మెయిన్ ఫీచర్

సై.. సైరా... మల్టీస్టారర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశమే హరివిల్లయ వేనవేల రంగుల కలయికతో హృదిని అలరించినట్లు... అవని పూల వనమై కుసుమ పరిమళాలతో గుండెని అభిషేకించినట్లు... అంతరిక్షమే చల్లని వెనె్నలగా మారి మదిని పులకరింప చేసినట్లు... ఏకంగా మేను గాలి పొరలై తేలిపోతూ తన్మయత్వానికి లోనైనట్లు... ఓష్..! అసలిలాంటి ఎన్నో ఉపమానాలనైనా మాలలుగా గుడిగుచ్చి మనో వాకిట అనుభూతుల తోరణాలుగా అలంకరింప చేయొచ్చు. అంత హ్యాపీ మ్యాటరన్న మాట!! ఏంటది? మరదేనండో.. మళ్లీ టాలీవుడ్ తెరపై మల్టీస్టారర్ బొమ్మ శ్రీకారం చుట్టుకుంది. రెండు కొదమ సింహాలు తలపడితేనే మజామరి. రెండు చిరుతలు పోరుపడితేనే థ్రిల్ మరి. రెండు ఒంగోలు గిత్తలు రంకెలేస్తేనే పసందు మరి. రెండు పొట్టేళ్లు ఢీ కొంటేనే హుషారు మరి. సైరా.. సై... మల్టీస్టారర్‌కి మేము సై... అంటున్నారిప్పుడు కొందరు టాలీవుడ్ స్టార్స్... అవునా.. ఇది నిజమా? అవును.. నిజమే! మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడానికి సమీకరణలు జరుగుతున్నాయన్నది ఫ్లాష్ న్యూస్!
కథాకమామీషు..
తొలినాళ్లలో తెలుగు సినిమాల్లో చాలామంది హీరో పాత్రలు ధరించి మెప్పించినా ప్రధానంగా చెప్పుకునేది చిత్తూరి నాగయ్యనే. గుర్తుండిపోయే పాత్ర పోషణ చేశారాయన. మంచి మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి అందించారు. కానీ తర్వాత కథానాయకులుగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగిడిన అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావులు కథానాయకుడికి ఓ కొత్త ఇమేజ్ తెచ్చారు.
హీరోకు క్రేజీనెస్ ఆపాదించారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. అందుకే వాళ్లిద్దరూ తెలుగు సినీ పరిశ్రమకి తొలితరం స్టార్ హీరోలయ్యారు. వెలకట్టలేని ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో అజరామరమైన నటావిష్కరణ చేసి నభూతో నభవిష్యత్‌గా నీరాజనాలందుకున్నారు - అందుకుంటున్నారు... మరణానంతరం కూడా!
అయితే వీళ్లిద్దరి తొలిదశల్లోనే వీరితోపాటు సహ హీరోలుగా చలామణీ అయిన జగ్గయ్య, కాంతారావు లాంటి వారు అక్కినేని, రామారావులతో కలిసి పలు చిత్రాల్లో నటించినా, అవి అన్నీ మామూలు చిత్రాలుగానే సినీ మేధావులు పరిగణనలోకి తీసుకున్నారు. స్టార్‌డమ్‌తో అశేష ప్రేక్షకాభిమానులతో వెలిగిపోతూ సినీ పరిశ్రమకి నిండుదనాన్ని అద్దిన ఎన్టీఆర్, ఏయన్నార్‌లు కలిసి నట విశ్వరూపం ప్రదర్శించిన సినిమాల్నే మల్టీస్టారర్ సినిమాలన్నారు. అలనాటి ఈ సినీ దిగ్గిజాలు రికార్డు స్థాయిలో మొత్తం 14 మల్టీసారర్ చిత్రాల్లో నటించి... హిట్స్ కొట్టి... అనూహ్యమైన కాంబినేషన్‌కి అంకురార్పణ చేశారు.

