మెయిన్ ఫీచర్

లావుగా ఉంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి అమ్మాయిలు.. ఎంత సన్నగా ఉంటే అంత అందంగా ఉన్నట్లు భావిస్తుంటారు. జీరో సైజుతో ఉంటే చాలు.. మాకంటే అందగత్తెలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని అనుకుంటూ ఆనందపడుతుంటారు. వీరు ఏ కొంచెం బరువు పెరిగినట్లు అనిపించినా విపరీతంగా ఆందోళన పడుతుంటారు. వ్యాయామాలు, జిమ్, డైటింగ్, జాగింగ్, రన్నింగ్.. అంటూ నానా హైరానా చేస్తుంటారు. ఇక తినే ప్రతి గ్రాముకీ కొలతలు వేసుకుంటూ ఉంటారు.. అలాగే తాగే నీళ్లకు కూడా కొలతలు వేసుకుంటూ తాగుతారు. మన భారతదేశంలో ఇలా ఉంటే.. ఒక దేశంలో అమ్మాయిలు మాత్రం లావుగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటారట.. అక్కడ పెళ్లి కావాలన్నా బొద్దుగా ఉండాల్సిందేనట.. అంతేకాదు.. అక్కడ లావు కావడానికి ప్రత్యేకమైన సెంటర్లు కూడా ఉన్నాయట.. మరి చూసేద్దామా.. అది ఏ దేశమో.. అక్కడి విశేషాలేంటో..
ఆ దేశం పేరు మారేటేనియా.. అక్కడ అమ్మాయిలు లావుగా ఉంటేనే వారు అందంగా ఉన్నట్లుగా భావిస్తారట. అంతేకాదు.. అక్కడి అబ్బాయిలు కూడా లావుగా ఉన్న అమ్మాయిలను మాత్రమే వివాహం చేసుకుంటారట.. సన్నగా ఉన్నవారిని పెళ్లి చేసుకోరు. ఆ దేశంలో అమ్మాయిలు లావుగా ఉన్నారు అంటే వారు చాలా అందంగా ఉన్నారని అర్థం. ఎవరైనా సన్నగా, జీరోసైజ్‌లో ఉంటే వారిని అసహ్యంగా చూస్తారు. అందుకే అమ్మాయిలందరూ తమని లావుగా చేసే సెంటర్లలోకి చేరిపోతుంటారు. ఇక్కడ డైటింగ్ సెంటర్లు ఎలాగో.. అక్కడ లావు చేసే సెంటర్లు అన్నమాట. ఇలాంటి వాటికి అక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ కొందరు ఇష్టంగా చేరితే.. మరికొందరు బలవంతంగా చేరతారు. లావు చేసే సెంటర్లలో చేరిన వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా తినడం, పడుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప ఆ సెంటర్‌లో మరేమీ చేయకూడదు. మరి అక్కడ దినచర్య ఎలా ఉంటుందో.. లావుగా కావాలనుకున్న అమ్మాయిలకు ఎలాంటి డైట్ ఇస్తారో ఒకసారి చూద్దాం..
* ఉదయం నాలుగున్నరకి నిద్రలేవాలి. లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకుని ఒక లీటరు చిక్కటి ఒంటె పాలు తాగాలి. దీనితో వారి దినచర్య మొదలవుతుంది.
* తరువాత బ్రేక్‌ఫాస్ట్‌లో మేకపాలు, జంతువుల కొవ్వుతో పాటు ఖర్జూరాలు, పల్లీలు, గసగసాలు, నూనె కలిసి చేసిన ముద్దలు తినాలి. వీటితో పాటు వరి, గోధుమ, బార్లీ.. మొదలైన ధాన్యాల రవ్వతో చేసిన జావలాంటి ‘గ్రూయల్’ అనే పదార్థాన్ని తాగాలి.
* ఈ గ్రూయల్ అనే పదార్థాన్ని రోజులో నాలుగు సార్లు తాగాలి. పైన చెప్పినవన్నీ రోజంతా తింటూనే ఉండాలి.
* ఇలా రోజుకు ఒక్కొక్కరికి 16000 కేలరీల ఆహారాన్ని అందిస్తారు. అంటే మామూలుగా ఇది మనం రోజూ తీసుకునే ఆహారం కన్నా పదింతలు ఎక్కువ అన్నమాట.
* ఉపేక్షించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎవరైనా తినకుండా మొండికేస్తే కాళ్లపై కొట్టడం, రెండు కర్రల మధ్య కాళ్లని పెట్టి గట్టిగా ప్రెస్ చేయడం వంటివి చేస్తారు.
* ఇలా తినిపించి ఒక్కో అమ్మాయి కనీసం 140 కేజీల బరువు తూగిన తరువాత ఇంటికి పంపిస్తారు.
ఇలా ఎందుకు చేస్తారు? అంటే.. మారటేనియా అంటే అత్యంత వెనుకబడిన ఎడారి దేశం.. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఎవరి భార్య ఎక్కువ లావుంటే అతడే అత్యంత ధనవంతుడని అనుకునేవారట. అలా కొంతకాలానికి అమ్మాయిలు లావుగా ఉంటేనే అందంగా కనబడతారని, అందరూ ఇష్టపడతారని, వారిని ధనవంతులుగా భావిస్తారన్న ఫీలింగ్ ఆ తెగలో బలంగా నాటుకుపోయిందట. అందుకని అమ్మాయిలను బలవంతంగానైనా సరే.. లావు చేయాలన్న దృక్పథంలోనే వాళ్లుండి పోయారు. అందుకే ఇలాంటి పద్ధతులను మొదలుపెట్టారు. అయితే ఈ పద్ధతిని కొందరు
అమ్మాయిలు వ్యతిరేకిస్తుంటే మరికొందరేమో అబ్బాయిలు లావు ఉంటేనే ఇష్టపడుతున్నారన్న కారణంతో బరువు పెరగాలనుకుంటున్నారు. లావు ఉంటేనే అందం అనుకునే అక్కడి తెగలో ఇప్పుడే కొద్దికొద్దిగా మార్పు మొదలవుతోంది. అమ్మాయిలు బరువు పెరగడానికి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలు కూడా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని సన్నగా ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అయినా నేటికీ కొంతమంది ఈ పద్ధతులనే పాటిస్తున్నారు. వారిలో కూడా మార్పు రావాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) చేపట్టిన ఒక సర్వే ప్రకారం అక్కడి మహిళల్లో ఇరవై శాతం మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారట. ఇది ఇలాగే జరిగితే చాలా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, దీనితో ప్రాణహాని ఉందని చాలామంది వాపోతున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే మాట చెబుతోంది. అక్కడి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాలే కాక అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి.
*