మెయిన్ ఫీచర్

జాతికి పునాది మహిళలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ 21వ శతాబ్దంలో భారతదేశ ప్రగతి గాథ అసాధారణమైన వృద్ధితో, నూతన ఆవిష్కరణలతో కొనసాగుతోంది. ఆరోగ్య రంగాన్ని తీసుకుంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల మధ్యన పోలియోను నిర్మూలించగలిగాం. అలాగే మెటర్నల్ అండ్ నియోనాటల్ టెటనస్ నిర్మూలన కూడా చేశాం. అది కూడా అంతర్జాతీయంగా విధించిన గడువు కంటే ముందుగా ఆ పని చేశాం. ఇవి రెండూ మన దేశానికి ఎంతో ముఖ్యమైన విజయాలు. భారతదేశ విజయగాథలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వారు మన సమాజాన్ని నిర్మిస్తున్నారు. అశేషమైన విధానాల ద్వారా మన ఉత్పాదకతను పెంచుతున్నారు. మా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనేక విధానాల ద్వారా మహిళలకు అండదండలు అందిస్తోంది. వారికి ప్రగతిదాయక భవిష్యత్తును అందించడానికి విశేషంగా కృషి చేస్తోంది.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అనేక కార్యక్రమాలు, పథకాల ద్వారా మహిళల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. శిశు దశ నుంచి, పెరిగి పెద్దయ్యేంతవరకూ లైఫ్ సైకిల్ విధానంలో మహిళలకు సేవలందిస్తోంది. టీకాలు వేయించడంతో పాటు ఆరోగ్య కార్యకర్తలు నిత్యం తమ పరిధిలోని గృహాలను సందర్శించి ఆరోగ్య రక్షణ అందిస్తున్నారు. అన్ని దశల్లోని వారికి పోషణ ప్రాధాన్యతను వివరిస్తున్నారు. తద్వారా ఆరోగ్యకరమైన బాల్యానికి పునాది వేస్తున్నారు. అలాగే కౌమార వయస్సులోని వారి కోసం ఆరోగ్య కార్యక్రమాలున్నాయి. బహిష్టు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వారం వారం ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ స్కీమ్ అమలుచేయడం, సాథియా (మహిళా ఆరోగ్యం విషయంలో విజ్ఞానం కలిగిన తోటి మహిళలు)ల సాయంతో మహిళలకు చేరువవ్వడం మొదలైన కార్యక్రమాలు అమలుచేస్తున్నాం.
వివాహితలకు అవసరమయ్యే కుటుంబ నియంత్రణ సేవలను అందిస్తున్నాం. అలాగే వివాహిత మహిళలు అవసరమైనప్పుడు గర్భనిరోధక విధానాలు పాటించాల్సి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం తగిన చైతన్యం కలిగిస్తోంది. గర్భధారణ, శిశు జననాలకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీని కోసం ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (పి.ఎం.ఎస్.ఎం.ఏ), సురక్షిత్ మాతృత్వ ఆస్వాషన్ (సుమన్), లక్ష్య (ప్రసూతి గది నాణ్యత మెరుగుదల కోసం ప్రత్యేక కార్యక్రమం), మంత్రసాని సేవలు మొదలైన వాటి ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నాం.
మహిళలందరికీ ఆరోగ్య భద్రతను కల్పించాలనేది మా మంత్రిత్వ శాఖ నిబద్ధతతో పని చేస్తోంది. బ్రెస్ట్, సర్వికల్ కేన్సర్ల పరీక్షలను అందరు మహిళలకు అందుబాటులోకి తెచ్చాం. ఇది ఉచిత సేవ. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి చెందిన ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ పని చేయిస్తున్నాం.
పి.ఎం.ఎస్.ఎం.ఏ.ను 2016 జూన్ నెలలో ప్రారంభించాం. గర్భస్థ శిశువులకు సమగ్రమైన ఆరోగ్య రక్షణ కల్పించడానికి గాను ఇందులో యాంటినాటల్ కేర్ ప్యాకేజీ ఉంది. పరీక్షలు చేయడమే కాకుండా మందులు కూడా ఇస్తారు. అంతే కాదు గర్భధారణ మహిళలందరికీ ప్రతి నెలా 9వ తేదీన ఈ సేవలను ఉచితంగా అందిస్తారు.
ఈ కార్యక్రమం కింద ప్రైవేటు రంగ ఆరోగ్య సంరక్షణ దారుల సాయాన్ని కూడా తీసుకోవడం జరుగుతోంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద వారు స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రత్యేక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 2.38 కోట్లకు పైగా గర్భిణీ స్ర్తిలు పి.ఎమ్.ఎస్.ఎం.ఎ. కింద ప్రసూతి సంరక్షణ పొందారు. అంతేకాదు 12.55 లక్షలకు పైగా హైరిస్క్ గర్భాలను గుర్తించటం జరిగింది.
