మెయిన్ ఫీచర్

ప్రకృతి సోయగాలు ... పెరటి పూదోటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరట్లో పూదోటలను పెంచడం ముగ్ధ మనోహర అభిరుచికి అద్దం పడుతుంటారు. గృహాల ముంగిట కనిపించే రంగు రంగుల లతలు, పూమొక్కలతో కూడిన పెరటి తోటలు సౌందర్య రసానుభూతిని సృష్టిస్తాయి.
నానాటికి పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యానికి చెట్ల పెంపకమే సరైన సమాధానం అంటున్న నేటి రోజుల్లో పెరటి తోటల పెంపకం అత్యవసరం, ప్రోత్సాహకరం. ఇంటి ముంగిట, వెనుక చుట్టూతా ఏపాటి కొద్ది స్థలం వున్నా పెరటి తోటలను పెంచు కోవచ్చు. కాంక్రీట్ జంగిల్‌ను తలపించే నేటి గృహావరణలో అందాలు చిందే స్వర్గసీమను సృష్టించవచ్చు. ఇంటి బాల్కనీ, కారిడార్, వరండా.. ఇలా ఎక్కడైనా మనసుండాలే కానీ పూల మొక్కలను మనోల్లాసం కల్గించేలాగా పెంచుకోవచ్చు. పూతోటలను పెంచడం తేలికే అయినప్పటికీ వాటిని ఒక క్రమ పద్ధతిలో అందంగా తీర్చిదిద్దడంలో ఎంతో నేర్పరితనం అవసరం.
ఎవరైనా తమ పెరట్లో పూతోటలను పెంచాలనుకున్నప్పుడు మొదట తమకున్న స్థలం ఎంత, నీటి వసతి ఎలా ఉందనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వంటింట్లో వివిధ పనులకు వాడుకునే నీరు, కాళ్లు, చేతులు కడుక్కునే నీరు కూడా వాడుకోవచ్చు. పెరటి సరిహద్దుల్లో పెద్ద పెద్ద మొక్కలు, ఆ తరువాత వరుసగా అందంగా వివిధ రకాల పూల మొక్కలను పెంచుకోవచ్చు. మధ్య మధ్యన తులసి, సబ్జా, మాచిపత్రి, పుదీనా.. మొక్కలు, కరివేపాకు, కొత్తిమీర లాంటి ఆకుకూరలు, పచ్చిమిర్చి, టమోటా.. మొక్కలు వుంటే ఆరోగ్యకరమైన గాలి పీల్చుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర లాంటి ఆకుకూరలు, పచ్చిమిర్చి, టమోటా, వంకాయ మొదలగు కూరగాయల మొక్కలను పెంచుకోవచ్చు. సహజంగా పెరటి తోటలకు పాకే మొక్కలు అందాన్ని చేకూరుస్తాయి.
తీగ మొక్కలను పెంచేటప్పుడు అవి అల్లుకోవడానికి అమర్చే ఆధారాన్ని చక్కటి ఆకృతిలో మలచుకుంటే అందంగా పెరుగుతాయి. పోర్టికోల మీద నుంచి గార్డెన్ ప్రాంగణానికి జారేలా (కిందకి పాకేలా) పెంచడం, కుండీలను పైన వ్రేలాడదీసి తీగ మొక్కలను చక్కగా కిందకి మెలి తిరిగేలా పెంచవచ్చు. లతలను తరచు పక్కలకు విస్తరించకుండా కత్తిరించడం వంటి పనులు బద్ధకించకుండా చేయాల్సి వుంటుంది. పాకే మొక్కల ఎంపికలో రంగు రంగుల పూలుండే కొన్ని రకాల హైబ్రిడ్ జాతిని ఎన్నుకోవాలి. అల్లుకునే స్వభావంగల తీగ జాతి మొక్కలు అనగానే మదిలో మల్లె, సన్నజాజి, విరజాజి, జాజిమల్లె ఇలా స్ఫురిస్తాయి. పూదోటకు ఎన్ని రకాల మొక్కలు వేసామన్నదానికన్నా ఎంత చక్కగా వేసినా వాటిని పొందికగా పెంచుతున్నామన్నది ముఖ్యం.
పెరటి తోటలు అందంగా కనిపించాలంటే ముదురు, లేత రంగు పూల మొక్కలు అవసరం. పెరటి తోటల్లో జామ, సపోట, సీతాఫల్, పనస, బొప్పాయి లాంటి పండ్ల చెట్లు ఒకటి అరా వుంటే శ్రేయస్కరం. పెరటితోటల పెంపకానికి స్థలం లేదనుకున్నపుడు మట్టి, సిమెంట్ కుండీల్లో వివిధ రకాల క్రోటను మొక్కలను, బంతి, చామంతి, మందార, కనకాంబరం, గులాబీ మొక్కలను పెంచవచ్చు. ఇపుడు వివిధ రకాలైనా ప్లాస్టిక్ కుండీలు, స్టాండ్‌లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. గార్డెనింగ్‌కి కావలసిన పనిముట్లు, గ్రీన్ షెడ్, నెట్ తదితర వస్తువులు, పూల మొక్కలు, విత్తనాలు, సేంద్రి ఎరువులు స్థానికంగా నర్సరీల్లో దొరకడంతో పాటూ ఆన్‌లైన్ షాపింగ్‌లో వెబ్ సైట్లలో కూడా పరిశీలించవచ్చు. హోమ్ గార్డెనింగ్ వల్ల శరీరానికి వ్యాయామంతో పాటూ ఇంటి ముంగిట పూతోటలతో అనేక మానసిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తద్వారా ఆరోగ్యవంతులను చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రజల తక్షణ బాధ్యతగా పరిణమిల్లుతున్న ప్రస్తుత తరుణంలో పలువురు సేంద్రియ పద్ధతుల్లో పెరటి తోటల సాగుపై ఆసక్తి చూపడం, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఎరువులను తయారుచేసుకోవడం గమనార్హం. మొక్కల పెంపకం మనో అభిరుచిని తీరుస్తుంది. *