మెయన్ ఫీచర్

మొదటికొచ్చిన రాజధాని రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. చెన్నై నుంచి హైదరాబాద్ ద్వారా అమరావతి చేరిన ఈ ప్రస్థానం ప్రస్తుతానికి విశాఖ మార్గం పట్టింది. నలుగురికి ఆమోదయోగ్యమైన విధంగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సయోధ్యతో కూడిన రాజధానికి స్థల ఎంపిక 2014లో చంద్రబాబునాయుడుగారు చేసి ఉండి ఉంటే ఈనాడు ఈ సమస్య ఉత్పన్నం అయ్యుండేది కాదు. ఏకపక్షంగా, సంకుచిత ధోరణితో రాజధాని స్థల నిర్ణయం ఆనాడు జరిగింది కాబట్టే ఈ రోజు ఇటువంటి పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తున్నది. రాజధాని స్థల ఎంపికపై ఉన్న సిద్ధాంతపరమైన రచనలు చాలా పరిమితమైనవి. ఆ బహుకొద్ది రచనలలో వాదిమ్ రాస్మన్ అనే రష్యన్ రచయిత రచించిన ‘రాజధాని నగరాలు: పరిణతి, స్థల ఎంపిక’ పుస్తకము ప్రముఖమైనది. రాజధాని స్థల ఎంపికలో ఎదురయ్యే వివిధ సమస్యలను, ప్రయోజనాలను, వైరుధ్యాలను, ఆ వైరుధ్యాల మధ్య జరిగే సయోధ్యను గురించి ఈ రచనలో సవివరంగా పేర్కొనటం జరిగింది.
ముఖ్యంగా ఆయన రాజధానులను రెండు రకాలుగా విభజించారు. అన్ని వర్గాలను, ప్రాంతాలను సమన్వయం చేసుకొని పోగలిగిన సంఘటిత రాజధానులు (జశషఖఒజ్పళ ష్ఘఔజఆ్ఘఒ) కొందరి ప్రయోజనాలకి పరిమితమయ్యే అసంఘటిత రాజధానులు (ళనషఖఒజ్పళ ష్ఘఔజఆ్ఘఒ). సంఘటిత రాజధానులలో అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రాజధాని స్థల ఎంపిక చేయటం జరుగుతుంది. దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ఉండే అన్ని వర్గాల ప్రజలు రాజధానిని తమ రాజధానిగా భావిస్తారు. ఈ రకంగా ఎంపిక చేయబడిన రాజధానులు అందరి ఆమోదంతో ఏర్పడినవి కాబట్టి చాలాకాలం మనగలుగుతాయి. ఇక అసంఘటిత రాజధానుల స్థల ఎంపిక అన్ని వర్గాలను ప్రాంతాలను కలుపుకొని జరగదు. కేవలం ఒక వర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని స్థల ఎంపిక చేయడం జరుగుతుంది. ఇటువంటి రాజధానులు ఏ ఒక్క వ్యక్తితోనో, వంశంతోనో ముడివడి ఉంటాయి. అందుచేత ఆ వంశము కానీ వ్యక్తిగానీ మారినప్పుడు రాజధానులు మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి రాజధానులు అస్థిరంగా ఉంటాయి. బహిరంగంగా కనిపించని రహస్య అజెండా ఈ రాజధానులను నడిపిస్తూ ఉంటుంది. ఇటువంటి రాజధానులు స్వల్పకాలం మాత్రమే మనుగడ చేయగలుగుతాయి. వీటిని ఏర్పాటుచేయటం నడపడం, వ్యయప్రయాసలతో కూడిన పని.
