మెయిన్ ఫీచర్
సంక్రాంతి సంగ్రామం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పవన్‌కళ్యాణ్- త్రివిక్రమ్‌ది సూపర్‌హిట్
కాంబినేషన్. వీరిద్దరూ ‘జల్సా’తో హంగామా సృష్టించారు. ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టారు. అందుకే ఈ ‘అజ్ఞాతవాసి’పై అంచనాలు పెరిగాయ. అమెరికాలో అత్యధిక సెంటర్లలో విడుదల చేస్తుండడంతో ఈ విషయంలో ‘బాహుబలి’ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. విడుదలకు ముందే దాదాపు పది కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో సినిమా విజయవంతమయితే ‘అజ్ఞాతవాసి’ వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. ప్రవాసంలో ఉన్న ఓ రాకుమారుడిలా పవన్‌కళ్యాణ్ వినోదాలు పంచబోతున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్- త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సంక్రాంతికి సరికొత్త రికార్డుల్ని సృష్టించే చిత్రమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ.
సంక్రాంతి పండుగ వస్తుందనగానే మన ఇళ్లల్లో, ముఖ్యంగా గ్రామాల్లో పండుగ వాతావరణం చోటు చేసుకోవడం మనం చూస్తున్నదే. ఎంతో సరదాగా నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా వేయబోయే ముగ్గులు.. చేయబోయే వంటకాలు.. రాబోయే అతిథులు.. కొనబోయే దుస్తులు.. పాల్గొనబోయే పోటీలు.. ఇలా అన్నింటి గూర్చీ మాట్లాడుకోవడం మొదలు పెడతాం. వీటన్నింటితో పాటు మనం ముఖ్యంగా చర్చించుకునేది పండుగలో భాగమైన సంక్రాంతి సినిమాల సంగ్రామం గూర్చి. సినీ ప్రియుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేవి సంక్రాంతి చిత్రాలే. టాలీవుడ్‌లో అతిపెద్ద సీజన్ సంక్రాంతి. వారం రోజులపాటు సెలవులు వుండే ఈ సీజన్‌లో అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదలవుతుంటాయి. సంక్రాంతి ఒక సెంటిమెంట్‌గా భావించే స్టార్ హీరోలున్నారు.
సంక్రాంతి వచ్చిందంటే వెండితెరకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే. ఈ సీజన్‌లోనే తమ చిత్రాలను విడుదల చేయడానికి ప్రతీ హీరో, దర్శక నిర్మాతలూ ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటుంటారు. గత ఏడాది సంక్రాంతి పండుగ సమయం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్.150’, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానం భవతి’ ఇలా వచ్చిన మూడు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. జనవరి నెలలో వచ్చే ఈ సంక్రాంతి సంగ్రామానికి ముఖ్యం గా ఈ ఏడు అంటే 2018కి రెండంటే రెండే చిత్రాలు నువ్వా.. నేనా? అన్న రీతిలో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేయబోతున్నాయ. అవి పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జై సింహా’. వీటితో పాటు యువ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడుగా నటించిన ‘రంగులరాట్నం’ తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘గ్యాంగ్’ సైతం ఈ బరిలోనే అడుగుపెడుతున్నాయ. అయితే పోటీ విషయానికొస్తే మాత్రం రెండు అగ్ర హీరోల చిత్రాలనే పరిగణనలోకి తీసుకోవాలి. భారీ బడ్జెట్‌తో కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాలు సంక్రాంతి సంగ్రామానికి సై అంటే సై.. అంటున్నాయ్. ఇటు బాలయ్యకు, అటు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువే. వీరి చిత్రాల విడుదల సమయంలో అభిమానుల హల్‌చల్ అంతా ఇంతాకాదు. 2018లో సంక్రాంతికి తమ అభిమాన హీరోల చిత్రాలు వస్తున్నాయంటే ఇక వీరి ఆనందానికి హద్దేముంటుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జై సింహా’ ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి సమరానికి సై అంటున్నాయి. ‘ఈ సంక్రాంతి విజేతలం మేం అంటే మేమే’ అంటూ ఆయా చిత్రాల హీరోలతో పాటు దర్శక నిర్మాతలూ బలమైన నమ్మకంతో వున్నారు.
