మెయిన్ ఫీచర్

మోక్షప్రాప్తి.. పురుషార్థములలో పరమశ్రేష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
మంగళాచరణము
1. సర్వవేదాన్తసిద్ధాన్తగోచరం తమగోచరమ్‌
గోవిన్దం పరమానన్దం సద్గురుం ప్రణతో స్మ్యహమ్‌॥
తాత్పర్యము
మంగళాచరణ శ్లోకములో తొలుత సంప్రదాయసిద్ధంగా, తమ పూజనీయ సద్గురువులైన గోవింద భగవత్పాదులకు, గోవింద నామస్మరణతో ప్రణమిల్లి శంకరాచార్యులవారు గ్రంథ రచన ఆరంభిస్తున్నారు.
గోవిందుడు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ యొక్క స్వస్వరూపము. పరమాత్మ త్రికాలాతీతము, అద్వితీయము, సర్వవ్యాపి మరియు సర్వాంతర్యామి. అయిననూ, వాఙ్మయనోబుద్ధ్యాది ఇంద్రియములతో వ్యక్తము చేయబడనిది. అగోచరమైన పరమాత్మయొక్క తత్త్వము ఉపనిషద్వాక్యములందే నిర్దేశింపబడినది.
‘‘సర్వేషాం వేదాన్త వాక్యానాం అద్వితీయే బ్రహ్మణి నిర్విశేషే ఆత్పర్యమ్’’. ఆత్మతత్త్వము నెఱింగిన సద్గురువునాశ్రయించి, దృఢ సంకల్పముతో నిరంతర సాధనచేసిన శిష్యుడు, అజ్ఞాన నివృత్తిని గురూపదేశంతో పొందుట శక్యము. ఛిన్నసంశయుడైన జ్ఞానికి, నిత్యానిత్య వివేకముతో అహర్నిశలు బ్రహ్మీభూతుడై, పరమాత్మ ధ్యానములో నిమగ్నమైన, జ్ఞాన నేత్ర ఉన్మీలనతో ఆత్మదర్శనభాగ్యము లభించును.
వివేకమే ఆత్మసాక్షాత్కారమునకు మూల ము. అవివేకి ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలిసికొనజాలక (విచక్షణజ్ఞానము లేక) దుఃఖమయ జీవితమును గడుపును. ఆత్మావలోకనము చేసికొనిన వ్యక్తియే బ్రహ్మైక్యతను సాధించి పరమానందమును, మరియు కైవల్యసిద్ధితో శాశ్వత సుఖమును పొందును.
‘‘వివేక చూడామణి’’ జ్ఞానసిద్ధికి, వివేకమును ప్రసాదించే గ్రంథరాజము. జిజ్ఞాసువులకు వెలకట్టలేని శిరోభూషణము. అమూల్యమైన ఈ రత్నఖచిత కిరీటమును ముముక్షువులు ధరించుటకు అర్హులు.
2. జన్తూనాం నరజన్మ దుర్లభ మతః
పుంస్త్వతతో విప్రతా
తస్మా ద్వైదికధర్మమార్గపదంతా
విద్వత్తమస్మాత్పరమ్‌
ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి
ర్ముక్తిర్నో శతకోటి జన్మను కృతైః పుణ్యైర్వినా లభ్యతే॥
ప్రాణులకు మానవ జన్మ లభించటమే దుర్లభము. అందునూ అరుదైనది పురుషుడుగా జన్మించడము. అంతకన్ననూ దుర్లభమైనది ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మ. దానికంటెను అరుదుగా లభించేది సంప్రదాయ వైదికాచార అవలంబనము. సదాచార సంపన్నుడైన వైదిక ప్రవృత్తిగల వ్యక్తికి, ఆస్తికత్వము, పునర్జన్మపై విశ్వాసము, పుణ్యపాపములపై అవగాహన ఇతోధికంగా లభించే అవకాశము ఉన్నది. బహు దుర్లభమైనది, శాస్త్ర అభ్యాసముతో పొందే వివేకము. విద్యాప్రాప్తితో వివేకి, బుద్ధిశక్తిని ఉపయోగించుకొని ధీమంతు డౌతాడు. ధీమంతుడే, పండితుడు, ప్రాజ్ఞుడు, వివేకి, మరియు శాస్తప్రరిజ్ఞానంతో విచక్షణ సంపన్నుడుగా పరిగణింపబడును. అనగా, అట్టి జ్ఞానసంపద కల్గిన వ్యక్తికే ఆత్మధర్మము- ఆత్మేతర పదార్థములయొక్క ధర్మములపై సమ్యక్ జ్ఞానము లభించును. నిత్యమైన ఆత్మ, క్షయగ్రస్తమయే శరీరమునకు భిన్నమైనదనే వివేకముకల్గిన వ్యక్తియే జ్ఞాని. జ్ఞానార్జనతో బ్రహ్మతత్పరత పెంచుకొని, బ్రహ్మైక్యత సాధించుటకు అట్టి జ్ఞానియే ఉపక్రమించును.
