మెయన్ ఫీచర్

రాజకీయాలతో తలెత్తిన షిర్డీ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు దేశంలోని ప్రముఖ హిందూ ప్రార్ధన స్థలం లో ఒకటిగా విశేష ప్రాచుర్యం పొందుతున్న షిర్డీలోని శ్రీ సాయిబాబా ఆలయానికి సంబంధించి ఈ మధ్య ఒక పెను వివాదం తలెత్తింది. సాయిబాబా జన్మస్థలం అంటూ అక్కడకు 272 కి.మీ. దూరంలో గల పత్రీ గ్రామంలో ఉన్న సాయిబాబా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు కేటాయంచడంతో ఈ వివాదం చెలరేగింది.
నిజంగా హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం, భక్తుల సదుపాయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకొంటే అందరం సంతోషించే వాళ్ళం. అయితే దీని వెనుక ఉన్న మురికి రాజకీయాలతో ఇది భక్తులలో తీవ్ర ఆందోళన కలిగించింది. సాయిబాబా జన్మస్థలం పత్రీ అంటూ కొందరు భక్తులు విశ్వసిస్తూ ఉంటే ఉండవచ్చు. అయితే అసంఖ్యాకంగా భక్తులు నిత్యం పారాయణం కావించే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన 16 ఏళ్ళ వయస్సులో షిర్డీకి వచ్చారు. అప్పటి నుండి దాదాపుగా అక్కడనే ఆయన లీలలు అన్నీ జరిగాయి. కానీ అంతకు ముందుటి ఆయన జీవనం గురించి ఆయనెప్పుడూ ప్రస్తావించిన దాఖలాలు లేవు. దానితో మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక మురికి రాజకీయ నెలకొన్నట్లు భక్తులు నిరసనలు వ్యక్తం చేసారు.
షిర్డీలోని భక్తులు నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చారు. అయితే స్థానిక ఎంపీ, భాజపా నాయకుడు రాధాకృష్ణ విఖే పటేల్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలవడంతో ఈ పిలుపును ఉపసంహరించుకున్నారు. ముఖ్యమంత్రి కొంతమేరకు సానుకూలంగా స్పందించినట్లు కనబడు తున్నది. ప్రార్థనా స్థలాలపై భక్తులు, ఆయా మతాల పెద్దలు ప్రభావం చూపితే భక్తి, పవిత్రత నెలకొంటుంది. కానీ ఎప్పుడైతే రాజకీయ నీడలు పడటం ప్రారంభం అవుతుందో అప్పటి నుండి ఆయా స్థలాలకు సహితం మురికి వ్యాపిస్తూ ఉంటుంది. ఇతర మతాలలో రాజకీయ నాయకులు సహితం తమ మతానికి చెందిన ప్రార్థన స్థలాలపై ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ వాటి వ్యవహారాలలో వారి పెత్తనం దాదాపు సాగదు.
కానీ దురదృష్టవశాత్తు, హిందూ దేవాలయాల విషయంలో ఒక వంక ప్రభుత్వాలు, మరో వంక రాజకీయ నాయకుల పెత్తనం సాగుతూ ఉండడంతో అక్కడ పవిత్రతకు తీవ్ర భంగం కలుగుతున్నది. నేడు షిర్డీలో కూడా అదే జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సాయిబాబా సమాధి స్వీకరించిన షిర్డీ నుండి ప్రధాన దేవాలయాన్ని 272 కి.మీ. దూరంలో ఉన్న పత్రికి తరలించే ప్రయత్నంగా చాలామంది భావించారు.
పత్రిలో ఇప్పటికే సాయిబాబా దేవాలయం ఉండటం ఇక్కడ గమనార్హం. అయితే ఎన్నడూ షిర్డీ వలే అది ఎప్పుడు ప్రాచుర్యం పొందలేదు. అందుకనే బాబా భక్తులు పూజలు జరపడానికి షిర్డీకి మాత్రమే వస్తూంటారు. అయితే ఇప్పుడు మరో బాబా దేవాల యానికి ప్రాచుర్యం కలిగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనది.
షిర్డీ కేవలం 36,000 మంది జనాభా ఉన్న చిన్న గ్రామం. సాయిబాబా దేవాలయానికి వచ్చే యాత్రికుల పర్యటనలతోనే ఈ గ్రామం ఆధారపడి ఉంది. షిర్డీ నుండి పత్రికి భక్తులను మళ్లిస్తే షిర్డీకి ఆర్ధికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది.
షిర్డీ సాయిబాబా దేవాలయ ట్రస్ట్ దేశంలోనే సంపన్నమైన దేవాలయ ట్రస్ట్‌లలో ఒకటి. దానికి 2019లో రూ. 689 కోట్ల విరాళాలు సమకూరాయి. మార్చి 31, 2019 వరకు రూ. 2,238 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. షిర్డీ గ్రామాభివృద్ధిని షిర్డీ దేవాలయ ట్రస్ట్ పర్యవేక్షి స్తుంటుంది. అంటే అక్కడ హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు, భక్తులకు ఇతర నివాస ప్రదేశాలు, వాణిజ్య పరమైన వాటన్నింటిని ట్రస్ట్ నియంత్రిస్తుంది. ఆ గ్రామంపై ఆర్థికంగా, ఇతరత్రా ట్రస్ట్‌కు ఉన్న ఆధిపత్యాన్ని ఇది వెల్లడిస్తుంది.
