మెయిన్ ఫీచర్
విజయాల రారాజు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డబుల్ హ్యాట్రిక్‌తో పరిశ్రమలో సంచలనం
‘‘ఒక్క ఏడాదిలో ఆరు సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఈ సక్సెస్‌లు నావి కావు. కష్టపడ్డ ప్రతీ ఒక్కరివి. అందరూ అలా తమ వంతు పాత్ర నిర్వహించారు కాబట్టే ఇన్ని సక్సెస్‌లు వచ్చాయి. ఇరవై ఏళ్ల క్రితం మా జీవితంలో గ్రేట్ సెక్సెస్ తెచ్చిన సినిమా పెళ్లిపందిరి. ఆ సినిమా లేకుంటే మేం లేం. ఆ సినిమా ద్వారానే ఇక్కడి వరకు రాగలిగాం. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాక చాలా మంది నిర్మాతలు మంచి సినిమాలు ఇచ్చారు. ఎన్నో సినిమాలతో అనుభవం వున్న మేం ప్రొడక్షన్లోకి వచ్చాం. వినాయక్‌తో కలిసి ‘దిల్’ చేశాం. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాం. 2017 సంవత్సరం మా సంస్థకు డబుల్ హ్యాట్రిక్ వస్తుందనుకోలేదు. భగవంతుడు ఇలా డిజైన్ చేశాడు. ఈ ఆరు సక్సెస్‌ల వెనక నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు. 2017 నిర్మాతగా నాకు గొప్ప విజయాలను ఇచ్చింది. నా నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంటే దిల్ రాజు మంచి కథల్ని ఎంపిక చేసుకొంటాడని నన్నంతా మెచ్చుకొంటారు. విలువలతో సినిమాలు నిర్మించినట్టుగానే, వ్యక్తిగతంగానూ నేను అలాగే ఉండాలనుకొంటా’’
-‘దిల్’ రాజు
కొంతమంది ఏం చేసినా ఓ లెక్క ప్రకారమే చేస్తుంటారు. ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటుంటారు. సినిమా రంగంలో అలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో దిల్ రాజు ఒకరు. మంచి కథలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అనేది రాజు గట్టిగా నమ్ముతారు. అందుకే ఆయన చిత్రాల్లో
ఎప్పుడూ అలాంటి కథలే మనల్ని పలకరిస్తుంటాయ.
‘అన్ని సినిమాలు ఒకేలా ఉండవు’ అన్నట్టు పరిశ్రమలో నిర్మాతలంతా ఒకేలా ఉండరు. ఎవరి శైలి వారిది.. ఎవరి పద్ధతులు వారివి. అలాగే నిర్మాత ‘దిల్’ రాజుకి ఓ ప్రత్యేక శైలి ఉంది.. ఓ పద్ధతి ఉంది... ఓ ఫార్ములా ఉంది. అవేంటో ఆయన నిర్మించిన సినిమాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. కథ దగ్గర్నుంచి పాత్రల పరిచయం వరకూ ప్రతిచోటా ఆయన ముద్ర కనిపిస్తుంది. తొలి చిత్రం నుంచి నేటి వరకు ఆయన నిర్మించిన ఏ సినిమాను తీసుకొన్నా ఏదో ఒక చోట కొత్త ఆలోచన మొగ్గ తొడుగుతూ ఆకర్షిస్తుంది. పిల్లలు, పెద్దలు ఇంటిల్లిపాది మెచ్చే, నచ్చే కుటుంబ కథా చిత్రాల్ని నిర్మించాలనే ధ్యేయంతో ‘దిల్’ రాజు డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి నిర్మాణంలోకి అడుగుపెట్టారు. కొంతమంది ఏం చేసినా ఓ లెక్క ప్రకారమే చేస్తుంటారు. ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటుంటారు. సినిమా రంగంలో అలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అలా అరుదుగా కనిపించే వ్యక్తుల్లో దిల్ రాజు ఒకరు. మంచి కథలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అనేది రాజు గట్టిగా నమ్ముతారు. అందుకే ఆయన చిత్రాల్లో ఎప్పుడూ అలాంటి కొత్త కథలే మనల్ని పలకరిస్తుంటాయి. 