మెయిన్ ఫీచర్

సెల్ కష్టాలు తీరేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్ కష్టాలు నేడు అన్నీ ఇన్నీ కావు. సెల్ఫీలు సెలబ్రిటీలతోటి, పెద్దవారితోటి ఫొటోలు దిగి వాటిని వాట్సప్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా తమవారికి చేరవేస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. కానీ ట్రైన్ వస్తోంటే సెల్ఫీ దిగి చనిపోవడం, జూలో క్రూరమృగాల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ వాటికి బలికావడం, చెరువులు, వాగులు, సముద్రాల్లో సెల్ఫీలు దిగుతూ పదుల సంఖ్యల్లో చనిపోతున్నారు. ఇదంతా కూడా వారి మూర్ఖత్వం. పిచ్చి పిచ్చి చేష్టలతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
గేమ్స్ యాప్
పిల్లలు ఇంతకుముందు ఎంచక్కా నలుగురితో కలిసి ఆడుకునేవారు. కానీ ఇపుడు సెల్‌ఫోన్స్‌లోని గేమ్స్ ఆడుతూ దృష్టి అంతా వాటిమీదనే పెట్టడంవల్ల కంటివ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. కొన్ని కొన్ని గేమ్స్‌వల్ల చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఒకప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే ఎంతో సందడిగా ఉండేది. కాని ఇపుడు పిల్లలు అస్సలు ఉన్నారా లేదా అన్నట్లుగా ఉంది ఈ సెల్‌ఫోన్స్‌వల్ల. పిల్లలు స్కూల్‌నుండి వచ్చింది మొదలు బట్టలు మార్చుకునే దగ్గరినుండి హోమ్‌వర్క్, భోజనం చేస్తూ కూడా గేమ్స్ ఆడుతూనే చేస్తున్నారు. గారాబం కొద్దీ తల్లిదండ్రులు వారిని ఏమీ అనటంలేదు. మంచలించకపోవడంవల్ల ఆ సమస్య ఇంకా ఎక్కువైపోయే ప్రమాదముంది. పిల్లలు ఏదో గొప్ప విజ్ఞానవంతులవుతున్నారు అనుకుంటున్నారు కానీ ముందు ముందు రాబోయే సమస్యలను గుర్తించడంలేదు. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా కూడా మొబైల్స్‌లో గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు.
అదేవిధంగా స్నేహితులు, బంధువులు కానీ కలిసినపుడు ఇంతకుముందు ఎంతో ఆప్యాయంగా పలకరించుకునేవారు. ఇపుడు హోటల్‌లో టీ త్రాగుతూనే సెల్‌ఫోన్‌లో వాట్సప్, గూగుల్, ఫేస్‌బుక్ చేసుకుంటున్నారు. ఇలా వీరు ఎంతసేపు ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ మాట్లాడుకునే మాటలు తక్కువే.
తినడానికి ఏమైనా కావాలంటే స్విగ్గీ లాంటి వాటిల్లో ఆర్డరు వేసి నేరుగా నిమిషాల్లో తెప్పించుకుని ఇంట్లోనుంచి కదలకుండా, చెమట రాకుండా ఆరగించేస్తున్నారు. ఒకవేళ ఇంట్లో నగదు లేకపోతే ఫోన్ పే, గూగుల్ పే ఉండనే ఉన్నాయి. ఒకప్పుడు వంట చేసుకోవాలంటే పొయ్యి వెలిగించి గినె్నలో బియ్యం ఉడికించుకుని, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుని కడుపునిండా తినేవారు. అది రాను రాను హోటల్ నుండి పార్శిల్ తెచ్చుకుని తినే పరిస్థితి నేడు దాటిపోయి ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేసుకుని తినేంతవరకు వచ్చింది. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సోమరితనం ఎక్కువైపోతోంది.