షిర్డీ నెలకొన్న అహ్మదానగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాధాకృష్ణ విఖే పటేల్ ఈ ట్రస్ట్‌పై ఆధిపత్యం వహిస్తున్నారు. విఖే పాటిల్ కాంగ్రెస్ నుండి వైదొలిగి, కొంతకాలం క్రితం భాజపాలో చేరడంతో ఈ దేవాలయంపై ట్రస్ట్ పై కాంగ్రెస్ ఆధిపత్యం పోయింది. ఈ ట్రస్ట్ నుండి పాటిల్ పట్టును తగ్గించే పరిస్థితిలో కాంగ్రెస్ ఇప్పుడు లేదు.
దానితో షిర్డీపై కోల్పోయిన ఆధిపత్యాన్ని భర్తీ చేసుకోవడం కోసం ఎన్సీపీతో కలసి పత్రి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. దానితో సహజంగానే షిర్డీకి వచ్చే విరాళాలు పత్రికి మారే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ మురికి రాజకీయాలలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చిక్కుకు పోయినట్లు కనిపిస్తున్నది.
పత్రి దేవాలయం ట్రస్ట్ ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల ఆధీనంలో ఉండటం గమనార్హం. అందుకనే ఆ రెండు పార్టీలు కలసి పత్రి అభివృద్ధి కోసం ఎత్తుగడ వేసాయి. దానితో వారి ఉద్దేశాలు స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. కేవలం తమ ఆధిపత్యం కోసమే ఈ వివాదాన్ని వారు సృష్టించినట్లు అర్థమవుతుంది. షిర్డీ సాయిబాబా దేవాలయం నిర్వహిస్తున్న శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ (షిర్డీ) చట్టం, 2004 ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
ఇప్పుడు ఇక్కడ తలెత్తుతున్న వౌలిక ప్రశ్న దేవాలయాల ట్రస్ట్‌లు ప్రభుత్వ ఆధీనంలో ఉండవచ్చా అన్నది. కేరళలోని శబరిమల దేవాలయ వివాదంలో సహితం ఇటువంటి ప్రశ్న తలెత్తింది. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్వహణలో సహితం ఇటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అయితే ఏడుకొండల తిరుమల నాథుడి పరిధి నుండి నాలుగైదు కొండలను తీసివేసే ప్రయత్నం చేశారు కూడా.
గతంలో దేవాలయాలు ప్రభుత్వాల అధీనంలో ఉన్నా రాజకీయ నాయకులకు పాలక మండలిలో పెద్ద పీఠ వేసేవారు కాదు. కొందరిని పాలక మండలిలో నియమించినా వారు భక్తుల వలే వ్యవహరించేవారు కానీ, అక్కడ మురికి రాజకీయాలు తీసుకు వచ్చేవారు కాదు. తిరుమలలో కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రి పదవి పొందలేక పోయిన టి. సుబ్బిరామిరెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించినప్పటి నుండి రాజకీయ నాయకులు నేరుగా అక్కడ తిష్ట వేయడం ప్రారంభించారు.
గతంలో టీటీడీ బోర్డు చైర్మన్‌లు కేవలం బోర్డు సమావేశాలకు మాత్రమే హాజరవుతూ ఉండేవారు. అయితే ఎమ్యెల్యే కాలేక పోయిన బి. కరుణాకరరెడ్డి తిరుపతి వాసుడు కావడం, అక్కడనే ఉండడంతో చైర్మన్ నిత్యం పాలనా యంత్రాంగాల్లో భాగం అవుతూ వచ్చారు. అదే రీతిలో డి.కె. ఆదికేశవులు నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి, సుధాకర్ యాదవ్‌ల నుండి నేటి వై.వి. సుబ్బారెడ్డి వరకు రాజకీయ నాయకులకు తిరుమలలో పునరావాసం కల్పించారు. వీరందరూ ఇతరత్రా రాజకీయ పదవులు పొందలేక, పునరావాసంగా ఈ పదవులు పొందడం గమనార్హం.
హిందూ దేవాలయాల పాలక మండలిలను రాజకీయ నాయకులతో నింపడమే కాకుండా దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యకలాపాల కోసం ఖర్చు పెడుతూ ఉండటం, అన్య మతస్థులను కీలక పదవులలో నియమించడంతో పాటు ఇతర మతాల ప్రచారాలకు సహితం ఈ దేవాలయాలను వాడుతూ ఉండడం వివాదాస్పదంగా మారుతున్నది.
అన్య మతాలకు చెందిన ఉద్యోగాలను తొలగించాలని కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ఇవ్వన్నీ మురికి రాజకీయాల కారణంగానే జరుగుతూ ఉండటం గమనార్హం. అందుకనే హిందూ దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుండి, మురికి రాజకీయాల నుండి విముక్తి కావించాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల యాజమాన్యం పైననే రాజకీయ నాయకులు పట్టు కోసం ప్రయత్నిస్తుం డటం గమనార్హం. కుటుంబపరంగా ఏర్పాటు చేసే దేవాలయాల యాజమాన్యంలో పాల్గొన్నా, ప్రభుత్వ పరంగా జరిగే పాలక మండలిల నియామకాలలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చూడవలసి ఉంది. రాజకీయ పునరావాస కేంద్రాలుగా వీటిని మార్చకుండా జాగరూకత వహించవలసి ఉంది. అందుకోసం దేవాలయాల నిర్వహణ పట్ల స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంది.
ఎన్నికలలో సీట్లు ఇవ్వలేకపోతే, పోటీ చేసినా గెలుపొందలేకపోతే, గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేక పోతే దేవాలయ పాలకమండలిలలో పదవులు కట్టబెట్టే మురికి సంస్కృతికి చరమగీతం పాడవలసి ఉంది. అసలు ఎండోమెంట్ శాఖనే రద్దు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తున్నది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయా సంప్రదాయాలకు చెందిన ఋషులు, సాధు సంతతులకు దేవాలయాల నిర్వహణలో క్రియాశీల పాత్ర కల్పించాలి.

- చలసాని నరేంద్ర