మెయిన్ ఫీచర్

విజ్ఞాన శాస్త్రంలో స్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం
*
దేశం అభివృద్ధి రంగంలోకి దూసుకుపోవడానికి మూలకారణం మానవుడు సాధించిన విజ్ఞానశాస్తమ్రే. మానవుడి బుద్ధివికాసానికి విజ్ఞానశాస్త్రం ఒక గుర్తుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కొండ గుహలో నివసించే ఆదిమానవుడు తన బుద్ధి విశేషం చేత, జ్ఞానం చేత ప్రకృతిని వశం చేసుకుని సర్వసౌకర్యాలతో సుందర భవనాల్లో నివశిస్తున్నాడు. సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదు. మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించుటకు సైన్స్ ఒక పునాది. విజ్ఞాన శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, వృక్షశాస్త్రం మున్నగు అనేక శాఖలతో కూడినది. ఇందులో సాధించిన ప్రగతి అపారమైనది.
భారతీయ భౌతిక శాస్తవ్రేత్త సర్ సి.వి.రామన్ 1928 ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ను కనిపెట్టారు. ఉత్కృష్ట భారతీయ వెలుగులు ప్రపంచంలో నలుదిశలకూ వ్యాపించిన ఆ తేదీనే ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. 1930లో ఈ ఆవిష్కరణకుగాను రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్‌సిఎస్‌టిసి) 1987 ఫిబ్రవరి 28న మొదటిసారి ‘నేషనల్ సైన్స్ డే’ని ప్రకటించి జరిపారు. ఆనాటినుండి ప్రతి సంవత్సరం ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం పాటించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఎన్‌సిఎస్‌టిసి ప్రాధాన్యతాంశాన్ని ప్రకటిస్తారు. సంవత్సరమంతా ఆ విషయమై చర్చ జరపడం, జన బాహుళ్యానికి ఆ విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా చేరవేస్తారు. 2016లో దేశీయాభివృద్ధికి శాస్ర్తియ ప్రాతిపదికలు, 2017లో దివ్యాంగులకు శాస్ర్తియ సాంకేతిక తోడ్పాటు, 2018లో సుస్థిర భవిష్యత్తుకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 2019లో ‘విజ్ఞానం కోసం ప్రజలు, ప్రజల కోసం విజ్ఞానం’ అనే ఇతివృత్తం ఆధారంగా సైన్స్ దినోత్సవం జరుపుకున్నాం. ఈ సంవత్సరం 2020 విషయం ‘విజ్ఞానశాస్త్రంలో స్ర్తి’ (విమెన్ ఇన్ సైన్స్) అన్నది ప్రధానాంశం. బహుశః స్ర్తిలకు సాధికారిత ఇచ్చే దిశలో భాగంగా ఇది ప్రధానాంశమై ఉండవచ్చు. భూమిమీద మొట్టమొదటి శాస్తవ్రేత్త స్ర్తియేనని సామాజిక శాస్తవ్రేత్తలందరి నిశ్చితాభిప్రాయం. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సాంకేతికతే సరిపోదు. శాస్త్ర రంగంలో కూడా పరిశోధనలు జరగాలి. గత 90 సంవత్సరాలలో భారతదేశంలో సర్ సి.వి.రామన్ పరిశోధనలు మినహాయిస్తే నోబెల్ బహుమతి స్థాయి పరిశోధనలు జరగలేదని శాస్తవ్రేత్తల అభిప్రాయం. కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా లేదనేది అందరూ అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో కూడా తొలితరానికి చెందిన మహిళా శాస్తవ్రేత్తల గురించి తెల్సుకోవాల్సిన అవసరమెంతైనా వుంది. ఇపుడిపుడే మహిళల భాగస్వామ్యం కొంత పుంజుకుంటున్నప్పటికీ ఇంకనూ పెరగాల్సిన అవసరం ఎంతో వుంది. ఆ సందర్భంగా తొలి తరం మహిళలను స్ఫూర్తిగా తీసుకొని ఈ శతాబ్దం మహిళలు / స్ర్తిలు ఇంకనూ సైన్స్ రంగంలో పురోగమించాల్సిన అవసరమెంతైనా వుంది.
తొలి తరం శాస్తవ్రేత్తలు
మేడం క్యూరీ దంపతులకు 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. 1911లో మేరీ క్యూరీకి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. మన దేశానికి వస్తే జానకి అమ్మల్, ఆనందీబాయి జోషి, అసిమా ఛటర్జీ, అన్నామణి, కమలా సోహాని, రూపాబాయి ఫర్దూన్జీ లాంటి వారు ఎందరో విజ్ఞాన శాస్తవ్రేత్తలు వారి వారి రంగాల్లో తమ ప్రతిభను చాటారు. వృక్షశాస్త్రంలో చిరస్మరణీయమైన పరిశోధనలు సాగించిన జానకి అమ్మాళ్ అమెరికానుంచి వృక్షశాస్త్రంలో పిహెచ్‌డి పొందిన తొలి మహిళగా పేరు పొందింది. వృక్ష జాతులకు చెందిన 21,500 నమూనాలపై పరిశోధనలు సాగించారు. ఆమె పరిశోధనలు జన్యుశాస్త్రానికి ఇతోథికంగా తోడ్పడ్డాయి. 1977లో భారత ప్రభుత్వ పద్మశ్రీతో సత్కరించింది. దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్తవ్రేత్తగా పేరొందిన అన్నామణి, సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావంపై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతయ స్థాయిలో మన్ననలు దక్కాయి.
