మెయిన్ ఫీచర్

స్టార్ పెరగని టాలీవుడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర సృష్టించే సినిమాలున్నాయి.
పదికాలాలు వెంటాడే చిత్రాలూ తయారయ్యాయి.
అప్పుడప్పుడు మాత్రమే-
తళుక్కున మెరిసే అలాంటి చిత్రాల్ని చాలాకాలం
గుర్తుపెట్టుకుంటాం. సందర్భానుసారం -వాటిని ఉదహరిస్తూ ఆనందిస్తాం. వీటితో -తరువాతొచ్చే చిత్రాలనూ
పోలుస్తుంటాం. నడుస్తున్న కాలం చరిత్రలోకెళ్లినా -ఆ చిత్రాల తాలూకు గుబాళింపును మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా
కప్పుకుంటాం. జోనర్‌కు తగిన మైకాన్ని
మైండ్‌లో నింపుకుంటాం.
**
ఓ మంచి పుస్తకాన్ని మంచి సినిమాగా మలచొచ్చు. కానీ మంచి సినిమాను గొప్ప పుస్తకంగా చూడలేం -అంటాడో పెద్దాయన. మంచి పుస్తకంలాంటి సినిమాలు రావన్నది ఆయన ఉద్దేశం కాదు. అపురూపమైన పుస్తకంగా దాచుకోతగ్గ సినిమా రావడం లేదన్నదే ఆవేదన. చరిత్రలో గొప్ప సినిమాలంటే -్ఠక్కున పది పేర్లు చెప్పగలం. అలాంటి చరిత్ర సృష్టించే సినిమా ఈ ఏడాది ఏమైనా వచ్చిందా? అంటే సమాధానం చెప్పడానికి తటపటాయించాలి.
చెలామణీలో -చరిత్ర సృష్టించినవిగా ఈ ఏడాదీ చాలా సినిమాలనే ప్రస్తావించాం. ఆయా సినిమా కథల్ని ప్రయోగాత్మక అంశాలుగా చర్చించుకున్నాం. సో, గొప్పను ఆపాదించే కథలు రాలేదని గట్టిగా చెప్పలేం. వచ్చాయి. రుచి చూపించాయి. మెప్పించాయి. సినిమా థియేటర్లో ఉన్నంతకాలమూ చర్చకు నోచుకున్నాయి. వెళ్లిపోయిన తరువాతా -కొద్దిరోజులు గుర్తున్నాయి. అలాంటి ప్రభావం చూపించే మరో సినిమా వచ్చినపుడు మాత్రం -ముందు సినిమా పక్కకు
తప్పుకున్న చిత్రాలే ఉన్నాయ.

**
ఫ్రెష్ ఫీల్‌ని కోరుకోవడం ఆడియన్స్ నైజం. ఎప్పటికీ ఫ్రెష్ ఫీల్‌నిచ్చే సినిమాలివ్వడం ఇండస్ట్రీ బాధ్యత. ఈ రెంటి విషయాల్లో ఈ ఏడాదీ -తెలుగు ఇండస్ట్రీ ఒక్కడుగూ ముందుకు వేయలేదు. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సిత్రాలు, పాన్ ఇండియా పటాటోపాలు.. ఇవన్నీ పరిశ్రమను పదికాలాలు పరిగెత్తించే బలాన్నిచ్చేవైతే కాదు. అంటే, మంచి సినిమాలే రాలేదా? అన్న ప్రశ్న చటుక్కున బుర్రకు తట్టొచ్చు. ఆ ప్రశ్నకు సమాధానంగా కొన్ని చిత్రాలను ఉదహరించొచ్చు. అవన్నీ కథాబలం, కథనగమనం చూపించిన చిత్రాలుగానే చూడగలం తప్ప, స్టార్లు పెంచుకున్న చిత్రాలుగా అభివర్ణించలేం. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే ఈ ఏడాదిలో ‘బావున్న’ సినిమాలొచ్చాయే తప్ప, ‘చాలా బావుంది’, ‘చాలా చాలా బావుంది’ అనదగ్గ సినిమాలైతే లేవనే చెప్పాలి. సమీక్షల్లోనూ ఐదింట -మూడు స్టార్లు దాటిన చిత్రాలూ లేవని గట్టిగానే చెప్పొచ్చు.
