మెయిన్ ఫీచర్

వికసించిన పద్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికసించిన పద్మాలు వీరు. క్రీడా, సినిమా రంగంలో వీరు చూపిన ప్రతిభకు
కొలమానంగా నిలిచి ఈ ఏటిమేటి పురస్కారమైన పద్మభూషణ్ వరించింది. క్రీడా, సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారు.
ఈ ఇద్దరికి పద్మాలు సొంతమయ్యాయి.
*
తెలుగు మహిళాతేజం
భారత బాడ్మింటన్ క్రీడారంగంలో అద్భుత ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన తెలుగుతేజం మహిళా బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు. ఆమె తన 24వ ఏటనే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు సాధించటం తెలుగువారికి ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ పురస్కారం దేశంలో అత్యున్నత స్థాయిలో 3వ పురస్కారం పద్మభూషణ్ కావటం విశేషం. పి.వి. సింధు పూర్తిపేరు పూసర్ల వెంకట సింధు, ఆమె 1995 జూలై నెల 5వ తేదీన పి.వి రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించింది. సింధు తల్లిదండ్రులు కూడా క్రీడాకారులే. వాళ్లీరువురూ వాల్‌బాల్ క్రీడాకారులు. భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ స్ఫూర్తితో పి.వి. సింధు ఈ క్రీడారంగంలోకి ప్రవేశించారు. పుల్లెల గోపిచంద్ సారధ్యంలో ఏర్పాటుచేసిన బాడ్మింటన్ అకాడమీలో ఈమె శిక్షణ తీసుకున్నారు. గురువు అయిన గోపిచంద్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య పురస్కార్ ప్రకటించటం విశేషం. ఈయనకు 2014లోనే పద్మభూషణ్ వరించింది. బ్యాడ్మింటన్ క్రీడారంగంలో పలు విజయాలను సొంత చేసుకున్న సింధు, తన చిన్ననాట ఎనిమిదేళ్ల వయసు నుంచే బాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. కాగా భారతదేశం క్రీడాకారులకు పుట్టిల్లు. దేశంలోనే అత్యున్నతమైన మూడవ పురస్కారం పద్మభూషణ్. ఎంతో ప్రతిభాపాటవాలు చూపేవారికే ఇచ్చే గొప్ప పురస్కారం. అలాంటి ఈ అత్యున్నత పురస్కారం భారత ప్రభుత్వం ప్రకటించటం క్రీడాభిమానులకు ఆనందదాయకం కలిగించింది. పి.వి.సింధూ కెరీర్‌లో ఎన్నో విజయాలు దాగివున్నాయి. బాడ్మింటన్ క్రీడలో తనకంటూ ప్రత్యేకత సాధించిన మహిళాక్రీడాకారిణిగా గొప్ప పేరు సాధించారు. 24 ఏళ్ల ప్రాయంలోనే ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి స్వర్ణ పతకం, రెండు రజిత పతకాలు, కాంస్యాలున్నాయి. నాలుగేళ్ల క్రితం సింధూ రియో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించింది. 2015లో సింధూకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేయటం విశేషం. ఈ బాడ్మింటన్ క్రీడాకారిణి మరిన్నో విజయాలను సాధించాలని కోరుకుందాం.
*
విలక్షణ నటనకు దక్కిన పురస్కారం
కంగనారనౌత్ ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో ఒదిగిపోతుంది. అంతేకాదు. ఆ పాత్రకు సంబంధించిన యాసలో డైలాగులు చెప్పటంతో ఆ పాత్రకు పరిపుష్టి తీసుకువస్తుంది. ఒప్పుకున్న పాత్ర కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ పాత్రలో ఆమె ఒదిగే తీరు విమర్శకులు సైతం ప్రశంసిస్తారు. అంతేకాదు సమకాలిన స్ర్తి సమస్యలు ఎదురైనప్పుడు ఆమె స్పందించే తీరు విభిన్నంగా ఉంటుంది. ముక్కుసూటిగా, తాను చెప్పదలచుకున్నది చెబుతుంది. ఆమెలో సేవా దృక్పథం కూడా మెండు. ఇటీవలనే 40 లక్షల రూపాయల విరాళాన్ని కావేరి నదీ జలాల పరిరక్షణకు ఇవ్వటం విశేషం. ఆమెకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద. అందుకే ఆయన స్థాపించిన రామకృష్ణ మిషన్‌తో అనుబంధాన్ని ఏర్పాటుచేసుకుని సేవా కార్యక్రమాలను సైతం నిర్వహించటం విశేషం. సినిమాలే చూడటానికి ఇష్టపడని కంగన ఖాళీ సమయాల్లో టీవీ చూడటానికి సైతం సుతారం ఇష్టపడదు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, సంగీతం వినటం చేస్తుంది. అంతేకాదు షూటింగ్ లేని సమయంలో ఇంటిలో సాధారణ జీవితం గడపటానికి మక్కువ చూపుతుంది. తన వంట తానే చేసుకుంటుంది. బట్టలు ఉతుక్కుంటుంది. కంగన తొలిసారి 2010లో మధుర్ భండార్కర్ రూపొందించిన ఫ్యాషన్ చిత్రం ద్వారా ఉత్తమ సహాయ నటి అవార్డును సొంతం చేసుకుంది. తల్లి ఉపాధ్యాయురాలు, తండ్రి వ్యాపారవేత్త. అనురాగ్ బసు డెరెక్ట్ చేసిన గ్యాంగ్‌స్టర్ సినిమాతో నటిగా మారింది. కంగన చిన్న చెల్లెలిపై ఓ దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడటం జరిగింది. 32 సంవత్సరాల వయసున్న ఈ విలక్షణ నటి ముప్పయికిపైగానే సినిమాలలో నటించారు. అంతేకాదు 2009లో ఏక్‌నిరంజన్ అనే తెలుగు సినిమాలోనూ, 2008లో ధామ్ ధూమ్ అనే తమిళ చిత్రంలో సైతం నటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన కంగనను ఎంతమంది ద్వేషిస్తారో అంతకుమించి ఆమె నటనను ఇష్టపడేవారు కోకొల్లలు.

-ఎల్. ప్రపుల్లచంద్ర