ప్రసూతి కేంద్రాల్లో నాణ్యమైన సేవలను అందించడానికి గాను 2017 డిసెంబర్ నెలలో లక్ష్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రమాదకర పరిస్థితుల్లోని బాలింతల మరణాల్ని, శిశువుల మరణాల్ని సరైన ఆరోగ్య సేవలందించడం ద్వారా ఆపడం జరుగుతోంది. అంతేకాదు గర్భిణీ మహిళలు గౌరవప్రదమైన ఆరోగ్య సేవలను పొందడానికి గాను, వారు నాణ్యమైన సేవలను పొందడానికి గాను అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. ఇంతవరకూ ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ఆమోదం తెలిపిన సౌకర్యాల వివరాలను తీసుకుంటే వాటిలో 506 ప్రసూతి రూములు, 449 మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్లున్నాయి. ఇక లక్ష్య ఆమోదం తెలిపినవి జాతీయస్థాయిలో 1188 ప్రసూతి కేంద్రాలు, 160 మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్లున్నాయి.
కేవలం ప్రసూతి గదులనే కాదు బాలింతలు, శిశువుల ఆరోగ్య భద్రత కోసం ఆధునిక సౌకర్యాలను ఆయా జిల్లా ఆసుపత్రుల్లో/జిల్లా మహిళా ఆసుపత్రుల్లో కల్పించడం జరిగింది. అంతే కాదు ఆయా జిల్లా ఉపస్థాయి ఆరోగ్య కేంద్రాల్లో కూడా నాణ్యమైన మహిళా ఆరోగ్య, గర్భ శిశువుల ఆరోగ్య సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఇంతవరకూ 650 పూర్తిస్థాయి మాతృమూర్తుల మరియు శిశు ఆరోగ్య విభాగాలను ఆయా ప్రాంతాలకు కేటాయించడం జరిగింది. వీటి ద్వారా 42 వేల అదనపు పడకలు లభించాయి.
ఈమధ్యన మహిళల కోసం ప్రారంభించిన మరో కార్యక్రమం సుమన్. దీన్ని గత ఏడాది అక్టోబర్ 10న ప్రారంభించాం. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు గౌరవప్రదమైన, నమ్మకమైన, నాణ్యమైన ఆరోగ్య సేవలను ఉచితంగా అందించడం జరుగుతుంది. దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల దగ్గరకు వచ్చే వారికి సేవలు అందించమూ అని సిబ్బంది ఎవరైనా చెబితే దాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. ప్రసవ సమయ మరణాలను, నవజాత శిశువుల మరణాలను అరికట్టడానికి ఇలాంటి చర్యలను తీసుకోవడం జరిగింది. ఈ చర్యల కారణంగా పేద, సామాన్య మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవించడం జరుగుతుంది. మాతృమూర్తులకు, నవజాత శిశువులకు ఆరోగ్య సేవలందించే అన్ని కార్యక్రమాలను సుమన్ కార్యక్రమం కిందకు తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ ఆరోగ్య సేవలను పొందే హక్కు కలిగిన వారందరికీ సమగ్రమైన, సులువైన సేవలందించడం జరుగుతుంది.
అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే సంకల్పాన్ని చూస్తే దీని ద్వారా అన్ని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల్లో 30 ఏళ్ల వయస్సు దాటిన వారికి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా మూడు రకాల సాధారణ క్యాన్సర్ల విషయంలో పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ మూడు రకాల క్యాన్సర్లు ఏవంటే ... నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్లు. మహిళల విషయంలో రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్‌ల విషయంలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంతవరకూ దేశవ్యాప్తంగా 1.03 కోట్ల మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయడం జరిగింది. సర్వికల్ క్యాన్సర్ విషయంలో 69 లక్షల మంది మహిళలకు పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు, అందించే సౌకర్యాల కోసం నైపుణ్య మానవ వనరుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం జాతీయ శిక్షణా కార్యక్రమం దక్షతాను 2015లో ప్రారంభించడం జరిగింది. ఇది వ్యూహాత్మకంగా రూపొందించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం. దీని ద్వారా ఆరోగ్య భద్రతా రంగంలో పనిచేసే వారికి శిక్షణ ఇస్తారు. గర్భిణీలు ప్రసవం కోసం ఆరోగ్య కేంద్రంలో చేరినప్పటి నుంచీ వారు ఆరోగ్యకరమైన శిశువుతో ఇంటికి వెళ్లేంతవరకు నాణ్యమైన ఆరోగ్య సేవలందించడానికి వీలుగా ఇందులో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎం.లకు శిక్షణ ఇస్తారు. దక్షతా కార్యక్రమం కింద ఇంతవరకూ 16,400 మంది ఆరోగ్య భద్రతా రంగ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.