1997లో ‘పెళ్లి పందిరి’ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ని అందుకున్న రాజు 2002లో ‘దిల్’ చిత్రంతో విజయాన్ని సాధించి ‘దిల్’ రాజుగా మారారు. ఓ పక్క నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న ఆయన 2017లో తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఆరు విజయవంతమైన సినిమాలను అందించి డబుల్ హ్యాట్రిక్ నిర్మాతగా పేరును తెచ్చుకున్నారు. ఒక్క ఏడాదిలోనే ఆరు చిత్రాలు నిర్మించడం మాటలు కాదు, చేతలు కావాలి. అలాంటి చేతల్ని అధిగమించి విజయాల రారాజుగా తెలుగు చిత్రసీమలో ఎనలేని క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది లక్కీ హ్యాండ్ ఎవరిదంటే చిత్రసీమలో ‘దిల్’ రాజు పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ‘ఏం హ్యాండ్ అండీ బాబూ..’ అంటూ ఆయన గురించే పరిశ్రమలో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకటా.. రెండా... వరుసగా ఆరు హిట్లు.. అందులో మూడు చిన్న సినిమాలు. ‘శతమానం భవతి’తో ప్రారంభమైన ఈ ఏడాది విజయయాత్ర ‘నేను లోకల్’, ‘డీజే దువ్వాడ జగన్నాథం’, ‘్ఫదా’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎంసీఏ మిడిల్‌క్లాస్ అబ్బాయ్’ వరకూ కొనసాగింది. ఈ ఆరు విజయాలకు సంబంధించి ఇటీవలే ఆయన గొప్ప ఈవెంట్‌ని కూడా నిర్వహించారు. ఇది ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్ కాదు. ఆరు సినిమాలకు సంబంధించినది. ఒక నిర్మాత ఓ ఏడాదిలో ఆరు సినిమాలు చేసి.. ఆ ఆరు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కావడం అనేది ఒక దిల్ రాజుకే సాధ్యమైంది. దేనికైనా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత అల్లుకు పోవడమే గొప్ప విషయం. అలా దిల్ రాజు బ్యానర్ చిత్రసీమతో అల్లుకుపోయింది. చలనచిత్ర సీమకు ఈ రోజు దిల్ రాజు గర్వంగా నిలబడ్డారు. పది మంది నిర్మాతలకు ‘ఇలా సినిమా తీయాలి’ అనిపించేలా సినిమాలు చేస్తున్నారు. ఆయన కృషి, పట్టుదల కారణంగా ఇవ్వాళ ఆయనకు ఈ క్రేజ్.. ఈ రేంజ్ దక్కింది. ఇప్పటి వరకు ఈ బ్యానర్లో 27 సినిమాలు పూర్తి చేశారు. ఇందులో దాదాపు తొంభై శాతానికి పైనే సక్సెస్‌ని సాధించిన సినిమాలుండడం విశేషం. అంచనాలను తట్టుకుంటూ ఆరు సక్సెస్‌లను సాధించడం అంత చిన్న విషయమేమీ కాదు. ఆయనకు సినిమాపై ఉన్న ఫ్యాషన్ అలాంటిది. పరిశ్రమపై ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు. అందుకే నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా వేగంగా సినిమాలు చేస్తూ పరిశ్రమలో తన వంతు పాత్రని సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. సినిమా సినిమాకీ సంబంధం లేకుండా వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ విజయ పథంలో దూసుకెళుతున్నారాయన. బడ్జెట్ కాదు.. సబ్జెక్టు