మెయిన్ ఫీచర్

ఇదీ వెంకీ లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏజ్ బారైపోతున్నా -కుర్ర హీరోలతో
సమానమైన హీరోయిజాన్ని చూపిస్తూ.. గుండెలపై ‘స్టార్’ బ్యాడ్జిని మోస్తున్నది టాలీవుడ్‌లో నలుగురే. రాజకీయంగా సేదతీరి.. రీ ఎంట్రీతో ‘మెగా’ స్టామినాను చూపిస్తోన్న చిరంజీవి. వయసుకు తగిన కథలు చూసుకుంటూ.. యంగ్
జనరేషన్‌తో పోటీపడే పాత్రలు పోషిస్తూ తనదైన మార్క్‌ను కంటిన్యూ చేస్తున్న బాలకృష్ణ. ‘మన్మథుడు’ ఇమేజ్ దగ్గరే వయసుని ఆపేసి.. ఫన్నీ, ప్రయోగాలకు ఫిట్‌నెస్‌ని జతచేసి గ్యాప్‌లేకుండా ఆరాంగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న నాగార్జున. సోలో హీరో
సినిమాలు చేస్తూనే.. తరువాతి జనరేషన్స్‌తో జతకడుతూ తనదైన ‘బెంచ్ మార్క్’ సినిమాలు
చేస్తూ వస్తున్న వెంకటేష్.
*
ఇమేజున్న హీరోలు వెటరన్‌కు చేరుతున్నపుడు -అందుకనుగుణంగా కెరీర్‌ను కొత్త స్కీంలోకి తేవడం షరామామూలే. టాలీవుడ్ సీనియర్లు నలుగురూ ఎవరి స్టయిల్లో వాళ్లు -కెరీర్‌ను కంటిన్యూ చేయడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇందులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలు సోలో ట్రాక్స్‌ని కంటిన్యూ చేస్తుంటే -చాలాకాలం క్రితం నుంచే వెంకటేష్ ‘మల్టీస్టారర్’ ట్రాక్‌ను సెట్ చేశాడు. ఇప్పుడు కొత్త పాతల కలయికతో ‘మల్టీస్టారర్’ అనిపించుకునే సినిమాలేమైనా చేయాలంటే -ఏకైక ఆప్షన్ వెంకటేష్ అన్న మాటే ఇండస్ట్రీలో చెల్లుబాటవుతోంది. చాలాకాలం క్రితమే వెంకటేష్ ఈ రూట్‌కు రోడ్డేసినా -గత కొనే్నళ్లుగా ‘మల్టీస్టారర్’ చిత్రాలపట్ల ఎక్కువ మక్కువ చూపిస్తుండటం, చేస్తున్న సినిమాలన్నింటినీ దాదాపుగా సక్సెస్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
పాజిటివ్ వైబ్‌తో కెరీర్‌ను లాగిస్తూనే -మల్టీస్టారర్ కోణంలో కుర్ర హీరోలకు కొత్తదారులు చూపిస్తున్నాడు వెంకటేష్. సమవుజ్జీలు కాకున్నా.. స్టార్ హీరోలు, అప్‌కమింగ్ స్టార్ హీరోలు.. ఇలా తరువాతి జనరేషన్‌తో జతకడుతూ -తనదైన స్టయిల్లో ‘మల్టీస్టారర్’ సినిమాలకు సెపరేట్ ట్రాక్‌ను బలోపేతం చేశాడు. ఇప్పుడు థియేటర్లలో వున్న వెంకీమామకు ప్రమోషన్స్ నిర్వహింటే టైంలో -జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉందని మనసులో మాట చెప్పడం వెనుక అంతరార్థం ఇదే. ఇప్పటికే ఈ ఏడాది రెండు మల్టీస్టారర్లను సింగిల్ హ్యాండ్‌తో లాక్కొచ్చిన వెంకీ -పాత కొత్త హీరోల మేలు కలయిక కథలకు బెస్ట్ ఆప్షన్ తానేనన్నది చెప్పకనే చెబుతున్నాడు. ఈ తరహా కాంబినేషన్ సినిమాలు ‘వెంకీమామ’తో ఆగవని చెప్పడానికి, పాత కొత్తల కలయికతో భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పడానికే -జూ.ఎన్టీఆర్‌తో ప్రాజెక్టు చేయాలనుందని ప్రస్తావించటం. ‘ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్సింగ్ స్టయిల్ బావుంటుంది. మంచి కథ కుదిరితే తనతో నటించాలని ఉంది’ అన్నది వెంకీమామ ప్రమోషన్స్‌లో వెంకీ ఓపెన్ చేసిన కొత్త డైలాగ్ సారాంశం. అంటే, తన మనసులో మాటకు సూటయ్యే కథలుంటే తెచ్చుకోవచ్చని దర్శక నిర్మాతలకు తనదైన స్టయిల్లో ఆప్షన్ ఇచ్చేశాడన్న మాట. ఇక అలాంటి కథలకు సినీ రచయితలు పదును పెట్టడమే తరువాయి. థియేటర్లలోవున్న వెంకీమామకు ఓకే టాక్ రావడంతో -తమిళంలో హిట్టయిన ‘అసురన్’ రీమేక్‌కు రెడీ అవుతున్నాడు వెంకీ. ఐదేళ్ల క్రితం తనతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైటిల్‌తో మల్టీస్టారర్ చేసిన శ్రీకాంత్ అడ్డాలనే దర్శకుడిగా ఎంచుకోవడం తెలిసిందే.