భేషజాలు లేకుండా పాత్రోచితంగా స్క్రీన్‌షేర్ చేసుకొని ప్రేక్షకుల్ని అలరించడమే ధ్యేయంగా అన్ని చిత్రాల్లో నటించారు. సినీ కళామతల్లికి రెండు కళ్లు అనదగ్గ ఓ అగ్రనటులారా హ్యాట్సాఫ్! మీకు మనసారా సినీ వందనం!! ఈ ఇద్దరు మహామహుల సహృదయత, గొప్పతనం ఇంతటితో ఆగిపోలేదు. తమ తర్వాత వచ్చిన తమతో సమాన స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరోలతోనూ తెరపంచుకొని మల్టీస్టారర్ సినిమాలకు కొనసాగింపు చేశారు.ఎన్టీఆర్ - కృష్ణ, అక్కినేని - కృష్ణ కాబినేషన్‌తో మల్టీస్టారర్ సినిమాలొచ్చాయి. అలాగే కృష్ణ - శోభన్‌బాబు, కృష్ణ - కృష్ణంరాజులు సైతం పవర్‌ఫుల్ మల్టీసారర్ సినిమాల్ని ప్రేక్షకులకి అందించి మెప్పించారు. ఒకే స్క్రీన్‌పై ఇద్దరు ప్రజాదరణ పొందిన ప్రముఖ హీరోలు సందడి చేయడమనేది... నిజంగా ఇరు హీరోల అభిమానులకే కాదు... ప్రేక్షక లోకానికే ఆనందదాయకమైన విషయం. అలాగే దశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలిన ఈ ఇద్దరు స్టార్‌లె జెండ్స్ అక్కినేని - నందమూరి 14 చిత్రాల్లో నటించి ప్రేక్షకులని కనువిందు చేయడమనేది బహుశా.. రికార్డు మ్యాటరై ఉంటుంది.
ఇప్పటి మల్టీస్టారర్‌లు...
అలా ఆ తరం హీరోలు నెలకొల్పిన మల్టీసారర్ సినీ ఆనవాయితీని చాలా ఏళ్లకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మళ్లీ శ్రీకారం చుట్టారు. వెంకటేష్-మహేష్‌లు. మర్టీసారర్ చిత్రాలు ఏ కాలంలో ఏ దశలో వచ్చినా బ్లాక్‌బాస్టర్‌లేనని రికార్డ్ కలెక్షన్లతో రుజువు చేశారు. ఈ తరానికి మల్టీస్టారర్ కాంబినేషన్ కొత్త కావడంతో సంక్రాంతి సీజన్‌లో విడుదలైన ఆ సినిమాకి ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పట్టారు. ఫర్వాలేదు, ఇద్దరేసి స్టార్లతో సినిమాలు తీస్తే ప్రేక్షకామోదం లభిస్తుందనే ధైర్యాన్ని దర్శక నిర్మాతలకి కలిగేలా మల్టీస్టారర్ చిత్ర నిర్మాణ పునర్ వైభవానికి మరొకసారి తెర లేపింది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా. ఇక వెంకటేష్ - పవన్ కలిసి చేసిన సినిమా ‘గోపాల గోపాల’ విషయానికి వస్తే... వెంకటేష్ మీదున్న గౌరవంతో పవన్ సపోర్టింగ్ పాత్రలో నటించిందే తప్ప, అది మల్టీస్టారర్ మూవీ జోనర్‌లోకి రాదని సినీ విశే్లషకులు తేల్చేసారు. అందుకు తగినట్టుగానే సినిమా సక్సెస్ రుచి చూసింది తప్ప సెనే్సషనల్ క్రియేట్ చేయలేదు. పవన్ అభిమానులే సినిమాను సీరియస్‌గానూ తీసుకోలేదు. అలాగే వెంకటేష్ - రామ్ ప్రధాన పాత్రధారులుగా మరొక హిందీ మూవీ ‘మసాలా’గా రిమేక్ అయ్యింది. ఒకరు వెటరన్ హీరో, మరొకరు యంగ్ హీరో మాత్రమే కావడంతో ప్రేక్షకులేమంత ఆసక్తి కనబరచలేదు. ఇక త్వరలో అనిల్ రావిపూడి వెంకటేష్‌తో తీయబోయే సినిమాలో మరో హీరోకి స్థానముంటుందని ప్రకటించారు తప్ప, అది మల్టీస్టారర్ సినిమా అంటూ పెద్దగా హడావుడేం చేయడం లేదు. కానీ, బోయపాటి శీను తన స్వీయ దర్శకత్వంలో బాలయ్య, మహేష్‌ల సంచలనాత్మక