మెయిన్ ఫీచర్

మొదలైన వేసవి సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి-
తెలుగు స్క్రీన్‌మీద ‘సిరి’ కురిపించి వెళ్లింది. సీనియర్ హీరోల సినిమాలు హిట్టు
కొట్టడంతో -తదుపరి సినిమాల వెన్నులో వొణుకు తగ్గింది. పండగెళ్లిందని
చెప్పడానికి సంకేతంగా చలిగాలులు మందగిస్తే -సమ్మర్ సినిమా సీజన్ మొదలైందని చెప్పడానికి టాలీవుడ్
వాతావరణం వేడెక్కింది. ముచ్చటగా మూడు సినిమాలు సక్సెస్‌కు శుభారంభం పలకటంతో.. వచ్చే సీజన్‌లోనూ
ఆ ఊపు కొనసాగించేందుకు
-నెల ముందుగానే కొత్త సినిమాలు
థియేటర్లకు వరుసకడుతున్నాయి.
అంటే -్ఫబ్రవరిలోనే పెద్ద సినిమాలు చాలా విడుదల
కాబోతున్నాయన్న మాట.

సమ్మర్‌ను టార్గెట్ చేస్తూ పక్క రాష్ట్రాల చిత్రాలూ తెలుగు స్క్రీన్స్‌కు
రాబోతున్నాయి. రోబోకి సీక్వెల్‌గా రజనీ ‘2.0‘, కమల్ విశ్వరూపం -2, శెభాష్ నాయుడు, తెలుగులో మార్కెట్ పెంచుకున్న
సూర్య- సింగం 3 లాంటి అంచనాలు పెంచుతున్న చిత్రాలూ తెలుగులో విడుదల కాబోతున్నాయి.

వెటరన్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ -విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలను భయపెట్టేంతగా రికార్డు ఇన్నింగ్స్ ఆడేశారు. సక్సెస్ అంటే ఎంత బలంగా ఉండాలో డ్యాన్స్‌లు, డైలాగుల్లో సత్తా చూపించి మోత మోగించారు. ఖైదీ.., శాతకర్ణిలు బాక్సాఫీస్ వద్ద చూపించిన కలెక్షన్ల ఊపు తక్కువేం కాదు. పండుగ పోటీలో ఎవరు నెగ్గారన్న ‘కోట్లా’టలు పక్కనపెడితే.. కొత్త సినిమాలతో రాబోయే హీరోలకు మాత్రం ‘టెంపరేచర్’ పెంచే టార్గేట్లే ఫిక్స్ చేశారు. అందులో సందేహం లేదు.
***
ఇక్కడ హిట్టు మాటొక్కటే కాదు. వంద, వందన్నర రికార్డుల చిత్రాలుగా బాలయ్య, చిరులు వైవిధ్యమైన కథలతో రావడం కూడా -తెలుగు మొనాటినీకి బ్రేక్ వేసినట్టయ్యింది. ఈ వైవిధ్యం -మిగిలిన హీరోలు ఎంచుకున్న కథలు, ప్రాజెక్టుల కాంబినేషన్లలోనూ కనిపించబోతోంది. సో.. కొత్త సినిమాలన్నీ పరిశ్రమ, ప్రేక్షక వర్గాలకు సంతృప్తినిచ్చేవే అనొచ్చేమో.
***
పండుగ సినిమాలు ఇచ్చిన భరోసాతో -సమ్మర్ సీజన్‌ను టార్గెట్ చేసుకొని స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు థియేటర్ల వద్ద దుమ్ము దులిపేందుకు రెడీ అవుతుంటే, సమ్మర్ తరువాతి సీజన్ కోసం ఇంకొందరు హీరోలు ఇప్పటి నుంచే ముహూర్తాలు సెట్ చేసుకుంటున్నారు. ఒక్క ఫిబ్రవరిలోనే అరడజనుకు పైగా సినిమాలు విడుదలవుతుంటే, మార్చి చివరి నాటికి మరో అరడజను పెద్ద సినిమాల షూటింగులు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే -పవన్ కల్యాణ్, నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, నాని, వరుణ్ తేజ్.. ఇలా ఎవరి బిజీలో వాళ్లు కనిపిస్తున్నారు.
రొటీన్ సినిమా ప్రవాహంలో కొట్టుకుపోతున్న టాలీవుడ్‌లో -గత నాలుగైదేళ్లుగా ఒకింత వైవిధ్యాన్ని చూస్తూనే ఉన్నాం. కథలపరంగానో, కాంబినేషన్లపరంగానో, కథనాలరూపంలోనో కొత్తదనం రుచి చూపించేందుకు తెలుగు సినీ పరిశ్రమ శక్తిమేరకు కృషి చేస్తూనే ఉంది. అది ఈ ఏడాదీ ఒకింత ఎక్కువ కనిపించబోతోంది. పెద్ద, చిన్న సినిమాలన్నీ -వాటి వాటి ప్రత్యేకతను చాటిచెప్పుకోడానికి వైవిధ్యాన్ని ఆశ్రయించి వస్తున్నాయి.
