మెయిన్ ఫీచర్

పరాకు హానికరము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
‘‘అసక్తబుద్ధి స్సర్వత్ర జితాత్మా విగతస్పృహః
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి॥
(విషయాసక్తి లేనివాడు, అంతఃకరణమును జయించినవాడు, కోరికలు లేనివాడు, స్పృహ రహితుడు, జ్ఞానమార్గము ద్వారా నైష్కర్మ్య సిద్ధిని పొందునని స్మృతి బోధిస్తున్నది -్భ.గీ.18-49). క్రియాశూన్యమే నైష్కర్మ్యసిద్ధి. పరమాత్మ నిష్క్రియి. అందువలన, సంగరహితుడై ఆత్మానందము పొందేవాడు జీవన్ముక్తుడని స్పష్టము చేయబడుతున్నది.
319
సద్వాసనాస్ఫూర్తి విజృంభణే సతి
హ్యసౌ విలీనా త్వహమాదివాసనా
అతిప్రకృష్టా ప్యరుణ ప్రభాయాం
విలీయతే సాధు యథా తమిస్రా॥
చిద్రూపము, సద్రూపమైన పరమాత్మకు తాను అభిన్నమనే బ్రహ్మాత్మభావన, సుస్థిరముగా బుద్ధిగుహలో వృద్ధిచెందుచుండగా, అహంకారాది దేహేంద్రియ వాసనలు ఎంత బలీయమైనవైనా నశించును. అరుణ కిరణముల ప్రసరణతో అంధకారచ్ఛాయలు తొలిగిపోయినట్లు, సుదృఢ బ్రహ్మాత్మభావనతో జ్ఞానసాధన చేసిన, దేహపరమైన అహంకారాది సమస్త వికారములు నశించి, ప్రత్యగాత్మ మిక్కిలి తేజోవంతమై, అంతర్బాహ్య విభేదము లేక దేహమంతటినీ ప్రకాశవంతము చేయును.
320
తమ స్తమఃకార్యమనర్థజాలం
న దృశ్యతే సత్యుదితే దినేశే
తథా‚ ద్వయానన్దరసానుభూతూ
నైవాస్తి బన్ధో న చ దుఃఖగన్భః॥
అంధకారములో పలు అనర్థములను, జాగరూకతతో ఉన్ననూ, ఎదుర్కొనవలసి వచ్చును. సూర్యోదయముతో భానుని కిరణములు నలుదిశలా విస్తరిస్తుండగా, సమస్తము ప్రకాశవంతమై చీకటిలో ఎదురయే పలు కష్టములు అంతమైపోవును. అదేవిధముగా, సచ్చిదానంద ఏక రహస్య రూపమైన ఆత్మానుభూతి పొందిన అనంతరము, దుఃఖమునకు హేతువులైన వాసనలు పటాపంచలై, సంసారబంధము వీడిపోవును. బ్రహ్మైక్యత నిరవధిక (ఆత్యంతిక) సుఖమును ప్రసాదించును.
321
దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్ స్వయం
సన్మాత్రమానన్దఘనం విభావయన్‌
సమాహితస్సన్ బహిరన్తరం వా
కాలం నయేథా స్సతి కర్మబనే్ధ॥
నామరూపములతో దృశ్యవౌతున్న కార్యప్రపంచమును ఆత్మలో విలీనముచేసి, సచ్చిదానంద ఘన స్వరూపమైన పరమాత్మ స్వస్వరూపమే నేను అనే భావనతో సదా ఉండుము. కర్మబంధమువలన శరీరము ఉన్నంతవరకు అనుక్షణము ఏకాగ్రతతో బ్రహ్మమందే నీ మనస్సును లగ్నముచేసి కాలమును గడుపుము.
సమస్త బాహ్యపదార్థములు కార్యరూపములు, నశ్వరములు అట్లే దేహములోనున్న ఇంద్రియాదులు, పంచప్రాణములు, మనోబుద్ధ్యహంకారములు, చిత్తము ఏవియూ శాశ్వతముకావు. బ్రహ్మమొక్కటే సత్పదార్థము. అందుచేత, అంతర్బాహ్య విషయముల పైకి నీ మనస్సును పోనీయక, అనుక్షణము బ్రహ్మనిష్ఠతో కాలము గడుపుము. బ్రహ్మత్వసిద్ధినిపొంది భవబంధమును అధిగమించుము.
322
ప్రమాదో బ్రహ్మనిష్ఠాయాం న కర్తవ్యః కదాచన
ప్రమాదో మృత్యు రిత్యాహ భగవాన్ బ్రహ్మణః సుతః॥
మహాభారతములోని ప్రసిద్ధ సనత్సుజాత సంవాదము ఇచ్చట ఉల్లేఖించబడినది. దృతరాష్ట్రునికు, చతుర్ముఖ బ్రహ్మ మానస పుత్రుడైన సనత్కుమారునకు జరిగిన ఈ సంవాదములో సనత్కుమారుడు ‘‘ప్రమాదం వై మృత్యు మహం బ్రవీమి’’అని వ్యక్తంచేస్తాడు (ఓ రాజా! పరాకుతనము నిశ్చయముగా మృత్యువే -మ.్భ.ఉద్యోగపర్వము 40-45).
మనస్సు బహుచంచలమైనది. పరాకుగా ఉన్నప్పుడు, స్వల్ప సమయము వేరొక ఆలోచన మనస్సులో మెదలినా, అది బ్రహ్మనిష్ఠకు అత్యంత హానికరమని బోధించుటకు ఈ సంవాదము ఉదహరించబడినది.
ఇంకా ఉంది