కాంబినేషన్‌లో ఒక ఉంటుందనీ ఊహాగానపు ప్రకటన ఊపందుకుంది. ఇదే గనక వాస్తవ రూపం దాల్చితే... ఇద్దరూ ఓకే అంటే ఎవరికి వారు క్రేజీస్టార్స్ కాబట్టి ప్రేక్షకులకి పండగే! పైగా ఎన్టీఆర్ - కృష్ణ కలిసి నటించిన అలనాటి ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలా వారి వారసులుగా ‘బాలయ్య - మహేష్’ సినిమా ఈ కాలానికి తగినట్టు సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంటుంది. ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ తన దర్శకత్వంలో ఏకంగా ముగ్గరు యంగ్ హీరోలు రానా, నితిన్, నారా రోహిత్‌లతో ఓ కొత్త సినిమా ప్లాన్ చేసాడని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కుదిరి సెట్స్‌పైకి వెళితే చూడాలి మరి. సినీ క్రిటిక్స్ దీన్ని మల్టీస్టారర్ అంటారా... వాళ్లెవరూ ఇంకా స్టార్‌డమ్ పొందలేదు కాబట్టి ‘‘క్రేజీ కాంబినేషన్’ సినిమాగా తేల్చేస్తారా చూడాలి మరి. మొత్తానికి ఇలాంటివే కాక, మరికొన్ని రోజుల్లో టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ప్లస్ క్రేజీ కాంబినేషన్ చిత్రాల హవా హైరేంజ్‌లో ఊపందుకోనుందని తెలుస్తోంది. అలాగే నాగ్-నాని, వెంకీ-చైతూల కాంబినేషన్‌లో కూడా సినిమాలు రావొచ్చని వార్తలు వినవస్తున్నాయి. పైన మొదలైన... మొదలవ్వబోతున్న స్టార్ (లేదా హీరోస్) సమ్మేళిత సినిమాల్ని పక్కనపెట్టి... ఇంకా సరికొత్త కాంబినేషన్లో సినిమాలు కొబ్బరికాయలు కొట్టుకుంటే మటుకు టాప్ లేచి బాక్సాఫీస్ పలుమార్లు షేక్ అవచ్చని కొందరు అభిమాన సినీ ప్రేక్షకులు ఊహాగానాలు చేసుకుంటున్నారు. అవి ఎలాంటి కాంబినేషన్లో ఓసారి చూసేద్దామా?
నెంబర్‌వన్
చిరు-నాగ్-బాలయ్య-వెంకీలది సూపర్ కలయిక. ఈ నలుగురు వెటరన్ టాప్ హీరోల్లో ఏ ఇద్దర్ని కలిసి... ఓ సినిమా మల్టీస్టారర్‌గా మలచినా అదొక వండర్ క్రియేట్ చేసి తీరొచ్చు. హైరేంజ్‌లో నిర్మాతల జేబుల్ని కాసులతో నింపేస్తాయనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ స్టార్‌డమ్ పక్కన పెట్టి వాళ్లంతా కలిసి నటించడానికి సుముఖంగా ఉండాలంతే! వాళ్లు ఓకే అంటే మాత్రం ఏ ఒక్క రచయిత అయినా మాంచి కథని పసందుగా వండడానికి రేడీగానే ఉంటాడు. పైగా కొత్తకొత్త కథలు పుట్టుకు రావడానికి సిద్ధంగా ఉంటాయి. బాక్సాఫీస్ సైతం వెలవెల బోకుండా గలగలమంటుంది. సినీ బిజినెస్ జోరందుకుంటుంది. తన సినీ కెరీర్ కొత్తలో చిరు సీనియర్ ఎన్టీఆర్ తిరుగులేని మనిషి చిత్రంలో చిన్నపాత్ర పోషించి... ఆ మహానటుడితో కలిసి నటించిన ఓ తీపిగురుతుగా తన ఖాతాలో వేసుకున్నాడు, అలాగే స్టార్‌డమ్ వచ్చాక అక్కినేనితో మెకానిక్ అల్లుడులో లీడ్‌రోల్ పోషించి ఈ పెద్ద హీరోతోనూ, స్క్రీన్ షేర్ చేసుకున్నాడు తప్పితే అవి రెండూ మల్టీస్టారర్ జోనర్‌లోకి చేరవు, అందుకే చిరు ఇపుడు సమ ఉజ్జీలుగా సినిమా పరిశ్రమలో ఉన్న నాగ్-బాలయ్యలతో కలిసి నటిస్తే... అప్పుడీ సినిమాలు సిసలైన మల్టీస్టారర్ చిత్రాలవుతాయ. పోతే చాలా ఏళ్ల క్రితమే గుండమ్మకథని రీమేక్ చేస్తే బావుంటుందని బాలయ్య - నాగ్‌లు తమ తండ్రుల పాత్రలు పోషించాలనే ఓ సినిమా గాసిప్ సుడులు తిరిగింది. కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ వార్తే ఎప్పటికైనా నిజమైతే తండ్రుల మల్టీస్టారర్ ఆనవాయితీని వీళ్లిద్దరూ వారసత్వంగా కొనసాగించిన వారవుతారు. కానీ ఇప్పట్లో ఇది సాధ్యపడక పోవచ్చు. ప్రస్తుతం వాళ్లిద్దరూ వ్యక్తిగత రీత్యా ఎడమొగం పెడమొగంగా ఉంటున్న దృష్ట్యా వీరి నుండి మల్టీస్టారర్ చిత్రాన్ని ఊహించడం, ఆశించడం వృథా ప్రయాసే! ఇక నాగ్ - వెంకీలతో ‘బావ-బావమరిది’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కించాలని ఉందని... ఈ హీరోలు స్టార్స్‌గా మాంచి ఊపు మీదున్నపుడు రామానాయుడు గారన్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకనో అదీ, కార్యరూపం దాల్చలేదు. చూద్దాం. రేపేమవుతుందో... ఏ మల్టీస్టారర్ సినిమాకి ఎప్పుడు అంకురార్పణ జరుగుతుందో?
నెంబర్ టూ
పక్కాగా పవన్ - మహేష్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తే మాత్రం బాక్సాఫీస్ షేకైతీరుతుంది. ఈ ఇద్దరు క్రేజీస్టార్స్ కాంబినేషన్ అదిరిపోయే రీతిలో ఉంటూ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని తప్పక అలరించి తీరుతుంది. వాళ్లు స్పందించి పచ్చజెండా ఊపాలే గానీ... సరికొత్త కథలు బారులు తీరొచ్చు. టి.సుబ్బరామిరెడ్డి మెగా సోదర ద్వయం చిరు, పవన్‌లతో ఓ మల్టీస్టారర్ తప్పక తీస్తానని... అందుకు కథ కసరత్తు జరుగుతోందని... అప్పటికి బహిరంగంగా ప్రకటించి... మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఇది గనక వాస్తవ రూపం దాల్చితే... ఇద్దరూ ఒకే కుటుంబ హీరోలు కాబట్టి, ‘మనం’లా మరో మరచిపోలేని సినిమా అయితీరుతుందనడంలో సందేహం లేదని సినీ విశే్లషకులు అంటున్నారు.
నెంబర్ త్రీ
ప్రభాష్ - జూ.ఎన్టీఆర్ - అల్లు అర్జున్ - రామ్‌చరణ్... ఈ నలుగురిలో ఏ ఇద్దరు ఒకే సినిమాని షేర్ చేసుకున్నా ఫలితాలు హై పిచ్‌లో ఉంటాయన్నది నిర్వివాదాంశం. అలాగే తిరిగి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. అల్లు అర్జున్ - రామ్‌చరణలు ఆల్రెడీ ‘ఎవడు’ సినిమాలో ఉన్నా అది బంధుత్వ రీత్యా సపోర్టింగ్ పాత్రగా మిగిలిపోయింది తప్ప అల్లు అర్జున్‌ది పూర్తిస్థాయి పాత్ర కాదు. కాబట్టి ఆ చిత్రం మల్టీస్టారర్ సినిమా కిందికి రాదు. అందుకు మరొక మంచి యాక్షన్ మసాలా సినిమా ఇద్దరి కలయికతో వస్తేనే మల్టీస్టారర్ చిత్రం అవుతుంది. అందుకే సరితూగే మంచి కథ కథనాలతో పైన తెలిపిన నలుగురి కాంబినేషన్‌లో ఏ ఇద్దరితోనైనా బొమ్మ తీస్తే... మామూలుగా ఉండదు. టాలీవుడ్ వెండితెర చిరిగిపోద్ది. కానీ చెరిసగం తూగే మంచి వంటకం కావాలి. అపుడే అదుర్స్ అవుతుంది. మల్టీస్టారర్ చిత్రం ‘యన్టీఆర్ - రామ్‌చరణ్’లతో ‘యమధీర’గా రాజవౌళి అనుకుంటున్నాడనే ఊహ చక్కర్లు కొట్టింది.
