మెయిన్ ఫీచర్

వౌనంతో ఆత్మానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
నిర్వికల్ప స్థితిలో పూర్ణ స్వరూపముతో పరబ్రహ్మమందే మనస్సును లగ్నము చేసి క్రియారహితుడవై వౌనముగా ఆత్యంతానందానుభూతిని పొందుము.
భగవద్గీతలోనూ ఈ బోధన ఇట్లు చేయబడింది.
‘‘బాస్యాస్పర్శష్వసక్తాత్మా విదంత్యాత్మని యత్సుఖమ్
స బ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖ పక్షయ పశ్నుతే’’
ప్రాపంచిక విషయములందు ఆసక్తిలేని అంతఃకరణ గల సాధకుడు ఆత్మయందు నిశ్చల మనస్సుతో ధ్యానము చేసి, పరబ్రహ్మమందు అభిన్నభావ స్థితుడై క్షయ రహితమైన సుఖమును పొందుతున్నాడు. -్భ.గీ. 5-21)
310
సమూలకృత్తో పి మహానహం పున
ర్వ్యుల్లేఖితః స్యాద్యది చేతసా క్షణమ్
సంజీవ్య విక్షేప శతం కరోతి
నభస్వతా ప్రావృషి వారిదో యథా॥
అహంకారం అతి శక్తివంతమైనది. సమూలంగా విజ్ఞానముచే ఛేదింపబడినప్పటికీ మేల్కొనిన పురుషునిచే పీడకల వలె స్మరింపబడినచో , చంచలమైన చిత్తముచే ప్రేరేపింపబడి, మరల ఉత్పన్నమై వృద్ధిచెందే అవకాశమున్నది. వర్షఋతువు ప్రవేశించగనే వాయువేగముతో మేఘములు కదిలి వర్షించినట్లు అహంకారము అల్ప సమయము మనస్సులో మెదలినా బహువిధములుగా మరల అంకురించి వ్యాపించును.
311
నిగృహ్య శత్రో రహమో పకాశః
క్వచిన్న దేయో విషయానుచిన్తయ1
స ఏవ సంజీవన హేతురస్య
ప్రక్షీణ జంభీరతరోరివాంబు
అహంకారము మరల ఉత్పన్నము కాకుండా ఉండుటకు విషయవాంఛలపై మనస్సును మరల నీయరాదు. గట్టి పట్టుదలతో మనస్సును నియంత్రించుకొనవలెను. లేనిచో, క్షీణించిన నిమ్మచెట్టుకు నీరు లభించగనే చిగురించి వృద్ధి చెందినట్లు అహంకారము మరల విజృంభించి వ్యాపించును.
స్వరూప విస్మృతియే అహంకారము మరల పెరుగుటకు హేతువు. బ్రహ్మాత్మ భావనతో అనునిత్యమూ బ్రహ్మ చింతనలో ఉండే సాధకునినకి ప్రాపంచిక సుఖములపైకి మనస్సు పోదు. కాయక్లేశ భయముతో గానీ, ఐహిక సుఖములందు ఇచ్ఛతో గానీ ఆత్మ చింతన విస్మరించిన అహంభావము పునరుద్భవించును. ఆత్మసాక్షాత్కారము పొందుటకు స్వరూప విస్మరణ కు తావివ్వక ఏకాగ్రతతో అంతర్ముఖుడై ధ్యానము సల్పిన ఆత్మనిష్ఠగల సాధకునకు చిత్త విభ్రాంతి కలుగదు.
312
దేహాత్మనా సంస్థిత ఏవ కామీ
విలక్షణః కామయితా కథం స్యాత్
అతో ర్థ సంధాన పరత్వమేవ
భేద ప్రసక్త్యాభవబన్ధ హేతుః
దేహాత్మ బుద్ధికి భోగలాలస మూలహేతువు. కోరికలతో నిండిన మనస్సు గలవాడే కామీ. కాముకుడు లేక కామ వంతుడు చెప్పవచ్చును. కాముకుడు విషయేంద్రియ సంయోగము వలన కలిగే భోగములపై మో హం పెంచుకునును. ధనకనక వస్తు వాహనాదులందు అత్యంతాసక్తితో పాటు, సంసార బంధ హేతువులైన లోక వాసనాదులందు కూడా అభిలాష కనబరుచును. తద్భిన్నముగా నిరంతరమూ బ్రహ్మాత్మ భావనలో నిమగ్నమైన సాధకుడు సమస్త ఇంద్రియ భోగములను తుచ్ఛములుగా భావించును. వాని మోక్షేచ్ఛ బ్రహ్మతత్పరత కామాదుల పైకి మనస్సును ఎన్నడూ మరల నీయడు
శ్రుతి ఇట్లు ప్రకటిస్తున్నది. ఏవం పశ్యం నే్నవం మన్వాస ఏవం విజ్ఞానన్ ఆత్మ రతి రాత్మక్రీడ ఆత్మ మిథున ఆత్మానందః
స స్వరాద్భవతి ( ఈ ప్రకారము భావన చేయుచు, ఈ విధంగా మనన చేయుచు, ఈ ప్రకారం అపరోక్ష జ్ఞాన నిష్ఠ కలవాడై ఆత్మయందే ఇచ్ఛ గలవాడును, ఆత్మయందే రమించువాడును ఆత్మస్వరూప సుఖానుభవ తృప్తి కలిగి ఉంటుటచే అతడు పరిపూర్ణ బ్రహ్మ స్వరూప సత్తామాత్రముగా నిల్చి ఉండును. ఛా. ఉ.7-25-2ఙ ఎల్లవేళలా ఆత్మ చింతనలో నిమగ్నమైన ముముయువునకు కోరేవాడు, కోరిక, కోరదగినది. అనే త్రివిధ భేదబుద్ధి ఉండును. సమస్తము స్వస్వరూపములోనే విలీనమై పోవును.
313
కార్య ప్రవర్ధ నాద్భీజ ప్రవృద్ధిః పరిదృశ్యతే
కార్య నాక ద్బీజనాశ స్తస్మాత్కార్యం నిరోధయేత్
కార్యము లేనిదే ఫలసిద్ధి లభించదు. విత్తనము లేనిదే చెట్టు లేదు. చెట్లు లేనిదే విత్తనము లేదన్నది లోక ప్రసిద్ధము.
ఇంకా ఉంది