టిక్‌టాక్
ఇది మరీ విపరీతంగా తయారైంది. చిన్నపిల్లలనుండి యుక్తవయస్సు వారు, మధ్యవయస్సువారు, వృద్ధులు కూడా ఈ యాప్‌ని వినియోగించుకుంటున్నారు. సినిమాల్లోని పాటలు, సన్నివేశాలను డబ్బింగ్ చేస్తూ వాటిని ఫేస్‌బుక్, వాట్సప్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారు. కొన్నింటిని చూసినట్లయితే నవ్వు రావటం పోయి నవ్వులపాలయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మరీ విచిత్రం కాకపోతే దవాఖానల్లో నర్సులు, జూనియర్ డాక్టర్లు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది తమ బాధ్యతలు, విధులను మరిచిపోయి టిక్‌టాక్ వీడియోలు చేసి వాటిని ఫేస్‌బుక్, వాట్సప్‌లో అప్‌లోడ్ చేయడంవలన అవి సామాజిక మాథ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యి చివరకు వారి ఉద్యోగాలు పోయే పరిస్థితి వరకు వచ్చింది. ఇపుడు టిక్‌టాక్ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది.
యాప్స్ ద్వారా నేర్చుకోవడం
ఇక యుట్యూబ్, గూగుల్ లాంటి యాప్స్‌ను చూసి ఎన్నో నేర్చుకుంటున్నారు. ప్రతి సబ్జెక్టు, ప్రతీ విషయం అన్నీ ఆన్‌లైన్ అయ్యాయి కాబట్టి వీటిల్లో సెర్చ్ చేసినట్లయితే లభించని సమాచారం లేదు. చదువుకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, డెవలప్‌మెంట్‌కు సంబంధించినవి చూసి జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎన్ని నేర్చుకున్నా ఇవన్నీ గురువు లేని గ్రుడ్డివిద్య లాంటివనే చెప్పాలి. వీటిల్లో చూసి కొంతమంది ప్రతి విషయంపై తమకు పూర్తి పరిజ్ఞానం ఉందని భావిస్తుంటారు కానీ, అలాంటి ఆలోచన నూటికి నూరుశాతం పొరపాటే. మేధావులు తమకున్నటువంటి విజ్ఞానాన్ని పదిమందికి తెలియజేయాలనే ఆలోచనతో సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు కానీ కొంతమంది వాటిని మిడిమిడిజ్ఞానంతో అపహాస్యం చేస్తూ తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. యూ ట్యూబ్‌లో డెలివరీ చేసే సర్జరీని చూస్తూ ప్రాక్టికల్‌గా ప్రయత్నిస్తూ ఒకరు బలైపోయారు. కొందరు సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియోలను తీసి షేర్ చేస్తున్నారు. ఇదంతా మూర్ఖత్వం కాక మరేమిటి? టెక్నాలజీని అపహాస్యం చేస్తున్న సంఘటనలు సమాజంలో కోకొల్లలు.
ఇటువంటి యాప్స్ ద్వారా సమాజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశ్యంతో వస్తుంటే, కొందరు మాత్రం వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. మొబైల్స్ అవసరం ఊహించలేనంత స్థాయికి పెరిగిపోయింది. ఇంతకుముందు రీఛార్జ్ అంటే 10 రూపాయలకు ఉండేది. అదిపోయి ఇపుడు నెలకు రూ.149, 399, 555కి తక్కువ లేదు. అది ఏ నెట్‌వర్క్ అయినా ఒక నెల ఫుల్ వాలిడిటీతో ఇంటర్నెట్ డేటా విపరీతంగా వాడుకోవచ్చు అనే స్థితికి వచ్చాయి. పట్టణాల్లోనే కాదు ఇపుడు పల్లెటూళ్లలో కూడా ప్రతీ నెట్‌వర్క్‌కి సిగ్నల్స్ ఉండటంవల్ల మారుమూల గ్రామాల్లో సైతం ఇంటర్నెట్ సౌకర్యాన్ని విపరీతంగా వినియోగించుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ టెక్నాలజీని మనిషే డెవలప్ చేస్తున్నాడు. దానిని వినియోగించుకోవలసింది మనిషే. కాని అది ఎంతవరకు? బంధాలు, బంధుత్వాలు దెబ్బతినేంతవరకు మాత్రం కాదు, నవ్వులపాలయ్యేవిధంగా కాదు. రేడియేషన్ బారినపడి మందులు లేని రోగాలు వచ్చేంతవరకు కాదు. ఈ రేడియేషన్‌వల్ల కొన్ని రకాల పక్షులు అంతరించిపోయాయి. అలాగే తప్పుడు కాల్స్ ద్వారా పరిచయమై ఎన్నో సంసారాలు, కుటుంబాలు కూలిపోయాయి. వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలున్నాయి.

-శ్రీనివాస్ పర్వతాల