమె తాజాగా తనతోటి హీరోయిన్లకు పంచ్ వేసింది. హీరోయిన్లందరూ తమ తల్లులతో సెట్స్‌పైకి వస్తారని, అలాంటిది తనకిష్టం వుండదని చెప్పుకొచ్చింది. ఒకరి సహాయం ఎందుకు? మనమేమైనా చిన్నపిల్లలమా అంటూ ప్రశ్నించింది. సెట్స్‌లో ప్రతి ఒక్కరూ ఎవరిపని వారు చేసుకుంటూ పోతూ, ప్రొఫెషెనల్‌గా వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు రావని, తనకు ఇప్పటివరకూ ఎలాంటి ఇబ్బంది కానీ, తల్లిదండ్రుల్ని తన తోడుగా తెచ్చుకోవడం అన్న విషయాలు కానీ ఎదురవ్వలేదని చెప్పుకొచ్చింది. తన దర్శకులందరూ ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు తనను అభినందిస్తూ, వారి పని వారు చేయించుకుంటారని, అందుకే తనకుకెటువంటి తోడు అవసరం లేదంటూ ట్వీట్ ఇచ్చింది. ఇది ఎవర్ని దృష్టిలో పెట్టుకుని అన్నదో తెలిసిపోతుంది కదా!