ఈ సైద్ధాంతిక నేపథ్యంలో పరిశీలిస్తే అమరావతి రాజధాని స్థల ఎంపిక కార్యక్రమం అసంఘటిత రాజధానులకు వివరించిన లక్షణాలకు అనుగుణంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ నివేదికకు ఎటువంటి విలువ ఇవ్వలేదు. ఆనాటి పురపాలక శాఖ మాత్యుల ఆధ్వర్యంలో కొందరు పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఒక కమిటీ ఏర్పాటుచేసింది. వారు వారి నివేదిక ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఉన్న ఫళంగా విజయవాడ నగర పరిసర ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుచేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి తదనుగుణంగా ముందే అనుకున్న ప్రదేశంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే ప్రభు త్వం రాజధానిని ఏర్పాటుచేసింది. చారిత్రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యం కోసం ఏర్పాటుచేసుకున్న శ్రీ్భగ్ ఒప్పందం లాంటి ఒప్పందాలను కూడా పూర్తిగా విస్మరించడం జరిగింది. అమరావతి మన అందరి రాజధాని అనే భావన ప్రజలలో కలుగలేదు. దీనికి కారణం భిన్నత్వంతో కూడిన వివిధ ప్రాంతాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని సామరస్యధోరణిలో ఇచ్చిపుచ్చుకునే విధానంతో రాజధానిని ఏర్పాటుచేయకపోవడమే. ఇన్ని రోజులు ప్రజలలో చర్చింపబడుతున్న భూలావాదేవీలు అనే రహస్య అజెండాను ఆర్థికశాఖా మాత్యులు కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ వేదికగా బట్టబయలుచేశారు. కొందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రహస్య అజెండాతో ముందుకు పోయిన అమరావతి రాజధాని అసంఘటిత రాజధాని గానే మిగిలిపోతుంది. సిద్ధాంతపరంగా పేర్కొన్నట్లు ఇటువంటి రాజధానులు ఒక వ్యక్తికో, వర్గానికో, వంశానికి పరిమితమై పోతాయి కాబట్టి ఆపైన వచ్చే పాలకులు అటువంటి రాజధానులను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది. అసెంబ్లీ వేదిక ముఖ్యమంత్రిగారు సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విభాగాల పరంగా పరిపాలనా పరమైన రాజధానిని విశాఖపట్నంలోనూ, శాసనపరమైన రాజధానిని అమరావతిలోని, హైకోర్టును కర్నూల్ పట్టణంలోనూ ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నట్టు తెలియజేశారు. నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉన్న ముఖ్యమంత్రిగారే స్వయాన శాసనసభలో ప్రకటించటంవలన ఈ నిర్ణయం జరిగిపోయినట్టే భావించాలి. ఈ నిర్ణయం యొక్క సాధక బాధకాలు కష్టనష్టాలు పరిశీలిద్దాం. రాజధాని స్థల ఎంపికకు ఉన్న వివిధ సిద్ధాంతాలలో వివిధ ప్రాంతాల మధ్య అంగీకార విధానం (స్పెషల్ కాంప్రమైజ్) ప్రధానమైనది. ఒక దేశంలోగాని రాష్ట్రంలో గానీ భిన్నత్వం కలిగి ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన ప్రదేశాలు ఉన్నప్పుడు రాజధాని ఎక్కడ ఉండాలి అనే సమస్య ఏర్పడినప్పుడు ఆ వివిధ ప్రాంతాలవారు చర్చల ద్వారా ఒక అంగీకారానికి వచ్చి రాజధానిని తటస్థ ప్రదేశంలో ఏర్పాటుచేసుకోవటమే ఈ విధానం. ఈ ప్రక్రియ రెండు విధాలుగా సాగవచ్చు. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ అన్ని వర్గాలకు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన ఒక ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుచేసుకోవడం. అటువంటప్పుడు శాసనసభ, సచివాలయం, ఉన్నత న్యాయస్థానం ఒకేచోట ఉండటం జరుగుతుంది. ప్రాంతాలమధ్య అంగీకారం విధానంలో ఇది ఉత్తమమైనది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉత్తర ప్రాంత రాష్ట్రాలకు దక్షిణ ప్రాంత రాష్ట్రాలకు మధ్య రాజధాని ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకొని తటస్థ ప్రదేశమైన వాషింగ్టన్ డి.సి.లో రాజధాని ఏర్పాటుచేసుకోవటానికి నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఆస్ట్రేలియా దేశంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అన్ని ప్రాంతాలవారు చర్చించుకొని తటస్థ ప్రదేశమైన కాన్‌బెరాలో రాజధానిని ఏర్పాటుచేసుకోవడం జరిగింది. కేవలం ఒక దక్షిణ ఆఫ్రికా దేశంలో మాత్రం వివిధ ప్రాంతాలమధ్య ఏర్పడిన అవగాహన ఫలితంగా ప్రభుత్వశాఖలను మూడు ప్రాంతాలలో ఏర్పాటుచేస్తూ ఈ సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రిటోరియా నగరంలో పరిపాలన రాజధాని, కేప్‌టౌన్‌లో శాసన పరమైన రాజధాని, బ్లూఫాంటం నగరంలో ఉన్నత న్యాయస్థానాలను ఏర్పాటుచేసుకోవడం జరిగింది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనుసరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రిగారు తెలిపారు.