**
ఈ ఏడాదీ బావున్న సినిమాలొచ్చాయి. అలాంటి సినిమాలను -పక్షపాతం లేకుండా ఆడియన్స్ ఆదరించారు. దేశాలు దాటొచ్చిన కథలను ఆదరించారు. భాషాభిమానం పక్కనపెట్టి -అనువాద చిత్రాలనూ అక్కున చేర్చుకున్నారు. రొటీన్‌కు భిన్నంగా సినిమా చూపించే టెక్నిక్‌నూ ఆహ్వానించారు. అలా వచ్చిన వాటిలో కథాపరంగా బలాన్ని చూపించి గెలిచినవి కొన్ని. కథనంతో ఆడియన్స్‌ని మెప్పించిన సినిమాలు ఇంకొన్ని. చాలాకాలంగా అలవాటుపడిన రొటీన్ సినిమా ఫార్మాట్‌ను దాటి -సరికొత్త అనుభూతిని పంచిన సినిమాలు మరికొన్ని.
వైవిధ్యం అన్నది ఏరూపంలోవున్నా -ఆడియన్స్ ఓకే అన్నారు. బాక్సాఫీస్ వద్ద సినిమాను మోశారు. కలెక్షన్లిచ్చి కొత్త కళనిచ్చారు. ఒక్కముక్కలో చెప్పాలంటే -మంచి సినిమాలు తీస్తే మేమున్నామన్న భరోసానిచ్చారు. అలాంటి ఆశలునింపిన సినిమాల ప్రత్యేకతను చూద్దాం.
‘ఓ బేబీ’ అని పిలుచుకునేంత ముద్దుగా మనముందుకు వచ్చింది సమంత. కొరియా నుంచి తెచ్చుకున్న కామెడీ, ఫాంటసీ డ్రామాను తెరకెక్కించిన దర్శకురాలు బీవీ నందినరెడ్డి. వృద్ధురాలు ఉన్నఫళంగా యవ్వనంలోకి వస్తే..? అన్న సింగిల్ పాయింట్ మీద నడిచిన మంచి కథ. దీంతోపాటు కథనం కూడా కొత్త అనుభూతి కలిగించటంతో ఆడియన్స్ మురిసిపోయారు. మంచి క్లాసిక్ చూశామన్న భావనకు గురయ్యారు. కథాబీజం అద్భుతమని చెప్పలేం. అయినప్పటికీ తమ అభిరుచిని మరోసారి రుజువు చేశాడు ఆడియన్స్.
ఇండస్ట్రీలో హీరోయిజాన్ని చూపించిన యన్టీఆర్ -రావణుడి వేషం కడితే సినిమా ఫ్లేవరే మారిపోయింది. అంత గొప్ప పోలికతో సరితూగకున్నా -వరుణ్‌తేజ్ అలాంటి ప్రయత్నంతోనే మంచి హిట్టందుకున్నాడు. జాలిలేని బోయవాడు పరివర్తనతో వాల్మీకి ఎలా అయ్యాడన్న కథాసారాన్ని ఇప్పటి విలువలకు అప్లై చేస్తూ వచ్చిన చిత్రం -గద్దలగొండ గణేశ్. హీరోయిజం సినిమాలు చేస్తూ వచ్చిన వరుణ్ -ఒక్కసారిగా నెగెటివ్ క్యారెక్టర్‌తో సినిమా చేశాడు. ఆడియన్స్‌కి అదో భావన అనిపించింది. రౌడీని హీరోగా పెట్టి అతని ఆత్మకథతో సినిమా తీయడమనే కానె్సప్ట్ కాస్త వెరైటీ అనిపించింది. అలా బాక్సాఫీస్‌ను గద్దలకొండ.. దడదడలాడించాడు.
సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో హీరోయిజానికి కొత్త డెఫినిషన్ ఇచ్చినవాడు -నాని. ఈ ఏడాది ముందువరకూ నాని చేసిన సినిమాలు ఒకెత్తు. గత ఏప్రిల్‌లో వచ్చిన జెర్సీ మరో ఎత్తు. కొడుకు ముందు హీరోగా పడిపోకూడదనుకునే తండ్రి కథ. ఈ సింగిల్ పాయింట్‌ను ఎంతో ఎత్తులో చూపించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కథ చూపించిన విధానానికి ఆడియన్స్ ఫ్లాటైపోయారు. కథాబలాన్ని చూపించిన సినిమాలో, తండ్రి పాత్రలో నాని పెర్ఫార్మెన్స్‌కు క్రిటిక్సూ పడిపోయారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్ ఫ్రెష్ ఫీల్‌నివ్వడంతో -ఆడియన్స్ హిట్టిచ్చేశారు.
