మెయిన్ ఫీచర్

కారణం గుణాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
అతోభిమానం త్యజ మాంసపిణ్డే
పిణ్డ్భామానిన్యపి బుద్ధి కల్పితే
కాలత్రయాబాధ్య మఖణ్ణబోధం
జ్ఞాత్వా స్వమాత్మాన ముపైహి శాన్తిమ్
సమస్త వికారములకు నెలవైన నీ స్థూల శరీరమందూ అహంకారాదులకు నిలయమైన లింగశరీరములో ఉత్పన్నవౌతున్న దేహాత్మ భ్రాంతిని త్యజించవలెను. నీ అంతరాళములో నున్న జీవాత్మ నాశరహితము, త్రికాలాతీతము, మరియు అఖండ జ్ఞాన స్వరూపమని తెలిసికొని పరమశాంతిని ప్రసాదించే బంధ విముక్తిని పొందుము.
298
త్వజాభిమానం కులగోత్ర నామ
రూపాశమ్రే ష్వార్ధ్ర శతాశ్రీతేషు
లింగస్య ధర్మానపి కర్తృతాదీన్
త్యక్త్వా భవాఖన్ణ సుఖస్వరూపః
కుల గోత్ర నామ రూప ఆశ్రమ వ్యవస్థ ఇత్యాదులు స్థూల శరీరమున్నంతవరకు మరణానంతరం తడిసిన శవమునకు వర్తిస్తాయి. అంతేకానీ అవి శాశ్వతముకావు. సూక్ష్మ శరీర ధర్మములైన కర్తృత్పాదులు సహితము అశాశ్వతము. అందుచేత స్థూల సూక్ష్మ శరీరములందు మమకారము, అనురక్తి విడుపుము. నీవు బ్రహ్మాత్మభావనలో నిమగ్నమై అఖండానంద స్వరూపుడవై ధ్యానము చేయుము. శాశ్వతమైన భవబంధ ముక్తిని పొందెదవు.
అహంకారమే ముక్తికి ప్రధాన ప్రతిబంధకము
299
సన్త్యనే్య ప్రతి బన్ధాః పుంసః సంసార హేతవో దృష్టాః
తేషా మేషాం మూలం ప్రథమ వికారో భవత్యహంకారః
మానవుడు తత్త్వ జ్ఞానార్జనతో ముక్తిపొందుటకు ఇతర ప్రతి బంధకములు ఎన్నియో ఉన్నవి. అన్నింటికంటెను ప్రధానమైన వికారము అహంకారమని తెలిసికొనుము. అశ్రద్ధ, క్రోథము, పౌరుషము, విషయాసక్తి ఇత్యాదులన్నీ యథార్థ జ్ఞానము పొందుటకు ప్రతిబంధకములే. వాటన్నింటికీ మూలకారణము అహంకారమే. అహంకారమును త్యజించిన అన్య వికారములు నాశనవౌను.
300
యావత్ స్యాత్ స్వస్య సంబన్ధో హంకారేణ దురాత్మనా
తావన్న లేశమాత్రాపి ముక్తి వార్తా విలక్షణా
అవిద్య కారణముగా అంతః కరణలో ఉత్పన్న వౌతున్న అహంకారముతో జీవి సంబంధము ఎంతవరకు కొనసాగునో అంతవరకు సంసార బంధమునకు విలక్షణమైన మోక్షము ప్రాప్తించే అవకాశము లేశమాత్రము కూడా ఉండదు.
301
అహంకార గ్రహాన్ముక్తః స్వరూప ముపపద్యతే
చన్ద్ర వద్వమలః పూర్ణః సదానన్దః స్వయం ప్రభః
చంద్రుడు గ్రహణ సమయంలో రాహుగ్రహమునకు వశమైనట్లు అంతరాళములో నున్న ఆత్మ అహంకారముచే కప్పబడి పరిపూర్ణముగా తన సహజ సిద్ధ రూపములో ప్రకాశించజాలదు. గ్రహణము వీడిన పిదప, రాహువు నుండి ముక్తుడైన చంద్రుడు ఎట్లు నిజస్వరూపము తో ప్రకాశించునో అదేవిధముగా అహంకారమును వీడిన పురుషుడు ప్రత్యగాత్మ స్వస్వరూపమే తానని తెలిసికొని, సచ్చిదానంద స్వ రూపుడై భవబంధమునుండి విముక్తిని పొందును.
302
యో వా పురైషోహమితి ప్రతీతః
బుద్ధ్వా వివిక్త స్తమసా తిమూఢయా
తస్యైవ నిఃశేషతయా వినాశే
బ్రహ్మాత్మభావః ప్రతి బన్ధ శూన్యః
తామస గుణ స్వభావముచే సంక్రమించిన అజ్ఞానము చేత మూఢత్వము వలన యథార్థ మును గ్రహించే శక్తి లేకపోవుట చేత, బుద్ధి కలుషితమైన కారణంగాను, అహంకారమే నేను అనే భావన తొలుత కలుగుతుంది. కానీ, ఈ అజ్ఞాన జనిత ప్రతీతి . అనగా దేహాత్మ భావన శేషరహితముగా నశించినపుడు ప్రతిబంధకములు సర్వమూ అంతమై బ్రహ్మాత్మ భావన మాత్రమే స్థిరమై మోక్ష ప్రాప్తి సులభతరమగును.
303
బ్రహ్మానన్దనిధి ర్మహాబలవతాహంకార ఘోరాహినా
సంవేష్ట్యాత్మ ని రక్ష్యతే గుణమయై శ్చండైస్ర్తీభి మస్తకైః
విజ్ఞానాఖ్యమహాసినా ద్యుతి మతా విచ్ఛిద్య శీర్షత్రయం
నిర్మూల్యాసిమిమం నిధిం సుఖకరం ధీరో నుభోక్తుం క్షమః
బ్రహ్మానందం అమూల్యమైన నిధి వంటిదని దానిని పొందనీయకుండా అహంకారం దేహంలో చేరి నిరోధిస్తున్నదని స్పష్టం చేయుటకు భగవత్పా దుల వారు అలంకార ప్రయోగముతో బోధి స్తున్నారు. అహంకారము ఒక మహాస్పరము. దాని మూడు సత్త్వ రజస్తమో గుణాలు.
ఇంకా ఉంది