మెయన్ ఫీచర్

అగ్ర రాజ్యాలు భూతాపాన్ని నియంత్రిస్తాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై క్లోన్-బి అనే విషవాయువును కనుగొన్న హబర్ (Haber) కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతినిచ్చా రు. ఈ విషవాయువుతో మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పది లక్షలకు పైగా యూ దుల్ని యుద్ధం సందర్భంగా నిర్బంధించిన కేంద్రాలలో చంపివేసారు. యుద్ధాలకు మూల ప్రభువులైన అమెరికా మాజీ అధ్యక్షులు అల్‌గోరెకు పర్యావరణ పరిరక్షణలో, ప్రస్తుత అధ్యక్షుడైన బరాక్ ఒబామాకు శాంతి పరిరక్షకుడిగా నోబెల్ పురస్కారాలు లభించాయి. ‘బాంబుల సంస్కృతి ఆలోచనల్ని చంపదు. పైగా మరింతగా ప్రోత్సహిస్తుంది...’అంటూ సిరియా ఐఎస్ స్థావరాలపై విమానాల దాడుల్ని చేస్తానన్న, బ్రిటన్ ప్రభుత్వ ప్రకటనకు వ్యతిరేకంగా లండన్‌లో పౌర సమాజం నినదిస్తున్నది.
‘ఆరోగ్యకరమైన వాతావరణం, న్యా యం, ఉపాధి అవకాశాలు కావాలి... మా ఆవేదనను వినండి...’ అంటూ లండన్ ప్రజ లు, ‘భమాతా? వాతావరణంపై పండిత చర్చలు వద్దూ....’ అంటూ మెల్‌బోర్న్ ప్రజ లు, బెర్లిన్ ప్రజలు సిఓపి-21 (Conferences of Parties)కు వ్యతిరేకంగా నిరసనల్ని తెలుపగా, భూవాతావరణంపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు వేదిక అయిన పారిస్ నగరంలోని డెల రిపబ్లిక్ చౌరస్తా (dela Republic square) లో వేలాది మంది నవంబర్ 29న చెప్పుల జతల్ని వదిలివెళ్ళారు. ఇందులో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయిన బన్‌కిమూన్ చెప్పుల జతతోపాటు, పోప్‌ఫ్రాన్సిస్ పంపిన చెప్పుల జత కూడా వుండడం గమనార్హం! ఇలా 175 దేశాల్లో, దాదాపు 3,25,000 మంది నవంబర్ 30నుంచి డిసెంబర్ 11దాకా పారిస్‌లో జరుగుతున్న / భూరక్షణ (్ళ్యఔ21) సదస్సు సందర్భంగా ర్యాలీలను నిర్వహించడం, మానవహారాల్ని ఏర్పాటుచేసి నిరసనల్ని తెలపడం జరిగింది.
ఒబామాతో సహా, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వాల్దిమిర్ పుతి న్, బ్రిటన్ అధ్యక్షుడు కామెరాన్‌తో సహా నరేంద్రమోదీ హాజరౌతున్న ఈ పర్యావరణ సంబంధిత అంతర్జాతీయ సదస్సులో దా దాపు 150 దేశాల పెద్దలు, నాయకులు పాల్గొంటుండగా, మొత్తంగా 196 దేశాలు హాజరౌతున్నాయి. ‘న్యాయమైన వాతావరణం...’అనే ఎజెండా కింద జరుగుతున్న ఈ సదస్సులో ప్రధానంగా నాలుగు అం శాలు చర్చించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం వంద బిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని 2020నుంచి ధనిక దేశాలు బీద దేశాలకు పునరుత్పాదిత శక్తుల వినియోగానికై ఇవ్వాలనేది మొదటి అంశం. ఈ నిర్ణయం 2009లో జరిగిన కొపెన్‌హగన్ సదస్సులోనే జరిగినా, ఇప్పటికి ఏ ఒక్క దేశం ఈ దిశగా ఆలోచించలేదు. రెండోది, అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని బీద దేశాలకు బదలాయించి, భూఉష్ణోగ్రతల్ని నియంత్రించాలంటే, వివిధ దేశా లు ఉత్పత్తిచేస్తున్న కాలుష్య హరిత వాయువులు (Green House gases), కార్బన్ వాయువుల నియంత్రణ ఛర్యలు మూడోది. ఇక చివరిది పారిస్‌లో తీసుకోబోయే నిర్ణయాల చట్టపరమైన విధి విధానాలు.
