మెయిన్ ఫీచర్

ఓ మహిళా మేలుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తికి విద్య అవసరమేనా..? ఇలాంటి ప్రశ్నలకీ, చర్చలకీ కాలం చెల్లి చాన్నాళ్లయ్యింది. స్ర్తి ఉద్యోగాలు చేయాలా వద్దా? ఈ రకమైన ప్రస్తావనలకి సైతం ఇపుడు తావు లేదు. ‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్న నానుడి పాతబడిపోయింది. ఇవాళ్టి మహిళ జీవితంలో ఉద్యోగం ఒక భాగమైంది. ఉద్యోగం చేయటం స్ర్తిల లక్షణం, లక్ష్యంగా మారింది. కానీ ప్రేమ వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా? అన్న చర్చలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇలా పెళ్లి దగ్గరికి రాగానే స్ర్తి స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారాలకి అవరోధాలు ఏర్పడుతున్నాయి. చదువు, ఉద్యోగం విషయంలో అమ్మాయి స్వేచ్ఛని మన్నించే తల్లిదండ్రులు, పెళ్లి విషయానికి వచ్చేసరికి తమ మాటనే నెగ్గాలన్న రీతిన ఇంకా కొందరు వ్యవహరిస్తూనే వున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం వున్నా తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిన మలచుకోగలిగే స్థానంలో స్ర్తి ఇంకా నిలబడలేదనే చెప్పాలి. స్ర్తిల జీవితంలో అతి పెద్ద మలుపు పెళ్లి. ఇలాంటి కీలక విషయంలో స్వయం నిర్ణయాధికారం లేకపోవడం స్ర్తిల స్వేచ్ఛకి పెద్ద అవరోధం. ఈ పరిస్థితి ఎందుకు వుంది అవలోకిస్తే కనిపించే కారణం అనేకం. ఈ కాలం ఆడవాళ్ళ జీవితంలో చదువులు, ఉద్యోగాలు అనివార్యమై కుటుంబం, ఆర్థిక భారం పంచుకోవడంలో ఒక భాగమైంది. స్ర్తి జీవితంలో ఇది పెద్ద ముందడుగు. కానీ వివాహం విషయానికి వస్తే మాత్రం ఇంకా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంటూ ఈ తరం యువతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాము నిర్ణయం తీసుకొంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే దాన్ని సమాజంలో ఇంకా కొంతమంది తప్పుపడుతూనే ఉంది. ఇవాళ సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకొని ఉద్యోగాలు చేసే అమ్మాయిలు సైతం పెళ్లి దగ్గరికి వచ్చేసరికి స్వయం నిర్ణయాలకన్నా పెద్దల మాటకే చాలా మంది కట్టుబడుతున్నారు. ధైర్యం చేసి వారి నిర్ణయాలను పెద్దలకు, తల్లిదండ్రులకు చెప్పే సాహసం చేయలేకపోతున్నారు చాలామంది యువతులు. కారణం తాము పెరిగిన కుటుంబ నేపథ్యం. కులం, ఆచారాలు, సంప్రదాయాలు స్ర్తిలని వెనక్కులాగుతున్నాయి. చదువులో, కెరీర్‌లో అత్యున్నత ప్రతిభను కనబరచిన అమ్మాయి పెళ్లి విషయానికి వచ్చేసరికి తన మనస్సులోని అభిప్రాయాలను స్వేచ్ఛగా పెద్దల ముందుంచలేకపోతున్నారు. అంతే ఏదో ఒక లోపం తనలో వుంటుందనే ఆలోచన వారిలో రేకెత్తిస్తుంది. బాగా చదువుకున్న అమ్మాయిలు, మంచి ఉద్యోగం చేసేవారు డాక్టర్లయినా, సాఫ్ట్‌వేర్ నిపుణులైనా పెళ్లి విషయంలో అమ్మా నాన్నల నిర్ణయాలమీదనే ఆధారపడుతున్నారు. కొనే్నళ్ళుగా స్ర్తివాద భావజాలం, మహిళా ఉద్యమాల ప్రభావం స్ర్తిలకి సంబంధించిన ఎన్నో అంశాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ తరం స్ర్తిలు అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అయితే జీవితంలో అతి పెద్ద మలుపైన వివాహ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రేమను, భావాలను, నిర్ణయాలను ధైర్యంగా బయటకు వ్యక్తం చేయలేకపోతున్నారు.
ఒకవేళ వ్యక్తం చేసినా కొందరు తల్లిదండ్రులు స్వాగతించలేకపోతున్నారు. దీనికి కులం, మతం, కట్టుబాట్లు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలని అంటారు. అలాగే మనిషికి ఉన్నది జీవితం ఒక్కటే కనుక, ఆ జీవితాన్ని అభివృద్ధి చెందిన ఒక ఆధునిక కాలంలో కట్టుబాట్ల పేరిట నరకం చేసుకోవడంలో అర్థం కనిపించదు. ‘స్వేచ్ఛ’ అనేది ఒకరిస్తే తీసుకునేది కాదు. కుటుంబ సభ్యులకోసమో, సమాజం కోసమో కాకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొనే విధంగా స్వేచ్ఛ వుండాలి. ఆ స్వేచ్ఛను కూడా పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాలి. పెద్దలు కుదిర్చిన సంబంధమైనా, ప్రేమ పెళ్లయినా.. ఏదైనా సరే మనసులు కలవాలి. మనుగడ అందంగా, ఆనందంగా సాగాలి. ఇప్పటి యాంత్రిక జీవితానికి ఆనందంగా గడిపే సమయం కూడా చాలా తక్కువే. వున్న సమయాన్ని ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం మధ్య హాయిగా జీవితాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా సుఖ సంతోషంతో గడపాలి. జీవితాన్ని నందనవనంగా తీర్చిదిద్దుకోవాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యం? తన మనసుకు నచ్చిన, మెచ్చిన రీతిలో స్వేచ్ఛగా వ్యవహరించే ఆత్మస్థైర్యం స్ర్తికి ఉన్నపుడే మనుగడ వుంటుంది.
అందుకో ఓ మహిళా మేలుకో! ఓ అడుగు ముందుకేయ్!! ‘స్వేచ్ఛ’ను సొంతం చేసుకో..

- కంచర్ల సుబ్బానాయుడు