మెయిన్ ఫీచర్

కాలేజీ కుర్రాడు.. వీధి బాలల మాస్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

..............
చదువు కోసం తన వద్దకు వచ్చే పిల్లలకు వీకెండ్‌లో పోహా అనే వంట స్వయంగా తయారు చేసి పెట్టేవాడు. పసిబిడ్డల చదువు కోసం ఆ యువకుడు పడుతున్న తపన గమనించిన చుట్టుపక్కలవారు కూడా అతనికి సాయం అందించసాగారు. అంతేకాదు అతని స్నేహితులు సైతం
ఆర్థికంగా ఆదుకున్నారు.
...................
వీధి బాలల కోసం బహుళజాతి కంపెనీలోవచ్చిన ఉద్యోగానే్న వదిలేశాడు. కారు, ఖరీదైన నివాసం ఇవేమి తనకు అక్కర్లేదనుకున్నాడు పదిహేడేళ్లప్రిన్స్. వీధి బాలలకు పాఠాలు చెబుతూ వారిలో చదువుపట్ల చిన్న మార్పు తీసుకువచ్చేందుకు తన చేతలనే నమ్ముకున్నాడు. 2011లో పదిమంది పిల్లలతో ప్రారంభమైన విద్యాబోధన నేడు వందమంది పిల్లలకు చేరింది. వీధి బాలలను ఒక్కత్రాటిపైకి తీసుకువచ్చి విద్యావంతుల్ని చేస్తున్న ఈ యువకుడి యత్నం అసలు సిసలైన సేవ.
వారంతా ఉత్తర ముంబయిలోని కండవల్లి సమీపంలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ ఐవేకి సమీపంలోని మురికివాడలో నివశించే పిల్లలు. వాహనాల రణగొణ ధ్వనులతో గాలి, నీరు కలుషితమైన ప్రాంతం. ఎవరైనా ఒక్కక్షణం అక్కడ నిలబడటానికి ఇష్టపడరు. కాని ఎన్నో నిరుపేద కుటుంబాలు అక్కడ ఏడేళ్ల నుంచి నివసిస్తున్నాయి. పాత బట్టలు అమ్ముకోవటం, చిత్తుకాగితాలు ఏరుకోవటం వారి వృత్తి. పిల్లలు భిక్షాటన చేస్తారు. పిల్లలంతా పక్కనే ఉన్న మున్సిపల్ స్కూలుకు వెళతారు. అదీ మధ్యాహ్న సమయంలో మాత్రమే వెళతారు. హాజరుపట్టీలో పేరు నమోదు చేయించుకుని మధ్యాహ్న భోజనం చేసేసి మళ్లీ అడుక్కోవటానికి వెళ్లిపోతారు.
కొండవల్లికి సమీపంలోని ఠాకూర్ కాలేజీలో కామర్స్ చదివే 17 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు ఓ రోజు కార్ల వద్ద అడుక్కుంటున్న ఆ వీధి బాలల వెంట నడిచాడు. రెండు నెలల పాటు ఆ పిల్లల స్థితిగతులను అధ్యయనం చేశాడు. ఆ చిన్నారులలో చిన్న మార్పు తీసుకురావాలని సంకల్పించాడు.
చార్టర్ ఎకౌంటెంట్ కోర్సు చేస్తునే్న వారి చదువు కోసం తన వంతు ప్రయత్నాలు ఆరంభించాడు. ఆ మురికివాడలోనే రెండు గదుల ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. పిల్లలకి చదువు పట్ల ఆసక్తి ఎలా పెంచాలా అని ఆలోచించాడు.
రోజూ ఆ పిల్లలు తిరిగే చోటుకు వెళ్లి వారితో మాట్లాడటం, ఆడుకోవటం ప్రారంభించాడు. వారి పుస్తకాలు చూశాడు. నోట్ పుస్తకంలో ఒక్క మాట కూడా రాసిన దాఖలాలు లేవు. నాలుగో తరగతి చదివే ఓ బాలికకు కనీసం చదవటంగానీ, రాయటంగానీ రాదు. ఎందుకంటే వారికి చదువుమీద ఆసక్తి పెంచే టీచర్లు ఆ స్కూల్లో లేరు. పిల్లలతో, తల్లిదండ్రులతో మాట్లాడితే... మా పిల్లలు చదువుకుని ఏమి చేయాలి? మమ్మల్ని వదలిపెట్టు బాబు!అని దండం పెట్టారు. అయినప్పటికీ ప్రిన్స్ ఏమాత్రం నిరుత్సాహాపడకుండా వారిని ఒప్పించగలిగాడు. కొంతమంది పిల్లలు చదువు పట్ల ఆసక్తి కనబరిచారు.
