మెయిన్ ఫీచర్

మామూలు డ్యాన్సర్‌కు దగ్గరవుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త రియాల్టీ షో ‘‘సో యు థింక్ యు కెన్ డ్యాన్స్’’తో సామాన్య డ్యాన్సర్‌కి, సామాన్య ప్రేక్షకుడికి దగ్గరవుతానని ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ విశ్వాసం వ్యక్తంచేస్తున్నా రు.‘‘స్టేజ్ వర్సెస్ స్ట్రీట్’’ అనే ము ఖ్య ఉద్దేశ్యం తో ఈ ప్రో గ్రామ్ జరుగుతుందని దీని కి ముఖ్య న్యాయ నిర్ణేతగా వ్యవహరించే మాధురి దీక్షి త్ అంటున్నారు. జలక్ నుంచి ఇప్పు డు ప్రారంభమై య్యే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ వరకు వెనుక గల ప్రస్ధానం గురించి వివరిస్తూ.. జలక్ ప్రోగ్రామ్‌లో కేవలం సెలబ్రిటీలతోనే పాల్గొనటం జరిగిందని, కాని ఈ ప్రోగ్రామ్‌లో సాధారణ వ్యక్తులు కూడా పాల్గొంటారని, వీరికి దగ్గరవ్వటంతో పాటు ఓ సామాన్య డ్యాన్సర్ వెనుక ఉన్న స్ఫూర్తిదాయకమైన అంశాలే ఆ డ్యాన్సర్ విజయానికి దోహదం చేస్తాయని, ఈ షోలో తాను అలాంటి కీలక అంశాలను గుర్తించగలననే నమ్మకం ఉందని ఆమె అంటున్నారు. ఈ ప్రోగ్రామ్, ఇతర ప్రోగ్రామ్‌ల మధ్య నెలకొన్న వ్యత్యాసం గురించి వివరిస్తూ.. ఈ ప్రోగ్రామ్ ద్వారా నాన్ డ్యాన్సర్‌ను డ్యాన్సర్‌గా గుర్తించే పని చేయటం లేదు. పుట్టుకతోనే ప్రతి మనిషిలో కొన్ని కళల పట్ల అభిరుచి ఉంటుంది. అలాగే నృత్యం అనే కళ దాగివున్న ఓ అసాధరణమైన కొరియోగ్రాఫర్‌ను వెలికితీయటమే ఈ ఫ్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించారు. ప్రేక్షకులు నృత్యం ఎంత అద్భుతమైందో ఈ ప్రోగ్రామ్ ద్వారా గుర్తిస్తారని ఆమె అంటున్నారు. ముగ్గురు ఖాన్‌లతో డ్యాన్స్‌లు చేశా రు. ఎవరు బాగా డ్యాన్స్ చేయగలరనుకుంటున్నారని ప్రశ్నిస్తే.. సల్మాన్‌ఖాన్ మంచి డ్యాన్సర్. షారుఖ్‌ఖాన్ చల్లటి గాలి లాంటివారు. ‘మాధూరీ! నువ్వు లీడ్ చేస్తే నేను ఫాలో అవుతా అం టారు. అమీర్‌ఖాన్ తన సొంత స్టైల్‌తో డ్యాన్స్ చేస్తా రు. అలాగే మీ భర్త మీతో డ్యాన్స్ చేయటానికి ఇబ్బం ది పడతారనుకుంటా అని అడిగితే.. పెద్దగా నవ్వేస్తూ రెండుసార్లు ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశామని, ఎప్పు డూ డ్యాన్స్ చేయనివారు కూడా డ్యాన్స్ చేయగలరని అన్నారు. ఏది ఏమైనా ‘‘ఏక్ దో తీన్’’ అంటూ అలనాడు డ్యాన్స్‌లతో ఉర్రూతలూగించిన మాధురి నేడు ఈ సరికొత్త షోతో సామాన్యుడిలో అసాధారణంగా దాగివున్న నృత్య అభినయాన్ని వెలికితీసే ప్రయత్నం లో సఫలీకృతమైయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

chitram మాధురి దీక్షిత్