మెయిన్ ఫీచర్

ఆత్మానందం.. ఆత్మజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
విద్యావేత్త పొందే దృష్ట్ఫలము ఇదియే. వివేకశూన్యుడు, యథార్థమేదో, మిథ్య ఏదో తెలిసికొనలేడు. ఆత్మవిద్యా ప్రస్తావనకు సంబంధించినంతవరకు, దేహాధికములు అనిత్యములు, హృదయ స్థానములో తన ఉనికికి కారణమైన ప్రత్యగాత్మ పరబ్రహ్మ స్వరూపమని, అదే తన స్వస్వరూపమని తెలిసికొని, ముక్తిని పొందగోరి(ఆశించి), ఆత్మావలోకనముకొరకు తీవ్ర ప్రయత్నముచేయుటయే విద్యావంతుని దృష్టిపలమని స్పష్టము చేయబడుతున్నది.
424. అజ్ఞాన హృదయగ్రనే్థ ర్వినాశో యద్యశేషతః
అనిచ్ఛోర్విదుషః కిం ను ప్రవృత్తేః కారణం స్వతః॥
అజ్ఞానముచే ఏర్పడిన హృదయగ్రంధి శేషరహితముగా నాశనమైనప్పుడు విద్యావంతుడు కోరికలను తీర్చుకొనుటకు మనస్సును విషయాదులపైకి పోనీయడు. అంతఃకరణముతో తాదాత్మ్యము కల్గినప్పుడే విషయాదులపైకి మనఃప్రసారణ ఉండుననే విషయము తెలిసినదే కదా!
బాహ్యముఖుడై ఉన్నప్పుడు, ఆత్మజ్ఞానము లేని స్థితిలో కామసంకల్పాదులు మనస్సుచే ప్రభావితమై ఉద్భవించును. అంతర్ముఖుడై, బ్రహ్మనిష్ఠతో ఆత్మదర్శనము చేసికొనదల్చిన విద్యావంతుని ప్రవృత్తి విషయాదులపైకి మరలదు. ఆనంద రసానుభూతి పొందుట తప్ప ఇతర విషయానుభూతికి క్రియాశూన్యుడైన ఆత్మజ్ఞాని స్వయముగా ఏవిధమైన ప్రయత్నమూ చేయడు. అందువలన, ఏకాంతముగా కేవలుడై ఉండుటయే ఆత్మవేత్త పొందే దృష్ట్ఫలమని నిశ్చయింపబడుతున్నది.
425. వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధిః
అహంభావోదయాభావో బోధస్య పరమావధిః
లీనవృత్తే రనుత్పత్తిర్మర్యాదోపరతేస్తు సా॥
ఇంద్రియములు గతములో అనుభవించిన భోగములందు, ఆ భోగ్యవస్తువులు తనకు అందుబాటులో ఉన్ననూ, ఉదాసీనతతో వాటిపై ఎట్టి అనురక్తి చూపకుండుట వైరాగ్యమునకు పరమావధి.
కోశములందు, అహంబుద్ధి సమూలముగా నశింపజేసుకొని, పునఃఉత్పన్నమగుటకు అవకాశము కలుగనీయకుండుటయే ఆత్మజ్ఞానముయొక్క ఆఖరి మెట్టు (పరమావధి). ఆనందాత్మయందు మనస్సు సంపూర్ణముగా క్షీరనీరములవలె అంతర్లీనమగుటయే ఉపరమయొక్క అంతిమసోపానము. ఆ గమ్యస్థానమును చేరుకొనిన తత్త్వవేత్త, అహర్నిశలు, బ్రహ్మానందమేకాక, పరమతృప్తిని అనుభవిస్తూ, నిష్క్రియుడై అపరోక్షానుభూతిని అచిరకాలములోనే పొందగల్గును.
426.
బ్రహ్మాకారతయా సదా స్థితతయా నిర్ముక్త బాహ్యార్థదీః
అన్యావేదిత భోగ్యభోగకలనో నిద్రాలువత్ బాలవత్‌
స్వప్నా లోలతలోకవ జ్జగదిదం పశ్యన్ క్వచిల్లబ్ధదీః
ఆస్తే కశ్చి దనన్త పుణ్య్‌ఫలభుక్ ధన్యః స మాన్యో భువి॥
పరబ్రహ్మ స్వరూపుడై ఉన్న కారణంగా, బాహ్యార్థములందు ఆసక్తి నశించిన ఆత్మజ్ఞాని, తాను స్వయముగా అన్నపానీయములకొరకు ప్రయత్నముచేయక, ఇతరులు అందించిన ఆహారాదులను నిద్రావస్థలోనున్న బాలునివలె, వౌనముగా అత్యల్పమాత్రములో స్వీకరించును. ఈ జగద్వ్యాపారమును, స్వప్నదృశ్యములవలె పరికిస్తూ సదా నిర్లిప్తతతో ప్రవర్తించును. ఆవిధముగా అనిర్వచనీయ పరబ్రహ్మమందే బుద్ధినివేశముగలవాడు ఏ ఒక్కడో ఉండును. అనంతకోటి పుణ్యకర్మల ఫలితమైన బంధవిముక్తిని పొందుతున్న అట్టి ఆత్మజ్ఞాని ధన్యుడు, పూజనీయుడు.
‘‘ఏతస్యైవానన్ద స్యాన్యాని భూతాని మాత్రా ముపజీవన్తి’’అని శ్రుతి ప్రకటిస్తున్నది (సమస్త భూతములు ఈ నిరతిశయ బ్రహ్మానందము యొక్క అంశమును మాత్రమే అనుభవించి జీవిస్తున్నవి- బృ.ఉ.4-3-32).
427
స్థిత ప్రజ్ఞో యతి రయం యః సదానన్ద మశ్నుతే
బ్రహ్మణ్యేన విలీనాత్మా నిర్వికారో వినిష్ట్రియః
పరబ్రహ్మమందే లీనమైన అంతఃకరణము గలవాడు. సమస్త వికారములు నశించినవాడు, క్రియారహితుడెవడో అతడే నిత్యము పరమానందమును పొందును. అట్టి యతీంద్రుడే స్థితప్రజ్ఞుడని చెప్పబడును.
స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములను ప్రస్తావిస్తూ భగవద్గీతలో ఇలా బోధించబడింది.
‘‘ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్!
ఆత్మనే్యవాత్మనా తుష్ఠః స్థిత ప్రజ్ఞ స్తదోచ్యతే’’
అర్జునా! కోరికలు తొలగిపోగా, పరమాత్మ సంయోగం వలన అత్మానందంను పొందేవానినే స్థితప్రజ్ఞుడు అందురు. - భగ.2-55
ఇంకా ఉంది