వైద్యరంగంలో పట్టు సాధించిన తొలి భారతీయురాలు ఆనంద్‌బాయి జోషిని ఆదర్శంగా తీసుకోవాలి. బ్రిటీష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమెను 1975లో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ప్రపంచంలో తొలి మహిళా అనెస్థటిస్టుగా పేరు ప్రఖ్యాతి గాంచిన రూపాబాయి ఫర్దూన్జీ లాంటి శాస్తవ్రేత్తలు ఈనాటి స్ర్తిలు ఆదర్శంగా తీసుకుని విజ్ఞాన శాస్త్రంలో ఇంకనూ అనేక ఆవిష్కరణలకు ప్రయత్నించాలి. అపుడే భారతదేశం పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి. అందుకు ఈ సైన్స్ దినోత్సవం రోజున ప్రతినబూనాలి.
మానవ సంక్షేమం కోసం సైన్స్ పరిశోధనలు చేపట్టేలా విద్యార్థులను ప్రేరేపించడం సైన్స్ దినోత్సవ లక్ష్యం. యువతను శాస్త్ర రంగంవైపు ఆకర్షించే భాగంగానే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, ఇస్రో వారు పాఠశాల విద్యార్థులకోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమే. పాఠశాల విద్యార్థులకోసం ‘ఇన్‌స్పైర్’ (ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ ఫర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్) ద్వారా విద్యార్థులలో ఉండే సృజనాత్మక శక్తి తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే నేషనల్ టాలెంట్ సెర్చ్, మ్యాథమాటికల్ ఒలిపింయాడ్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి స్కాలర్‌షిప్స్ ద్వారా వారిని ప్రోత్సహించడం జరుగుతున్నాయి. నేడు భారతదేశం అణు, అంతరిక్ష పరిజ్ఞానాల్లో అగ్ర దేశాల సరసన చేరింది. ఇస్రో, డిఆర్‌డిఓ వంటి సంస్థలు శాస్త్ర సాంకేతిక రంగంలో వినూత్న ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు ప్రాథమిక తరగతులనుంచే విశే్లషణాత్మక ఆలోచనా విధానం అలవరచాలి. రోబోటిక్స్, డేటా సైన్స్, కృత్రిమ మేధ, జన్యు వైద్యం, ఇతర గ్రహాలకు యాత్రలు ఊపందుకుంటున్న తరుణంలో, వాటిలో రాణించేలా మన విద్యార్థులను ముఖ్యంగా స్ర్తిలను కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది- మరియు జాతి కర్తవ్యం కూడా.
సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అది సైన్స్‌తో సంబంధం కలుపుకోవాల్సిందే. సైన్స్ లేనిదే ఏదీ లేదు. జర్మనీకి చెందిన రుడాల్ఫ్ డీజిల్ కనుకొన్న తర్వాత రైల్వేల్లో బొగ్గు రైలింజన్ స్థానంలో డీజిల్, విద్యుత్, అయస్కాంత రైలు ఆవిష్కరించబడ్డాయి. రైట్ బ్రదర్స్ కృషి కారణంగా విమానాల నుండి అత్యంత వేగంగా ప్రయాణించే రాకెట్లు ఆవిష్కరించబడ్డాయి. ఉపగ్రహాలు తయారుచేసుకుని ఏమూల ఏమి జరిగిన క్షణంలో కంటిముందు మనకు ప్రసారాల మాధ్యమాలు కల్పించాయి. వైద్యరంగంలో గుండె మార్పిడి, నేత్ర మార్పిడులు, ప్రాణాంతక రోగాలైన కాన్సర్‌ను నివారించుటకు ఎనె్నన్నో మందులు అందుబాటు లోకి వచ్చాయి. మన దేశం కూడా అగ్రరాజ్యాలకు ధీటుగా విజ్ఞాన శాస్త్రంలో దూసుకుపోతోంది. దీనికి కారణం మన శాస్తవ్రేత్తలే. ‘సముద్రం నీలం రంగులో కనబడటానికి కారణం సూర్యకాంతి కిరణాలు సముద్రం మీద పడటమే’నని ప్రపంచానికి తెలియజేసిన రోజైన ఫిబ్రవరి 28న సి.వి. రామన్‌ను స్మరించుకుందాం. ఆయన బాటలో పయనించి వివిధ నూతన ఆవిష్కరణలు కనుగొందాం. ఉయ్యాలలూపే చేతులే కాదు అవకాశమిస్తే విజ్ఞానరంగంలో కూడా తమ నైపుణ్యాన్ని స్ర్తిలు ప్రదర్శిస్తారని ఆశిద్దాం..

- కె. రామ్మోహన్‌రావు