మెయిన్ ఫీచర్

పండగ పసందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్‌కైనా, మధ్యతరగతికైనా పండగంటే సినిమా. పెద్ద సినిమా ఓ పండగ. రొటీన్ యాక్టివిటీస్ నుంచి రిలాక్సేషన్ దొరికేది అప్పుడే కనుక -ప్రత్యేకంగా వినోదాన్ని వెతుక్కోవడం మొదలెడతారు. ఇంట్లోవుంటే టీవీముందు, బయటికొస్తే థియేటర్‌లోను కాలక్షేపానికి కనెక్టవుతాం. మెజారిటీ జనానికి సినిమాయే ప్రధాన వినోద సాధనం కనుక -ఏడాది ఆరంభంనుంచే ఏ సినిమా ఎప్పుడో ఆడియన్స్ ఆసక్తి చూపించటం మొదలెట్టారు. 2020 జనవరి ఫస్ట్ వీక్‌లో అలాంటి ఆనందాలు ఆడియన్స్‌కి దొరకలేదు. అందుక్కారణం -పెద్ద సినిమాల్లాంటివన్నీ అనువాదాలే కావడం. డబ్బింగ్‌లు, రీమేక్‌లు, ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించలేని చిన్న సినిమాలే -్ఫస్ట్‌వీక్‌లో దారి చూసుకున్నాయి. ఈ బాటలో పది పదిహేను సినిమాలొచ్చినా -్థయేటర్ల వద్ద మాత్రం కళ కనిపించటం లేదు. అందుక్కారణం -తరువాత వస్తోన్న పెద్ద చిత్రాలకు మధ్య తరగతి, మాస్ ఆడియన్స్ బడ్జెట్‌ను జాగ్రత్త చేసుకోవడమే. వచ్చిన సినిమాలన్నీ చూసేసే ప్రత్యేక ప్రేక్షకులను పక్కనపెడితే -బడ్జెట్‌కు అనుగుణంగా సెలెక్టెడ్‌గా సినిమాలు చూసేవాళ్లంతా పండగ సినిమాల కోసమే ఎదురు చూస్తున్నారు.
చిత్రమేంటంటే -ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్ సైతం ఓ పెద్ద అనువాద చిత్రంతోనే మొదలవుతోంది. అదే -దర్బార్. సంక్రాంతి సెంటిమెంట్‌తో జనవరి 9న థియేటర్లకు వస్తున్నాడు రజనీకాంత్. స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో చేసిన మొదటి సినిమా ఇది. రజనీ స్టయిల్, డైలాగ్స్‌కు తెలుగు మాస్ ఆడియన్స్ సైతం బలంగా కనెక్టైవుంటారు కనుక -ఈ సినిమాతో వినోదం ఖాయమన్నది చిత్రబృందం చెబుతోన్న మాట. లైకా ప్రొడక్షన్స్‌పై మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన దర్బార్‌లో -చాలాకాలం తరువాత రజనీ-నయనతార జోడీకడితే, చాలాకాలం తరువాత రజనీ పోలీస్ ఆఫీసర్ అవతారమెత్తాడు. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి విలన్ రోల్ పోషించటం మరో విశేషం. తమిళ, తెలుగు, మలయాల, హిందీలో విడుదలవుతోన్న చిత్రంపై పండగ ఆడియన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.
ఇక జనవరి 10న వైవిధ్యమైన పాత్రతో వస్తోంది -బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె. ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా దర్శకురాలు మేఘనా గుజ్జర్ తెరకెక్కించిన ఆ చిత్రం -చపాక్. పాత్ర కోసం స్క్రీన్‌పై తన అందాన్ని త్యాగం చేసిన దీపిక -యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలోకి దాదాపుగా పరకాయ ప్రవేశమే చేసిందన్న విషయం పోస్టర్లు చూస్తుంటేనే అర్థమవుతోంది. దేశం నివ్వెరపోయిన ఘటనను తెరపై చూపించే సినిమా కావడం, తెలుగు వర్షన్‌లోనూ విడుదలవుతుండటం.. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అదే రోజు అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ లీడ్‌రోల్స్‌లో వస్తోన్న యాక్షన్ పీరియాడిక్ డ్రామా -తానాజీ. ది అన్‌సంగ్ వారియర్ ఉపశీర్షిక. 17వ శతాబ్ధపు కథతో ఓమ్ రాత్ తెరకెక్కించిన చిత్రమిది. శివాజీ పాలనా కాలంలో మరాఠా రాజ్యంలోని సైనిక యోధుడి కథగా తెరకెక్కిన సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తివుంది. భారీ తారాగణంతో వస్తోన్న సీరియస్ పీరియాడికల్ చిత్రం కోసం ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
