మెయన్ ఫీచర్

ఇపుడు దేశంలో మళ్లీ భయం మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలోనే రెండు దేశాలను సృష్టించిన వాళ్లు కాశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తి రద్దుచేస్తే తట్టుకోలేకపోయారు. ‘కాశ్మీరియత్’ అనేది బయటకు కన్పించే అందమైన పేరు. కానీ దాని వెనుక ‘దారుల్ ఇస్లాం’ భావన దాగి వుంది. అందుకే యాసిన్ మాలిక్ లాంటి నరరూప రాక్షసులు లక్షలాది మంది పండిట్లను దారుణ అత్యాచారాలకు గురిచేసి అక్కడి నుండి వెళ్లగొట్టారు. కాశ్మీర్‌లోని రెండు కుటుంబాలు బయటకు రాకపోతే ‘కాశ్మీర్ కాళరాత్రి’ అంటూ పుస్తకాలు విడుదల చేస్తున్న లిబరల్స్, సూడో సెక్యులర్ గ్యాంగులు పండిట్లను గురించి ఒక్క అక్షరం ఎందుకు రాయలేదన్నదే ప్రశ్న. ఇపుడు కాశ్మీర్‌లో తొలగించిన 370 ఆర్టికల్‌ను తమకు తామే ఢిల్లీలోని ‘షాహీన్‌బాగ్’లో విధించుకొన్నారు. నెల రోజులుగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకొని ధర్నాకు దిగారు. ఎవరినీ అటువైపు రానియ్యడం లేదు. ఆఖరుకు దేశంలోనే ప్రముఖ జర్నలిస్టులైన సుధీంద్ర చౌదరి, దీపక్ చౌరాసియా వంటివాళ్లను తీవ్రంగా అవమానించి వెనక్కి పంపారు. కేవలం రాజ్‌దీప్ సర్దేశాయ్ గ్యాంగ్‌కు మాత్రమే అందులోకి అనుమతి వుంది. దీనిపై ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియాగానీ, ఇతర మీడియా స్వేచ్ఛ ఆకాంక్షాపరులుగానీ వారు నోరు మెదపలేదు. అంటే ఈ దేశంలో ఒక వర్గానికి మద్దతుగా నిలవడమే ‘మీడియా పాత్ర’గా తయారుచేశారన్నమాట.
ఇక మరోవైపు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ వారసత్వంగా మరో జాతిరత్నం బయటకు వచ్చాడు. ఈ విద్యార్థి నాయకుడు షెర్జిల్ ఇమామ్, అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఈ అపర దేశభక్తుడు ‘చికెన్‌నెక్’ లాంటి అస్సాం-్భరత్ లింక్ తెంపేద్దాం. రైలుపట్టాలపై చెత్తా చెదారం పోస్తే అస్సాంను భారత్ నుండి విడదీయొచ్చు. దాన్ని క్లియర్ చేసుకొనేందుకు భారత్ విమానాల ద్వారా ప్రయత్నించినా చాలా టైమ్ పడుతుంది. అలాగే పట్టణాల్లోని ముస్లింలు ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో దిగ్బంధనం చేయండి’’ అంటూ పిలుపునిచ్చాడు. ఇపుడు అన్ని రాష్ట్రాల్లోని ముస్లిం సంస్థలు అదే పనిలో ఉన్నాయి. ఏ పట్టణంలోకి వెళ్లినా ధర్నాలు చేస్తున్నారు. మెజారిటీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాని తీవ్ర పరిణామాలే ఇటీవల భైంసా లాంటి చోట్ల ప్రుస్ఫటమయ్యాయి. కొన్ని కుటుంబాల హిందువులు ఇళ్లను వదలిపెట్టడం ఆందోళన కలిగించే విషయం. ‘‘కాశ్మీర్ బహిరంగ చెరసాల’’ అటూ దేశమంతా తిరుగుతున్న గౌహర్ జిలాని వంటి అంధులకు ఇలాంటి ఘటనలు కన్పించవు. దేశ హోమంత్రిని పట్టుకొని ‘‘ఆ జంతువుపై చరిత్ర ఉమ్మేస్తుంది’’ అంటూ అనురాగ్ కశ్యప్ అనే ఓ సినీ దర్శకుడు అనగలిగినంత స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది.