రెండేళ్లు -రెండోవాళ్లకు చాన్స్ ఇవ్వకుండా టాలీవుడ్ మూడ్‌ను కమ్మేసిన ఘనత ఈ ఏడాదితో రాజవౌళికే దక్కుతుంది. 2015 జూలై 10న ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన జక్కన్న -ఈ ఏడాది బాహుబలి 2ని బిగ్ సినిమాగా తెస్తున్నాడు. రాజవంశానికి విశ్వాసపాత్రుడైన కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాల్సి వచ్చిందన్న ప్రశ్నకు -రెండు నెలలు తక్కువ రెండేళ్ల తరువాత సమాధానం దొరకబోతోందన్న మాట. బాహుబలిపై ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసిన రాజవౌళి -వచ్చే ఏప్రిల్ 28న ‘కన్‌క్లూజన్’ ఇవ్వబోతున్నాడు. ప్రేక్షకులు ఆసక్తి ఈ కోణంలోవుంటే, సినిమా ట్రేడ్ వర్గాలు మాత్రం ‘బిగినింగ్’ కలెక్షన్లను ‘కన్‌క్లూజన్’ క్రాస్ చేస్తుందా? లేదా? అన్న ఆసక్తిపై లెక్కలేసుకుంటున్నారు. ‘కాళ్లూచేతులు చచ్చుబడిన కోటీశ్వరుడి’గా సాహసోపేతమైన పాత్ర చేసి, ఇదీ స్టార్ హీరోయిజం అనిపించుకున్న నాగ్ సైతం -ఈ ఏడాది మరోసారి వైవిధ్యాన్ని రుచి చూపించనున్నాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయిలాంటి అలవాటైన భక్తి చిత్రం ఒకటి చేస్తుంటే, భయపెట్టే సినిమా మరొకటి చేస్తుండటం వైవిధ్యమే అనాలి. దర్శకుడు కె రాఘవేంద్రరావు ఇప్పటికే తన అనుభవాన్ని రంగరించి ‘హాథీరామ్’ను తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 10న ‘ఓం నమో వెంకటేశాయ’ థియేటర్లకు రాబోతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలిసిందే కనుక -నాగ్ సినిమాపై ఆసక్తి కనిపిస్తోంది. ఇక సమ్మర్ సీజన్ పూర్తికాకపోతే -ఆడియన్స్‌ని భయపెట్టేందుకు తొలిసారి నాగ్ హారర్ చిత్రంతో రాబోతున్నాడు. చిన్న చిత్రంగా వచ్చి సెనే్సషన్ సృష్టించిన ‘రాజగారి గది’కి సీక్వెల్‌గా వస్తున్న ‘..గది-2’లో నాగ్ చేస్తుండటం ప్రత్యేకతను సంతరించుకున్నదే.
ఇటీవల క్రీడా ప్రాధాన్యమున్న సినిమాలకు ఆదరణ పెరగటంతో -సాలా ఖండూస్‌ను ఎంపిక చేసుకున్నాడు వెంకటేష్. మళ్లిన వయసులోనూ కండల సామర్థ్యానికి పదునుపెట్టి బాక్సింగ్ ‘గురు’గా స్క్రీన్స్‌కు వస్తున్నాడు. దీనికితోడు -పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్టులోనూ వెంకీ రోల్ వైవిధ్యమేనన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ ఒక స్పెషల్ అయతే -ఫెయిల్యూర్స్‌తో అల్లాడుతున్న పూరీ తన మార్కు కథను వెంకీ కోసం తయారు చేశాడన్నది మరో స్పెషల్. ‘వెంకీ ఇప్పటి వరకూ చేయని పాత్ర’ అన్న టాక్ బలంగా వినిపిస్తోందటే -పూరీ తన స్టయిల్లో ఏదోక స్పెషాలిటీ పెట్టే ఉంటాడన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల మాట.