గర్భిణీ స్ర్తిలు, నవజాత శిశువులకు గౌరవప్రదమైన, నాణ్యమైన చికిత్సలు, సేవలందించడానికి వీలుగా ఈ మధ్యనే కేంద్ర, ఆరోగ్య శాఖ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మంత్రసాని సేవల కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీని ద్వారా ఈ రంగంలో సమర్థవంతమైన, నైపుణ్యత గల నర్సులను తయారుచేయడం జరిగింది. వీరు మిడ్ వైవ్స్ అంతర్జాతీయ సమాఖ్య (ఐ.సి.ఎం.) సూచించిన ప్రమాణాల ప్రకారం తమ నైపుణ్యాలను పెంచుకొని సేవలందించడం జరుగుతోంది. వీరు మహిళలే కేంద్రంగా వారికి కావల్సిన గర్భధారణ, మాతృత్వ, నవజాత శిశు సంరక్షణ అంశాల్లో సేవలందిస్తారు.
ఈ శిక్షణా కార్యక్రమాలను బలోపేతం చేయడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఐదు జాతీయ నైపుణ్య పరీక్షా కేంద్రాలను (ద) ప్రారంభించింది. ఢిల్లీలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ జాతీయ సంస్థ, లేడీ హార్డింగే, సప్దర్ జంగ్, జామియా హమ్‌దర్ద్ మరియు ట్రైన్డ్ నర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాల వద్ద వీటిని 2014లో ప్రారంభించడం జరిగింది. అలాగే పలు రాష్ట్రాల్లో 104 నైపుణ్య పరీక్ష కేంద్రాలను స్థాపించడం జరిగింది. గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, జమ్ము అండ్ కాశ్మీర్ మొదలైన రాష్ట్రాల్లో వీటిని ప్రారంభించాం. ఆరోగ్య భద్రతా రంగంలో పని చేసే వారి సామర్థ్యాన్ని పెంచడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి నాణ్యమైన ఆర్.ఎం.ఎన్. సి.హెచ్. ప్లస్ ఏ సేవలందించడానికి వీటిని ప్రారంభించడం జరిగింది.
ఇంతవరకూ జాతీయ నైపుణ్య పరీక్షా కేంద్రాల్లో 3375 ఆరోగ్య రంగ భద్రతా సిబ్బందికి (2018-19 ఆర్థిక సంవత్సరంలో 1238 మందికి) శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రాలకు సంబంధించి 33751 మందికి (2018-19 ఆర్థిక సంవత్సరంలో 7750 మందికి) శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరిలో నర్సింగ్ ట్యూటర్లు, నైపుణ్య పరీక్షా కేంద్ర శిక్షకులు, ప్రొఫెసర్లు, మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ అందరినీ కలుపుకుపోతూ చేస్తున్న కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయి. మాతృత్వ సమయంలో సంభవించే మరణాల సంఖ్య విషయంలోనే ఒక సంవత్సరంలోనే ఎనిమిది పాయింట్లు తగ్గిపోయాయి. ఎం.ఎం.ఆర్ (మెటర్నల్ మోర్టాలిటీ రేట్) విషయంలో భారతీయ రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన తాజా ప్రత్యేక బులెటిన్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఈ తగ్గుదల చాలా ముఖ్యం. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే మనం సాధించిన ప్రగతి కారణంగా ప్రతి ఏడాది అదనంగా రెండు వేల మంది గర్భవతులు మృత్యుముఖం నుంచి బైటపడగలుగుతున్నారు. 2014-15 సంవత్సరంలో ప్రతి లక్ష ప్రసూతి కేసుల్లో 130 మంది మాతృమూర్తులు మరణించేవారు. ఈ సంఖ్య 2015-17 నాటికి 122కు పడిపోయింది. అంటే 6.2 శాతం తగ్గుదల. ఈ విధంగా నిలకడగా ఈ సంఖ్య తగ్గిపోతే ఎం.ఎం.ఆర్. విషయంలో 2025 నాటికే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్.డి.జి.) అందుకోగలుగుతాం. అంటే ఐదేళ్ల ముందే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.