పక్కా మాస్ నటనతో ఇప్పటికీ వనె్న తగ్గని నటుడిగా పేరు తెచ్చుకుంటూ నేటి తరం కుర్ర హీరోలతో పోటీపడుతున్న హీరో బాలకృష్ణ ‘జై సింహా’ గా కాలర్ ఎగరేస్తూ సంగ్రా మం లోకి అడుగుపెడు తున్నా రు. బాలకృష్ణ సినిమా అంటే రౌద్ర రసం, డైలాగులు, స్టెప్పులు.. వాటితో పాటు వినోదం కూడా! బాలయ్య కామెడీ చేస్తే భలే బాగుంటుంది దానికి బ్రహ్మానందం తోడైతే ఇంకా బాగుంటుంది. తెరపై వీళ్లిద్దరూ కలిస్తే ఎంతటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంచ్‌ల మీద పంచ్‌లు పడిపోతాయి. ‘జై సింహా’లో అలానే జరిగిందట. సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, హరిప్రియ, నటాషాదోషి కథానాయికలు. ముఖ్యమైన పాత్రల్లో బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్ నటిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 12న విడుదలవుతోంది. వేగంగా సినిమాను రూపొందిస్తారని దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌కు పేరుంది. ‘జై సింహా’ను అంతే వేగంగా షూటింగ్ జరిపి అనుకున్న టైమ్‌కే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ వుంది. తనకు అచ్చివస్తుందన్న నమ్మకం బలంగా వుంది. బాలయ్య.. అనగానే శక్తిమంతమైన సంభాషణలే గుర్తుకు వస్తాయి. ప్రతీ సినిమాలోనూ ఆయన శైలికి తగ్గట్టుగా సంభాషణల్ని పొందు పరచాలని తాపత్రయ పడుతుంటారు దర్శకులు, రచయితలు. సాదాసీదా సంభాషణని సైతం బాలయ్య పలికితే ఆ కిక్ వేరేలా ఉంటుంది. అందుకే బాలయ్య సినిమాల్లో మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ‘జై సింహా’లోనూ అలాంటి సంభాషణలు వినే అవకాశం ఉంది. టీజర్‌లో మచ్చుకకి ఒకటి రుచి చూపించారు కూడా. ‘సింహం వౌనాన్ని సన్యాసం అనుకోవద్దు’ అంటూ బాలయ్య తన ఉగ్రరూపం చూపించారు. బాలయ్య 102వ చిత్రమిది. ‘సింహా’ అనే శబ్దం నందమూరి బాలకృష్ణకు బాగా కలిసొచ్చింది. ‘లక్ష్మీ నరసింహా’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సింహా’ ఇలా.. ఆ పేరు టైటిల్‌లో కనిపించినప్పుడల్లా విజయాన్ని అందుకున్నారు. ఈ సారి ఆయన ‘జై సింహా’గా మరోమారు సింహా పాత్రలో అభిమానులను అలరించబోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్‌టిఆర్ విగ్రహం.. దాని చుట్టూ వేలాది జనం.. మధ్యలో బాలయ్య. మొత్తంగా చూస్తే ఓ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్లు కనిపిస్తుందా దృశ్యం. ఈ చిత్రాన్ని బాలయ్య శైలి, మాస్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య పాత్ర ఆయన కనిపించే విధానం కొత్తగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ‘‘అనుభవజ్ఞులైన నటీనటులు, సాంకేతిక నిపుణులూ ఈ చిత్రానికి పనిచేశారు. సెంటిమెంట్ నచ్చే వాళ్లకు, యా క్షన్ కోరే వాళ్లకు, ప్రేమ సన్నివేశాలు ఇష్టపడే వాళ్లకు.. ఇలా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అంటున్నారు దర్శకుడు కె.ఎస్.రవికుమార్. ‘‘ఓ హీరోతో సినిమా తీస్తే, అది బాగా ఆడకపోతే డేట్లు ఇవ్వడానికి ఆలోచిస్తారు. కానీ బాలయ్య అలాకాదు. ‘పరమవీరచక్ర’ తరువాత కూడా పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మా చిత్ర బృందం పనితనమేమిటో, ఈ సినిమాపై మేం ఇంత నమ్మకం ఎందుకు పెట్టుకున్నామో ఈ సినిమా విడుదల తర్వాతా తెలుస్తుంది. బాలయ్య ఫైట్లకి ఎలా చప్పట్లు కొడతారో, ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్లకూ అలాంటి స్పందనే అందిస్తారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందంటే చాలా మందికి నమ్మకం లేదు. కానీ అనుకున్నట్టుగానే మా సింహాన్ని సంక్రాంతికే తీసుకువచ్చాం’’ అని నిర్మాత సి. కళ్యాణ్ చెప్పారు.
