మెయిన్ ఫీచర్

పరిశోధనలో పట్టు.. ప్రగతికి తొలి మెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చందమామ రావే.. కొండెక్కి రావే.. గోగుపూలు తేవే.. అన్నీ తెచ్చి మా అమ్మాయికియ్యవే..’’ అని అమ్మ చంద్రుడ్ని చూపిస్తూ మమకారం అనే నెయ్యి వేసి గోరుముద్దలు తినిపిస్తోంది. ఇదే పసికూనకు అందని ఆ జాబిల్లిని అందుకోమ్మా అని సైన్స్ పట్ల మమకారాన్ని ఈ అమ్మే బోధిస్తే.. మన దేశంలో సైన్స్ ,సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఇంత దిగజారేదికాదేమో. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతుందని, అరచేతిలో ప్రపంచాన్ని ఇముడ్చుకున్నామని గొప్పలు చెప్పుకుంటాం. ఈ సాంకేతిక ప్రగతిలో మహిళ సాధికారిత సాధించిందా..? అంటే ప్రశ్నార్ధకమే. ఈనెల ఫిబ్రవరి 11న తొలిసారి ‘‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గరల్స్ ఇన్ సైన్స్’’ నిర్వహించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్ రంగాలలో మహిళలు, బాలికల భాగస్వామ్యం పెంచాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఈ దినోత్సవాన్ని ప్రకటించటమే కాదు ఘనంగా నిర్వహించింది.
ఒక్కసారి మీ రు కళ్లు మూసుకుని ఊహించుకోండి.
పసుపుపచ్చ టోపీ ధరించిన వ్యక్తి వైట్ యూనిఫాం ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంటే.. పసుపుపచ్చ టోపీ ధరించిన పురుషుడ్ని ఇంజనీర్‌గానూ, వైట్ యూనిఫాం ధరించిన మహిళను నర్సుగా ఊహించుకుంటారు కదా! ఇది సహజం అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే సైన్స్, సాంకేతిక రంగాలలో మహిళలు, బాలికల భాగస్వామ్యానికి వాస్తవ దర్పణం ఈ ఊహ. నేషనల్ టాస్క్ఫోర్స్ నిర్వహించిన సర్వేలో సైతం ఈ విషయాలే వెల్లడయ్యాయి.
మనదేశంలో పిహెచ్‌డి చేసిన మహిళల శాతం 37 శాతానికి మించలేదు. ఇందులో 15శాతం ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. సైన్స్ అకాడమీ ఇచ్చే ఫెలోషిప్‌ను సైతం 4శాతం మంది మహిళలు మాత్రమే అందుకుంటున్నారు. అంటే సైన్స్ చదివే సామర్థ్యం మహిళల్లో లోపించందనుకుంటే పొరపాటు. సైన్స్‌లోనే రెండు విభిన్న విభాగాలలో మొట్టమొదటిసారి నోబెల్ బహుమతి పొందినది మేరీ క్యూరీ ఓ మహిళే. ఈ రోజు వేలాది మంది జీవితాలను నిలబెడుతున్న కూల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్‌ను కనుగొన్న స్టీఫెన్ క్వాలెక్, మొట్టమొదటిసారి టెస్ట్‌ట్యూబ్ బేబీకి పురుడు పోసిన డాక్టర్ ఇందిర హిందుజ, గత సంవత్సరమే నేషనల్ సైన్స్ అడాడమీ మెడల్ సంపాదించిన యువ సైంటిస్ట్ నీనా గుప్తా లాంటి మహిళామణులు ఎందరో మనకు ఉన్నారు. కాని ఈ కొద్ది మంది సాధించిన విజయాలు మరేందరికో మార్గదర్శకం కావటం లేదు.
సైన్స్, సాంకేతిక రంగాలలో మహిళలు అడుగుపెట్టకబోవటానికి ప్రధాన అడ్డంకి వారు మానసికంగా సిద్ధం కాకపోవటమే. అసాధ్యాలను సుసాధ్యాలుగా మలిచే తెగువ, ధైర్యం వారికున్నా చిన్నప్పటి నుంచి సంస్కృతి సంప్రదాయాల పేరుతో వారిని కట్టడి చేయటం వారి విజ్ఞాన సముపార్జనకు తీవ్రఆటంకంగా మారింది. ఇది కాదనలేని సత్యం. అంతే తప్పా బాలికల మెదళ్లేమి తుప్పుపట్టలేదని ఇటీవల న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన సైన్స్ టెస్ట్‌లో వెల్లడైంది. ఈ టెస్ట్‌లో 15 సంవత్సరాల వయసులోపు వారు 65 దేశాలకు చెందిన బాల బాలికలు పాల్గొంటే బాలుర కంటే బాలికలే ఎక్కువ ప్రతిభాపాటవాలు చూపించారట. ఉగ్గుపాలతో మమకారంతో పాటు సంస్కృతి సంప్రదాయాల బోధించటంలో తప్పు లేదు కానీ ఇది వారిని ఈరంగంలోకి అడుగుపెట్టటానికి అడ్డంకిగా మారిందని విశే్లషకులు భావిస్తున్నారు. పరిశోధన పట్ల ఆసక్తిని పసివయసులోనే పాదుకొల్పాలని, పసి వయసులో మనసులో పడే బీజాలు మొలకెత్తి వారిని లక్ష్యం వైపు అడుగులు వేసేలా చేస్తుందంటారు మానసిక విశే్లషకులు.
నువ్వు మేథ్స్‌లో వీక్ అనే చిన్న మాట టీచర్ పదే పదే అంటే ఇక ఆ విద్యార్థిని మానసికంగా మేథ్స్ పట్ల ఆసక్తి కనబరచదు. చిన్న వయసులోనే ప్రాజెక్టు వర్క్ పట్ల వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైన్స్ నేర్చుకున్నామంటే ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే సత్తా మనలో పెరుగుతుందనే సేవా భావం తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు తెలియజేస్తేవారిలో ఈ రంగంలోకి రావాలనే ఉత్సాహం వస్తుంది. సాంకేతిక రంగంలోప్రవేశించేవారు తమ విలువైన సమయాన్ని ఎంతో వెచ్చించాలి. మా అమ్మాయికి అంత అవసరమా? ఎదో టీచర్‌గానో, చార్టర్ ఎక్కౌంట్‌గానో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించకుంటే చాలు అనే భావన తల్లిదండ్రుల్లో ఉంటే ఇక ఆ ఇంటిలో మహిళా సైంటిస్ట్ ఎలా మొగ్గతొడుగుతోంది? సైన్స్ నీకోసం, నాకోసం, మనందరి కోసం కావాలి అనే విశాల దృక్పధంతో బాలికలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధించినపుడే మొట్టమొదటి మహిళా నోబెల్ విజేత మేరీ క్యూరీ, నీనా గుప్తా లాంటి మేథావులు మనకు లభిస్తారు. ప్రోత్సాహమే సాంకేతిక రంగంలో పడతులు ప్రగతి సాధించటానికి దోహదపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

-హరి చందన