మెయన్ ఫీచర్

సమానవాటా మహిళలకు దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థతో విరాజిల్లుతున్న భారత్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో మహిళలు క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో మహిళలంటే కేవలం ఓటింగ్‌కు మాత్రమే పరిమితం. అక్కడక్కడా కొన్ని స్థానాల్లో సంపన్న వర్గాలకు చెందిన మహిళలకు ఆయా పార్టీలు టిక్కెట్లు ఇచ్చేవి. కాలానుగుణంగా భారతీయ సమాజంలో వచ్చిన మార్పులను విశే్లషిస్తే చట్టసభల్లో గతంతో పోల్చుకుంటే మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం మహిళల ప్రాతినిధ్యం తక్కువేనని నిస్సందేహంగా చెప్పవచ్చును. ఇటీవల పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికలను చూస్తే పోలింగ్ రోజు పురుషులతో సమానంగా మహిళలు క్యూల్లో బారులుతీరి నిలబడి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఓటు వేస్తున్నారు. ప్రజాస్వామ్య వికాసానికి ఇది మంచి తార్కాణం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 70 సీట్లలో 62 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ సెంటర్లకు వచ్చారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ ఎన్నికల్లో 62.55 శాతం మంది మహిళలు ఓట్లు వేశారు.
ఢిలీలో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాథమిక అవసరాలైన తాగునీరు, ఆరోగ్యం, విద్యకు మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయాల గురించి ఎక్కువగా ఆలోచించే పురుషులకంటే మహిళలు, దైనందిన జీవితంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే పార్టీకి ఓటు వేస్తారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయి. ఈ ఎన్నికల్లో మహిళలు పౌరసత్వ సవరణ చట్టం, షాహిన్ బాగ్‌లో మహిళల ఆందోళన అంశాలను పట్టించుకోలేదు. నరేంద్రమోదీ నిజ జీవితం లో నిరాడంబరత, మాట్లాడే తీరు, ప్రాధాన్యత అంశాల ప్రభావం మహిళలపై సానుకూల ప్రభావం చూపించింది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా మహిళలకు సిలిండర్ల పంపిణీ జరుగుతోంది. స్వచ్ఛ్ భారత్‌లో మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణానికి బీజేపీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కారణాల వల్ల బీజేపీ గెలిచి ఉండకపోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా ఓటర్లపైన ప్రధాని నరేంద్రమోదీ ప్రభావం పాజిటివ్‌గా ఉందని ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది. మహిళలు అణచివేత రాజకీయాలను భరించరు. అలాగే ఎన్నికల్లో దూషణలకు, అభాండాలకు దిగే రాజకీయ నేతలను మహిళలు సహించరు. ఇదే విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్థానిక సమస్యలు ప్రాధాన్యత వహిస్తాయని, అదేకోణంలో మహిళలు, మధ్యతరగతి ప్రజలు చూస్తారన్నారు. గోలీ మారో, ఇండో, పాక్ క్రికెట్ మ్యాచ్‌లపై పార్టీ నేతలు మాట్లాడి వలసి ఉండింది కాదని ఆయన పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 2019 ఎన్నికల్లో విశేషంగా పెరిగింది. దీనికి బీజేపీ ప్రభుత్వమే కారణమని చెప్పాలి. పాలనా విధానాలు, సిద్ధాంతాల విషయాలను పక్కనపెడితే, మహిళలు నాయకుడిలో విశిష్ట వ్యక్తిత్వం, వినమ్రత, దేశభక్తి, వ్యక్తిగత అలవాట్లు, వివాదాలు లేని వ్యక్తిత్వాన్ని చూస్తారు. దివంగత కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలాసీతారామన్, ఉమాభారతి, వసుంధరరాజేలాంటి ఫైర్ బ్రాండ్లను బీజేపీ అందించింది. భోపాల్‌లో ప్రజ్ఞ్ఠాకూర్ అనే మహిళపై జాతీయ వాద హిందుత్వ వాది అని, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అభియోగాలు న్నాయి. దిగ్విజయ్ సింగ్ అనే రాజకీయ కాంగ్రెస్ దిగ్గజం ఆమెపై పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. గాడ్సేను సమర్థించిన మహిళ అని మీడియా పదే పదే దృశ్యాలను ప్రసారం చేసింది. కానీ భోపాల్ మహిళలు ప్రజ్ఞ్ఠాకూర్‌ను గెలిపించారు. ఆమె వ్యాఖ్యలతో సగటు భారతీయుడు ఏకీభవించడనేది వాస్తవం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 78 మంది మహిళలు, 2014 లో 62 మంది, 2009ఎన్నికల్లో 45 మంది, 2004లో 45 మంది, 1999లో 49 మంది, 1998లో 43 మంది, 1996లో 40 మంది, 1991లో 38 మంది, 1989లో 29 మంది, 1984 లో 43 మంది, 1980లో 28 మంది, 1977లో 19 మంది, 1971లో 21 మంది, 1967లో 29 మంది, 1962లో 31 మంది, 1957లో 22 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, నేషనల్ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాల కంటే ఎక్కువగా బీజేపీ ప్రభుత్వ హయాంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 78 మంది మహిళలు లోక్‌సభలో అడుగుపెట్టారు. మహిళలు పోలింగ్ బూత్‌కు వచ్చి సకాలంలో ఓట్లు వేయరని, ఇంటి పనులకు పరిమితమవుతారని, ఆలస్యంగా పోలింగ్ కేంద్రానికి వస్తారని, రాజకీయాల గురించి అవగాహన ఉండదని, ఎవరిని ఎన్నుకోవాలో తెలియదనే పిచ్చి భ్రమలు, పసలేని వాదనలతో చాలా మంది వితండవాదనలు చేస్తుంటారు. ఇటువంటి వాదనలకు మహిళా లోకం చెక్ పెట్టింది. ఏతావాతా పురుషులతో సమానంగా మహిళలు ఓట్లు వేసే శాతం గణనీయంగా పెరిగింది. మహిళల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి భారతీయ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. 1962 ఎన్నికల్లో పురుషులు 63.3 శాతం, మహిళలు 46.6 శాతం, 1967లో 66.7, 55.5, 1971లో 60.9, 49.1, 1977లో 66, 54.9, 1980లో 62.2, 51.2, 1984లో 68.4, 59.2, 1989లో 66.1, 59.2, 1991లో 61.6, 51.4, 1996లో 62.1, 53.4, 1998లో 66, 58, 1999లో 64, 55.7, 2004లో 61.7,53.4, 2009లో 60.2, 55.8, 2014లో 67.1, 65.6, 2019లో పురుషులు 67.11, మహిళలు 67.7 శాతం ఓట్లు వేశారు.