‘‘నాన్నగారు నిర్మాతగా అప్పట్లో రెండు సినిమాలు తీశారు. తోడుదొంగలు, పిచ్చిపుల్లయ్య. ఇవి సరిగా ఆడలేదు.. బాగా నష్టపోయారు. అయితే వీటికి ఉత్తమ చిత్రాలుగా రాష్టప్రతి బంగారు పతకాలు వచ్చాయి. అలాంటి సమయంలో ‘జయసింహా’ తీసి ఘన విజయం సాధించారు. ఆ టైటిల్‌తోనే నేనూ ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. మాయాబజార్, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ పాండవీయం, దానవీర శూరకర్ణ ఇలాంటి గొప్ప చిత్రాలు చేసే అదృష్టం నాన్నగారికి దక్కింది. ఆ తర్వాత అది నాకు అబ్బింది. సి.కళ్యాణ్‌తో ఇది వరకు తీసిన ‘పరమవీరచక్ర’ నాకెంతో నచ్చింది. దాసరి గారితో చేయాలన్న కోరిక ఆ సినిమాతో తీరింది. కె.ఎస్.రవికుమార్‌తో పనిచేయాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా. ఎందుకో కుదరలేదు. ఇలాంటి సినిమా చేయాలని ఆగామేమో’’ అన్నారు బాలయ్య ఒక సందర్భంలో.
సంక్రాంతి హీరోగా బాలకృష్ణకు పేరుంది. ఆయన నటించిన చిత్రాలు పండక్కి చాలానే విడుదలయ్యాయి. బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదలవుతుందంటే విజయం ఖాయమనే ధీమా అటు పరిశ్రమతో పాటు, ఇటు అభిమానుల్లోనూ కనిపిస్తుంటుంది. గత ఏడాది సంక్రాంతికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జై సింహా’తో మరోసారి సంక్రాంతి సందడి చేయబోతున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయం సాధించడం ఒక ఎత్తయితే.. తెలుగు చక్రవర్తి అయిన శాతకర్ణి కథని వందో చిత్రంగా చేయడం మరో విశేషం. తెలుగు భాషపైన, తెలుగు నేలపైన ఆయనకున్న మమకారానికి అద్దం పట్టిన చిత్రమది. అలాంటి బాలయ్య మరోసారి తెలుగు వాళ్ల పెద్ద పండుగైన సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాలకృష్ణ, నయనతార హిట్టు జోడీ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’ చిత్రాల్లో వీరి జోడీ ప్రేక్షకుల్ని ముగ్థుల్ని చేసింది. అందుకే ముచ్చటగా మూడోసారి కలిసి నటించిన ‘జై సింహా’పై అభిమానుల్లో అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. బాలకృష్ణ శైలి, మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమని సినీ వర్గాలు చెబుతున్నాయి. అచ్చొచ్చిన సంక్రాంతి బాలకృష్ణ ఖాతాలో మరో విజయాన్ని చేర్చడం ఖాయమని అభిమాన వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఈ సినిమాకు శాటిలైట్ రూపంలో తెలుగు, హిందీకి కలిపి దాదాపు రూ.15 కోట్లకు పైగా ఆర్జించింది. మరో 35 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. బాలయ్యకు ఎప్పటిలాగే సంక్రాంతి సెంటిమెంట్ కలిసివస్తే ‘జై సింహా’ ఖాతాలో రూ. 50 కోట్లు వేసుకోవలసిందే. 2017లో మెరుపు వేగంతో సినిమాలు చేసిన బాలయ్య 2018లో కూడా అదే జోరును ప్రదర్శించబోతున్నారు. ఎమ్మెల్యేగా రాజకీయంగానూ బిజీగానే ఉంటున్నప్పటికీ ఆయన సినిమాలకి మాత్రం ఏలోటూ రానీయడం లేదు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. తేజ దర్శకత్వంలో ఎన్‌టిఆర్ జీవిత చరిత్ర కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేయనున్నారని సమాచారం. ఈ లెక్కన 2018లో కూడా బాలయ్య బిజీ బిజీనే. ఈయన దూకుడు మామూలుగా లేదు. సెంచరీ సినిమా తర్వాత అది మరింత ఎక్కువైంది.