సంక్రాంతి మొదలై కనుమ ముగిసేలోగా -మరో మూడు తెలుగు చిత్రాలూ బాక్సాఫీస్‌ను కళకళలాడించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రధానంగా సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో చిత్రాలను చెప్పుకోవాలి. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలపై కొనసాగుతోన్న కన్ఫ్యూజన్ ఒకటి రెండు రోజుల్లో క్లియర్ కావొచ్చు. 10నుంచి 12వ తేదీలోగా పెద్ద సినిమాలు రెండూ మాత్రం థియేటర్లకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
తొలిసారి మహేష్, రష్మిక జోడీగా వస్తున్న చిత్రం -సరిలేరు నీకెవ్వరు. టైటిల్ ఈ సినిమాకు పెద్ద ప్లస్‌పాయింట్. కంచుకోట చిత్రంలోని పాపులర్ సాంగ్‌నుంచి తీసుకున్న మొదటి రెండు పదాలు టైటిల్‌గా పెట్టుకోవడం -తెలీకుండా కనెక్టయ్యే అంశం. పైగా, భారత జవాను పాత్రలో మహేష్‌ని చూపిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్‌కూ ఇదే తొలి సినిమా. రాజకీయాల నేపథ్యంలో పుష్కరకాలం పాటు స్క్రీన్‌కి దూరంగా ఉండిపోయిన విజయశాంతి.. ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండటం మరో స్పెషల్. ఇన్ని ప్రత్యేకతలున్న సినిమాపై పండగ ఆడియన్స్‌లో భారీ ఆశలే ఉన్నాయి. గత రెండు మూడు చిత్రాలతో హిట్లందుకుని ఊపు మీదున్న మహేష్ -ఖాయంగా పండగ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ కనిపిస్తోంది. పైగా బడ్జెట్‌కు వెరవకుండా పరిమితికి మించి వెళ్లామని నిర్మాత అనిల్ సుంకరే చెప్పాడు కనుక -సినిమా గ్లాసీగా ఉంటుందనటంలో సందేహం లేదు. సో, సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్‌గా చెప్పుకోవచ్చు.
సంక్రాంతి రేసులో సత్తా చూపించనున్న మరో సినిమా -అల.. వైకుంఠపురములో.
హ్యాట్రిక్ సక్సెస్ కోసం అల్లు అర్జున్ -త్రివిక్రమ్ నుంచి వస్తోన్న కాంబో ప్యాక్. ఈ చిత్రానికీ టైటిల్ -పెద్ద అస్సెట్. పోతనామాత్యుడు రచించిన గజేంద్రమోక్షంలోని పద్యం మొదటి పదాలనే త్రివిక్రమ్ టైటిల్ చేశాడు. ఐతిహాసిక సారాన్ని సామాజిక కథాంశాల్లోకి తీసుకొచ్చే త్రివిక్రమ్ -అల.. వైకుంఠపురములో అద్భుతాన్ని చూపిస్తాడన్న అంచనాలూ ఉన్నాయి. పైగా -పెర్ఫార్మెన్స్ స్టామినాను పర్ఫెక్ట్‌గా ప్రయోగించగలనని జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో నిరూపించాడు. ఇప్పుడు హ్యాట్రిక్ సక్సెస్ కోసం పండగ సీజన్‌లో -కుటుంబ కథా చిత్రాన్ని బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా వదులుతున్నాడు. డీజేలో బన్నీతో అద్భుతమైన రొమాన్స్ పండించిన పూజా హెగ్దె -మరోసారి బన్నీతో రెచ్చిపోనుంది. సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్‌లాంటి భారీ తారాగణం ఒక ఎత్తయితే, ఒకనాటి నిలువెత్తు అందం టబు -కథను నడిపించే పాత్రను పోషిస్తోంది. అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయక్తంగా నిర్మించిన చిత్రంలో ఇప్పటికే పాటలు ఓ రేంజిలో హిట్టయ్యాయి. సో, సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక -అచ్చమైన పండగ సినిమాతో కొంత గ్యాప్‌లో వస్తున్నాడు హీరో కల్యాణ్‌రామ్. జనవరి 15న ఆయన నుంచి వస్తున్న సినిమా -ఎంత మంచి వాడవురా. కుటుంబ భావోద్వేగాలకు పదునుగా ప్రయోగించే దర్శకుడు సతీష్ వేగెశ్న ఈ చిత్రానికి దర్శకుడు. శతమానంభవతి చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న సతీష్ -గుజారాతీ కథపై నమ్మకంతో చేస్తున్న రీమేక్ ఇది. కల్యాణ్‌రామ్‌తో మెహ్రీన్ రొమాన్స్ చేయనుంది. సినిమాకంటూ ప్రత్యేకమైన అట్రాక్షన్స్ ఏమీలేకున్నా -కథపై పూర్తి నమ్మకంతో కనిపిస్తున్నారు నిర్మాతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా. అచ్చమైన పండగ సినిమాగా సత్తా చూపించటం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు.