ఇక -నాని హీరో, దిల్‌రాజు నిర్మాత. చిన్న ‘సినిమా.. చూపిస్త మావ’తో పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన దర్శకుడు నక్కిన. ఈ కాంబోలో వస్తున్న చిత్రం -నేను లోకల్. ఫిబ్రవరి సీజన్‌లో విడుదలవుతున్న (3న) మొట్టమొదటి సినిమా. ట్రైలర్ టాప్ లేపటం, టాంప్‌రేంజ్‌లోవున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఊపు బాణీలు.. వెరసి మంచి రెస్పాన్స్ బావుంది. ఇక మంచు విష్ణు ‘లక్కున్నోడు’ చిత్రం కూడా 3నే ధియేటర్లకు వస్తోంది. విష్ణుతో సరైన కెమిస్ట్రీ పండించగలిగే హన్సిక పెయిర్ కనుక -సినిమాపై అంచనాలున్నాయి. వారం తిరక్కుండానే ‘మంచు బ్రదర్’ మనోజ్.. దర్శకుడు సత్యతో కలిసి ‘గుంటూరోడు’గానూ వస్తున్నాడు. ఆ తరువాతి వారంలోనే (్ఫబ్రవరి 17న) -రాణా దగ్గుబాటి ‘ఘాజీ’ థియేటర్లకు వస్తోంది. మనదేశంలో తెరకెక్కిన మొట్టమొదటి జలాంతర్గామి యుద్ధ నేపధ్యాన్ని చూపించే వైవిధ్యమైన కథ ఇది. దీనికితోడు తెలుగు, తమిళం, హిందీలోనూ తెరకెక్కిన చిత్రం. మరోపక్క బాహుబలి విలన్‌గా క్రేజ్ తెచ్చుకున్న హీరో. ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయ కనుక -ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. జీర గొంతు, చిత్రమైన యాస, సెటారికల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో హీరోగా రేంజ్ పెంచుకున్న రాజ్‌తరుణ్ కూడా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అంటూ ఫిబ్రవరి 17నే వస్తున్నాడు. ‘బలమైన’ మెగా హీరోగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న సాయిధరమ్ తేజ్ చిత్రం ‘విన్నర్’ సైతం సమ్మర్ సీజన్‌నే టార్గెట్ చేసుకుంది. ‘తిక్క’తో సాయిధరమ్ గ్రాఫ్ డౌన్ అవ్వడంతో, దాన్ని తిరిగి నిలబెట్టేందుకు -దర్శకుడు గోపీచంద్ మలినేని గట్టిగానే కృషి చేస్తున్నాడు. రకుల్‌తో రొమాన్స్, అనసూయతో హాట్ సన్నివేశాలు పెట్టి ధరమ్‌తేజ్‌ను ‘విన్నర్’ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. సమ్మర్ రేస్‌లోనే -బన్నీ ‘డిజె’, వరుణ్ తేజ్‌తో శీను వైట్ల కసిగా చేస్తున్న ‘మిస్టర్’, గోపీచంద్- సంపత్ నందిల కాంబినేషన్ చిత్రాలు ఉండటం ఖాయం.
ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఆలోచనల దశనుంచే ఆసక్తిని రేకెత్తిస్తుంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించనుండటం ఒక కారణమైతే, బాబీతో తొలిసారి చేస్తున్న సినిమా మరో కారణం. జనతా గ్యారేజ్ హిట్టందుకున్నా, చాలాకాలంగా కథలు వినడానికే పరిమితమైన ఎన్టీఆర్ ఎట్టకేలకు ఫిబ్రవరి 10న షూట్ మొదలుపెట్టబోతున్నాడు. అన్నయ్య కల్యాణ్‌రామ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై నిర్మిస్తున్న చిత్రమిది.
ఇక మహేష్‌బాబు తొలిసారి మురుగదాస్‌తో కలిసి చేస్తున్న సినిమా టాలీవుడ్‌కు ఒకింత ప్రత్యేకమే. సామాజిక ఇతివృత్తాన్ని కథలుగా మలచుకునే మురగదాస్, హీరో మహేష్‌ల స్టామినా ఏమిటో ఆడియన్స్‌కు తెలుసు కనుక -ఈ చిత్రంపైనా పెద్ద ఎక్స్‌పెక్టేషనే్స ఉన్నాయి. కథతోపాటు మహేష్ పాత్ర, హావభావాలు ప్రాజెక్టుకు పెద్ద ప్లస్ అంటున్నారు.
హీరోగా ధృవ ఫెయిల్యూర్ తట్టుకుని, నిర్మాతగా ‘..150’కి హిట్టందుకున్న రామ్‌చరణ్‌తో సుక్కూ ప్రాజెక్టు జనవరి 30న ప్రారంభించే చాన్స్ ఉంది. స్పై థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని అంటున్నారు. అంటే, కొన్ని దశాబ్దాల తరువాత తెలుగులో మళ్లీ జేమ్స్‌బాండ్ లాంటి సినిమాలకు చరణ్ తెరలేపుతాడన్న మాట. 14 నెలలలుగా వెండితెరకు దూరమై వీదేశీటూర్లలోవున్న రవితేజ చిత్రం కూడా ఫిబ్రవరిలో మొదలుకావొచ్చు. వరుస హిట్లతో ముందుకెళ్తున్న దిల్‌రాజు ఇలాకాలో అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రమిది. ‘...150’ హిట్టుతో ఊపుమీదున్న చిరంజీవి సైతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా మొదుపెట్టబోతున్నట్టు కథనాలున్నాయి. అన్నీ అనుకున్నట్టయితే -రామ్‌చరణ్ బర్త్‌డే మార్చి 27న సినిమాను లాంఛనంగా ప్రారంభించొచ్చు.
కాటమరాయుడిగా వస్తున్న పవన్‌కల్యాణ్ సమ్మర్‌కు వస్తే, వచ్చే దసరా టార్గెట్‌తో దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నాడు. ఇందులో పవన్ పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందన్నది ఇండస్ట్రీ టాక్.

-రాణీప్రసాద్