మెయిన్ ఫీచర్

నిన్న మురిపించారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండమీదనుండి ఉద్ధృతంగా దూకే అలలు అంతే ఉరవడితో ప్రవహిస్తాయని నమ్మకం లేదు. ఒక్కొక్క అల ఆకాశాన్నంటితే మరో అల తన ఉనికిని కూడా చాటలేక తెల్లబడిపోతుంది. బాలనటులుగా
ప్రవేశించిన అనేకమంది వారి ప్రతిభతోనే
అద్భుతమైన చిత్రాలను అందించారు.
ప్రేక్షకులకు ఆరాధ్యులుగా మారారు. మరికొందరు ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.
ప్రతిభ లేని ఏ నటులైనా తెరమరుగు
కావాల్సిందే ఈ సినీ ప్రవాహంలో!
*
కదిలే కాలాన్ని, ప్రవహించే జలాన్ని ఆపడం ఎవరితరమూ కాదు. ఆపాలనుకోవడం కూడా తెలివైనవారి ప్రయత్నం కాదు. అది సృష్టికే వ్యతిరేకం. సృష్టి ధర్మం అలా సాగిపోవాల్సిందే. ఆపుదామన్నా ఆగనిది కాలం, మనిషి జీవితకాలం. కాలంలో మార్పులు వస్తాయి. కానీ కాలం నిలవదు. సృష్టిలోని ప్రతి జీవి జీవితకాలం, సృష్టించబడిన పదార్థం కానీ, వస్తువు కానీ కాలంతోపాటు దాని జీవితకాలంలో మార్పులు వస్తూనే వుంటాయి. కాలం ఆగదు. జీవి జీవితకాలం ఆగదు.
ఇక మన తెలుగు చిత్రసీమ గురించి మాట్లాడుకున్నట్లయితే బాలనటులుగా నటించినవారు చాలామందే ఉన్నారు. హీరోలయితేనేం, హీరోయిన్లయితేనేం, హాస్య నటీనటులయితేనేం, క్యారెక్టర్ ఆర్టిస్టులయితేనేం. నాడు అంటే మూడు మూడున్నర దశాబ్దాల క్రితం నటించిన శ్రీదేవి, రమేష్‌బాబులు కానీ, ఆ తర్వాత అనగా రెండు, రెండున్నర దశాబ్దాల క్రితం పరిశ్రమలోకి వచ్చిన బాల నటీనటులు మీనా, రాశి, మహేష్‌బాబు, తరుణ్, హరీష్, అలీ లాంటివాళ్లు బాలనటులుగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. వారి లో కొంతమందికి వాళ్ల కుటుంబాలకు సినిమా నేపథ్యం వుంది. వాళ్లు తరుణ్, మహేష్‌బాబు, రమేష్ లాంటివాళ్లు. అప్పటి బాలనటుల్లో గత కొన్ని రోజుల క్రితం సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించినవారు ఉన్నారు. ఆ హీరోలు అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేశారు. మహేష్‌బాబు, మొన్న ఈమధ్యకాలంలో మీనా (దృశ్యం) ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. మహేష్‌బాబు ఇప్పటికీ దుమ్మురేపుతూనే వున్నాడు. ఇంకా అలీ అయితే హాస్యనటుడుగా నటిస్తూనే దాదాపు ఒకటిన్నర, రెండు దశాబ్దాల క్రితం హీరోగా నటించి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పించాడు. ఇక సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడు, మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబు తండ్రి కృష్ణతో, మహేష్‌బాబుతో నటించారు. రమేష్‌బాబు బాలనటుడిగా చిత్రసీమకు వచ్చినా, తర్వాత రాను రాను హీరోగా అతి తక్కువ సినిమాలు చేశారు. ఇక నటుడు హరీష్ విషయానికొస్తే బాలనటుడిగా ప్రవేశించి ఆ తరువాత అనతికాలంలోనే హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రాలు కానీ, కుటుంబ నేపథ్య చిత్రాలుగానీ, కథను ఎంచుకునే విధానంగానీ, హరీష్ నటించిన సినిమాల్లోని పాటలు కానీ కుర్రకారుని హుషారెత్తించాయి. అదే ఊపులో హరీష్ చాలా సినిమాల్లో నటించాడు. అదే కోవలో మిగిలింది తరుణ్. అతడు కూడా సినిమా నేపథ్యం వున్న కుటుంబమే కావడంతో తరుణ్ బాలనటునిగానే సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. బాలనటుడిగా తెరంగేట్రం చేసిన తరుణ్ కొద్ది గ్యాప్ తరువాత హీరోగా నటించి యువ హృదయాల్లో తనదైన ముద్ర వేశాడు. తరుణ్ నటించిన కుటుంబ నేపథ్యం కలిగిన చిత్రం ‘నువ్వు లేక నేను లేను’ సినిమా తరుణ్‌కి బాగా కలిసొచ్చింది. ఆ చిత్రంలో ప్రేమ, బంధాలు, బంధుత్వాలు, అన్నిటికంటే కామెడీ పాత్రలో సునీల్ హంగామా చేశాడు. ఏది ఏమైనా ఈ సినిమా తరుణ్‌కి బ్రేక్‌నిచ్చింది.
