మెయిన్ ఫీచర్

మైనపు ముద్దుగుమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుగ్గే బంగారమా.. సిగ్గే సింగారమా.. అంటూ అందర్నీ ఉర్రూతలూగించిన సినీ నటి కాజల్. 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో అభిమానుల హృదయాలను దోచేసిన ముద్దుగుమ్మ కాజల్. సినిమా రంగంలోకి వచ్చి 13 సంవత్సరాలు దాటినా కూడా ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ ఏమాత్రమూ చెక్కు చెదరలేదు. అందుకేనేమో టుస్సాడ్స్ సంస్థ తన మ్యూజియంలో ఈమె మైనపు విగ్రహానికి చోటిచ్చింది. తాజాగా సింగపూర్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి ప్రదర్శనకు ఉంచుతుంది మేడమ్ టుస్సాడ్స్ సంస్థ. ఈ క్రమంలో ఇప్పటికే మనదేశంలో మనదేశంలో చరిత్ర, రాజకీయాలు, క్రీడ, వినోదం.. మొదలైన రంగాలకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలను వీరు తయారుచేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పటివరకు దక్షిణ సినీ పరిశ్రమ నుంచి హీరోలైన ప్రభాస్, మహేష్ బాబుల మైనపు విగ్రహాలను మాత్రమే టుస్సాడ్స్ బృందం రూపొందించగా.. ఈ గౌరవం దక్కించుకున్న తొలి దక్షిణ భారతదేశ హీరోయిన్‌గా కాజల్ చరిత్రకెక్కడం విశేషం. గతంలో ఒక సందర్భంలో కాజల్ ధరించిన గ్లిటరింగ్ వన్- షోల్డర్ డ్రెస్ లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించింది టుస్సాడ్స్ బృందం. తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాజల్ తన కుటుంబ సభ్యులతో సహా హాజరైంది. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ..
‘సాధారణంగా ఒక వ్యక్తి విజయాన్ని వారు అనుభవిస్తున్న సౌకర్యాలతో కొలుస్తారు. ఇల్లు, కారు.. ఇలా అన్నమాట.. కానీ ఇప్పటివరకు నాకు ఇవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. అసలు ‘సక్సెస్’ ఏంటని నన్ను చాలామంది అడుగుతుంటారు. కానీ నేను సక్సెస్ అయ్యానని ఏ రోజు కూడా అనుకోలేదు. నాకు ఎదురుపడిన క్షణాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఇంతవరకూ ముందుకుసాగాను. అంతే.. నాకు తెలిసిందల్లా ఏ వృత్తి అయినా నన్ను నేను మరిచిపోయేంతగా అందులో నిమగ్నమైపోయి పనిచేయడమే.. అలాగే నిజాయితీ, అమాయకత్వంతో ఉండటం, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, ఆరాటం.. ఉంటే చాలు.. అవే విజయానికి అసలైన నిర్వచనాలు అవుతాయని నా భావన. ఇప్పటివరకూ నాకు లభించినవన్నీ అదృష్టం కొద్దీ లభించాయి. అంతే.. అంటూ తన సుదీర్ఘ ప్రసంగాన్ని వినిపించింది కాజల్.
ఈ సందర్భంగా టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొల్పిన నటీమణుల మైనపు విగ్రహాల గురించి తెలుసుకుందాం..
ఐశ్వర్యారాయ్
టుస్సాడ్స్ బృందం రూపొందించిన తొలి భారతీయ మహిళా విగ్రహం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ది కావడం విశేషం. అయితే వీళ్లు ఇప్పటివరకు రెండు ఐష్ మైనపు విగ్రహాలను రూపొందించారు. డాన్స్ చేస్తున్న భంగిమలో మొదటి విగ్రహాన్ని 2004లో, అక్టోబర్‌లో లండన్ మ్యూజియంలో ఆవిష్కరించారు. రెండో విగ్రహాన్ని 2013లో న్యూయార్క్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 2010లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో ఐష్ లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించింది టుస్సాడ్స్ బృందం.
శ్రీదేవి
అందరి కలల రాకుమారి, భారతదేశపు తొలి లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి మైనపు విగ్రహాన్ని 2019, సెప్టెంబర్ 4న.. సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఆమె నటించిన మిస్టర్ ఇండియా సినిమాలోని ‘హవా.. హవాయి..’ పాటలోని స్టిల్ ఆధారంగా ఈ బొమ్మను రూపొందించింది టుస్సాడ్స్ బృందం. శ్రీదేవి మరణానంతరం రూపొందించిన ఈ మైనపు విగ్రహాన్ని ఆమె భర్త బోనీకపూర్‌తో పాటు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీకపూర్‌లు కలిసి ఆవిష్కరించారు.
సన్నిలియోన్
అందాలతార సన్నిలియోన్ మైనపు విగ్రహాన్ని 2018, సెప్టెంబర్ 18న దిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. దీని తయారీలో సన్నీ సిగ్నేచర్ పెర్‌ఫ్యూమ్ ‘లస్ట్ బై సన్నీ’ని వాడారు. అందుకే ఈ విగ్రహం సువాసనను వెదజల్లుతుంది. స్ట్రాప్‌లెస్ షార్ట్ డ్రెస్ రూపంలో ఉన్న సన్నీ మైనపు బొమ్మ హాట్‌గా దర్శనమిస్తుంది.
అనుష్కా శర్మ
అనుష్కా శర్మ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో 2018, నవంబర్ 21న ఆవిష్కరించారు. సిల్వర్ కలర్ వన్ షోల్డర్ షిమ్మరీ గౌన్‌తో, మెడలో ముత్యాలహారం ధరించినట్లు ఉన్న అనుష్క బొమ్మ సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. అయితే మిగిలిన బొమ్మలకంటే అనుష్క మైనపు బొమ్మకు ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే.. ఈ బొమ్మ చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌తో మనం సెల్ఫీలు తీసుకుని వాటిని అక్కడే సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. అంతేకాదు.. తన దగ్గరకు వచ్చిన సందర్శకులను ఈ బొమ్మ అనుష్క గొంతుతో పలుకరించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేకతలు ఉన్న ఇలాంటి బొమ్మ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇదొక్కటే..
ప్రియాంకా చోప్రా
గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంకా చోప్రాకు సంబంధించి టుస్సాడ్స్ బృందం ఇప్పటివరకు నాలుగు మైనపు విగ్రహాలను రూపొందించారు. ఇవి న్యూయార్క్, లండన్, ఆసియా, సిడ్నీలలో ఉన్న మ్యూజియాలలో ఉన్నాయి. వీటిలో రెడ్ డ్రెస్‌లో ఉన్నది ప్రియాంక లేటెస్ట్ మైనపు విగ్రహం. ఇలా నాలుగు మేడమ్ టుస్సాడ్స్ శాఖల్లో మైనపు విగ్రహాలను పెట్టించుకున్న తొలి బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా..
వీళ్లతో పాటు కత్రికాకైఫ్, కాజోల్, దీపికా, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, పాతతరం బాలీవుడ్ నటి మధుబాల, ఆశాభోంస్లే, మేరీకోమ్ వంటి వారి విగ్రహాలను టుస్సాడ్స్ బృందం రూపొందించింది.
*