నిజానికి భూవాతావరణంపై జరిగే సదస్సులు కొత్తేమీకాదు. ఈ సదస్సులో వివిధ దేశాల పెద్దలే కాదు, పారిశ్రామిక దిగ్గజాలైన బిల్‌గేట్స్, ముఖేష్, రతన్‌టాటా, జాక్ మా లాంటి 28 మంది బడా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనేక కీలక అంశాలపై నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఇలాంటి సదస్సులకు వేదికల్ని కల్గిస్తున్నది కూడా ఈ పారిశ్రామిక దిగ్గజాలే! ఇందుకుగాను, అప్పుల్లో మునిగి తేలే దేశాలు, పరిశ్రమల్ని పెట్టండి, కావల్సినంత కాలుష్యాన్ని వెదజల్లండి...’అంటూ ఈ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించడం తెలిసిందే. దీనికి మన దేశమే చక్కని ఉదాహరణ. ఓవైపు కాలుష్యాల్ని, భూతాపాన్ని పెంచుతూనే, పారిశ్రామిక విప్లవం (1850) కు ముందున్న వాతావరణ పరిస్థితుల్ని పునరుద్ధరించాలని, 2100 సంవత్సరం నాటికి పెరిగే 2్య ళ ఉష్ణోగ్రతను నియంత్రించాలని, కరిగిపోతున్న అంటార్కిటికా మంచు ఖండాల్ని అటవీ సంపదల్ని కాపాడాలని, లేనిచో రేపటి తరానికి భూమి ఆశ్రయమివ్వదని బ్రిటన్ రాజు చార్లెస్ లాంటివారు అంటున్నారంటే భూగోళం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో తెలుస్తున్నది.
వంద సంవత్సరాలుగా ప్రపంచ శాంతికి విఘాతం కలిగింది, ప్రపంచ యుద్ధాలకు కారకులైన అమెరికా, యూరప్ దేశాలు ఇప్పటికి దోపిడీని, పీడనను కొనసాగిస్తూ, దేశాల మధ్యన యుద్ధాల్ని ప్రేరేపిస్తూ, అంతర్గత యుద్ధాల్ని, తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతూ ఇలాంటి చిలుకపలుకులు పలకడం మామూలే! 1992లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ మార్పుల సమ్మేళనం (శ్రీ్ళ్ళ్ళ) సందర్భంగా ఏర్పాటుచేసిన చార్టర్ ప్రకారం ధనిక దేశాలే భూవాతావరణం వేడెక్కడానికి కారణమని, ఇది నియంత్రించబడాలని, తిరిగి ఇదే నినాదం తో 1997లో జరిగిన క్యోటో ఒప్పందంతోగాని, 2005నాటి అంతర్జాతీయ ఒప్పందంతోగాని ఆచరణకు రాని పరిస్థితి. చట్టాల్ని చేసి ఉల్లంఘించడం, ఉల్లంఘించేలా తమతమ చెప్పుచేతుల్లోని దేశాల్ని ప్రోత్సహించడం ఈ ధనిక దేశాలకు అలవాటే!
ప్రపంచంలోనే అత్యధికంగా హరిత వాయువుల్ని వాతావరణంలోకి వదులుతున్న చైనా (24%), అమెరికా (15.5%), యూరోపియన్ యూనియన్లు (18.8%), రష్యా(4.9%)లు కాగా, భారత్ 6.4 శాతం లో మూడో స్థానంలో వుంది. వీటిని 2030 నాటికి చైనా 60-65 శాతానికి, అమెరికా 26-28 శాతానికి ఈయూ (28దేశాలు) 40 శాతానికి, రష్యా 25-30 శాతానికి, ఇం డి యా 35 శాతానికి తగ్గించాలనే నిర్ణయాలు జరిగాయి. కాని ఈ దిశగా ఏ దేశమూ చర్యలు చేపట్టకపోగా, ప్రకృతికి అనుగుణంగా వుండే వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరణతో కాలుష్య మయంగా మార్చివేసాయి. వీటితో పాటుగా కర్బన ఉద్గారితాలను నిలువరించాలంటే, రాతినూనెల (శిలాజ ఇంధనాలు), బొగ్గు వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించినా, ఏ దేశంకూడా ఇటువైపుగా ఆలోచించడం లేదు. విరివిగా ఇంధనాన్ని వినియోగించడం, ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించడం, పట్టణీకరణకు ఎర్ర తివాచీల్ని పర్చడం జరుగుతున్నది. ఈ ళ్యఔ21 సదస్సుకు హాజరైన నికరాగువా, భూతాప నియంత్రణపై చేసే ప్రతిజ్ఞచేయనని కరాఖండిగా చెప్పింది. చిన్న దేశాలైన తాము అంతర్జాతీయ ఒడంబడికలకు కట్టుబడి వుంటే, ధనిక దేశాలే నియమాల్ని ఉల్లంఘిస్తున్నాయని, ప్రతిజ్ఞలు చేయాల్సింది ఈ దేశాలేనని, ఆ దేశ ప్రతినిధి పాల్ ఒక్విస్టు ఆరోపిస్తూ, వెనిజులా, బొలివియా, అర్జెంటినా, ఎల్‌సాల్వడార్, ఇండియా లాంటి దేశాలు తమ ప్రతిపాదనను గౌరవించాలని కోరడం జరిగింది.