బర్హాన్‌వనీ వంటి ఉగ్రవాది చచ్చిపోతే ‘ఆయన తండ్రి హెడ్మాస్టర్’ అంటూ ఇద్దరిని కలిపి, అతని గొప్పతనాన్ని కీర్తించిన సెక్యులర్ మీడియా, పార్టీలకు అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం నేరంగా తోచిందట. 2016లో పౌరసత్వం పొందిన కళాకారుడు అద్నాన్ సమీ. ‘కళలకు సరిహద్దులు లేవు’ అని రోజూ అరిచి గీపెట్టేవాళ్ల నోళ్లు పెగలడంలేదు. ఉగ్రవాద మనస్తత్వం ఉన్నవాళ్లకు జాతీయ పౌరసత్వం ఇవ్వాలని ఈ ‘కొత్త దేశభక్తులు’ అద్నాన్ సమీ, తారేక్‌ఫతే, తస్లిమా నస్రీన్‌లపై భౌతిక, బౌద్ధిక దాడులకు దిగుతారు. ఎంత విచిత్రం!?
ఆఖరుకు ఈ దేశంలో కోట్ల రూపాయల వ్యాపారం చేసుకొనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యలు చేశాడు. ‘‘అమెరికాలో టెక్నాలజీ, వలస విధానం నేను ఎదగడంలో తీర్చిదిద్దాయి’’ అన్నాడు. ఇందులో అమెరికా ఈ వివక్ష ఉండదని ఆయన అభిప్రాయం. మరి అమెరికాలో ‘యెహోదీ’లకు సులభంగా పౌరసత్వం ఇస్తున్న అమెరికా ‘సిరియా ముస్లింలకు’ ఎందుకు ఇవ్వడంలేదు!? పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చాక అసలు ఇతర దేశాల ముస్లిములు ఈ దేశంలోకి రారు అని ప్రచారం చేస్తున్నవాళ్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వాళ్లకూ తెలుసు. అలాగే సీఏఏ అనేది ఈ దేశ ముస్లింలకు సంబంధించిన ఏ హక్కు లాక్కోదని చెప్పాల్సిన నేతలు, మేధావులు గ్రుడ్డిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మేధా పాట్కర్, అరుంధతీరాయ్, రామచంద్ర గుహ లాంటి స్వయం ప్రకటిత మేధావులు ‘దళిత హక్కులు’ పోతాయని అసత్యాలు చెబితే, కమ్యూనిష్టులైతే ఏకంగా దళిత, ఆదివాసీ హక్కులకు భంగం అంటూ బహిరంగంగా చెబుతున్నారు. ఎంత రాజకీయ వ్యాఖ్యలు చేసినా అందులో సత్యాసత్య విచారణ లేకుండా ప్రసార మాధ్యమాలు వాటిని మోస్తున్నాయి.
పాకిస్తాన్‌లో మలమూత్రాలు ఎత్తిపోసే దళిత కులాలు అక్కడి మత హింస భరించలేక భారత్‌కు లక్షలాదిగా తరలి వచ్చారు. వాళ్లకు ఇపుడు ఈ చట్టం ద్వారా పౌరసత్వం లభించనుంది. ఇదంతా విస్మరించి ఇపుడు వీధుల్లో వీరంగం వేస్తూ చేస్తున్న భయానక దృశ్యాలకు కొందరు పరోక్షంగా, మరికొందరు ప్రత్యక్షంగా మద్దతు పలుకుతున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ దేశ వ్యతిరేక ఆందోళనకు కోట్లాది రూపాయలు నిధులు సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 120 కోట్లు పశ్చిమ యూపీలోని పలు అకౌంట్లలోకి వెళ్లినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో హైదరాబాద్‌లో వాలిన గ్రద్ధలన్నీ ఇపుడు షాహీన్ బాగ్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ ఎన్నికల కోసం నిరీక్షిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అటువైపు కనె్నత్తి చూడడంలేదు. వాళ్ల పార్టీలోని ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రం అందులో చురుగ్గా పాల్గొంటున్నారు. బహుశా! ఎన్నికల అనంతరం కేజ్రీవాల్ వస్తాడు. ఎందుకంటే అపుడు హిందువులతో అవసరం ఉండదు కదా!
ఇలాంటి ఆందోళనలతో దేశం ఇప్పటికే ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యంతో పాటు అస్థిరత వైపు నడిచే ప్రమాదం ఉంది. మతతత్త్వవాదులు, అర్బన్ నక్సల్స్ ప్రమేయంతో సూడో సెక్యులర్ పార్టీల దర్శకత్వంలో నడుస్తున్న ఈ ఉద్యమాల మూలాలను ఛేదించాలంటే కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వం కార్ల నుండి ఈ రోగానికి మందు పెట్టాలి. సాహిత్యం, మీడియా, చరిత్ర, సాంస్కృతిక రంగాల్లో జాతీయతను నింపడమే పరిష్కారం.

- శ్రీకౌస్త్భు