మెయిన్ ఫీచర్

స్ర్తిలపై వివక్ష ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన భారతదేశంలో మహిళలు జీవితపు అన్ని విభాగాలలో పురుషులతో సమాన హోదా అనుభవించారని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తలు వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకొనే వారని చెప్పారు. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళిచేసుకొనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని, వేదాలు చెపుతున్నాయి. వేదకాలంలో మహిళలు సమాన హోదా, హక్కులను హరించటం మొదలయ్యింది. ఆ తర్వాత ఎన్నో పెను మార్పులు. సతీసహగమనం, బాల్యవివాహాలు, దేవదాసి లాంటి అనేక వివక్షల నుంచి స్ర్తి బయటపడింది.
నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో ముందడుగు వేస్తుంది.
స్ర్తిల పట్ల ఎలాంటి వివక్షా చూపించకుండా భారతీయ మహిళలందరికీ సమానత్వంకోసం రాజ్యాంగం అనేక చట్టాలు చేసింది. అయినా ఇంకా మార్పు రాలేదనే చెప్పాలి.
కట్టుబాట్లు, ఆచారాల పేరిట ఆడవాళ్లపై ఆంక్షలు విధిస్తూనే వున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఇంకా కొనసాగుతుండడంతో స్ర్తి తన స్వేచ్ఛకు ఉన్నతికి దూరమవుతుంది. స్ర్తిల పట్ల వివక్ష చూపుతున్నారు. ఆడ, మగ సమానమని ఆలోచించాలి. ‘‘ఆడవాళ్లు అణిగిమణిగి ఉండాలి. మగవాళ్లు పౌరుషానికి ప్రతీక’’వంటి స్టీరియో టైప్ ఆలోచనల్ని ఆధునిక సమాజం దాటలేదనడానికి నేడు జరుగుతున్న నేరాలే సాక్ష్యాలు. ‘స్ర్తిలను గౌరవించాలి’ నినాదాలు గోడల మీదే గానీ, భావితరాల గుండెల మీద లిఖించడంలో వ్యవస్థ వైఫల్యంలేదని చెప్పలేని పరిస్థితులు. ఇంకెంతకాలం ఆడ, మగ తేడాలు. మగతనం కాదు, మనిషితనం ముఖ్యమని బోధించే వారెవ్వరు. గతి తప్పుతున్న కొందరు అబ్బాయిల బుద్ధికే ఇప్పుడు ఆంక్షలు అత్యవసరం.
అమ్మాయిలు గట్టిగా నవ్వకూడదు. అబ్బాయిలు బిగ్గరగా ఏడవకూడదు. కుటుంబ పరువును కాపాల్సిన బాధ్యత ఆడపిల్లదే. కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టేది మగపిల్లాడు. ఎంత కాదన్నా, అమ్మాయి పరాయితావుకెళ్లాల్సిందే. ఎంతైనా, కొడుకు కొడుకే.! ఆడపిల్లలు ఒళ్లును చుట్టేసే డ్రస్సులే వేసుకోవాలి. చిరుగుల ప్యాంటు తొడిగినా వాడు మగాడు. అమ్మాయి ప్రేమిస్తే బరితెగింపు. అబ్బాయి లవ్‌లో ఉంటే రొమాంటిక్ ఫెల్లో.
ఆమె అన్నం వండాలి.! అతడు పీకలదాకా మెక్కాలి. ఆడపిల్ల గినె్నలు తోమాలి. మగపిల్లాడు బజారుకెళ్లి సరుకులు తేవాలి..
ఒకటారెండా ఇలా ప్రతి సందర్భంలో.. ప్రతి పనిలో ఆడ, మగ మధ్య విభజన స్పష్టంగా కనిపిస్తుంది. నానాటికీ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అంతరిక్ష రహస్యాలనూ ఛేదించే స్థాయికి మానవ సమాజం అభివృద్ధి చెందుతోంది. అయినా, ఆడవాళ్లపై వివక్ష మాత్రం అంతేలా కొనసాగడం శోచనీయం. ఆధునికతకు ఆలవాలమని చెప్పుకొనే నగరాల్లోనూ ఇంటా, బయటా మహిళలపై అడుగడుగునా ఆంక్షలే. పెద్ద చదువులు వెలగబెట్టారనుకున్న చాలామంది మగ బుర్ర నిండా ఆడవాళ్ల పట్ల బూజుపట్టిన ఆలోచనలే. నెలకు రూ.లక్ష వేతనం పొందే సతీమణి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేయలేదని పెదవి విరిచే పతులు లేకపోలేదు.