ఇక నటీమణుల విషయానికొస్తే శ్రీదేవి అతి చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అగ్ర హీరోల సరసన నటించి దుమ్మురేపింది. నాలుగు దశాబ్దాల క్రితం ఎన్‌టిఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు లాంటి అగ్ర హీరోలతోపాటు ఆ తరువాత రంగప్రవేశం చేసిన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటివాళ్లతోనూ నటించి రెండు తరాల హీరోయిన్ అయింది. అలా రెండు తరాలవారితో కలిసి నటించే గొప్ప అవకాశం శ్రీదేవికే దక్కిందని చెప్పవచ్చు. మరొక హీరోయిన్ అందాల రాశి. ఆమె కూడా బాలనటిగానే తెరమీదకు వచ్చింది. హీరోయిన్‌గా కూడా కుటుంబ నేపథ్య చిత్రాలు చేసి అశేష జ నాల్ని మెప్పించిందని చెప్పవచ్చు. ఇక మూడో వ్యక్తి ముద్దులొలికే మీనా. తను కూడా బాలనటిగానే వచ్చినా హీరోయిన్‌గా పెద్ద పెద్ద సినిమాల్లో అగ్రహీరోలతో నటిచింది. తాజాగా ఈ మధ్యనే వచ్చిన ‘దృశ్యం’ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించింది. ఈ సినిమా అంతా ఒక మధ్యతరగతి వాళ్ల చుట్టూనే కథ అంతా తిరుగుతూ వుంటుం ది. ఇందులో ఇప్పుడు ధనవంతుల పిల్లలు మధ్యతరగతి వాళ్ల పిల్లలతో, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఎలా చెలగాటమాడుకుంటారో, అలా చేసినపుడు ఆ భీకర పరిస్థితుల నుండి బయట పడటానికి ఆ పరువుగల మధ్య తరగతి వ్యక్తులు బయటపడకుండా చేసిన ప్రయత్నమే ‘దృశ్యం’ చిత్రం. ఈ చిత్రంలో మీనా ఇద్దరు పిల్లల తల్లిగా మంచి అభినయాన్ని ప్రదర్శించింది.
