జాతీయ వార్తలు

వేట ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగ్గురు ఉగ్రవాదుల హతం
మాలిలో పది రోజులు ఎమర్జెన్సీ
మూడు రోజుల సంతాప దినాలు

బమాకో (మాలి), నవంబర్ 21: మాలి రాజధాని బమాకో లగ్జరీ హోటల్‌పై జరిగిన ఉగ్రవాద దాడికి పాల్పడినవారికోసం గాలింపు ముమ్మరం చేశారు. దాడిలో 27 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్న ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. దాడి నేపథ్యంలో ఎమర్జన్సీ విధించారు. మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. మరోపక్క దాడికి పాల్పడింది తామేనంటూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అనుబంధ గ్రూపు అల్-మురాబితౌన్ ప్రకటించుకుంది. అల్జీరియా కరుడుగట్టిన ఉగ్రవాది మిలిటెంట్, ఒంటికన్ను మొఖ్తార్ బెల్‌మొఖ్తార్ ఆధ్వర్యంలో ఈ గ్రూపు నడుస్తోంది. బమాకోలోని రెడీసన్ బ్లూ హోటల్‌పై దాడి చేసిన ఉగ్రవాదులకోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట్టు మాలి భద్రతాధికారులు శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. విచారణలో కొంత పురోగతి సాధించినట్టు తెలిసింది. అయితే పూర్తి వివరాలు వెల్లడించడానికి సంబంధిత వర్గాలు నిరాకరించాయి. ప్రస్తుతం రెడీసన్ బ్లూ హోటల్‌ను భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కమెండోలు 9 గంటల ఆపరేషన్‌లో అల్-మురాబితౌన్ అధినేత మొఖ్తార్‌ను మట్టుపెట్టినట్టు అధికారులు తెలిపారు. హోటల్ కాంప్లెక్స్‌పై దాడి చేసిన భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతం చేశాయ.
జిహాదీ దాడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పది రోజులు అత్యవసర పరిస్థితి విధించారు. ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారిలో ముగ్గురు చైనీయులు, ఒక అమెరికా పౌరుడు, ఒక బల్గేరియన్ ఉన్నట్టు మాలి ప్రభుత్వం ప్రకటించింది. వందమందికి పైగా బందీలుగా తీసుకోగా 27 మంది మరణించినట్టు తెలిపారు. బమాకో హోటల్‌పై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు చైనా విదేశాంగ ప్రతినిధి హాంగ్ లీ సానుభూతి తెలిపారు. ఆటవిక దాడులను అందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. శాంతికి విఘాతం కల్పించడానికే ఉగ్రవాదులు దాడులకు దిగుతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ అన్నారు. అమాయకుల ప్రాణాలు తీయడం దారణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా ఖండన
రెడీసన్ బ్లూ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడిలో తమ దేశానికి చెందిన ముగ్గురు మృతి చెందారని చైనా స్పష్టం చేసింది. మరణాలపై తీవ్ర సంతాపం తెలిపిన చైనా అధ్యక్షుడు జి జింపింగ్ దాడులను తీవ్రంగా గర్హించారు. చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు బమాకో హోటల్‌లో మృతి చెందినట్టు ఓ అధికార ప్రకటనలో తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా విదేశాల్లో ఉంటున్న పౌరుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దేశాధ్యక్షుడు దాడిని ఖండిస్తూ చేసిన ప్రకటనను చైనా సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేసింది. మాలి ఉగ్రవాద దాడిలో తమ దేశ పౌరులూ మృతి చెందారని రష్యా వెల్లడించింది. అయితే మృతుల వివరాలు, పూర్తి సమాచారం అందాల్సి ఉందని రష్యా విదేశాంగ ప్రతినిధి మారియా ఝఖరో తెలిపారు. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ** బమాకో హోటల్ వెలుపల పార్క్ చేసిన వాహనాన్ని తనిఖీ చేస్తున్న కమాండో **