పెద్ద చిత్రాల్లో ఏవి ఆడియన్స్‌కి కనెక్టైనా -రెండు వారాలు రచ్చ చేయడం ఖాయం. సో, తరువాత రావాల్సిన పెద్ద చిత్రాలు కొంత గ్యాప్ తీసుకుంటున్నాయి. అలా, జనవరి చివరిలో రిపబ్లిక్ డే రోజున రానున్న చిత్రం -డిస్కోరాజా. రవితేజ -విఐ ఆనంద్ కమర్షియల్ కాంబో ప్యాక్. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రంలో -నభానటేష్, పాయల్ రాజ్‌పుత్ పెద్ద రిలాక్సేషన్. గ్లామర్ డోస్‌కు గేట్లు తీసేశారన్న టాక్ ఎలానూ ఉంది కనుక -యూత్‌ని పూర్తిగా ఎంగేజ్ చేస్తారన్న అంచనాలున్నాయి. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌కే షట్టర్ పడిపోయిన తరుణంలో -రవితేజ కసిగా చేసిన సినిమా ఇది. సైంటిఫిక్ థ్రిల్లర్ జోనర్ కనుక -రొటీన్‌కి భిన్నమైన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలదన్న అంచనాలు లేకపోలేదు. అలాగే, రిపబ్లిక్ డేన విడుదలవుతోన్న కంగనారనౌత్ ప్రయోగాత్మక చిత్రం -పంగా. పెళ్లైన పడతి కబడ్డీ ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు పడిన కష్టాన్ని కంగనా చూపించనుంది. ఇల్లాలి స్ట్రగులే ఇతివృత్తంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి లేకపోలేదు. అలాగే, వరుణ్‌ధావన్, శ్రద్ధాకఫూర్ జంటగా ప్రభుదేవా ముఖ్యపాత్రతో వస్తోన్న చిత్రం -స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ చిత్రంపైనా ఆడియన్స్‌లో ఆసక్తివుంది.
వారం గ్యాప్‌లో మరో మూడు భారీ చిత్రాలు బాక్సాఫీస్‌కు కొత్త కళను తేనున్నాయి. అంటే -జనవరి 31న నిశ్శబ్ధం, అశ్వథ్థామ, రొమాంటి చిత్రాలు ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసుకుంటాయన్న మాట. అనుష్క అందం, అభినయం తెరపై కనిపించి రెండేళ్లైపోతోంది. గ్యాప్ తరువాత వైవిధ్యమైన పాత్రలో అనుష్క కనిపించనున్న చిత్రం -నిశ్శబ్ధం. మూగ ఆర్టిస్ట్‌గా ఛాలెంజింగ్ రోల్ చేసిన ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌ను హేమంత్ మధుకర్ తెరకెక్కించాడు. మాధవన్, అంజలి, షాలినీపాండే ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. తెలుగు సహా ఐదు భాషల్లో విడుదల కానున్న చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.
ఇక -్ఫ్లపుల నుంచి బయటపడి యాక్షన్ హీరోగా తనను తను ప్రూవ్ చేసుకోడానికి సొంత కథతో వస్తున్న హీరో -నాగశౌర్య. సినిమా -అశ్వథ్థామ. ఈ నెలలో రెండో సినిమాతో మెహరీన్ అలరించనుంది. యథార్థ ఘటనల ఆధారంగా శౌర్య రాసుకున్న కథను కొత్త దర్శకుడు రమణతేజ తెరకెక్కించాడు. సొంత బ్యానర్‌లో నిర్మించిన చిత్రం -కొత్త ఏడాదిలో కెరీర్‌ను గాడిలోకి తేగలదన్న నమ్మకంతో ఉన్నాడు శౌర్య.
మెచ్యూర్డ్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఆకాష్‌పూరి చేస్తున్న బ్యూటీ ఎంటర్‌టైనర్ -రొమాంటిక్. కొడుకును నిలబెట్టే కథను అందించాడు పూరి. అనిల్ పాడూరి తెరకెక్కించిన చిత్రంలో -ఆకాష్‌తో కేతికశర్మ హద్దుల్లేని రొమాన్స్ చేసింది. పూరి సొంత బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రంపై -ప్రత్యేక ఆసక్తి అయితే లేకపోలేదు. శివ కందుకూరి -వర్ష బొల్లమ్మ జోడీగా శేష సింధూరావు తెరకెక్కించిన -చూసీ చూడంగానే చిత్రం; రక్షిత్, నక్షత్ర జోడీగా కరుణకుమార్ రూపొందించిన పలాస 1978లాంటి చిత్రాలూ జనవరిలోనే ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయనున్నాయి.

-మహాదేవ