మెయిన్ ఫీచర్

ప్రశాంత జీవి.. ఆత్మజ్ఞాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
ప్రారబ్ధ సూత్రగ్రథితం శరీరం
ప్రయాతు వా తిష్ఠతు గోరివస్రక్
న తత్పునః పశ్యతి తత్త్వవేత్తా‚‚
నన్దాత్మనా బ్రహ్మణి లీనవృత్తిః॥
గోవు దృష్టి, అలంకారముకొరకు దాని మెడలో కట్టిన రంగుల త్రాగుపై ఉండదు. ఆ త్రాడు ఉన్ననూ లేకపోయిననూ గోవు వ్యధ చెందదు. అట్లే, ప్రారబ్ధకర్మ ఫలితముగా ఏర్పడిన శరీరముతో జ్ఞానవంతునకు ఆత్మదర్శనానంతరము ఎట్టి నిమిత్తము ఉండదు. బ్రహ్మసాక్షాత్కారము లభించి జీవన్ముక్తిని పొందిన జ్ఞాని, శరీరము పతనమైనా, కొంతకాలము నిల్చిఉన్నా దానిపై దృష్టిసారించదు, అతనికెట్టి నిస్పృహ, నిరాశ కలుగదు. మనస్సు నిరవధిక ఆనందాత్మ స్వరూపములో లీనమైన పిదప, అతడు ఆప్తకాముడు. నిశ్రే్శయసమునకు మించి ఆశించవలసినదేదీ జిజ్ఞాసువునకు ఉండదు.
418. అఖణ్డానన్దమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః
కిమిచ్ఛన్ కస్య వా హేతో ర్దేహం పుష్ణాతి తత్త్వవిత్‌॥
స్వయముగా తానే అఖండానంద స్వరూపమని తెలిసికొనిన తత్త్వవేత్త మరేమి ఆశించి, ఏ ఉద్దేశ్యముతో శరీర పోషణకు శ్రద్ధవహిస్తాడు? మోక్షమే కదా అతని ఆకాంక్ష? తన లక్ష్యము సిద్ధించగా, సత్వర శరీరపతనము తప్ప తత్త్వవేత్త మరి దేనిని ఆశించడు.
419. సంసిద్ధస్య ఫలం త్వేత జ్జీవన్ముక్తస్య యోగినః
బహిరన్తః సదానన్దరసాస్వాదన మాత్మని॥
ఆత్మదర్శనము చేసికొనిన సాధకుడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తి పొందిన యోగి దేహపతన పర్యంతము, అనునిత్యము హృదయములోను, బాహ్యంగానూ, ఆనంద రసాస్వాదన చేయుచూ కాలము గడుపును. అదియే ఆత్మవేత్త పొందే ఫలము. ఆత్మజ్ఞాని దేహపతనముతో, విదేహముక్తిని పొందును. శాశ్వత భవబంధముక్తి లభించిన బ్రహ్మజ్ఞానికి పునరావర్తనము లేదు.
420. వైరాగ్యస్య ఫలం బోధః బోధస్యోపరతిః ఫలమ్‌
స్వానన్దానుభవాచ్ఛాన్తి రేషైవోపరతేః ఫలమ్‌॥
వైరాగ్యమునకు ఫలము జ్ఞానము. జ్ఞానమునకు ఫలము ఉపరతి. స్వానందానుభవమువలన శాంతి లభించును. ప్రశాంతమైన మనస్సు ఉపరతికి ఫలము. ఉపరతి పొందనిదే బ్రాహ్మీస్థితిలో బ్రహ్మనిష్ఠుడు కాలేడు. బ్రహ్మనిష్ఠలేనిదే పరబ్రహ్మ సాయుజ్యము లభించదు. భగవద్గీత బోధన ‘‘బ్రహ్మభూతః ప్రసన్నాత్మా...లభతే పరామ్’’ ప్రశాంత మనస్కుడే బ్రహ్మభూతుడై జ్ఞానప్రాప్తి పొందునని స్పష్టము చేస్తున్నది (్భ.గీ.18-54).
421. నివృత్తిః పరమా తృప్తిః ఆనన్దో‚ సుపమః స్వతః
దృష్టదుఃఖేష్వనుద్వేగః విద్యాయాః ప్రస్తుతం ఫలమ్‌॥
ఆత్మజ్ఞాని కార్యోన్ముఖుడు కాడు. క్రియాశూన్యతవలన, ఇక ఆశించేదేమి లేనందువలన, మనఃప్రశాంతత లభ్యవౌను. చెప్పనలవికాని తృప్తిని పొందుతూ సాటిలేని ఆనందమును అనుభవించును. ప్రారబ్ధకర్మననుసరించి, వ్యాధిగ్రస్తుడైనా, దురవస్థపాలైనా కలత చెందడు. ఇదియే ఆత్మవిద్యాప్రాప్తివలన జీవన్ముక్తుడు ఈ లోకములో పొందే ఫలము.
422.
యత్కృతం భ్రాన్తివేళాయాం నానాకర్మ జుగుప్సితమ్‌
పశ్చాన్నరో వివేకేన తత్క్థం కర్తుమర్హతి॥
విద్యాప్రాప్తికి పూర్వము భ్రాంతికల్గుట సర్వసామాన్యము. భ్రాంతి మూలముగా, అజ్ఞాన దశలో నిందనీయమైనవి చేయకూడని పనులు చేసియుండుగాక. యథార్థజ్ఞానము పొందిన పిదప అట్టి జుగుప్సాకరమైన కర్మలుచేయడు. అయితే, అజ్ఞానంతో గతంలో చేసిన ప్రారబ్ధ కర్మఫలము అనుభవయోగ్యవౌనా అనే సందేహము కలుగును. కర్మఫలము అనుభవించక తప్పదు. పశ్చాత్తాపముతో కర్మఫలితము అంతమయే అవకాశము లేదు. జ్ఞానప్రాప్తికి పూర్వముచేసిన వివిధ కర్మల ఫలమును నివారించుకొనే అర్హత ప్రాజ్ఞుడు కూడా పొందలేడని ఇచ్చట స్పష్టము చేయబడుతున్నది.
423. విద్యాఫలం స్యాదసతో నివృత్తి.
ప్రవృత్తి జ్ఞానఫలం యదీక్షితమ్‌
తద్ జ్ఞాజ్ఞయోర్యత్ మృగతృష్ణికాదౌ
నోచే ద్విదో దృష్ట్ఫలం కి మస్మాత్‌॥
అసత్పదార్థములైన దేహాదులనుండి నివృత్తియే విద్యయొక్క ఫలము. అసద్వస్తువులను, సద్వస్తువులుగా భావించుట వివేకహీనుల స్వభావము. వివేకి, శుక్తిలో ఉన్నది రజతముకాదని, ఎడారిలో జలాశయములా కన్పించునది భ్రమ, మిథ్య అని గ్రహించగల్గుతాడు.
ఇంకా ఉంది