ఆత్మబోధకు, నిరన్తర సాధన మరియు కృషి ఆవశ్యకము. శారీరిక సుఖములందు ఆసక్తి పూర్తిగా త్యజించి, సహనత ఇనుమడించుకొని ఆత్మపరిశీలన గావించిన సాధకుడే కష్టసాధ్యమైన గమ్యము చేరుకొనుటలో కృతకృత్యుడౌను. ఆత్మానుభూతి స్వానుభవము. ఆత్మానుభూతి కల్గిన వ్యక్తి నిరవధిక ఆనందమును పొందును. ఆ స్థితియే జీవన్ముక్తి. ఆత్మ శాశ్వత బంధవిముక్తి పొంది పరమాత్మలో లయమగుటయే పురుషార్థములలో పరమశ్రేష్ఠమైన మోక్షప్రాప్తి. శతకోటి జన్మల పుణ్యఫలముగా ప్రాణులకు ముక్తిలభించునని ఇచ్చట ప్రస్తావించబడినది.
ఈశావాస్యోపనిషత్తు ‘‘ఈశావాస్యమిదగ్‌ం సర్వం యత్కించ జగత్యాంజగత్’’ (ఈ జగత్తులోనున్న చరాచరములన్నియూ పరమేశ్వరుని కారణముగా అవతరించినవి) అని ముందుగా ప్రకటిస్తూ, ‘‘అసూర్యానామ తే లోకా అంధేన తమసా‚‚ వృతాఃతాగ్‌ం స్తే ప్రేత్యాభిగచ్ఛంతి యే కే చాత్మహనో జనాః॥
(రాక్షస ప్రవృత్తిగలవారు అంధకారముతో నిండిన నరకలోకాలలో ఉంటారు. ఆత్మను చంపుకున్న అవివేకులకు అనగా స్వస్వరూపమైన ఆత్మయొక్క ఉనికిని ఎఱుగని వారికి, ఆత్మావలోకనమును నిర్లక్ష్యము చేసేవారికి నరక లోకమే మరణానంతరము ప్రాప్తించును). ‘‘విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయగ్‌ం సహ అవిద్యయా మృత్యం తీర్త్వా విద్యయా‚ మృతమశ్నుతే’’ (ఎవరు విద్య-జ్ఞానతత్త్వము మరియు అవిద్య- కర్మతత్త్వము అనే రెండింటియొక్క ఫలితములను సమగ్రముగా తెలుసుకుందురో, వారు అవిద్యారూపమైన కర్మానుష్ఠానముతో సంసార సాగరాన్ని దాటివేసి, విద్యవలన ముక్తిని పొందుదురు).
ఇతమిత్థంగా ఈ శ్లోకంలో గ్రహించవలసినవి రెండు విషయములు:
1. పరబ్రహ్మమే జగదావిర్భావమునకు కారణమని విశ్వసించని నాస్తికులు, అనీశ్వరులు ఈ గ్రంథాన్ని చదువుటకు అనర్హులు. 2. మోక్షము సుఖముగా లభించునది కాదు; అతి దుర్లభము.
ఒక అపోహను మాత్రము ఈ సందర్భంలో నివారించవలసి ఉన్నది. సమకాలీన సామాజిక వ్యవస్థ ఆచార వ్యవహారములను దృష్టిలో ఉంచుకొని భగవత్పాదులవారు పై శ్లోకంలో పురుషత్వము, విప్రునిగా జన్మ దుర్లభమని ప్రస్తావించుట జరిగినది. దీని ఆధారంగా, శంకరాచార్యులవారి మతంలో బ్రాహ్మణ పురుషుడుగా జన్మించినవాడే విద్యాసంపన్నుడు, కైవల్యసిద్ధికి అర్హుడౌనని అపోహపడుట ఎంత మాత్రము తగదు. అదే విధంగా, స్ర్తిగా జన్మించినవారు విదుషీమణులు కాలేరని, వారికి మోక్షగతిలేదని భావించుట తగదు. స్మృతి వాక్యములు బ్రహ్మలోకమును చేరుకొనుటకు, పరబ్రహ్మములో ఐక్యమగుటకు, తత్త్వజ్ఞానులైన స్ర్తిలు, పురుషులు వర్ణాశ్రమాది వ్యత్యాసము లేక అందరూ అర్హులని స్థిరీకరిస్తున్నవి.
‘‘మాం హి పార్థ వ్యపాశ్రీత్య యే‚ పిస్యుః
పాపయోనయః
స్ర్తీయో వైశ్యాస్త్థా శూద్రాః తే పి యాంతి
పరాంగతిమ్‌॥
(అర్జునా! స్ర్తిలు, వైశ్యులు, శూద్రులే కాని, యే పాప జాతివారైన కాని నన్ను ఆశ్రయించినవారు నిశ్చయంగా మోక్షమును పొందెదరు (ధ.గీ.9-32).
- ఇంకావుంది...