స్వాతంత్య్రం వచ్చిన 72 ఏళ్లకు తొలిసారిగా పురుషులతో సమానంగా మహిళలు ఓట్లు వేసిన చరిత్ర 2019 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 303 సీట్లు వచ్చాయి. 1962లో మహిళల కంటే పురుషులు 16.7 శాతం ఎక్కువగా ఓట్లు వేశారు. 57 ఏళ్ల తర్వాత పురుషులు, మహిళా ఓటర్ల మధ్య తేడా కేవలం స్వల్పంగా .4 శాతానికి వచ్చేసింది. మహిళా ఓటర్లు దేశం లో నిశబ్దంగా రాజకీయ విప్లవాన్ని సృష్టిస్తున్నారు. నేతల తలరాతలను మారుస్తున్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లు పార్లమెంటులో కొన్ని రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి వల్ల అటకెక్కించారు. దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే వచ్చే నాలుగేళ్లలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిం చే బిల్లుకు మోక్షం కలగవచ్చు. 2026 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. పైగా 2021 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాలను పెంచే అవకాశం ఉంది. పార్లమెంటులో రాజ్యసభ, లోక్‌సభతోపాటు, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో సీట్లు పెంచి, 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే తప్పనిసరిగా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. 1966 నుంచి 1977, 1977-1984 వరకు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రధానిగా మంచి పాలన అందించినా సహజనాయకత్వ లక్షణాలకు తోడు కుటుంబ నేపథ్యం వల్ల అత్యున్నత పదవి వరించింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాలుగు దశాబ్దాల పాటు 1980 ఎన్నికల వరకు దాదాపు పురుష ఓటర్లు, మహిళా ఓటర్లకు మధ్య వ్యత్యాసం 11 శాతం వరకు ఉండేది. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి పురుష ఓటర్లకు ఉండేది. గత మూడు దశాబ్దాల్లో వచ్చిన మార్పును చూస్తే మహిళా ఓటర్లు దేశ, రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. చైతన్య రాజకీయాలకు, మహిళల సాధికారతకు నిలయమైన కేరళ రాష్ట్రంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 78.8 శాతం మంది మహిళలు ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో పురుషుల ఓటింగ్ 76.47 శాతం నమోదైంది. బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓట్లు వేశారు. ప్రముఖ విశే్లషకురాలు షామికా రవి ఉమెన్ ఇన్ పొలిటిక్స్ పరిశోధనా పత్రంలో ఆసక్తికరమైన అంశాలను పేర్కొన్నారు. ‘్భరతీయ సమాజంలో మహిళల్లో రాజకీయ అధికార నాయకత్వాన్ని పెంపొందించడంలో రాజకీయపార్టీలు విఫలమయ్యాయని’ పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలనలో 1920లో అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వంలో భూమి ఉన్న మహిళలకే ఓటు హక్కును కల్పించారు. 1950 వచ్చేసరికి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కును కల్పించారు. దేశంలో 279 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఏదో ఒక ఎన్నికలో మహిళను ఎన్నుకున్నారు. 264 లోక్‌సభ నియోజకవర్గాల్లో 1962 నుంచి 2019 వరకు విశే్లషిస్తే, ఒక్క ఎన్నికల్లో కూడా మహిళలను లోక్‌సభకు ఎన్నుకోలేదు. 1962 నుంచి 2019 వరకు మొత్తం 617 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ చట్టసభల్లో 21శాతం మంది మహిళలు, అమెరికా చట్టసభల్లో 32 శాతం మంది మహిళలు ఉన్నారు. భారత్ లోక్‌సభలో ప్రస్తుతం 14.3 శాతం మందితో 78 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతవరకు 48.4 శాతం వరకు అంటే 264 నియోజకవర్గాల్లో ఓటర్లు ఒక్కసారి కూడా మహిళలను ఎన్నుకోలేదు. 1957 నుంచి 2019 వరకు చూస్తే ఐదు శాతం నుంచి 14.3 శాతానికి పెరిగినా.. ఇది తక్కువే. రాజకీయాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలన్న లక్ష్యం తో పార్టీలు ముందడుగు వేయాలి. రిజర్వేషన్లు లేకపోయినా టిక్కెట్లు ఇచ్చే కొత్త ప్రజాస్వామ్యఒపంథాకు శ్రీకారం చుట్టాలి. పురుషాధిపత్యానికి కేంద్రమైన మన సమాజంలో స్ర్తీకి అధికారాన్ని ఇచ్చేందుకు ఇష్టపడరు. అధికారం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. అధికారాన్ని గుంజుకుని రాజకీయాధికారంపై పట్టు సాధించే స్థాయికి భారతీయ మహిళలు ఎదగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వికసిస్తుంది.

- కె. విజయశైలేంద్ర, 9849998097