చదువుకుంటే తలరాత మారుతుందని నచ్చచెప్పటంతో ఇద్దరు ముగ్గురు పిల్లలు అతని గదికి వచ్చి చదువుకోవటానికి ఆసక్తి కనబరిచారు. తన గదికి చదువుకోవటానికి వచ్చే పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్స్ తెచ్చిచ్చేవాడు. అలా మూడేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలని పోగేశాడు. తొలుత 11 మంది పిల్లలు మాత్రమే వచ్చారు. వారందరినీ ఫైఓవర్ బ్రిడ్జి కింద కూర్చోబెట్టి ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకు చదువు చెప్పేవాడు. వారికి కావల్సిన పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు అన్నీ కూడా తన సొంత డబ్బుతో కొనుగోలు చేసి తెచ్చేవాడు. అతని సేవకు దైవం కూడా తోడైందనుకుంటా. చదువు కోసం తన వద్దకు వచ్చే పిల్లలకు వీకెండ్‌లో పోహా అనే వంట స్వయంగా తయారు చేసి పెట్టేవాడు. పసిబిడ్డల చదువు కోసం ఆ యువకుడు పడుతున్న తపన గమనించిన చుట్టుపక్కలవారు కూడా అతనికి సాయం అందించసాగారు. అంతేకాదు అతని స్నేహితులు సైతం ఆర్థికంగా ఆదుకున్నారు. ప్రిన్స్ ఉంటున్న గదిని చూసి తల్లిదండ్రులు, స్నేహితులు ఒకింత బాధపడినా.. అతని సేవ ముందు అవి చిన్నబోయాయి.
ప్రిన్స్ తండ్రి బిజినెస్ మ్యాన్.
బయటకు కాలు పెట్టాలంటే అతనికి ప్రత్యకంగా కారు ఉన్నది. అలాంటి విలాసవంతమైన జీవితాన్ని ఆ చిన్నారుల కోసం వదులుకున్నాడు. ఎక్కడకి వెళ్లాలన్నా రైలులోనే వెళతాడు. సిఏ పూర్తయిన వెంటనే డిలైట్, జిందాల్ కంపెనీల్లో ఉద్యోగం వచ్చినా వదులుకున్నాడు. అతని జీవితంలో ఆ మురికివాడల పిల్లలు ఓ భాగం అయ్యారు. ఫుల్ టైమ్ జాబ్ చేస్తే ఆ పిల్లల చదువు మధ్యలో వదిలేసినవాడినవుతానని భావించి మల్టీనేషనల్ కంపెనీ జాబ్ వదులుకోవటమే కాకుండా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఆ డబ్బుతో వారిని చదివిస్తున్నాడు. క్రమేణ పిల్లల్లో చదువు పట్ల అభిరుచి పెరగటంతో వారిన మున్సిపల్ స్కూళ్ల నుంచి సేవా దృక్పథం గల ప్రైవేటు స్కూళ్లల్లో చేర్పిస్తున్నాడు. గత ఏడాది 24 మంది విద్యార్థులను ఠాకూర్ శ్రీమన్నారాయణ స్కూల్లో చేర్పించాడు. అడ్మిషన్ ఫీజుకు ఏడు లక్షలు రూపాయలను ఖర్చు చేశాడు. గత మూడేళ్లలో పార్ట్‌టైమ్ జాబ్స్ చేయగా వచ్చిన డబ్బును కూడబెట్టి వారికి ఫీజులు చెల్లించాడు. ప్రిన్స్ సేవా దృక్పధాన్ని చూసిన టిఎన్‌టి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక్కొక్క విద్యార్థికి రూ.60,000లు ఖర్చు చేసేందుకు ముందుకురావటం గమనార్హం.
రెండేళ్ల క్రితం ‘తెరిసా’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి అదే సంవత్సరం 49 మంది విద్యార్థులను ఠాకూర్ స్కూల్లో చేర్పించాడు. ఖాళీ సమయంలో పిల్లలతో పేపర్ బ్యాగ్‌లు తయారుచేయించి వాటిని అమ్మటం వల్ల పదివేల రూపాయలు సంపాదించాడు. స్నేహితులు, తల్లిదండ్రులు, కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని పొదుపుగా వాడుతూ ఆ పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఇపుడు వారి కోసం ఓ బస్సు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి 13 లక్షల రూపాయలు అవసరం. ఆతని తండ్రి లక్ష రూపాయలు ఇచ్చాడు. మిగిలిన డబ్బు సంపాదించే యత్నంలో ఉన్నాడు.
ఇంకా వారి కోసం ఏకంగా అక్కడే ఓ స్కూలును కూడా నిర్మించాలని కలలు కంటున్నాడు. ఇపుడు ప్రిన్స్ వద్ద వంద మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరిలో కొంతమంది ఐఐటికి ఎంపికవ్వటం అతని కృషికి నిదర్శనం.