భారతదేశ వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాల్లో చేరి ప్రసవాలు పొందే వారి సంఖ్య పెరగడం వల్లనే ఇదంతా సాధ్యమవుతోంది. 2007-08లో ఇది 47 శాతముంటే 2015-16 నాటికి ఇది 78.9 శాతానికి చేరుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పైన తెలియజేసిన కాలాల్లో (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్-4) ప్రకారం సురక్షిత ప్రసవాల శాతం 52.7 శాతాన్నించి 81.4 శాతానికి పెరిగింది. జె.ఎస్.వై., జె.ఎస్.ఎస్.కె. లాంటి పథకాల కారణంగా ఈ లక్ష్యాన్ని అందుకోగలిగాం.
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించే గర్భిణీలను జె.ఎస్.వై. స్కీము కింద నగదు రూపంలో సాయం అందించడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవించే మహిళలకు ఉచిత వైద్యం అందించడం జరుగుతోంది. దీన్ని జనని శిశు సురక్షా కార్యక్రమం కింద అందిస్తున్నారు. ఆపరేషన్ చేసి ప్రసవం చేయించడం కూడా ఉచితంగానే చేస్తారు. అంతేకాదు బాలింతలకు ఉచిత మందులు, ఉచిత ఆహారం అందిస్తారు. అవసరమైతే ఉచితంగానే పరీక్షలు, రక్తం ఎక్కించాలనుకుంటే రక్తం కూడా ఉచితంగానే అందిస్తారు. అంతేకాదు ఈ పథకం కింద లబ్ధి పొందే గర్భిణీలను వారి ఇంటి నుంచి ఆసుపత్రికి రానుపోను ఉచిత రవాణా కూడా అందిస్తారు. ప్రసవానికి ముందు తర్వాత, శిశువుకు ఒక ఏడాది వయస్సు వచ్చేంతవరకూ ఏమైనా అనారోగ్యం వచ్చినా ఈ పథకం కింద సేవలను అందిస్తున్నారు.
మాతృమూర్తుల మరణాల పరిశీలన మరియు ప్రతిస్పందన (ఎండిఎస్సార్) కార్యక్రమం కింద మాతృత్వ దశ మరణాల సమీక్ష కూడా ఉంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోను, ఇళ్ల దగ్గరా సంభవించే గర్భిణీ, ప్రసవ మరణాలను అధ్యయనం చేయడం ద్వారా మాతృత్వ దశ మరణాలను తగ్గించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద ఆయా రాష్ట్రాల్లో సంభవిస్తున్న మాతృత్వ దశ మరణాలను పరిశీలించినప్పుడు అనారోగ్య సమస్యలే కాకుండా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలతో పాటు వ్యవస్థలోని లోపాలు కూడా మాతృత్వ దశ మరణాలకు కారణమవుతున్నాయని తేలుతోంది.
ఈ కార్యక్రమాలతో పాటు మహిళల రక్షణ కోసం వారిని సాధికారులను చేయడానికి వారి హక్కులను రక్షించడానికి చట్టాలను కూడా చేయడం జరిగింది. శిశు లింగ పరీక్షలను అరికట్టడం ద్వారా భ్రూణ హత్యలను ఆపడం జరుగుతోంది. ఇందుకోసం పార్లమెంటు ద్వారా ఫ్రీ కనె్సప్షన్ అండ్ ఫ్రీ నాటల్ డయాగ్నిస్టిక్ టెక్నిక్స్ యాక్ట్, 1994 రూపొందించుకున్నాం. తద్వారా సమాజంలో స్ర్తి పురుషుల నిష్పత్తిలో వస్తున్న తగ్గుదలను అరికట్టడం జరుగుతోంది.
ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య భద్రతా కార్యక్రమాల నుంచి మహిళలు భారీ సంఖ్యలో లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు సమాజానికి ఆరోగ్య రంగ సేవలందిస్తున్న సిబ్బందిలో కూడా మహిళల సంఖ్యే అధికం.
ముందునుండి ఆరోగ్య సేవలందిస్తున్న వారిలో ఆయాలు (అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టులు), ఏ.ఎన్.ఎం.లు (యాగ్జిలరీ నర్స్ మిడ్ వైవ్స్), స్ట్ఫా నర్సులు, మహిళా వైద్యులున్నారు. వీరు మన ఆరోగ్య భద్రతా వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్నారు. ఇతర మంత్రిత్వశాఖల నుంచి అమలుచేస్తున్న సేవల విషయంలో కూడా ఇది వాస్తవ రూపం దాల్చింది. ఉదాహరణకు తీసుకుంటే అంగన్‌వాడీ కార్యకర్తలు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే సేవలకు వెనె్నముకగా నిలుస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, పథకాల కారణంగా మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. వారి సాధికారత మరింత బలోపేతమైంది.
-డాక్టర్ హర్షవర్ధన్
ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