మెయిన్ ఫీచర్

ఫిమేల్ పెర్రీ మాసన్ ధన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టత్తిల్ ధన్యామీనన్.. దేశంలోని సైబర్ క్రైమ్ ఇనె్వస్టిగేషన్‌లో మొట్టమొదటి మహిళ. పరిశోధనా రంగంలో మహిళలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు.. ఇక సైబర్ క్రైమ్ అంటే చెప్పేదేముంది? అది ఇంకా అరుదు.. అలాంటి ఉద్యోగంలోకి అడుగుపెట్టింది పట్టత్తిల్ ధన్యామీనన్. అలా సైబర్ క్రైమ్ ఇనె్వస్టిగేషన్‌లో మొట్టమొదటి మహిళగా తనదైన ముద్ర వేసింది. వివరాల్లోకి వెళితే..
పట్టత్తిల్ ధన్యామీనన్ బ్రిటీష్ కొలంబియా యూనివర్శిటీ నుంచి దూరవిద్య ద్వారా బీటెక్ చేసింది. అంతేకాదు ఆమెకు నృత్యం అంటే ప్రాణం. బీటెక్ అర్హతతో సాధారణ ఉద్యోగాన్ని చేసింది. పెళ్లి జరిగింది. నృత్యాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తూ భర్త చేస్తున్న వ్యాపారాల్లో తాను పాలు పంచుకుంది. అన్ని రోజులూ మనవి కాదు కదా.. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఎప్పుడు లాభం వస్తుందో, ఎప్పుడు నష్టం వస్తుందో తెలియదు.. అలా ధన్య భర్త చేస్తున్న వ్యాపారాల్లో నష్టం వచ్చింది. క్రమంగా వారి వివాహ బంధం కూడా బీటలు వారింది. ఫలితంగా కొడుకుతో సహా బయటకు వచ్చేసింది. మామూలు ఉద్యోగమేదో చేసింది. కొడుకును ఎంత కష్టపడైనా మంచి స్కూల్లో చదివించాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఒక మంచి స్కూలును ఎంపిక చేసి అందులో వేద్దామని వెళితే.. సింగిల్ మదర్ అనీ, వారు సరిగ్గా ఫీజు పే చేయరని ధన్య కొడుకుకి అడ్మిషన్ ఇవ్వలేదు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. ఇంట్లో ముభావంగా ఉండటం చూసి ఆమె తాత విషయం అడిగాడు. ఆమె చెప్పింది. అప్పుడు ధన్య తాతగారు ఆమెను డబ్బు సంపాదించమన్నాడు. అందుకు సైబర్ లాను చదవమని సలహా కూడా ఇచ్చాడు. ధన్యకు తన భవిష్యత్తు అర్థమైంది. తాతనడిగి విషయం తెలుసుకుంది. తరువాత పుణెలోని ఏషియన్ స్కూల్ ఆఫ్ సైబర్ లాలో సైబర్ లా చదివింది. సైబర్ లా పుస్తకాలు చాలా ఖరీదు. ఈ సమయంలో ధన్య తాత ఆమెకు అండగా నిలిచాడు. ఆమె ఎలాగైనా సైబర్ లా చదవాలని, ఆమె చదువుతుందనే నమ్మకంతో ఫీజు నుంచి పుస్తకాల వరకూ అన్నీ ధన్య తాతే దగ్గరుండి చూసుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఏమీ ఆలోచించలేదు. తన కెరీర్ ఎక్కడికి వెళ్తుంది? అని కానీ, నేను సరైనదే చదువుతున్నానా? అనే అంశాలపై ఆమె దృష్టి సారించలేదు. ఆమె దృష్టంతా చదువుపైనే ఉండేది. ఆ చదువును ఆమె తన సొంతం చేసుకుంది. ఆ చదువులో ఉండే మలుపులను చూసి ఆశ్చర్యపోయింది. వాటిపట్ల ఆసక్తిని మరింతగా పెంచుకుంది. ఎందుకంటే అవి డిటెక్టివ్ నవలల కంటే ఎక్కువ ట్విస్టులున్న కేసులు మరి.. అందుకే వాటి పట్ల మరింత ఇష్టాన్ని పెంచుకుని ఆసక్తితో అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆ తరువాత అదే సైబర్ లా స్కూలులో ఫ్యాకల్టీగా పనిచేసింది. 2008 తరువాత పరిస్థితులు మారాయి. ఆమె చేసే పనికి గుర్తింపు పెరిగింది. మొబైల్ స్టాకింగ్, స్పై క్యామ్, కార్పొరేట్ ఇనె్వస్టిగేషన్ వంటివి చేసింది. కార్పొరేట్ సంస్థలకు, పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు ట్రైనింగ్ వర్కుషాపులు నిర్వహించడం మొదలుపెట్టింది.
రాష్ట్రపతి అవార్డు
అది ఫేస్‌బుక్ లేని కాలం. ఆర్కుట్ హవా నడుస్తున్న సమయం. ఒక అబ్బాయి ఆర్కుట్‌లో ఒక ప్రొఫైల్‌ని క్రియేట్ చేశాడు. ఇద్దరు మహిళలను టార్గెట్ చేస్తూ అందులో రాసేవాడు. తీరా చూస్తే ఆ మహిళల్లో ఒకామె అతని తల్లి.. ఇంకొకరు అతని టీచర్. వాళ్లిద్దరూ తరచూ అతన్ని తిడుతుండేవారు. వారిద్దరిపై పగ తీర్చుకోవడానికి అతను ఉపయోగించి అస్త్రం ఆన్‌లైన్. ఈ కేసును ధన్యామీనన్ చేధించింది. ఆమె సాల్వ్ చేసిన మొట్టమొదటి కేసు కూడా ఇదే. తరువాత తరువాత ఎంతగానో ఎదిగి కేంద్ర ప్రభుత్వానికి కన్సల్టెంట్‌గా కూడా పనిచేసింది. ఫేక్ ప్రొఫైల్స్, విజువల్ మార్ఫింగ్, ఇతర సైబర్ క్రైమ్‌కు సంబంధించిన రెండు వేల కేసులను డీల్ చేసింది. సైబర్ క్రైమ్ బాధితులకు సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం 2010లో, కేరళలో సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ ‘అవాంజో’ని స్థాపించింది. వీరేమీ పోలీసింగ్ చేయరు.. ఎలాంటి ఫిర్యాదులనూ తీసుకోరు. అయితే చట్టపరంగా ఎలాంటి అవకాశాలున్నాయి అనే విషయాన్ని వివరిస్తారు. ప్రారంభంలో ఇక్కడకు నెలకు ఎనిమిది కేసులు వచ్చేవట. ఇప్పుడు వారానికే 200 కేసుల పైన వస్తున్నాయట. అలాగే వర్చువల్ ప్రపంచం వల్ల ఉన్న ప్రమాదాలపై కూడా స్కూళ్లల్లో పిల్లలకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ధన్య. సైబర్‌క్రైమ్ పరిశోధనల్లో ఆమె అందిస్తున్న సేవలకు గాను రాష్ట్రపతి అవార్డును కూడా అందుకుంది ధన్య. అందుకే ఆమెను అందరూ ‘ ఫిమేల్ పెర్రీ మాసన్’ అంటారు. అలా తాతయ్య స్ఫూర్తితో తన జీవితాన్ని ధన్యం చేసుకుంది పట్టత్తిల్ ధన్యామీనన్. *