మగాళ్లకు చెప్పాలి!
‘ఆడవాళ్లు రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించకూడదు. వాళ్లు వెంట పెప్పర్ స్ప్రే బాటిలో, కారంపొడి డబ్బానో ఉంచుకోవాలి. సెల్‌ఫోన్లో సేఫ్టీయాప్‌లు పెట్టుకోవాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి’వంటి సూచనలు, సలహాలు ఇక చాలిస్తే మంచిది. ఇప్పుడు సూచనలు కావాల్సింది అబ్బాయిలకు. ‘పరాయి ఆడపిల్ల కనిపిస్తే, కండకావరంతో వ్యవహరించడం తప్పురా.! ఒంటరి మహిళపై వాంఛ తీర్చుకోవాలనుకునే దుర్భుద్ధి అత్యంత నీచ, నికృష్టమైన నేరంరా!..అని మగాళ్లకు చెప్పే బాధ్యతను కుటుంబం తీసుకుంటుందా! సమాజం తీసుకుంటుందా! కానీ వాళ్లకు చెప్పడం మాత్రం అత్యవసరమే. మహిళను విలాస వస్తువుగా చూసే దృక్కోణంలోనే దోషమంతా అని గ్రహించి, చిన్నప్పటినుంచే ఆడ, మగ సమానమనే పాఠాలు ఇంట్లోనూ, బడిలోనూ చెప్పడం చాలా అవసరం. అవన్నీ మానేసి బాధితులనే బాధ్యులను చేయడం అమానవీయం.
తల్లిదండ్రులూ తస్మాత్! జాగ్రత్త...
మగ పిల్లలను కన్న తల్లిదండ్రులారా తస్మాత్! జాగ్రత్త. మీ అబ్బాయి ఇంట్లో బుద్ధిమంతుడిలా నటించవచ్చు. వీధిలో అమ్మాయిల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాడో కాస్తంత పసిగట్టండి. ట్యూషన్ అనో, కంబైండ్ స్టడీ అనో రాత్రివేళ ఆలస్యంగా ఇంటికొస్తున్న పుత్రరత్నం ఎక్కడ ఏ రాచకార్యాలు వెలగబెడుతున్నాడో ఓర కన్నువేయండి. వీలైతే, బ్రీత్ ఎనలైజర్స్‌తో పరీక్షించినా తప్పులేదు. అడిగినంత పాకెట్‌మనీ ఇస్తున్నారా..! అయితే ఫ్రెండ్స్‌తో పార్టీల్లో మునిగి తేలుతున్నాడేమో ఓ కంట కనిపెట్టండి. స్మార్ట్ఫును వదల్లేకపోతున్నాడంటే విషయం కాస్తంత ట్రాకు తప్పిందని ఊహించండి.
ఒంటరిగా గడిపేందుకు తహతహలాడుతున్నాడని గుర్తిస్తేమాత్రం పోర్ను వెబ్‌సైట్లలో విహరిస్తున్నాడని గమనించండి. అసలు మీ అబ్బాయి స్నేహాల మీద ఆరాతీయండి. వాళ్లు చేసే పనులమీద నిఘాపెట్టండి. ఈ సలహాలను, సూచనలను మగ పిల్లలను కన్నవాళ్లకు ప్రతిపాదించండి. అంతేకానీ, అఘాయిత్యాలు జరిగిన ప్రతిసారీ ఆడపిల్లలకు సుద్దులు బోధించడం మానండి. బాధితులను బాధ్యుల్ని చేయకండి.
మగాళ్లకు ఏమాత్రం తీసిపోరని నేర్పండి. వివక్షతను చూపించేవారికి కాస్త గడ్డిపెట్టి బుద్ధిచెప్పండి.

- కంసుడు