ఇక పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగిన హీరోయిజం, తన తరహా వినోదంతో దర్శకుడు త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ని రూపొందించారు. ఈ చిత్రం 10న విడుదలవుతోంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. పవన్‌తో నటించడం వీరిద్దరికీ ఇదే తొలిసారి. చక్కటి వినోదంతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సంక్రాంతి లక్ష్యంగా ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేశారు. పవన్ ఐటి నిపుణుడి పాత్రలో కనిపిస్తారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన స్వరాలు విశేష ప్రజాదరణ పొందాయి. యూరప్‌లో పాటలను ఎంతో అందంగా కెమెరాలో బంధించారు. పవన్‌ది- త్రివిక్రమ్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. ‘జల్సా’తో హంగామా సృష్టించారు. ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టారు. అందుకే ఈ ‘అజ్ఞాతవాసి’పై అంచనాలు పెరిగాయ. అమెరికాలో అత్యధిక సెంటర్లలో విడుదల చేస్తుండడంతో ఈ విషయంలో ‘బాహుబలి’ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. విడుదలకు ముందే దాదాపు పది కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో సినిమా విజయవంతమయితే ‘అజ్ఞాతవాసి’ వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం. ప్రవాసంలో ఉన్న ఓ రాకుమారుడిలా పవన్‌కళ్యాణ్ వినోదాలు పంచబోతున్నారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్- త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సంక్రాంతికి సరికొత్త రికార్డుల్ని సృష్టించే చిత్రమవుతుందని ట్రేడ్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయ. ‘మధురాపురి సదన..మృదు వదనా’ అనే కీర్తనతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్‌లో పవన్ లుక్, హావభావాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘అతని చర్యలు ఊహాతీతం వర్మా’ అనే డైలాగ్‌ని బొమన్ ఇరానీతో చెప్పించారు. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. త్రివిక్రమ్ శైలికి వినోదం జోడించారన్న విషయం టీజర్ చూస్తేనే అర్థమయింది. జానపద గీతాలంటే పవన్‌కళ్యాణ్‌కి ఎంతో ఇష్టం. తాను నటించే సినిమాల్లో ఆ ఇష్టాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంటారు. అవకాశం వచ్చిన ప్రతీసారీ స్వయంగా గొంతు సవరించుకుని పాటలు పాడుతుంటారు. విశేషంగా ప్రాచుర్యం పొందిన ‘ఖుషి’లోని ‘బై బయ్యే బంగారు రమణమ్మా..’, ‘అత్తారింటికి దారేది’లోని ‘కాటమ రాయుడా..’ పాటలు పవన్ ఆలపించినవే. ఇవి ఎంతటి ప్రజాదరణ పొందా యో తెలిసిందే. తాజాగా ‘అజ్ఞాతవాసి’ కోసం ఆయన మరోపాట పాడారు. భాస్కరభట్ల రవికుమార్ రచించిన ‘కొడకా కోటేశ్వరా...’గీతాన్ని పవన్ పాడగా, సంగీత దర్శకుడు అనిరుధ్ నేతృత్వంలో రికార్డ్ చేశారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయ. మంచి బిజినెస్ కూడా జరిగిపోయంది.
