మెయిన్ ఫీచర్

పసిమొగ్గలు పదిలం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావి పౌరులు... భాగ్యవిధాతలు

చిన్నారుల సంరక్షణ పట్టించుకోని ప్రభుత్వం, తల్లిదండ్రులు కూడా వారి పాలిట శత్రువులే. ఇలాంటి వ్యవస్థ, తల్లిదండ్రుల వల్ల పిల్లలు హంసల మధ్య కొంగల్లాగ నలుగురిలో అపహాస్యంతో బతకాల్సిన పరిస్థితుల ఏర్పడుతున్నాయి. పిల్లల సంరక్షణతో పాటు వారు ఉన్నతంగా రాణించేందుకు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో
బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది.

బోసి నవ్వులు..అమాయకపు చూపులు.. ఆనందం వస్తే చేసే కేరింతలు.. సృష్టిలోని అందమంతా, సందడంతా అక్కడే ఉందన్నట్లుగా పసి పిల్లలు ఉన్నచోటు అనిపిస్తోంది. అందుకేనేమో పసిపిల్లలను పువ్వులతో పోల్చారు. ఇలాంటి పసిమొగ్గలను పదిలంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం చిన్నారులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. పిల్లల సంరక్షణ సంవత్సరంగా ప్రకటించి రాబోయే 15 సంవత్సరాలు అంటే 2030నాటికి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అమ్మ కడుపులో పడగానే వారిని పదిలంగా, బలంగా పెరిగేందుకు తల్లీబిడ్డలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించటం, ప్రసవం సమయంలో తల్లి సంరక్షణ కోసం సురక్షిత ప్రసవం, శిశు మరణాలు తగ్గించటం, ప్రసవం తరువాత ఆరోగ్యంగా పెరగటానికి కావల్సిన పరిస్థితులను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. నిర్ధేశాలు బాగున్నా..ఆచరణలో ఏవిధంగా రూపుదాల్చుకోబోతుందో వేచి చూడాలి.
వాస్తవానికి 1952లోప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విధానం అమలులోకి తీసుకువచ్చింది మనదేశమేనని చెప్పవచ్చు. దీనివల్ల శిశు మరణాలను తగ్గించవచ్చని ప్రభుత్వం ఆశించింది. కాని ఏ ఏటికాఏడు శిశు మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం 47,000 మంది తల్లులు, 7.3శాతం శిశువులు పురిట్లోనే కన్నుమూస్తున్నారు. రక్తస్రావంతో 38%, గర్భస్రావంతో 8%, అధిక రక్తపోటు వల్ల 5%, రక్తహీనత వల్ల 34% మృతిచెందుతున్నారనే గణాంకాలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. అలాగే పుట్టిన శిశువుల సంరక్షణ కూడా మనదేశంలో సమర్థవంతంగా జరగటంలేదు. పుట్టిన తరువాత సంభవించే మరణాలకు కూడా అనేక కారణాలు ఉన్నాయి. నెలలు నిండాకుండానే ప్రసవించటం, గర్భస్థ శిశువులలో ఇన్‌ఫెక్షన్స్ ప్రబలటం తదితర కారణాల వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి మరణాలు సంభవించకుండా నవజాతి శిశు సంరక్షణ కార్యక్రమాన్ని, గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ల నియామకం చేపట్టాలని ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు ప్రభుత్వం ముందుకు రావటం ముదావహం.
అయితే ఈనాటికీ ఆసుపత్రులలో ప్రసవాలు జరగటం లేదు. కాకపోతే గతంలో కంటే కాస్తంత పరిస్థితి మెరుగుపడింది. జిల్లా స్థాయిలో జరిగిన సర్వేల్లో ఆసుపత్రులలో ప్రసవం 47 నుంచి 73 శాతానికి పెరిగిందని వెల్లడైంది. దీనిని నూటికి నూరు శాతం అమలుచేసేందుకు ఆరోగ్య కార్యకర్తల చొరవ చూపాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. పసిపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు ఒక ఎత్తయితే తల్లిదండ్రుల బాధ్యత మరింత ఉంది.
శిలలను మార్చే శిల్పులు తల్లిదండ్రులే..
ఒక విత్తనంలో ఓ మహావృక్షం దాగివున్నట్లు పిల్లల్లో మహోన్నతమైన వ్యక్తిత్వం దాగివుంటుంది. రైతు సేద్యం చేసి పంటలు పండించడానికి ఎంత సేద్యం చేస్తాడో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో, ఎంత సహనంతో వ్యవహరిస్తాడో బిడ్డల సంరక్షణలో తల్లిదండ్రులు కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. చిన్నారుల సంరక్షణ పట్టించుకోని ప్రభుత్వం, తల్లిదండ్రులు కూడా వారి పాలిట శత్రువులే. ఇలాంటి వ్యవస్థ, తల్లిదండ్రుల వల్ల పిల్లలు హంసల మధ్య కొంగల్లాగ నలుగురిలో అపహాస్యంతో బతకాల్సిన పరిస్థితుల ఏర్పడుతున్నాయి. పిల్లల సంరక్షణతో పాటు వారు ఉన్నతంగా రాణించేందుకు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది. చిన్నారుల శక్తి సామర్థ్యాలు పెంపొందించేందుకు సంరక్షణతో పాటు అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం. ప్రోత్సహామే వారిలో ఆత్మవిశ్వాసాన్ని అంకురింపజేస్తోంది. పిల్లల తప్పులను ఎత్తిచూపడం కాకుండా వారిని ప్రోత్సహిస్తే వారు తప్పకుండా పురోగతిని సాధిస్తారు.
జీవితంలో బాల్యం అతి ముఖ్యమైన ఘట్టం. ఈ తొలిప్రాయంలోనే చిన్నారుల పరిపక్వతను పరిగణలోకి తీసుకోకుండా అనవసర విషయాలను వారిపై రుద్దేస్తున్నారు. ఇది చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. వారిని మంచి వ్యక్తిత్వంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాలలు తోడ్పడాలి. కాని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులే కరువయ్యాయి. ప్రైవేటు పాఠశాలల్లో పోటీతత్వం పెరిగి ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాలుగా వారిని మలుస్తున్నారు. సౌందర్య పోటీలు, డ్యాన్స్ పోటీలంటూ వారిని తప్పుదోవ పట్టిస్నున్నారు.
పసివయసులో వారికి సౌందర్య పోటీలు నిర్వహించటం వల్ల వారి శ్రద్ధ, ఏకాగ్రత అంతా శరీరంపైనే ఉంటుంది. ఇది భవిష్యత్తులో అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుంది. వయస్సుకు మించిన ఆలోచనలతో, ఆందోళనలతో పోటీతత్వం వైపు పొడచూపుతారు. పోటీతత్వం ఉండాలి కాని ఇలాంటి పోటీ తత్వం వల్ల మానసిక వికాసం, విద్యా సముపార్జనపై దృష్టి సారించలేరు. ఆధునికత పేరుతో ఇలాంటివాటిని అటు విద్యాసంస్థలూ, తల్లిదండ్రులూ ప్రోత్సహించటం వల్ల తాము అందంగా లేమనే ఆత్మన్యూనతా భావంతో పసిహృదయాలు వికసించలేవు. కాబట్టి అమాయకత్వానికి, నిర్మలత్వానికి, ఆటపాటలకు చిరునామాల్లాంటి చిన్నారులను ఉన్నతమైన మానసిక వికాసంతో వికసించేలా ఎదగనిద్దాం!
*