ఇలాంటి సదస్సులు ప్రపంచ దృష్టిని మరల్చడానికి తప్ప, ఆచరణ శూన్యమేనని గతంలో నిరూపించబడినాయి. మధ్యప్రాచ్య, పశ్చిమాసియా దేశాలు అంతర్గత వర్గపోరుతో కొట్టుమిట్టాడుతూ, లక్షలాది ప్రజల్ని కాందిశీకులుగా మారుస్తూ, మరణాలకు కారణవౌతూ వుంటే, వీటిని నివారింపజేయాల్సిన ఐక్యరాజ్యసమితి అమెరికా చెప్పుచేతుల్లోనే వుంటున్నది. పైగా దీని సెక్రటరీ జనరల్ ఈ సదస్సు సందర్భంగా తన జత చెప్పుల్ని వదిలి, తన మనుమల భవిష్యత్తుకు ఆహ్లాదకర ప్రపంచం కావాలని కోరుకోవడం ఆశ్చర్యకరం కాదా? భూవాతావరణం వేడెక్కడానికి ప్రధాన పెట్టుబడి దేశాలే 90 శాతం కారణమని తెలిసినా, నియంత్రించలేని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సదస్సుల్ని మాత్రం ఆర్భాటంగా నిర్వహిస్తున్నది.
ఈ సదస్సు సందర్భంగా పారిస్‌కు రాకపోకలు సాగించే విమానాలు, ఇతర వాహనాలు వినియోగించే 27మిలియన్ గ్యాలన్ల ఇంధనం విడుదలచేసే కాలుష్యం మూడువేల టన్నులుగా అంచనా! ఒక్క ఒబామా విమానమే సంవత్సరం పొడుగునా 72 కార్లు విడుదలచేసే కార్బన్ డైయాక్సైడ్‌ను విడుదల చేస్తుందంటే, ఈ సదస్సు ప్రాముఖ్యత ఎంతనో తెలుస్తున్నది. అయినా ప్రారంభం రోజునే హరిత వాయువుల నియంత్రణపై 51 మిలియన్ల డాలర్ల సహాయాన్ని ప్రకటించిన ఒబామా, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తాడో చెప్పలేదు. ఇలా మొత్తం దేశాలు 248 మిలియన్ల డాలర్ల సహాయాన్ని ప్రకటించడం గమనార్హం!
నిజానికి వెనుకబడిన దేశాలేవీ కాలుష్య వాయువుల్ని విడుదల చేయకున్నా, ఈ విష పరిణామాల్ని మాత్రం అనుభవిస్తున్నాయి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలు, భారత్ లాంటి ఆసియా దేశాలు కాలుష్యానికి గురౌతూనే వున్నాయి. గత శతాబ్దకాలంలో 2015 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత సంవత్సరంగా గుర్తించబడగా, గత అక్టోబర్ మాసం అత్యధిక ఉష్ణోగ్రత నెలగా రికార్డుకెక్కింది. వీటి ఫలితాల్ని భారత్ గత మూడు సంవత్సరాలుగా అనుభవిస్తూనే వుంది. ఉత్తరాఖండ్, జమ్మూ, కాశ్మీర్ వరదలే కాక, ఈమధ్యన తమిళనాట కురుస్తున్న కుంభవృష్టి వర్షాలు ఈ భూతాప ఫలితాలే! ఒక సంవత్సరంలో పడే వర్షం ఒక నెలలో, ఒక నెలలో పడాల్సిన వర్షాలు ఒక రోజులోనే కురుస్తున్నాయంటే, వాతావరణ పరిస్థితులు ఎంతగా చేజారిపోయాయో తెలుస్తున్నది.
పరిస్థితులు ఇంతగా దిగజారితే, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన దేశాలు, చర్చల పేరున కాలయాపన చేస్తూ, దశాబ్దాల్ని టార్గెట్‌గా నిర్ణయిస్తూ, సదస్సుల పేరున సంబరాల్ని జరుపుతూ, తీర్మానాల్ని చేసుకుంటూ వదిలి పెడుతున్నాయి. ఆచరణకు నోచుకోని ఈ తీర్మానాలు ప్రజల్ని ప్రపంచవ్యాపితంగా నిద్రపుచ్చుతున్నాయి. ఏదో జరగబోతుందనే ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. ఇంతలోనే ప్రపంచం మరో విపత్తులోకి ప్రవేశిస్తున్నది. తిరిగి దీనిపై చర్చలు, కాలయాపన. ఈ సంధికాలాల్లో తన్నుకుచచ్చే దేశాలు తన్నుకుంటూ వుంటే, చలి మంటని అనుభవించడం అమెరికా లాంటి దేశాల పనిగా మారింది. ఇది మారుతుందా, మారగలదా, మార్చేశక్తి ఏ దేశ ప్రజలకైనా వుందా...? అంటే, ఆ దేశంపై, జాతులపై బాంబుల్ని కురిపించడమే ఈ బడా దేశాలు ఎంచుకున్న మార్గం. తాత్కాలిక లాభానికైనా ప్రపంచాన్ని దీర్ఘకాలికంగా కష్టాలకు గురిచేయడం అమెరికా లాంటి దేశాలకు ఎప్పుడు అలవాటే కాబట్టి, దీనె్నదిరించే సమాజాలు (సమాజం) కావాలి.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162