2005లో తమిళ ‘ఆనందం’ చిత్రాన్ని దర్శకుడు ముప్పలనేని శివ రీమేక్ చేయడం తెలిసిందే. ‘సంక్రాంతి’గా వచ్చిన ఆ చిత్రంలో వెంకటేష్, హీరో శ్రీకాంత్‌తో కలిసి సినిమా చేశాడు. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత 2013ల శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో మహేష్‌తో కలిసి ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్లు’ చిత్రం చేశాడు. సినిమాకు హిట్ టాక్ రావడంతో -తన జూనియర్లతో కలిసి సినిమాలు చేయాలన్న ఆసక్తి వెంకీలో పెరిగింది. చిత్రంగా అదే ఏడాది బాలీవుడ్ హిట్ ‘బోల్ బచ్చన్’ చిత్రానికి రీమేక్ చేశాడు వెంకటేష్. వెంకీ, రామ్ పోతినేని కాంబోలో దర్శకుడు కె విజయ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. 2015లో హిందీ హిట్టు ‘ఓ మై గాడ్’ను దర్శకుడు డాలీ ‘గోపాల గోపాల’గా రీమేక్ చేయడం తెలిసిందే. వెంకీ -పవన్ కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు రీమేక్‌కూ మంచి టాక్ వచ్చింది. దీంతో మల్టీస్టారర్‌గా రావాల్సిన ఏ భాషా రీమేక్‌కైనా -టాలీవుడ్‌లో వెంకీ ఆప్షన్‌గా నిలిచాడు. పైగా వెంకటేష్ సైతం కుర్ర హీరోలతో జతకట్టే విషయంలో తనదైన ఉత్సుకత చూపిస్తుండటంతో -దర్శక నిర్మాతలంతా వెంకీ కోసం ఆ కోణంలోనే కథలల్లుకోవడం మొదలెట్టారు. వెంకీ- వరుణ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్-2 ఈ ఏడాది సంక్రాంతి హిట్టు. ఏడాది ఆరంభంలో ఈ సినిమాతో హిట్టందుకున్న వెంకీ, అలాంటి మల్టీస్టారర్ చిత్రంతోనే ముగింపునూ ఇచ్చాడు. -రియల్ లైఫ్ మేనల్లుడైన నాగ చైతన్యతో కలిసి కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ చేసిన వెంకటేష్ -ఈ ఏడాదికి ఫీల్‌గుడ్ మూవీతో ఫుల్‌స్టాప్ పెట్టాడు. ‘ఇండస్ట్రీకొచ్చి 30ఏళ్లు దాటుతోంది. అచీవ్ చేయడానికి ఇంకేముంటుంది?’ అంటోన్న వెంకటేష్ -ఈ జనరేషన్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలన్న అభిలాషను వ్యక్తం చేయడాన్ని చిన్నదిగా చూడలేం. ఆమధ్య హీరో నానితో కలిసి సినిమా చేయడానికి వెంకీ ఓకే అన్నా -సరైన కథ కుదరకపోవడంతో ప్రాజెక్టు ట్రాక్‌పైకి రాలేదు. కొత్త పాతల కలయికతో సినిమాలు చేసే విషయంలో నాని మైండ్‌సెట్ కూడా అదే కావడంతో -ఏదోక టైంలో వెంకీ కాంబినేషన్‌లో ప్రాజెక్టు సెట్టయ్యే అవకాశాలు లేకపోలేదన్నది ఇండస్ట్రీ మాట. సో, ఈ ట్రెండ్ బలపడితే -తెలుగు ఇండస్ట్రీలో పాతకొత్తల హీరోల కలయికతో మరిన్ని సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

-ప్రవవి