మెయిన్ ఫీచర్

శీతాకాలంలో ఆరోగ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడివేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. వేడి వేడి ఆహారం తినాలనుకోవడం మంచిదే.. కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలకు, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు. వీటికి తోడు అసలే బయట చలిగా ఉంటే ఇక వ్యాయామం ఏం చేస్తాంలే.. అంటూ చాలామంది ఎక్సర్‌సైజ్‌ను వాయిదా వేస్తుంటారు. చలికాలంలో ఎదురయ్యే ఇలాంటి పరిణామాల వల్ల పలు అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే శీతాకాలంలోనూ సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమంటున్నారు. మరి, ఈ కాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..
రోగనిరోధక శక్తి
పెరగాలంటే..
చలికాలంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడం ఎంతో అవసరం. ఈ కాలంలో ఏది తిన్నా జలుబు, దగ్గు, గొంతునొప్పి.. వంటి పలు అనారోగ్యం దరిచేరతాయి. ఇలాంటి అనారోగ్యాలు కలగజేసే బాక్టీరియా, వైరస్‌లు ఈకాలంలో త్వరగా వస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటే అదే బాక్టీరియా, వైరస్‌లను బయటకు నెట్టేస్తుంది. అందుకే ఈ కాలంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునే ఆహారపదార్థాల్ని తప్పకుండా తీసుకోవాలి. ఇందుకోసం క్యాబేజీ, బ్రొకోలీ, నిమ్మజాతి పండ్లు, చిలగడ దుంప.. వంటి వాటిని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మాంసాహారులైతే.. చేపలు, గుడ్లు, మాంసం, పాలు, గింజలు, తృణధాన్యాలు.. వంటి జింక్ అధికంగా లభించే పదార్థాల్ని సైతం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అలాగే ప్రతిరోజూ ఉదయానే్న వేడివేడిగా ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అందులోని క్యాట్చిన్స్, ఇతర సమ్మేళనాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి.
శరీరంలో శక్తి తగ్గకుండా..
చలికాలంలో మెదడులోని సెరటోనిన్ అనే ఫీల్‌గుడ్ రసాయనం స్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మరి వీటిని మెరుగుపెరచుకోవడానికి కార్బోహైడ్రేట్లు నిండి ఉన్న ఆహార పదార్థాల్ని తీసుకోవాలనే కోరిక మెదడు ద్వారా మనకు కలుగుతుంది. అయితే ఇందులో చక్కెరలు అధికంగా ఉండే సాధారణ కార్బోహైడ్రేట్లు కాకుండా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా నిండి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే ఇవి విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువ సమయం వరకు శరీరంలో శక్తి స్థాయిలు కోల్పోకుండా కాపాడుకోవచ్చు. ఇందుకు గుమ్మడికాయ, చిలగడ దుంప, ఆకుపచ్చని కూరగాయలు, ఓట్‌మీల్, పాస్తా, కార్న్.. వంటి వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. తద్వారా మెదడులో సెరటోనిన్ స్థాయిలు పెంచుకోవడంతో పాటు ఎక్కువ సేపు శక్తిని కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు.
వ్యాయామం..
బయట చలిగా ఉంటే ఆ రోజు వ్యాయామానికి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఏ కాలంలోనైనా వ్యాయామం తప్పనిసరి. జలుబు, దగ్గు.. వంటివి వస్తాయి అనుకోకుండా తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు బయట చల్లగా ఉంటే మంచినీళ్లు ఏం తాగుతాంలే.. అనుకుంటారు. కానీ ఈ కాలంలో ఎక్కువ మంచినీళ్లు తాగాలి. అలాగే ఈకాలంలో వెల్లుల్లిని బాగా తీసుకోవాలి. వెల్లుల్లికి ఇనె్ఫక్షన్లను ఎదిరించే శక్తి ఉంటుంది. కాబట్టి వెల్లుల్లిని అధికంగా తినడం వల్ల ఇనె్ఫక్షన్లు దరిచేరవు.
విటమిన్ ‘డి’కై..
మన ఆరోగ్యానికి ‘డి’ విటమిన్ చాలా అవసరమన్న సంగతి మనకు తెలిసిందే.. సూర్యోదయం తర్వాత ఉదయం ఎనిమిది గంటల్లోపు వచ్చే సూర్యకిరణాల్లో విటమిన్ ‘డి’ పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయానే్న కాసేపు ఎండలో నిల్చోవాలి అని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అయితే అందరికీ ఇది సాధ్యం కాదు. ఫలితంగా ఎముకల్లో నొప్పి, కండరాల బలహీనత, విపరీతమైన అలసట తలెత్తుతాయి. అందుకే సూర్యకిరణాల నుంచి పొందలేని విటమిన్‌ను ఆహారపదార్థాల రూపంలో, సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం విటమిన్ ‘డి’ అధికంగా అందించే పాలు, పాల పదార్థాలు, చేపలు, గుడ్లు.. వంటివి ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు విటమిన్ ‘డి’ సప్లిమెంట్స్‌ని కూడా తీసుకోవాలి. తద్వారా శీతాకాలంలో ఎలాంటి అనారోగ్యాలూ బాధించకుండా ఉంటాయి.
*