ముక్తాయింపు
పైన తెలిపిన నెంబర్ వన్ - టూ - త్రీ కాంబినేషన్స్ మినహా మరే ఇతర హీరోల కాంబినేషన్స్ సెట్టయినా... బహుశా సెనే్సషనల్ కాంబోలుగాకపోచ్చు. పెద్దగా హైప్ కూడా క్రియేట్ చేయక పోవచ్చు. ఎందుకంటే క్రేజీస్టార్లు కలిస్తేనే అది క్రేజీ మల్టీస్టారరై క్రేజీ క్రేజీగా ఉంటుంది. ఒకవేళ ‘జై లవకుశ’లోలా ఒకే ఎన్టీఆర్ మూడు పాత్రలకి కాకుండా... జై-లవ-కుశ...లుగా వేర్వేరు స్టార్స్‌ని (కథనం మారొచ్చు) ఊహించి చూడండి. బొమ్మ ఎక్కడికో వెళ్లిపోద్ది. ఇలా ముగ్గురు స్టార్స్ ఒకే సినిమాలో నటించడమనే ప్రయోగం టాలీవుడ్ స్థాయికి కొత్తవుతుంది. ఆ సాహసానికి పూనుకుంటారా ఎవరైనా? అసలది సాధ్యపడుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశే్న!
గతంలో ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాలో రామారావు, నాగేశ్వరరావులతో పాటు పోటాపోటీగా మరో తమిళస్టార్ శివాజీగణేషన్ అలెగ్జాండర్ పాత్రతో ఇరగదీసినా అది సహాయ పాత్రగానే నిలిచిపోయింది. కాబట్టి ఆ సినిమా ఇద్దరు హీరోల మల్టీస్టారరే అయ్యింది. ఇక ఈ మధ్యే వచ్చిన శమంతకమణిలో ఏకంగా నలుగురు నారారోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది లాంటి వారు కలిసి నటించినా... వాళ్లంతా అప్‌కమింగ్ హీరోలు అయినందున... ఇలాంటి సినిమాల్ని మల్టీస్టారర్ అనలేమని అంటున్నారు.
ఏదేమైనా స్టార్ సినిమాలు స్టార్స్ లెవెల్సే! అందుకే అవి మల్టీస్టారర్లుగా చలామణీ అవుతున్నాయి. సినీ లోకంలో తిరుగులేని చిత్రాలుగా చిరస్థాయిగా నిలిచి పోతున్నాయి. ఒక దశలో చరిత్ర సృష్టిస్తున్నాయి.
అందుకే అభిమానులతో పాటు ప్రేక్షకులు అలాంటి సినిమాలకి స్వాగతం పలకాలి. మల్టీస్టారర్ సినిమాల్లో తమతమ ఫెవరేట్ హీరోలు ‘రీళ్ళని’ పంచుకోవడం కాదు... ‘కథను’ షేర్ చేసుకుంటే చాలని... అభిమానులు భావించి అనుమతిస్తే... ఎన్ని మల్టీస్టారర్ సినిమాలైనా టాలీవుడ్ తెరపై క్యూ కడతాయి. సరికొత్త మల్టీస్టారర్స్ చరిత్ర పునఃసృష్టికి కారణభూతమవుతాయి. బాక్సాఫీసు సైతం ఇలాంటి సినిమాలతో కళకళలాడుతుంటుంది. టాలీవుడ్ సినిమా బొమ్మ ‘కళ’గా మురిసిపోతుంది!

-ఎనుగంటి వేణుగోపాల్