ఈ రెండు చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు ఈ బరిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అవి రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘రంగులరాట్నం’, సూర్య హీరోగా నటించిన అనువాద చిత్రం ‘గ్యాంగ్’. 2017లో ‘రారండోయ్ వేడుక చూద్దాం..’, ‘హాలో..’వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘రంగులరాట్నం’ చిత్రం ఈ సంక్రాంతికే ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందులో రాజ్‌తరుణ్‌కు జోడీగా చిత్రాశుక్లా నటిస్తోంది. శ్రీరంజని దర్శకత్వం వహించారు. ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ మళ్లీ రాజ్ తరుణ్‌తో చేస్తున్న చిత్రమిదే కావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రానికి సంబంధించి 10 నుంచి 15 కోట్ల వరకు వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నారు.
సూర్య హీరోగా వస్తున్న అనువాద చిత్రం ‘గ్యాంగ్’ కూడా ఈ సంగ్రామంలోనే అడుగుపెడు తోంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘స్పెషల్ ఛబ్బీస్’కి రీమేక్ ఇది. టాలీవుడ్‌లో సూర్యకు మంచి మార్కె ట్ ఉంది. పైగా యూవీ క్రియేషన్స్ లాంటి అగ్ర సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద ప్రారంభ వసూళ్లకు ఢోకాలేదంటున్నారు ట్రేడ్ వర్గాలు.
మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతికి అగ్రహీరోల చిత్రాలు థియేటర్లలో ఇలా సందడి చేయబోతున్నాయ. పండుగ నాలుగు రోజులూ థియేటర్లలో కొత్త సినిమాల హడావుడి కోలాహలంగా ఉండబోతోంది. ఈ చిత్రాల ద్వారా ఈ సంక్రాంతికి సుమారు రూ. 200 కోట్ల మార్కెట్ జరగబోతోందని తెలిసింది. ఇవన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సంక్రాంతికి సినీ సంబరాలు అంబరాన్ని తాకినట్లే. సంక్రాంతికి తమ చిత్రాల ద్వారా విజయ ఢంకా మోగించాలని ఎన్నో ఆశలతో, బలమైన నమ్మకంతో ఈ సంగ్రామంలో దూసుకు వస్తున్న ఇద్దరు అగ్ర హీరోల లక్ష్యం ఎలాం టి ఫలితాలనిస్తుందో చూడాల్సిందే. *
సంక్రాంతి హీరోగా బాలకృష్ణకు పేరుంది. ఆయన నటించిన చిత్రాలు పండక్కి చాలానే విడుదలయ్యాయి. బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదలవుతుందంటే విజయం ఖాయమనే ధీమా అటు పరిశ్రమతో పాటు, ఇటు అభిమానుల్లోనూ కనిపిస్తుంటుంది. గత ఏడాది సంక్రాంతికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జై సింహా’తో మరోసారి సంక్రాంతి సందడి చేయబోతున్నారు. ‘సింహా’ అనే శబ్దం నందమూరి బాలకృష్ణకు బాగా కలిసొచ్చింది. ‘లక్ష్మీ నరసింహా’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సింహా’ ఇలా.. ఆ పేరు టైటిల్‌లో కనిపించినప్పుడల్లా విజయాన్ని అందుకున్నారు. ఈ సారి ఆయన ‘జై సింహా’గా మరోమారు సింహా పాత్రలో ప్రేక్షకులను అలరించబోతుండడంతో సహజంగానే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయ. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.