మెయిన్ ఫీచర్

జీవన్మముక్తికి జ్ఞానమే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
428
బ్రహ్మాత్మనోః శోధిత యోరేక భావాగగాహినీ
నిర్వికల్పా చ చిన్మాత్రవృత్తిః ప్రజ్ఞేతి కథ్యతే
సా సర్వదా భవేద్యస్య స జీవన్ముక్త ఉచ్యతే.!
తత్త్వ విచారణ ద్వారా జీవ పరమాత్మల ఏకత్వమును అవగాహన చేసికొని, నిర్వికల్పమైన అఖండ జ్ఞాన స్వరూపమందు చిత్తవృత్తి కల్గి ఉన్న సాధకుడు ప్రాజ్ఞుడు. అఖండ బ్రహ్మాకార చిత్తవృత్తి పొందిన ఆత్మవేత్తకు భవబంధ ముక్తి తప్పక లభించును. అందువలన ‘అహం బ్ర హ్మాస్మి’ నేనే బ్రహ్మస్వరూపము అని ఎవనిలో అద్వైత చిత్తవృత్తి సదా ఉండునో అట్టి ప్రాజ్ఞుడే జీవన్ముక్తుడనబడును.
429యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా యస్యానన్దో నిరన్తరః
ప్రపంచో విస్మృప్రాయః సజీవన్ముక్త ఇష్యతే
ఎవని ప్రజ్ఞ నిశ్చలమై ఉండునో అతడు అనుక్షణమూ ఆనందరసానుభూతిని పొందుతూ, ఈ ప్రపంచముతో నిమిత్తము లేనట్లు ప్రవర్తించును. సమస్త లౌకిక వ్యాపారమునందు ఎట్టి ఆసక్తి చూపక ఉదాసీనతతో ఉండే జ్ఞానవంతుడే జీవన్ముక్తుడనబడును.
430లీన ధీరపి జాగర్తి యో జాగ్రద్ధ ర్మవర్జితః
బోధో నిర్వాసనో యస్య స జీవన్ముక్త ఇష్యతే॥
జాగ్రదావస్థలో సామాన్య వ్యక్తులకు సమస్త రూప శబ్దాది విషయములు ఇంద్రియ గ్రాహ్యవౌను. కానీ ఏ ప్రజ్ఞావంతుని మనస్సు బ్రహ్మములో లీనమై ఉండునో, మేల్కొని ఉన్ననూ అట్టి స్థితప్రజ్ఞుని దృష్టి , బాహ్య విషయ గ్రహణ కొరకు మరలదు. ఆ పురుషుడే జాగ్రద్ధర్మవర్జితుడని చెప్పబడును. అందువలనై, పరిపూర్ణ పదార్థ జ్ఞానము గలవాడై వాసనాశూన్యుడైన స్థితప్రజ్ఞుడే పదార్థ జ్ఞానము గలవాడై, వాసనాశూన్యుడైన స్థితప్రజ్ఞుడే జీవన్ముక్తుడుగా అంగీకరింపబడునని స్పష్టము చేయబడుతున్నది జీవన్ముక్తుడుగా అంగీకరింపబడునని స్పష్టము చేయబడుతున్నది.
‘‘ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వా స్యామంత కాలే పి బ్రస్మ నిర్వాణ మృచ్ఛతి ॥ అనిస్మృతి బోధన. అర్జునా బ్రాహ్మీస్థితి అనగా ఇదియే. ఈ స్థితిని పొందిన వాడు మోహితుడు కాడు. అంతకాల పర్యంతము బ్రాహ్మీస్థితిలో స్థిరముగా ఉండే వ్యక్తి బ్రహ్మనందమును పొందును భ.గీ. 2-72
431శాస్త్ర సంసార కలనః కలావానపి నిష్కలః
యః సచిత్తోపి నివ్చిత్తః స జీవన్ముక్త ఉచ్యతే
ఎవనికి ప్రాపంచిక బంధము శాంతించినదో, అతడు మహాపండితుడైననూ బాహ్యముగా విద్యాసంపదన్నుడి వలె కనిపించ వ్యవహరించును. ప్రాణాది షోడశ కళలతో సచిత్తుడుగా బుద్ధ్యాది అంతరేంద్రియములతో సంబంధము ఉన్నవాడైనప్పటికీ ఎవడు చిత్త రహితుడై చిత్తాదులతో ఎట్టిసంబంధం లేక వ్యవహరించునో అట్టి మహాత్ముడే జీవన్ముక్తుడని చెప్పబడుతున్నాడు.
షోడశకళల పురుషుడు ఎవడు అని సుకేశుడనే శిష్యుడు అడుగగా, దానికి పిప్పలాద మహర్షి సమాధానము, శ్రుతిలో ఇలావిన్పిస్తున్నది. ‘‘స ప్రాణ మసృజత ప్రాణాత్ శ్రద్దాం ఖం వాయు ర్జ్యోతి రాపః పృథివీంద్రియం మనో న్న మన్నాద్వీర్యం తపో మంత్రాః కర్మలోకా లోకేషు చ నామచ ’’ సకల ప్రాణుల అంతరాత్మగా వెలసిన ఆ పరబ్రహ్మమే ప్రాణమును సృజించెను. ప్రాణముతో శద్ధ్రను, ఆకాశమును, అగ్నిని, ఉదకములను, పృథ్విని ఇంద్రియములను , మనస్సును సృష్టించెను. ప్రాణుల జీవనోపాధికి అన్నమును, అన్నముతో వీర్యమును, తపస్సును, మంత్రములను, కర్మలను మరియు లోకములను, లోకులను సృష్టించి నామధేయములను కూడా కల్పించెను. -ప్ర.ఉ.6-4.
షోడశకళలూ ఉన్న జ్ఞానవంతుడు ఎప్పుడు నిష్కలుడై జీవనయాత్ర కొనసాగించునో అతడే జీవన్ముక్తుడనబడును.
432వర్తమానే పి దేహా స్మిం శ్ఛాయావదనువర్తిని
అహంతా మమతాభావో జీవన్ముక్తస్య లక్షణమ్
స్థూలదేహమును నీడ వెన్నంటే ఉంటుంది. కానీ నీడపై వ్యామోహము ఎవరికీ ఉండదు. స్థూల దేహమును అనుసరించి ఉన్నవే అహంకారమమకారములు, ఇచ్ఛాద్వేషములు, జరామరణాది వికారములు, స్ధూలదేహముతో నిల్చి ఉన్నప్పటికీ, ఎటువంటి దేహ సంబంధ వికారములు లేక జీవనయాత్ర చేయుటయే జీవన్ముక్తిని విశిష్ట లక్షణము.
433. అతీతాననుసన్ధానం భవిష్యదవిచారణమ్
ఔదాసీన్యమపి ప్రాప్తే జీవన్ముక్తస్య లక్షణమ్
నిజజీవితములో జరిగిపోయిన ఏ విషయమును గుర్తు చేసుకొనకపోవుట మున్ముందు ఏమి జరుగనున్నదో అనే ఆలోచన లేకుండుట, ప్రస్తుతము ప్రాప్తించిన విషయము పై కూడా ఉదాసీనముగా ప్రవర్తించుట జీవన్ముక్తుని లక్షణములు.
ఇంకా ఉంది