మెయిన్ ఫీచర్

వైవిధ్యమే అందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నటీనటుల్లో బలహీనతలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ నటనపై ఉండే వెర్రి వ్యామోహమే మంచి నటులుగా తీర్చిదిద్దుతుంది. మనలో ఉండే కరుణ, వైవిధ్యమే మనలో అందాన్ని ఇనుమడింపజేస్తోంది’’ అని అంటోంది ప్రముఖ హాలీవుడ్ నటి షబానా అజ్మి . ముంబయిలో జరిగిన ఓ ర్యాంప్ షోలో ఆమె 40 నిమిషాలు పాటు చేసిన ప్రసంగంలో విభిన్న అంశాలతో పాటు గుర్తింపు కోసం నటీ నటులు చేస్తున్న ప్రయత్నాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నటుల్లో నెలకొన్న పురుషాధిక్య భావనపై తన అసమ్మతిని సైతం అదే వేదికపై వ్యక్తం చేయటం గమనార్హం. ఆమె వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..
చిన్నతనం నుంచి నా తండ్రి భిన్నం గా ఉండటం గమనించాను. అదే నిజమైన అందమని గ్రహించాను. భారతదేశంలో మహిళలు తమ గుర్తిం పు కోసం ఇంకా పాకులాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. మతం విధించే అడ్డుగోడలు వారికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. ఈ సభలో మీలో ఎంత మంది నన్ను ఫరాన్ అక్తార్ తల్లిగా గుర్తిస్తారు అని నవ్వుతూ ప్రశ్నించింది. వాస్తవానికి షబానా అజ్మికి పిల్లలు లేరు. ఆమె భర్త, ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ మొదటి భార్య ఇరానీ అక్తర్ కుమారుడే ఫరాన్ అక్తర్. కొంతమందిని చూస్తే విస్మయం కలుగుతుంది. వారేమి చెబుతున్నారు? ఎం చేస్తున్నారోఅర్థం కావటంల్లేదు. ఎలాం టి ప్రయత్నం చేయకుండానే ఏదో సాధించాలని తపన పడటం ఆశ్చర్యం కలిగిస్తుంటారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన షబానా అజ్మి అసాధారణ నటనను వృత్తిగానూ, వైవిధ్యమైన పాత్ర లు పోషిస్తూ తన జీవితాన్ని అందంగా మలుచుకున్నానని చెబుతారు. దేశంలో ప్రముఖ ఉర్దూ కవులలో ఒకరైన అజ్మి షాహెబ్ తనయ షబనా. చిన్నతనం నుంచే క్యూట్‌గా ఉండేది. మెరిసే బ్లూ కళ్లతో అందమైన బొమ్మగా పెరిగానని పేర్కొంది. కానె్వంట్‌కు వెళితే అక్కడ కూడా తండ్రి అందరూ నడిచే సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా విభిన్నంగానే నడవమని ప్రోత్సహించేవాడని, తన తండ్రే తనకు మార్గ నిర్ధేశకుడు అని విశ్వసిస్తోంది. తండ్రి జీవనశైలి ఎంత భిన్నంగా ఉండేదో వెల్లడిస్తూ ఆయనను చూసే తాను విభిన్నంగా ఉండేలా తన జీవితాన్ని మలుచుకున్నానని వెల్లడించింది. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టటం వల్ల లింగ వివక్షత ఆమె పెద్దయ్యేవరకు చవిచూడలేదట! తాను నివశించే గదినే రెడ్‌హాల్ అని పిలుస్తారు. మా ఇంటి చుట్టుప్రక్కల కూడా వివక్షత అనే మాటకు తావు లేని వాతావరణం వుండేది. ర్యాంప్ షోలలో లింగ వివక్షత అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు మహిళా మోడల్స్‌ను హైహిల్స్ వేసుకుని ర్యాంప్‌లపై నడిపిస్తున్నారని సూటిగా ప్రశ్నించింది. ఫైర్‌లో బరువైన పాత్రను పోషించి మెప్పించిన షబనా అజ్మి ఇందులో నటించేటపుడు తన భర్తను సంప్రదించానని, ఇతరుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా నువ్వు చేయాలనుకుంటే చేయమని వెన్నుతట్టారని పేర్కొంది. నేను ప్రజలకు భయపడతాను. అందుకే నేను ఎల్లప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉంటాను. ఓ వ్యక్తిని ఉపయోగించుకుని అవార్డులు సంపాదించాలనే కోరిక లేదు. సామాజిక సేవలో పాల్గొనటానికి మక్కువ చూపుతాను అని తెలిపింది. కథాంశంలో సంబంధం లేనప్పటికీ ఐటెమ్ సాంగ్స్ పేరుతో శృంగారాన్ని ఒలకబోయిస్తున్నారు. అలాంటి అసభ్యకరమైన శృంగార పాటలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థంకావటం లేదు. నాలుగేళ్ల పిల్లల చేత కూడా ఇలాంటి డ్యాన్స్‌లు చేయించటం బాధాకరమని, ఇలాంటివాటి వల్ల చిత్ర పరిశ్రమ ఇమేజ్ దెబ్బతింటుందని, ఈ ఐటెమ్ సాంగ్స్‌ను వ్యతిరేకించటం మనందరి బాధ్యత అని నిర్మోహమాటంగా వెల్లడించింది. చిత్ర పరిశ్రమలోకి కొత్తవారు రావటం శుభపరిణామంటూ వారు తమ బాధ్యతలను నిర్వహిస్తూ మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. హాలీవుడ్‌లో తనదైన ముద్రవేసుకున్న షబానా అజ్మి 1988లో దాదాపు 12 సినిమాలలో నటించి రికార్డు సృష్టించారు. హాలీవుడ్, బాలీవుడ్ మధ్య నెలకొన్న వ్యత్యాసం గురించి చెబుతూ.. హాలీవుడ్‌లో స్కిల్, అటెన్షన్‌ను ఎక్కువగా కనిపిస్తోంది. అదే బాలీవుడ్‌లో నేర్పరితనం బాగుంటుందని పేర్కొంది. సామాజిక సేవకురాలిగా ముంబయిలో తనదైన ముద్ర వేసుకున్న షబానా అజ్మి మురికివాడలలో 40,000 వేల మంది జీవితాలలో మార్పు తీసుకువచ్చేందుకు ఓ పునరావాస ప్రాజెక్టును చేపట్టింది. ఇది ఆసియాలోనే అతి ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనున్నది. మురికివాడలు అంటే ప్రజలు, వారి వస్తువులు, నివాస ప్రాంతాలు మురికిగా ఉండటమా? అని ప్రశ్నిస్తూ.. ఆ మురికివాడల ప్రజలే సిటీలను శుభ్రం చేస్తున్నారనే విషయాన్ని మరువరాదని పేర్కొంది. వైవిధ్యం పేరుతో విభిన్నమైన పాత్రల పోషణకు మొగ్గుచూపే షబనా అజ్మి నటించిన సినిమాలు ఎన్నోసార్లు నిషేధాలకు, సెన్సార్ కత్తిరింపులకు గురైనా వెరవక ఆమె వాటికే అంకితమవ్వటం విశేషం.