కావాలి అంటారాయన. సినిమాకి కావల్సింది హంగు, ఆర్భాటం కాదు.. కథ ముఖ్యం. గొప్ప సినిమాలు బడ్జెట్ వల్ల తయారవ్వవు. సబ్జెక్ట్ ఉంటేనే తయారవుతాయి. ఈ ఏడు దిల్ రాజు నిర్మించిన ఆరు చిత్రాల్లో మనకు ఈ సబ్జెక్టే కనిపిస్తుంది. సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్‌రాజ్, జయసుధ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శతమానం భవతి’ చిత్రంతో ఈ ఏడు విజయానికి నాంది పలికారు. ఇంటిల్లిపాదినీ థియేటర్‌కి తీసుకురావాలని తపించే నిర్మాత దిల్ రాజు. ఎంత పెద్ద స్టార్ కథానాయకుడితో సినిమా తీసినా, ఆ కథల్లో కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే అంశాలు తప్పని సరిగా ఉండేలా చూసుకొంటారాయన. నిజంగా కుటుంబం అంతా కలిసి వస్తే థియేటర్ల వద్ద కనిపించే సందడే వేరు. ఒకప్పుడు కుటుంబ కథలతో ప్రయాణం చేసే నిర్మాతలు ఎంతో మంది కనిపించేవాళ్లు. కానీ ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. దిల్ రాజు మాత్రం తాను నమ్ముకొన్న కుటుంబ కథలతో సినిమాలు తీస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. అలా కుటుంబ కథతో వచ్చి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన చిత్రమే ‘శతమానం భవతి’. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించుకొని విజేతగా నిలిచింది. కుటుంబ కథ అంటే ఏముంటుంది? తండ్రీ, కొడుకు, అన్న, తమ్ముడు, మావయ్య, పిన్ని, అత్త, మామ, మరదలు.. ఇలా బంధాలే కదా? అనిపించొచ్చు. కానీ ఆ బంధాలు, అనుబంధాల మధ్య సరైన సంఘర్షణని చూపిస్తే మాత్రం భావోద్వేగాలు ఇట్టే పండిపోతాయి. కుటుంబ కథల్లో కనిపించే అనురాగం, ఆప్యాయతల్ని తెరపై ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. కుటుంబ గొప్పతనమే అది. ఇదివరకే మన తెరపై ఎన్నో గొప్ప కుటుంబ కథల్ని చూపించినప్పటికీ సతీష్ వేగ్నేశ రాసుకొన్న ఈ కథ, అనుబంధాల మధ్య సంఘర్షణని ఆయన చూసిన.. చూపించిన కోణం కొత్తగా ఉంటుంది. అదే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రధాన కారణమై వుండొచ్చు. పిల్లలు ఇంటిని మరిచిపోతే పెద్దలు పడే ఆవేదన.. కుటుంబం.. అందులోని విలువలు అంటే ఏమిటో, అవెలా ఉంటాయో ఈ చిత్రంలో చక్కగా చూపించారు.
నాని, కీర్తి సురేష్ జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘నేను లోకల్’. నాని సినిమా అంటే కుటుంబం మొత్తం హాయిగా చూసే సినిమా అని ఓ మార్కు ఉంది. ఈ చిత్రంలో కూడా అదే ట్రాక్‌లో నడిచాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసి సరదా సరదాగా తిరిగే కుర్రాడుగా నాని నటించాడు. కీర్తి సురేష్ తన నటనతో అలరించింది. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రంపై తీసుకున్న శ్రద్ధ అడుగడుగునా కనిపిస్తుంది. మంచి వసూళ్లు రాబట్టి బ్యానర్‌కు మంచి పేరుని తెచ్చి పెట్టంది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’. మాస్ ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడిగా హీరోయిజాన్ని తెరపై బాగా ఆవిష్కరిస్తారనే పేరున్న హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ ‘డీజే’ అందుకు తగ్గట్టే రూపొంది ఆకట్టుకుంది. చేయి తిరిగిన శాఖాహార వంటగాడు దువ్వాడ జగన్నాథ శాస్ర్తీగా అల్లు అర్జున్ నటన ప్రేక్షకుల్ని తాకింది. కథానాయిక పూజా హెగ్డే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు, హరీష్ శంకర్ మాటలు బాగా పేలాయి. ఫార్ములా ప్రకారం కాకుండా, కామెడీతో సన్నివేశాల్ని ముగించిన విధానం ఆకట్టుకుంది. హరీష్ శంకర్ హ్యూమర్, బన్నీ పెర్ఫార్మెన్స్ కలిసి సినిమాను నిలబెట్టాయి. దర్శకుడు ఎంచుకున్న రొటీన్ కథే అయినా, తెలివిగా అందులో దువ్వాడ జగన్నాథమ్ అనే ప్రత్యేక పాత్రను ఇన్వాల్వ్ చేసి సినిమాను బలంగా వినోదాత్మకంగా తయారు చేశారు. ఈ సినిమా నటుడిగా అల్లు అర్జున్‌కు మంచి పేరు తేవడమే కాకుండా, ఆయన కెరీర్లోనే మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా వచ్చిన చిత్రం ‘్ఫదా’ అందరి మనసుల్ని ఫిదా చేసేసింది. తీసింది కొన్ని చిత్రాలే అయినా, ప్రేక్షకులపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు చాలా నిజాయతీగా, మన జీవితాల్ని పోలినట్టుగా ఉంటాయి. చిత్రం చూశాక ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తాయి. ఆ అనుభూతి కొంతకాలం మనతోపాటే ప్రయాణం చేస్తుంది కూడా. ఎప్పుడు ఏ సినిమా తీసినా దాన్ని తన జీవితంతో పోల్చి చూసుకొంటుంటారు శేఖర్ కమ్ముల. ‘్ఫదా’ తన కూతురు లాంటి సినిమా అని చెప్పుకున్నారు. కొన్ని పరాజయాల తర్వాత.. కొంత విరామం తీసు కొని శేఖర్ కమ్ముల చేసిన ‘్ఫదా’కు దిల్ రాజు నిర్మాత కావడం.. అందులో వరణ్‌తేజ్ కథానాయకుడిగా నటించడంతో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ విజయంతో ఎక్కడికో దూసుకెళ్లింది. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్, సాయిపల్లవిల జోడీ ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఓ పల్లెటూరు, అందమైన మనుషుల మధ్య సాగే ఓ అందమైన ప్రేమకథ ఈ చిత్రం. ఇందులో తెలంగాణ యాస మరింత అందంగా వినిపిస్తుంది. పలు సన్నివేశాలకి యాసే బలాన్నిచ్చింది.
రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రాజా ది గ్రేట్’ బాక్సాఫీస్ వద్ద సందడి బాగానే చేసింది. రెండేళ్ల తర్వాత గ్యాప్ తీసుకొని అతడు నటించిన చిత్రమిది. అంధుడిగా రవితేజ పాత్ర ఆకట్టుకునే విధంగా సాగింది. ఒక హీరో.. హీరోయిన్ను కాపాడటం అనేదే రోటీన్ స్టోరీయే. అయితే ఆ హీరో అంధుడు కావడమే ‘రాజా ది గ్రేట్’ చిత్రం ప్రత్యేకత. ముఖ్యంగా దర్శకుడు హీరో పాత్రను డిజైన్ చేసిన విధానం అందరికీ నచ్చింది. అంధుడైన కథానాయకుడు ఒక బలమైన ప్రతి నాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడనే దాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా చూపించాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలచడంలో విజ యం సాధించాడు.