వివిధ ప్రాంతాల మధ్య సమన్వయానికి సమతుల్యానికి ఒక అంగీకారానికి వచ్చి ఏర్పాటుచేసుకునే రాజధాని ఏదైనా తటస్థ ప్రాంతంలో అందరి ఆమోదంతో అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకచోట ఉండేటట్లుగా ఏర్పాటుచేసుకోవడం ఉత్తమం. ప్రస్తుత అమరావతి రాజధాని ప్రాంతం తటస్థ ప్రాంతంగా భావించటం లేదు కాబట్టే అటువంటి తటస్థ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాల ఆమోదంతో ఏర్పాటుచేసుకోవడమే ఈ సమస్యకు ఉత్తమమైన పరిష్కారమవుతుంది. అలాకాకుండా సౌత్ ఆఫ్రికా దేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ విభాగాలను విభజించి వివిధ రాజధానులు ఏర్పాటుచేస్తే ఇది అసౌకర్యానికి, పరిపాలనలో అసమర్థతకు దారితీస్తుంది. చారిత్రకంగా వచ్చిన విధానంగా దక్షిణాఫ్రికా దేశంలో ఈ విభజనను కొనసాగిస్తున్నారు కానీ ఇది సౌలభ్యంగా ఉన్నదని భావించి మాత్రం కాదు. అమరావతి నుంచి రాజధాని మార్చాలంటే ప్రధాన సమ స్య భూములు ఇచ్చిన రైతులనుంచి రావచ్చు. చాలావరకు ఈ భూములన్నీ ఉపయోగించకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని తిరిగి రైతులకు ఇచ్చే మార్గం న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొవలసి ఉంటుంది.
రాజధానుల ఏర్పాటుకు ఇంకొక సిద్ధాంత ప్రాతిపదిక ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మకంగా ఏ ప్రదేశంలో రాజధానిని ఏర్పాటుచేస్తే బాగుంటుందో ఆలోచించి రాజధానిని అక్కడ ఏర్పాటుచేయటం (స్ట్రాటెజిక్ లొకేషన్) ఉదాహరణకు రష్యా దేశం ఐరోపా ఖండంలోని దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఆలోచించిన రోజులో రాజధానిని అక్కడికి దగ్గరగా ఉండే సెయింట్ పీటర్ బర్గుస్‌లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దృష్టితో ఆలోచిస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుకు సరైన ప్రదేశం విశాఖపట్నం. హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చెందగలిగిన పట్టణం విశాఖ. తూర్పు తీరాల్లో కలకత్తా, చెన్నై మహానగరాలకు సమదూరంలో ఉండటంవలన ప్రభుత్వం దృష్టిసారిస్తే అనతికాలంలోనే మహానగరంగా విస్తరించగలదు. పెట్టుబడులను ఆకర్షించగలదు. ఈ దృష్టితో ఆలోచిస్తే ప్రభుత్వం రాజధానిని విశాఖలో ఏర్పాటుచేసి, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయవచ్చు. శాసనసభా విభాగానికి, పరిపాలన విభాగానికి పెనవేసుకున్న అవినాభావ సంబంధం ఉన్నది కావున విడదీసి వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం పరిపాలనలో అసమర్థతకు దారితీస్తుంది. కానీ పరిపాలన విభాగానికి హైకోర్టుకు అటువంటి దగ్గర సంబంధ బాంధవ్యాలు లేవు. అందుచే రాజధానిని ఒకచోట, హైకోర్టును వేరొకచోట ఏర్పాటుచేయటంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భారతదేశంలో దాదాపు పది రాష్ట్రాలలో హైకోర్టు, రాజధాని వేరువేరు ప్రాంతాల్లో ఉన్నాయి.
స్థూలంగా అందరికీ ఆమోదయోగ్యమైన తటస్థ ప్రదేశంలో అన్ని ప్రభుత్వ విభాగాలతోకూడిన పరిపాలన రాజధాని నిర్మించుకొని మహానగర నిర్మాణ భ్రమనుంచి బయటికి వచ్చి దానిని పరిపాలనా రాజధానిగా కొనసాగిస్తూ రాష్ట్ర వివిధ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయటం ఒక ప్రత్యామ్నాయం. లేదంటే విశాఖపట్నాన్ని రాజధానిగా ఏర్పరచుకొని మహానగర అభివృద్ధికి పునాదులు వేయటం మరికొక ప్రత్యామ్నాయం. మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవటం ఏ విధంగానూ పరిష్కారం కాకపోవచ్చు.

- ఐవైఆర్ కృష్ణారావు iyrk45@gmail.com