మరి అంత మంచి రికార్డులు బ్రేక్ చేసిన బాలనటులంతా ఏమయ్యారు? బాలనటులుగా నటించిన వారిలో శ్రీదేవి, రమేష్‌బాబులు మాత్రమే కాస్త పెద్దవయస్సువారు. మహేష్‌బాబు మాత్రం ఇప్పుడు వస్తున్న సినిమాల్లో దుమ్ము దులిపేస్తున్నాడు. ఇంకా మిగతావారు తరుణ్, హరీష్‌లు ఎందుకు నటించడంలేదు. ఫీల్డ్ నచ్చకనా? అవకాశాలు రాకనా? లేక సినీ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడలేకనా? వాళ్లలాగానే వడ్డే నవీన్, అబ్బాస్‌లు కూడా కనిపించటంలేదు. కాలంతోపాటు మనిషి ప్రయాణం చేయాలి కానీ మనిషి ఆగినంత మాత్రాన కాలం ఆగదు. బ్రతికున్నంతకాలం ఏదో ఒక పాత్రలో నటిస్తేనే జనాలలో నటులుగా గుర్తించబడతారు. అంతకుముందు రికార్డులు బ్రద్దలు కొట్టిన సినిమాలను ప్రేక్షకులు గుర్తుంచుకొంటారు. లేకుంటే ఆ నటీనటులతోపాటు అంతటి మంచి పేరొచ్చిన సినిమాలను కూడా ప్రేక్షకులు మరచిపోవలసి వస్తుంది.
ఒకనాటి అగ్రహీరోలయినా, అగ్ర హీరోయిన్లయినా కాలంతోపాటు వయస్సులో, శరీరంలో మార్పులు సహజంగా వస్తూనే వుంటాయి. జనరేషన్‌ను బట్టి, ట్రెండ్‌ను బట్టి ఏ రకమైన పాత్రలనైనా చేయాల్సి వుంటుంది. అందుకే ఒకప్పటి రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు, శోభన్‌బాబు ఎంత అగ్ర కథానాయకులైనప్పటికినీ ఆ తర్వాత కాలంలో వారి పిల్లలు సినిమాల్లోకి ప్రవేశిస్తున్న కాలంలో వాళ్ల వయస్సుకు సరిపోయే అన్న, తండ్రి, తాతల పాత్రల్లో నటించి, జీవించి వారి ఉన్నతి కాపాడుకున్నారు. మా పిల్లలు సినిమాల్లోకి వచ్చినా కూడా హీరోలుగా నటిస్తామనుకోలేదు.
ఇంకా ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అతడే మన అందగాడు సుమన్. సుమన్ తన నటన, ఫైట్స్, డాన్స్, పాటలు, సెంటిమెంట్స్‌తో వచ్చిన కొన్ని సినిమాలు 20వ శతాబ్దం, రక్తకన్నీరు, పెద్దల్లుడు లాంటి సినిమాల్లో చాలా హుందాగా నటించాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తన వయస్సు అయిపోయిందని అనుకోకుండా పౌరాణిక చిత్రాల్లోనే కాకుండా హీరోయిన్ తండ్రిగా, విలన్‌గా, రాజకీయ నాయకుడిగా నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల గుండెల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు.
రాజేంద్రప్రసాద్ కూడా దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం సినీ పరిశ్రమకు వచ్చి హీరోగా, హాస్యనటుడిగా హాస్యాన్ని పండించడంలో ఒక ముద్ర వేశాడు. రాజేంద్రప్రసాద్ నటించిన ‘ఆ నలుగురు’ సినిమా మధ్యతరగతివారికి ఎంతో దగ్గరయిందనే చెప్పవచ్చు. ఇక విభిన్న నటుడు ప్రకాష్‌రాజ్. ప్రకాష్‌రాజ్‌కు తెలుగు ఇండస్ట్రీలో గాడ్‌పాదర్ ఎవరూ లేనప్పటికీ విలన్‌గా, హీగా, అన్నగా, తండ్రిగా, తాతగా ఏ పాత్రలోనైనా అట్టే ఒదిగిపోయే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్.
ఇక హీరోయిన్ల విషయానికొస్తే జయసుధ, వాణిశ్రీ, శారదలు మహానటులు. నాలుగు దశాబ్దాల క్రితం వాళ్ళే గొప్ప నటీమణులు. అగ్రహీరోల సరసన నటించిన వీరూ ఒక వయస్సు వచ్చేటప్పటికి అక్క పాత్రలు, తల్లిపాత్రల్లో నటిస్తూ వారి ఉనికిని, వారి నటనా సామర్థ్యాన్ని, దానితోపాటు వారి గత చిత్రాల ఇమేజ్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు.

-సుమ శ్రీ