ఆశలూ, కోరికల్ని అదుపులో ఉంచుకొని, బతుకుల్ని పొదుపుగా నడిపించుకునే మధ్య తరగతి కుటుంబాలు... ఆశకూ అవసరానికీ ఊగిసలాడే జీవితాలు. సర్దుకుపోయే తత్త్వం ఉంటే తప్ప మనుగడ సాధించలేని పరిస్థితి. ఆ ఇంట్లో వాళ్లయితే.. ఏదోలా జీవితాన్ని వెళ్లదీస్తారు. కొత్తగా వచ్చిన వ్యక్తులతోనే చిక్కు. ఆ ఇల్లు పక్కా మధ్యతరగతికి ప్రతిరూపం. చాలీ చాలని జీవితమైనా సరే ఆనందంగా గడిపేస్తున్నారు. అలాంటి ఇంట్లో వదిన హోదాలో అడుగుపెట్టిందో ఇల్లాలు. ఆమెకీ, ఆ ఇంట్లోని మధ్య తరగతి మరిదికీ మధ్య ఏం జరిగిందన్న కథతో ‘ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయ్’ రూపుదిద్దుకుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాతగా దిల్ రాజుకు మంచి పేరుని తెచ్చిపెట్టడమేగాక, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టుకుంటోంది. మధ్య తరగతి కుటుంబాలకి సంబంధించి ఈ మధ్య కొన్ని సినిమాలొచ్చాయి. తండ్రీ కూతుళ్లు, అన్నా తమ్ముళ్ల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో సాగాయి. కానీ వదిన, మరిది నేపథ్యంలో సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. ఇటువంటి కథా కథనాలున్న చిత్రం ఇప్పుడొస్తే కొత్తగానే ఉంటుందనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ‘ఎంసీఏ’ నిర్మించారు. వది న, మరిదిగా భూమిక, నానిల పోటాపోటీ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. మిడిల్‌క్లాస్ అబ్బాయ్ చేసే పోరాటాన్ని ప్రేమ, వినోదాలతో తెరపై ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఈ కథలో నాని ప్రేయసిగా పల్లవి పాత్ర ప్రాధాన్యతను నిలబెట్టుకుంది.
చిత్రసీమలో సక్సెస్‌లు ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేయడం ముఖ్యం కాదు. ఫెయిల్యూర్స్ తెచ్చిన దర్శకులతో సైతం మళ్లీ సినిమాలు తీయడం అనేది మామూలు విషయం కాదు. దమ్ముండాలి. ధైర్యం కావాలి. ఆ రెండూ దిల్ రాజులో పుష్కలంగా వున్నాయి, కాబట్టే తమ సంస్థలో ఫెయిల్యూర్స్ ఇచ్చిన దర్శకులతో కూడా సినిమాలు నిర్మించి ఇవ్వాళ విజయ పథంలో దూసుకెళ్లి ఆ దర్శకుల్ని తన పక్కనే నిల్చునేలా చేశారు.
‘‘ఒక్క ఏడాదిలో ఇన్ని సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. ఈ సక్సెస్‌లు నావి కావు. కష్టపడ్డ ప్రతీ ఒక్కరివి. నా యూనిట్వి.. నా దర్శకులవి.. నా హీరోలవి. అందరూ అలా తమ వంతు పాత్ర నిర్వహించారు కాబట్టే ఇన్ని సక్సెస్‌లు వచ్చాయి. 1987 డిసెంబర్లో నా జీవితం మొదలైంది. ఒక సూట్‌కేసు పట్టుకొని ఆటో మొబైల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవడానికి బయలుదేరాను. 1987, 1997, ఇప్పుడు 2017 అన్నింటికీ ఏదో ఇంటర్‌లింక్ ఉన్నట్లు అనిపిస్తోంది. సినిమాల మీద ఆసక్తితో మేం ఇండస్ట్రీలోకి రావడం, బిగినింగ్‌లో ఫెయిల్యూర్స్.. ఇరవై ఏళ్ల క్రితం మా జీవితంలో గ్రేట్ డే సెక్సెస్ తెచ్చిన సినిమా పెళ్లిపందిరి.