కొన్ని సినిమాలు వసూళ్లపరంగా ఓహో అనిపించలేకపోయినా -అద్భుతమైన పాయింట్‌తో వచ్చినవీ ఉన్నాయి. అలాంటి వాటిలో కల్యాణ్‌రామ్ చేసిన 118 సినిమా పెట్టొచ్చు. ప్రతి సినిమాకూ ఓ కొత్తదనం వెతుక్కునే కల్యాణ్, ఈసారి కానె్సప్ట్ బేస్డ్ సినిమాతో సంతృప్తినిచ్చాడు. క్రైం థ్రిల్లర్ కథకు ‘డ్రీం’ అనే సైన్స్ ఎలిమెంట్‌ను యాడ్ -కానె్సప్ట్ బేస్డ్ సినిమాను తెరకెక్కించింది దర్శకుడు గుహన్. సినిమాటోగ్రాఫర్‌గా తన అనుభవాన్ని రంగరించి -స్క్రీన్‌పై కనికట్టు చేశాడు. క్లైమాక్స్ ఆడియన్స్‌కి బలంగా కనెక్టైపోవడంతో -ఓకే అనేశారు. ఫైనల్‌గా వసూళ్లను బ్రేక్‌ఈవెన్ దాటించి -కల్యాణ్‌లో మరో వైవిధ్యమైన సినిమా చేసే ఉత్సాహాన్ని నింపారు.
చాలా సినిమాలకు కథే హీరో అయినా.. కొన్ని సినిమాలకు మాత్రం హీరోయే కథవుతాడు. అలాంటి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరోల్లో -అడవి శేష్ పేరు గట్టిగా ప్రస్తావించొచ్చు. అడవి శేష్ సినిమా అంటే -అందులో ఏదోక కొత్తదనం ఉంటుందని అనుకునేంతగా ఇమేజ్ తెచ్చుకున్నాడు శేష్. ఈ ఏడాది ‘ఎవరు?’ అని ప్రశ్నిస్తూ వచ్చాడు శేష్. కొత్త కథ. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే. దానికితోడు శేష్ పెర్ఫార్మెన్స్. ఫిదా అయిపోయారు ప్రేక్షకులు.
రెండోమాట లేకుండా హిట్టిచ్చేశారు.
ఫ్లాపులకు ఎదురెళ్లేవాడు ఎప్పటికైనా హిట్టు కొడతాడని బెల్లంకొండ సాయికి ధైర్యాన్నిచ్చిన రీమేక్ సినిమా -రాక్షసుడు. ఇదొక క్రైం థ్రిల్లర్ జోనర్. రొటీన్ జోనర్‌కు ఫ్రెష్ టచ్ నిచ్చాడు దర్శకుడు రమేష్ వర్మ. ఆరు వరుస ప్లాపులకు వెరవకుండా -ఏడో అడుగుతో ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చాడు సాయిశ్రీనివాస్. చిన్న పిల్లలను హత్య చేసే సైకో -వాణ్ని పట్టుకునేందుకు కంకణం కట్టుకున్న హీరో. కుర్చీల అంచుల్లో కూర్చోబెట్టిన ఉత్కంఠ కథనం -ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ఈ ఏడాది వసూళ్లు రాబట్టిన హిట్ సినిమాల్లో ఒకటైంది.
వీడియో గేమ్స్‌కి ఎడిక్టైన అమ్మాయి. ఆ కథలో హారర్ ఎలిమెంట్స్. అదే -‘గేమ్ ఓవర్’. చిత్రమైన కథ, కథనాలు ప్రేక్షుకలకు నచ్చేశాయి. ముఖ్యంగా తాప్సి నటనకు బలంగా కనెక్టైపోయారు. చూడదగ్గ మంచి సినిమాగా టాగ్ తగిలించేశారు.
హీరో సందీప్ కిషన్ మరికొంత కాలం ఉత్సాహంగా సినిమాలు చేసే అవకాశమిచ్చిన కథ -నిను వీడని నీడను నేనే. మంచి కథ దొరికిందన్న ఆనందంతో స్వీయ నిర్మాణానికీ దిగాడు. అనుకున్నంత వసూళ్లు రాబట్టిన సినిమాకాకున్నా -కథాపరంగా ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలిగింది. అద్దంలో మరొకరి ప్రతిబింబం కనిపిస్తే-అన్న ఐడియాతో కథల్లుకున్నాడు దర్శకుడు కార్తీక్‌రాజు. వెనె్నల కిషోర్ సీరియస్ కామెడీని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కానీ, కథా విస్తృతిలోను, కథనంలో బలం లేకపోవడంతో సినిమా ఆడియన్స్‌కి ఎక్కలేదు. అలాగని క్రియేటివ్ థాట్‌ను కొట్టిపారేయలేం. పైగా వరుస ఫ్లాపులతో కెరీర్‌ని కష్టంగా లాగుతున్న సందీప్ కిషన్‌ను మళ్లీ నిలబెట్టిన సినిమాగా ప్రస్తావించుకోవచ్చు.
