మెయిన్ ఫీచర్

అవగాహన లేని పెళ్ళిళ్లు అతివలకు ఉరితాళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి వెన్నుముక రైతే అయినప్పటికీ ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకుంటాయి. అదే ఇంటికి దీపమైన ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంటే ఎవరికీ పట్టటం లేదని సామాజిక విశే్లషకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సైతం స్పందించకపోవటం శోచనీయం అని అంటున్నారు. దేశంలో 2014 నుంచి ఏటా 20,000 మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణాలు ఏమైనప్పటికీ రైతుల ఆత్మహత్య కంటే ఇవి రెండురెట్లు అధికం. ఈ వివరాలన్నీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూ రో వెల్లడించినవే. ఈ గృహిణుల ఆత్మహత్యల సంఖ్య 2009లో మరీ అధికంగా ఉంది. దాదా పు 25,092 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
1997 లెక్కల ప్రకారం లక్షమంది మహిళల్లో ప్రతి 11మంది తమ జీవితాలను అంతం చేసుకుంటున్నా రు. 2014లో ఈ సంఖ్య 9.3కి తగ్గినప్పటికీ ప్రపంచంలో భారతదేశంలోనే గృహిణులు అత్యధిక సంఖ్యలో అత్మహత్యకు పాల్పడటం పట్ల అడిలైడ్ యూనివర్శిటీ పాలిటిక్స్ అధ్యాపకులు పీటర్ మేయర్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా భారతదేశ గృహిణి ఆత్మహత్యలపై అధ్యయనం చేశారు. 2011లో ప్రతి లక్షమంది గృహిణుల్లో 20మంది తమ జీవితాలకు ముగింపు పలికారట.! మహారాష్ట్ర, పాండిచ్చేరి, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, పశ్చిమబెంగాల్, గుజరాత్, పంజా బ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆత్మహత్య రేటు అధికంగా ఉంది.
పెళ్లయి ముప్పయేళ్లు దాటినా...
పెళ్లయి ముప్పయేళ్లు దాటిన గృహిణులు సైతం ఆత్మహత్యలకు పాల్పడటం పట్ల మిసెస్ మేయర్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. గృహహింస వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతుందని ఆమె అంటున్నారు. 2001లో సంభవించిన 70శాతం మంది ఆత్మహత్యలలో 67శాతం మంది గృహిణులే ఉం డటం గమనార్హం. అదే అమెరికా, ఆస్ట్రేలియా వంటి పాశ్చత్యదేశాలలో గృహిణుల ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా ఉంది. వివాహాన్ని గౌరవప్రదంగా భావించే భారతదేశంలో ఇల్లాలి ఆత్మహత్యలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం గృహహింస అని చెప్పవచ్చు.
15ఏళ్లు పైబడినవారే..
లాన్‌సెట్ మెడికల్ జర్నల్ 2012లో జరిపిన అధ్యయనంలో 15 సంవత్సరాలు అంతకంటే అధి క వయసు ఉన్నవారు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ‘సూసైడ్-సొసైటీ’ పుస్తక రచయిత్రి కూడాఅయిన మిసెస్ మేయర్ మాట్లాడుతూ నిరక్షరాస్యత, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛన్నమవ్వటం, ఆడపిల్లలు సాధికారిత దిశగా అడుగులు వేయకపోవటం వల్ల ఈ బలవన్మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని తెలిపింది. యవ్వన ప్రాయంలో కన్న కలలు నిజంకాక ఆత్మన్యూనతకు గురైన యువతులు కన్నవారు చేసే సాంప్రదాయ పెళ్లికి తలవంచకమానదు. దీంతో అటు అత్తింటివారిలో ఇమడలేక, జీవిత భాగస్వామితో కాపురం చేయలేక తమ ప్రాణాలు తామే తీసుకుంటున్నారు. జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నపుడు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల లడైంది. అత్తంటివారు, కోడలు ఇద్ద రూ కూడా చదువుకున్నవారైతే ఈ ఆత్మహత్యల సంఖ్య తక్కువగా ఉం టుంది. లింగ వివక్షత, వరకట్నం తదితర ఎన్నో రుగ్మతులు గృహిణులు అసువులుబాయటానికి కారణాలుగా ఎన్నదగినవి.