ఆ సినిమా కొన్నప్పటి నుంచి విడుదల వరకూ ఎంత కష్టపడ్డామో మాకు, మా ఫ్యామిలీకి తెలుసు. సినిమా విడుదల రోజు కేవలం మూడు లక్షలు తక్కువ ఉంటే ఎన్నో షాపులు తిరిగి కట్టాం. ఆ సినిమా లేకుంటే మేం లేం. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో జగపతిబాబులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ సినిమా ద్వారానే ఇక్కడి వరకు రాగలిగాం. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టాక చాలా మంది నిర్మాతలు మంచి సినిమాలు ఇచ్చారు. ఎన్నో సినిమాలతో అనుభవం వున్న మేం ప్రొడక్షన్లోకి వచ్చాం. వినాయక్‌తో కలిసి ‘దిల్’ చేశాం. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాం. దిల్ ద్వారా పుట్టిన సుకుమార్, బోయపాటి శ్రీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల, వేణు.. ఇలా ఎనిమిది మందిని పరిశ్రమకు పరిచయం చేశాం. ఒక్క దర్శకుడు తప్ప ఇందులో మిగిలిన వాళ్లందరూ సక్సెస్ఫుల్ దర్శకులే. ఈ ఏడాది మా సంస్థకు డబుల్ హ్యాట్రిక్ వస్తుందనుకోలేదు. ఆరు సినిమాలు నిర్మిస్తానని కూడా అనుకోలేదు. భగవంతుడు ఇలా డిజైన్ చేశాడు. గుడ్ ఫ్యామిలీ, గుడ్ఫ్రెండ్స్ లేకుంటే జీవితంలో మనం ముందుకు పోలేం. ఈ ఆరు సక్సెస్‌ల వెనక నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు. 2017 సంవత్సరం నిర్మాతగా నాకు గొప్ప విజయాల్నిచ్చింది. వ్యక్తిగతంగా, పంపిణీదారుడిగా మాత్రం నష్టాన్ని మిగిల్చింది. నా అర్థాంగిని కోల్పోవడం తీరనిలోటు. పంపిణీ దారుడిగా కొన్ని సినిమాలు మిగిల్చిన నష్టాలు భయానికి గురిచేశాయి. నిర్మాతగా నాకు విజయాలు వచ్చాయి కాబట్టి పంపిణీలో నష్టాలు అంతగా కనిపించలేదు. నా నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంటే దిల్ రాజు మంచి కథల్ని ఎంపిక చేసుకొంటాడని నన్నంతా మెచ్చుకొంటారు. నా సినిమా పరాజయాన్ని చవిచూసినప్పుడు కూడా వాటి భారాన్ని అంతే సమానంగా స్వీకరిస్తుంటా జయాపజయాలు నాకు రెండూ సమానమే. విలువలతో సినిమాలు నిర్మించినట్టుగానే, వ్యక్తిగతంగానూ నేను అలాగే ఉండాలనుకొంటా’’ అన్నారు దిల్ రాజు
ఇదే సంస్థ నుంచి ఈ ఏడాది మరో ఇద్దరు దర్శకులు పరిచయం కాబోతున్నారు. అలాగే మహేష్‌బాబు- వంశీ పైడిపల్లి సినిమాతో పాటు, నితిన్‌తో శ్రీనివాస కళ్యాణం, నితిన్-శర్వానంద్ కథానాయకులుగా ‘దాగుడు మూతలు’ చిత్రాల్ని నిర్మించబోతున్నారు.
విలువలతో కూడిన కథల్ని తెరపైకి తీసుకువచ్చే నిర్మాతలు చాలా అరుదు. అందుకే ఆ తరహా కథలు ఎప్పుడో కానీ తెరకెక్కవు. నిర్మాత దిల్ రాజు మాత్రం తన నిర్మాణంలోని కథని బలంగా నమ్ముతారు. అలాంటి విలువలతో కూడిన చిత్రాల వైపే మొగ్గు చూపుతారు. విజయాలు సాధిస్తారు. అదే ఆయన బలం. అదే ఆయన ఆయుధం కూడా. ఏ దర్శకుడు ఎంత మంచి కథని చెప్పాలనుకొన్నా, ప్రోత్సహించే నిర్మాత లేకపోతే వృథానే. దిల్ రాజు ఎప్పుడూ కొత్త కథలతో వచ్చే దర్శకులను ప్రోత్సహిస్తూనే వుంటారు. అలానే ప్రోత్సహించాలని, మరెందరో దర్శకులను చిత్రసీమకు పరిచయం చేయాలని, మరిన్ని చక్కటి చిత్రాలను టాలీవుడ్‌కు అందించాలని కోరుకుందాం.