ఇంట్రెస్టింగ్ సోషల్ పాయింట్‌తో ఈ ఏడాది హైలెట్ చిత్రాల జాబితాలోకి చేరిన సినిమా -బ్రోచేవారెవరురా. వైవిథ్యమైన టైటిల్ పట్లే ఆడియన్స్ ఆసక్తి చూపిస్తే -తన పెర్ఫార్మెన్స్‌తో థ్రిల్లర్ కానె్సప్ట్‌ను రక్తి కట్టించాడు శ్రీవిష్ణు. ఒక సోషల్ స్టిగ్మాను చెప్పాల్సిన రీతిలో చెప్పడంలో -దర్శకుడు వివేక్ ఆత్రేయకు మంచి పేరొచ్చింది. మంచి కథను అంతే బలమైన కథనాన్ని జోడించటంతో -ఆడియన్స్‌కి బాగా నచ్చింది. క్రిటిక్స్‌ని మెప్పించిన కథాబలమున్న సినిమాగా పేరు తెచ్చుకుంది. ప్రేమ కథను థ్రిల్లర్ కథనంతో నడిపించిన విధానం -బ్రోచెవారెవరురా హైలెట్‌కు కారణమని చెప్పాలి. అంతేస్థాయి ప్రశంసలు అందుకున్న మరో క్రైమ్ థ్రిల్లర్ -ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. చాంతాడంత టైటిల్ చూసి ఇదేదో పిచ్చి సినిమా అనుకున్నా, పెద్దగా ప్రమోషన్స్ లేకున్నా -విడుదలైన తరువాత రిపీటెడ్ ఆడియన్స్‌ని సాధించుకున్న సినిమా ఇది. కొత్త కథతో వచ్చిన చిన్న సినిమాగా పెద్ద విజయమే దక్కించుకుంది. ఓ ప్రయివేట్ డిటెక్టివ్ మొదలెట్టిన మర్డర్ ఇనె్వస్టిగేషన్‌తో భారీ స్కామ్ బయటపడటమనే -ఆసక్తికరమైన కథ, కథనంతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేశాడు దర్శకుడు స్వరూప్. నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచేయం చేస్తూ తెరకెక్కిన సినిమా విమర్శకుల మన్ననలూ అందుకుంది. అంతేకాదు, ఈ ఏడాది సినిమాలో ది బెస్ట్ క్యాటగిరీలో నిలిచింది.
సరైన సినిమా పడక సతమతమవుతున్న నిఖిల్‌కు కొత్త ఊపిరినిచ్చిన సినిమా -అర్జున్ సురవరం. విద్యారుణాలు, సర్ట్ఫికెట్ల స్కామ్ నేపథ్యంగా వచ్చిన ఈ రీమేక్‌ను -తెలుగు ఆడియన్స్ అదరించారు. నిఖిల్ కెరీర్‌కు ఈ సినిమాతో కొత్త ఊపునిచ్చారు. ఈ ఏడాది చివర్లో వచ్చిన చిత్రాలుగా మారుతి తెరకెక్కించిన -ప్రతిరోజూ పండగే, రితేష్ రాణా తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ -మత్తువదలరా చిత్రాలనూ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సున్నితమైన హాస్యానికి ఎమోషన్స్ ముడిపెట్టి మారుతి కథ నడిపిస్తే, రొటీన్ పాయింట్‌నే మిస్టీరియస్ ట్విస్టులతో చెప్పి రితేష్ రాణా సక్సెస్ అయ్యాడు. సినిమా హిట్టు ఫ్లాపు అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే -మజిలీ, చిత్రలహరి, ఏబీసీడీ, ఫస్ట్‌ర్యాంక్ రాజు, ఇస్మార్ట్ శంకర్, కథనం, కౌసల్యా కృష్ణమూర్తి, గ్యాంగ్‌లీడర్, ఆవిరి, మీకు మాత్రమే చెప్తా, మిస్‌మ్యాచ్, 90ఎంఎల్ సినిమాల్లోని కథాబీజమూ వైవిధ్యమే. అయితే ఆయా చిత్రాలు కొన్ని ఆడియన్స్ కనెక్టైతే, మరికొన్ని రెండోరోజు కూడా నిలబడలేకపోయాయి. ఏదేమైనా ఈ ఏడాది కథా ప్రాధాన్యమున్న చిత్రాల లెక్కను పెద్దగానే చెప్పుకోవచ్చు. కాకపోతే -చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమైతే ఒక్కటీ రాలేదు.

-ప్రవవి